న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్లుగా భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ ఇతిమరపు రజని తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టులో రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ నెలలో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ ఈ చిత్తూరు జిల్లా క్రీడాకారిణికి స్థానం లభించింది. ఆసియా క్రీడల కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. ఈ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది.
భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), దీప్ గ్రేస్ ఎక్కా, సునీత లాక్రా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మింజ్, మోనిక, ఉదిత, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, రాణి రాంపాల్, వందన కటారియా, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్.
ఆసియా క్రీడలకు రజని
Published Sat, Jul 7 2018 1:56 AM | Last Updated on Sat, Jul 7 2018 1:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment