
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు చిలీ పర్యటనను అజేయంగా ముగించింది. సీనియర్ చిలీ జట్టుతో సాంటియాగోలో సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలుపొందింది. బ్యూటీ డుంగ్‌డుంగ్ (6వ ని.లో, 26వ ని.లో) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. చిలీ తరఫున 40వ నిమిషంలో ఫ్రాన్సిస్కా టాలా ఏకైక గోల్ సాధించింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. మరోవైపు అర్జెంటీనా పర్యటనలో ఉన్న భారత సీనియర్ మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. అర్జెంటీనా ‘బి’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున సలీమా (6వ ని.లో), గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment