savita
-
హెచ్ఐఎల్తో ఆర్థిక స్థిరత్వం
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని... దీని వల్ల యువ ఆటగాళ్లు హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మక్కువ చూపుతారని భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా అభిప్రాయపడింది. ఈ నెల 12 నుంచి 26 వరకు మహిళల కోసం తొలిసారి హెచ్ఐఎల్ నిర్వహిస్తుండగా... దీని వల్ల ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని సవిత ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సవిత... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించింది.కెరీర్ విశేషాలు, భవిష్యత్తు లక్ష్యాలు, దేశంలో హాకీ భవిష్యత్తుపై సవిత తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రతి ప్లేయర్‌కు ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. హాకీ ఇండియా లీగ్ వల్ల అది సాధ్యమవుతుంది. క్రీడా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కూడా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి వస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అదే జూనియర్ స్థాయిలో ఆడేవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్లకు హెచ్ఐఎల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. » ఆర్థిక ఇబ్బందులు లేననప్పుడే ప్లేయర్లు తమ లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. సీనియర్ ప్లేయర్‌గా జూనియర్లకు ఎప్పుడూ లక్ష్యాన్ని వదలొద్దనే చెబుతా. హాకీ అనే కాదు ఏ క్రీడలోనైనా అంతే. » హాకీని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటే గతంలో తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కనీసం వాళ్లు సంతోషిస్తారు. పిల్లలు మంచి ప్రదర్శన చేస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అయితే వస్తుంది. » 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా. అప్పటి వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించను. నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కాదనలేదు. పెళ్లి తర్వాత భర్త కూడా నన్ను అర్థం చేసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది. » ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలపైనే ప్రధానంగా దృష్టి పెట్టా. ఆటను ఆస్వాదిస్తున్నా. » మహిళల హాకీలో హెచ్ఐఎల్ పెను మార్పులు తీసుకువస్తుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు దక్కడం ఖాయం. ఎందరో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. వారి అనుభవాల నుంచి భారత యువ క్రీడాకారిణులు పాఠాలు నేర్చుకుంటారు. » భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా నా బాధ్యతలేంటో తెలుసు. యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంతో పాటు... గోల్ కీపర్‌గా ఆటను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
మీ సంపద సృష్టి మంత్రి సవితకు రాచమల్లు కౌంటర్
-
అడ్డొస్తే... శాల్తీలు లేచిపోతాయ్..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఎవరైనా అడ్డొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శాల్తీలు లేచిపోతాయ్.. బాడీలు కూడా కనపడకుండా చేస్తా. ఇక్కడికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సద్దాం వస్తే మర్యాదగా ఉండదు’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు బెదిరించారు. ఈ ఘటన ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 40 ఏళ్లకు పైగా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ఇక్కడ దుకాణం పెట్టుకున్న నయాజ్ దాన్ని కొంతకాలం క్రితం రియాజ్ అనే వ్యక్తికి స్నేహ పూర్వకంగా ఇచ్చి ముంబై వెళ్లాడు. ఇటీవల తిరిగొచి్చన అతను, తన షాపు తనకు ఇవ్వాలని కోరగా రియాజ్ నిరాకరించాడు. వీరి మధ్య వివాదం కొనసాగుతుండగానే రియాజ్ ప్రస్తుతమున్న షాపును శ్మశానం వైపు పొడిగించి పెద్ద షెడ్డు వేస్తుండడంతో మసీదు కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రియాజ్ వారి మాటను పట్టించుకోకపోవడంతో దుకాణానికి తాళం వేశారు.దీంతో టీడీపీ కార్యకర్త అయిన రియాజ్ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన పోలీసులతో చేరుకుని దుకాణం తాళాలను పగులగొట్టడమే కాకుండా అక్కడున్న జామియా మసీదు కమిటీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు దాదు, నిషార్, షమి, సన్నా తదితరులు దౌర్జన్యానికి దిగారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సర్ది చెప్పి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా మంత్రి భర్త దౌర్జన్యంపై ముస్లింలు మండిపడ్డారు. -
Savitha Rao: నిశ్శబ్దానికి రక్షకులు కావాలి
ముంబైలో 46 లక్షల వాహనాలున్నాయి. వాటిలో 70 శాతం రోజుకు కనీసం ఏడుసార్లు హారన్ మోగిస్తే ఎంత శబ్దకాలుష్యమో ఆలోచించారా అని ప్రశ్నిస్తుంది సవితారావు. ముంబైకి చెందిన ఈ సామాజిక కార్యకర్త ‘నిశ్శబ్దం తరఫునపోట్లాడేవాళ్లు కావాలి’ అని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ అనే పుస్తకం రాసి శ్రుతి మించిన ధ్వని వల్ల వచ్చే శారీరక, మానసిక అనారోగ్యాలను తెలియచేసింది. ‘చప్పుళ్ల చెత్తను పారపోద్దాం రండి’ అంటున్న ఆమె పరిచయం.మన హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పోలీసు వారు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అవి గుర్తించి చలాన్లు పంపుతాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా 255 ‘నాయిస్ డిటెక్టర్లు’ బిగించారు. ఒక వాహనం అవసరానికి మించి హారన్ మోగించినా, నియమిత డెసిబెల్స్ మించి చప్పుడు చేసినా వెంటే ఈ నాయిస్ డిటెక్టర్ గుర్తించి వారికి జరిమానా విధిస్తుంది. ఇది 1000 రూపాయల వరకూ ఉంటుంది. ‘మెట్రో నగరాల్లో అర్థం పర్థం లేని హారన్ మోతలను నివారించాలంటే ఇలాంటి చర్యలు అవసరం. ముంబైలో ముఖ్యంగా అవసరం’ అంటోంది సవితా రావు.నో హారన్ ప్లీజ్రోడ్డు మీద వెళుతుంటే గతంలో చాలా వాహనాల వెనుక ‘ప్లీజ్ సౌండ్ హారన్’ అని ఉండేది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు ‘నో హారన్ ప్లీజ్’ అంటున్నారు. ముంబైకి చెందిన సవితా రావు ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ పేరుతో ఈ అంశంపై చైతన్యం కోసం పుస్తకమే రాశారు. ‘ఇండియా పాజిటివ్ సిటిజెన్ ఇనిషియేటివ్’ పేరుతో సంస్థ ్రపారంభించిన సవితా రావు ΄పౌరులుగా ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయవలసిన బాధ్యత ఉందని, అందుకే ‘వన్ యాక్షన్, వన్స్ ఏ వీక్, ఎవ్రీ వీక్’ అనే భావన వారిలో కలిగించాలని పని చేస్తోంది. అంటే రోజూ దేశం, సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేయక΄ోయినా కనీసం వారంలో ఒకసారి చేస్తూ, ప్రతి వారం చేయగలిగితే చాలా మార్పు సాధించవచ్చని ఆమె అంటారు. ఉదాహరణకు రాంగ్ సైడ్ వాహనం నడపక΄ోవడం, ట్రాఫిక్ నియమాలను పూర్తిగా పాటించడం కూడా సమాజానికి పెద్ద మేలు అంటారామె. అయితే ఆ చిన్నపాటి దుర్గుణాన్ని కూడా సరి చేసుకోరు చాలామంది అని వా΄ోతారు.నిశ్శబ్దం మన హక్కు‘ఇవాళ నిశ్శబ్దం కలిగిన వాతావరణం అరుదైపోయింది. పెళ్లిళ్లకు వెళ్లినా, పార్కుకు వెళ్లినా, రెస్టరెంట్‌కు వెళ్లినా, జిమ్‌కు వెళ్లినా పెద్ద శబ్దంతో ఏవో ఒక పాటలు, సంగీతం చెవిన పడుతుంటాయి. ఆఖరకు ఆస్పత్రులకు వెళ్లినా ఔట్ పేషంట్ల విభాగం దగ్గర అందరూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ చాలా చప్పుడు చేస్తుంటారు. నిశ్శబ్దం పాటించడం ఒక సంస్కారం అని మరిచి΄ోయాం. ఇక పండగలు వస్తే మైకుల ద్వారా జరుగుతున్న గోల చాలా తీవ్రమైనది. వీధి చివర కనపడే చెత్త మాత్రమే కొందరికి కనిపిస్తుంది. కాని ఇది కనపడని చెత్త. కనపడని కాలుష్యం. ఇది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది’ అంటారు సవితా రావు.అనారోగ్య మెట్రోలు‘దేశ ఆర్థిక పురోగతికి 2030 నాటికి పట్టణ, నగరాలే ఆయువుపట్టు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని ఈ మెట్రో నగరాల్లో ఉన్న పౌరుల ఆరోగ్యం సరిగ్గా లేక΄ోతే అవి ఎలా పురోగమిస్తాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వారిని కాటేస్తోంది. హారన్ వాడకం చాలా తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే మన దేశ పట్టణాల్లో, నగరాల్లో డయాబెటిస్, బి.పి.లతో అత్యధిక జనం బాధపడుతున్నారు. శబ్ద కాలుష్యం వల్ల గుండె, చెవి, మెదడు ఆరోగ్యం దెబ్బ తింటుంది. అనవసర ఆందోళన మొదలవుతుంది’ అంటారు సవితా రావు.చప్పుళ్లు సృష్టించే అభివృద్ధి‘ప్రభుత్వాలు విమానాశ్రయాలను వృద్ధి చేస్తున్నాయి. విమానయాన సంస్థలు వందల కొత్త విమానాలకు అర్డర్లు ఇస్తున్నాయి. రైలు మార్గాల విస్తరణ, ఇక లక్షలాది టూ వీలర్లు ఇవన్నీ ఏ స్థాయిలో శబ్ద కాలుష్యం సృష్టిస్తాయో ఆలోచిస్తున్నామా? శబ్ద కాలుష్యం వల్ల మరణాలు సంభవించక΄ోయినా ఆయుష్షు క్షీణిస్తోందని డబ్లు్య.హెచ్.ఓ చెబుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ముందు బండిని దాటేయాలన్న దుశ్చర్యతో అదేపనిగా హారన్ కొట్టి శబ్ద కాలుష్యం సృష్టించేవారిపై జరిమానా విధించాలా వద్దా?’ అని ప్రశ్నిస్తారు సవితా రావు.ఆమె రాసిన పుస్తకం ‘నాయిస్ ఇన్ అవర్ నేషన్’ శబ్ద కాలుష్య దుష్ప్రభావాలు తెలపడమే కాదు ప్రభుత్వం, స్థానిక సంస్థలు,పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ΄పౌరులు కలిసి దీని నుంచి సమష్టి ప్రయత్నంతో ఎలా బయటపడాలో కూడా తెలియచేస్తోంది. -
హార్దిక్, సవితలకు ఎఫ్ఐహెచ్ అవార్డులు
లుసానే (స్విట్జర్లాండ్): భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, సవిత పూనియాలు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళల కెపె్టన్ అయిన సవిత ‘ఎఫ్ఐహెచ్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో హ్యాట్రిక్ కొట్టింది. సవిత 2021, 2022లలో కూడా ఈ అవార్డును అందుకుంది. ఆ్రస్టేలియా పర్యటనలో టెస్టు మ్యాచ్‌లు, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 33 ఏళ్ల సవిత చక్కని ప్రదర్శన కనబరిచింది. అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలుపడంలో కీలకపాత్ర పోషించింది. జనవరిలో రాంచీలో జరిగే ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యంగా సవిత జట్టును నడిపించనుంది. భారత పురుషుల జట్టులో స్టార్ మిడ్‌ఫీల్డర్‌గా ఎదిగిన హార్దిక్ సింగ్ పోరాటపటిమను ఎఫ్ఐహెచ్ గుర్తించింది. అతను ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అతనికి లభించిన రెండో అవార్డు ఇది! హాకీ ఇండియా (హెచ్ఐ) నుంచి ‘బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కూడా అందుకున్నాడు. -
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న హార్ధిక్
భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు. -
FIH Nations Cup final: ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు
వాలెన్సియా: ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ‘నేషన్స్ కప్’ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సవిత పూనియా గోల్‌పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలువడంతో భారత్ షూటౌట్లో 2–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. తొలిక్వార్టర్లో ఐర్లాండ్ స్ట్రయికర్ నవొమి క్యారొల్ (13వ ని.) గోల్ చేయడంతో ఐర్లాండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే మూడో క్వార్టర్ ముగిసే దశలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (45వ ని.) గోల్‌గా మలచి స్కోరును సమం చేసింది. షూటౌట్లో భారత బృందంలో లాల్రేమ్సియామి, సోనిక గోల్స్ సాధించగా, ఐర్లాండ్ జట్టులో హన్నా మెక్‌లాలిన్ గోల్ చేసింది. ఎలెన్ కరన్ షాట్‌ను సవిత సమర్థంగా ఆడ్డుకుంది. అప్పటికి భారత్ 5 ప్రయత్నాలు ముగియగా... ఐర్లాండ్‌కు ఆఖరి షాట్ మిగిలుంది. కత్రిన్ ములన్ షాట్‌ను వైడ్‌గా కొట్టడంతో భారత్ 2–1తో విజయం సాధించింది. ఫైనల్ చేరిన భారత్... స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్‌హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు. భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్‌కు.. -
మొన్న ఓటమి.. నిన్న విజయం.. ఈ సారి మనదే ‘షూటౌట్’!
FIH Pro League- భువనేశ్వర్: శనివారం ఓటమికి కారణమైన ‘షూటౌట్’ ఆదివారం వచ్చేసరికి విజయాన్నందించింది! ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని చిత్తు చేసింది. తొలి మ్యాచ్ తరహాలోనే నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ముందుగా మ్యాచ్ 29వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీషియా వీడర్మన్ గోల్ సాధించగా... 40వ నిమిషంలో నిషా గోల్ సాధించి భారత్‌ను బరిలో నిలిపింది. షూటౌట్లో భారత్ మూడు ప్రయత్నాల్లోనూ బంతి గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో సఫలం కాగా... జర్మనీని మన గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. షూటౌట్లో భారత్ తరఫున కుమారి సంగీత, టెటె సలీమా, సోనిక గోల్స్ సాధించారు. తాజా గెలుపుతో భారత్ ఖాతా లో 2 పాయింట్లు చేరాయి. ప్రొ లీగ్‌లో భాగంగా భారత్ తమ తర్వాతి పోరులో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై తలపడుతుంది. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు -
Savita Punia: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్‌కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్‌కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1 — Savita Punia (@savitahockey) November 24, 2021 -
ఓటమి తట్టుకోలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు
-
ఏడ్వొద్దు ప్లీజ్.. తలెత్తుకో సవితా: టీజ్ చేసిన వాళ్లకు జవాబు ఇచ్చావుగా!
సాక్షి, వెబ్‌డెస్క్: ఆద్యంతం ఉత్కంఠ... తొలి క్వార్టర్లో బ్రిటన్ ఆధిపత్యం.. రెండో క్వార్టర్లో సీన్ రివర్స్.. క్వార్టర్ ముగిసే సరికి 5 నిమిషాల వ్యవధి(25 ని, 26 ని, 29వ నిమిషం)లో ఏకంగా మూడు గోల్స్ కొట్టి 3-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకొచ్చిన రాణి సేన.. మూడో క్వార్టర్ ముగిసేంత వరకు 3-3తో సమంగానే ఉంది.. అటు స్ట్రైకర్లు, ఇటు డిఫెన్స్ టీం చక్కగా రాణించినప్పటికీ.. చివరిదైన నాలుగో క్వార్టర్లో ప్రత్యర్థికి గోల్ కొట్టే అవకాశం లభించింది. ఫలితంగా.. భారత మహిళల హాకీ జట్టు చరిత్రలో ఒలింపిక్ పతకం చేరుతుందన్న ఆశలు అడియాశలయ్యాయి. కాంస్యం కోసం హోరాహోరీగా సాగిన పోరులో చివరికి విజయం బ్రిటన్నే వరించింది. దీంతో ఒలింపిక్స్‌లో తొలి మెడల్ సాధించే అద్భుత అవకాశం చేజారడంతో మన అమ్మాయిలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తలెత్తుకో సవితా ముఖ్యంగా భారత ఓటమిని ఖరారు చేసే ఫైనల్ విజిల్ వినిపించగానే గోల్ కీపర్ సవితా పునియా కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సుమారు పన్నెండు సార్లు బ్రిటన్ను గోల్ చేయకుండా అడ్డుకున్న తన పోరాటం వృథా అయినందుకు.. చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు స్పందనగా.. ‘‘మీరంతా గొప్ప ప్రదర్శన కనబరిచారు. తలెత్తుకో సవితా’’ అంటూ భారతావని ఆమెకు అండగా నిలుస్తోంది. చిన్న గ్రామంలో జన్మించిన సవితా పునియా.. భారత అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎదిగిన తీరును ప్రశంసిస్తూ నీరాజనాలు పలుకుతోంది. అలా మొదలైంది హర్యానాలోని జోద్ఖాన్ సవిత స్వస్థలం. ఆమె తాతయ్య రంజిత్ పునియా హాకీ మ్యాచ్ చూసేందుకు ఒకసారి ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన మదిలో ఒకటే ఆలోచన. తన కుటుంబంలో కూడా ఒక హాకీ ప్లేయర్ ఉండాలని బలంగా భావించారు. అప్పటి నుంచి మనవరాలు సవితాను హాకీ ఆడే విధంగా ప్రోత్సహించారు. అలా పునియా కుటుంబం నుంచి వచ్చిన తొలి హాకీ క్రీడాకారిణిగా సవిత ప్రయాణం మొదలైంది. మొదట్లో హాకీ ఆడటాన్ని ద్వేషించేది తాతయ్య చెప్పినట్లు అంతా బాగానే ఉంది.. కానీ.. ప్రాక్టీసు కోసం వారానికి ఆరు రోజులు.. పోనురానూ కలిపి సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణం.. సిర్సా పట్టణంలోని మహరాజా అగ్రాసన్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు వెళ్తేనే ఆట సజావుగా సాగేది.. ఎందుకంటే తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఏకైక హాకీ క్రీడా ప్రాంగణం, కోచ్‌లు గల పాఠశాల అది. ఇలా రోజూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు సవితాకు చిరాకు పుట్టించేవి. అందుకే తొలుత ఆమె హాకీ ఆడటాన్ని ద్వేషించేదని సవిత తండ్రి మొహేందర్ పునియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయాన్ని చెప్పండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు? ఫొటో కర్టెసీ: ఇండియా టుడే అబ్బాయిలు టీజ్ చేసేవారు ‘‘ప్రాక్టీసుకు వెళ్లేందుకు సవిత బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే, కిట్‌బ్యాగ్‌తో ఆమెను లోపలికి అనుమతించేవారు కాదు. బ్యాగ్‌ను టాప్‌పైన పెడితేనే బస్సు ఎక్కనిస్తామని కండక్టర్లు హెచ్చరించేవారు. కానీ సవితకు అది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తను చాలా సార్లు రూఫ్ మీద కూర్చుని ప్రయాణం చేసేది. ఒక్కోసారి ఇంటికి వచ్చి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి బాధపడేది. ‘‘నాన్నా.. బస్సులో అబ్బాయిలు నన్ను టీజ్ చేస్తున్నారు’’ అని మనసు చిన్నబుచ్చుకునేది. నిజానికి అలాంటి అనుభవాలే తనను మరింత ధైర్యంగా ఉండేలా మార్చాయి. నా కూతురిని ఏడిపించిన అబ్బాయిల అందరి చెంప మీద కొట్టినట్లుగా తన ప్రతీ ప్రదర్శన వారికి ఒక జవాబునిచ్చింది’’ అని కూతురి విజయాల గురించి చెబుతూ మొహేందర్ పునియా పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. 2007 నుంచి మొదలు.. మూడేళ్ల నిరీక్షణ తర్వాత లక్నోలోని నేషనల్ క్యాంపులో శిక్షణకు సవితా 2007లో ఎంపికైంది.ఆ మరుసటి ఏడాదే జాతీయ జట్టు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అయితే, తన మొదటి జాతీయ హాకీ మ్యాచ్ ఆడేందుకు మాత్రం మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఇంచియాన్ ఏసియన్గేమ్స్లో భాగంగా అద్భుత ప్రదర్శన కనబరిచి వెలుగులోకి వచ్చింది సవితా పునియా. ఆ ఏడాది భారత్ కాంస్య గెలవడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా 2017 ఏసియన్ కప్‌లో ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించడంతో గోల్‌కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో చైనాతో జరిగిన ఉత్కంఠ పెనాల్టీ షూటౌట్లో భారత్ 5-4తో డ్రాగన్ దేశాన్ని ఓడించి 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజేతగా నిలిచింది. ఫొటో కర్టెసీ: సోనీ టీవీ మనసులు గెల్చుకున్నారు ఇక ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లోనూ సవిత తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సెమీస్‌లో ప్రవేశించేందుకు ఆస్ట్రేలియాను ఓడించడంలోనూ, కాంస్య పతక వేటలో చివరికంటా భారత మహిళా హాకీ జట్టు బ్రిటన్‌తో జరిపిన పోరాటంలోనూ గోల్‌కీపర్‌గా తనవంతు బాధ్యత నిర్వహించి వాల్‌కు సరికొత్త నిర్వచనంలా నిలిచింది. ఏదేమైనా పతకం చేజారినా, అద్భుత ప్రదర్శనతో మనసులు గెల్చుకున్న మన అమ్మాయిలు.. బంగారు తల్లులే!! భవిష్యత్ తరానికి స్ఫూర్తిదాతలే!! 5 minutes on the timer ➡️ 3 goals on the score board!#IND had pulled off an impressive comeback in the final five minutes of Q2 in their loss vs #GBR to make it 3-2 at one stage via Gurjit Kaur’s brace while Vandana earned the lead with a crucial field goal. 👏#BestOfTokyo pic.twitter.com/Fyn4os5w6h — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 6, 2021 -
దీనస్థితిలో సీనియర్ నటి, అయినవాళ్లు కూడా పొమ్మన్నారు!
Veteran Actor Savita Bajaj Needs Financial Help: సీనియర్ నటి సవితా బజాజ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. 'నిశాంత్', 'నజ్రానా', 'బెటా హోతో ఐసా' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆదుకునేందుకు అయినవాళ్లు కూడా ముందుకు రాకపోవడంతో మూగగా రోదిస్తోందీ నటి. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. "నేను సంపాదించి కూడబెట్టినదంతా ఊడ్చుకుపోయింది. ఆ డబ్బంతా నా వైద్యం కోసమే ఖర్చు పెట్టాను. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు చాలవన్నట్లు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడేం చేయాలో కూడా పాలు పోవడం లేదు. అసలే నాకు ముంబైలో సొంతిల్లు కూడా లేదు. ఒక చిన్న కిచెన్ రూమ్‌లో అద్దెకుంటున్నాను. దీనికి ఏడు వేల రూపాయలు అద్దె కడుతున్నాను. 2016లో నేను ఓ ప్రమాదంలో గాయపడినప్పుడు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) రూ.50 వేలు, రైటర్స్ అసోసియేషన్ లక్ష రూపాయలు ఇచ్చింది. కానీ ఈ సారి నా ఆరోగ్యాన్ని నేను చక్కదిద్దుకునే పరిస్థితిలో లేను. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే తిరిగి పనిలోకి ఎక్కగానే వారిచ్చిన మొత్తాన్ని ఇచ్చేయాలనుకునేదాన్ని. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తిరిగి నటిస్తానన్న నమ్మకం లేదు. ఇక నా కుటుంబం అంటారా! నా దురదృష్టం కొద్దీ నా బాగోగులు చూసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. 25 ఏళ్ల క్రితం నా స్వస్థలమైన ఢిల్లీకి వెళ్లాలనుకున్నా. కానీ నా కుటుంబంలోని ఏ ఒక్కరూ నన్ను వారితో ఉండనిచ్చేందుకు ఇష్టపడలేదు. ఎంతో సంపాదించాను, కుటుంబం కోసం మరెంతో ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ఒంటరినై సాయం కోసం అర్థించాల్సిన దుస్థితికి చేరుకున్నాను" అని నటి ఎమోషనల్ అయింది. కాగా బుల్లితెర నటి షగుఫ్త అలీ కూడా తన వైద్యం కోసం బంగారు నగలు, కారును అమ్మేసిన విషయం తెలిసిందే. ఆమె గురించి తెలిసిన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ దీవానీ 3 టీం తరపున రూ.5 లక్షల చెక్ అందించింది. ఇప్పుడు దీనస్థితిలో ఉన్న సవితా బజాజ్‌కు కూడా ఎవరైనా చేయూత అందిస్తే బాగుండంటున్నారు నెటిజన్లు. -
ఆ నిర్ణయమే సవితని విజేతగా నిలబెట్టింది
ఆది లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యా లక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి... మనకు తెలిసిన అష్ట లక్ష్ములు. వీరి జాబితాలో చేర్చాల్సిన మరో లక్ష్మి కథ ఇది. ఆ లక్ష్మి పేరు శ్రమలక్ష్మి. ఆమె నలభై ఏళ్ల గృహిణి. పేరు సవిత లబాడే. ఊరు నాసిక్. చదివింది ఎనిమిదో తరగతి. ఇద్దరు పిల్లలు. భర్త ఆత్మారామ్ చిన్న రైతు. వాళ్లకున్నది రెండున్నర ఎకరాల పొలం. వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యత మొత్తం భర్త స్వయంగా చూసుకునేవాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం తప్ప మరేమీ తెలియని ఇల్లాలామె. విధి వక్రించింది. భర్త గుండెపోటుతో మరణించాడు. అతడు చేసిన అప్పులన్నీ అతడు పోయిన తర్వాత బయటపడ్డాయి. భర్త పోయిన నెల రోజులకే కో ఆపరేటివ్ బ్యాంకుల వాళ్లు తలుపుకొట్టారు. అయోమయం నుంచి తేరుకునే లోపే ఇంటి గోడకు నోటీస్ అంటించారు. ఆ తర్వాత ఏడాది లోపు ఒక్కటొక్కటిగా అప్పుల లెక్కలన్నీ వరుస కట్టాయి. అంతా చూస్తే ఏడు లక్షల రూపాయలు. అప్పుకు వడ్డీ రోజురోజుకూ పెరిగిపోతోంది. భర్త పోయిన దుఃఖం ఒక కంట్లో నీరై కారుతోంది. అతడు చేసిన అప్పులు కన్నీళ్లుగా మరో కంట్లో ఉబికి వస్తున్నాయి. ఆ క్షణంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను నేడు విజేతగా నిలబెట్టింది. బలి తీసుకున్న ద్రాక్ష తీగ సవిత భర్త పొలంలో ద్రాక్షతోటను పెంచేవాడు. ద్రాక్ష సాగు ఎలాగో ఆమెకు ఏ మాత్రం తెలియదు. పైగా భర్తను బలి తీసుకున్న ద్రాక్ష తీగను జీవితంలో తాక కూడదనుకుంది. దాంతో పొలంలో కూరగాయల సాగు చేయడానికి సిద్ధమైంది. అది మంచి లాభాల్నే ఇచ్చింది. నెలకు పదివేలు... ఇద్దరు పిల్లలతో బతకడానికైతే సరిపోతాయి. అయితే అప్పులు తీర్చేదెలా? ఇంకా ఏదో చేయాలి. అప్పుల నుంచి బయటపడితే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అనుకుంది. తాను ఇష్టంగా ధరించే బంగారు దండను అమ్మేసి పెద్ద అప్పులు తీర్చింది. కూరగాయలతోపాటు సోయాబీన్, గోధుమ పంటలు వేసి బతుకు బండిని లాగుతోంది. ఒక స్నేహితురాలి సలహాతో సవిత మసాలా దినుసుల తయారీకి సిద్ధమైంది. మెషీన్ కొనాలంటే డబ్బు కావాలి. పొలం మీద వచ్చిన డబ్బు కొంత చేతిలో ఉంది. మిగిలిన బంగారం కూడా అమ్మేసి 65 వేలకు మెషీన్ కొన్నది. నిజానికి అది ఒక సాహసమే. అయితే ఆ ప్రయత్నం ఆమెను పరీక్ష పెట్టలేదు. మసాలా పొడుల తయారీ విజయవంతంగా నడిచింది. ఆమె కుటీర పరిశ్రమ 2015 నాటికి నెలకు అరవై వేల సంపాదనకు చేరింది. ఈ లోపు పొలంలో మరో ప్రయోగం... చెరకు పంటకు పని తక్కువ, ఏడాది కి రెండుసార్లు పంట వస్తుంది. కష్టాల కడలిని ఈదుతున్న సవితను చెరకు పంట కూడా అర్థం చేసుకున్నట్లుంది. ఒక సీజన్‌కి యాభై వేల రాబడి తో తీపిని పంచింది. మసాలా పరిశ్రమ పని ఫిబ్రవరి నుంచి జూలై వరకే ఉంటుంది. పొలం మీద రాబడి కూడా సీజన్లోనే వస్తుంది. అలా కాకుండా ప్రతి నెలా డబ్బు కనిపిస్తే తప్ప జీవితం గాడిన పడదనుకుందామె. దాంతో జనరల్ స్టోర్ ప్రారంభించింది. ఇప్పుడు సవిత పంట మీద, మసాలా పొడుల పరిశ్రమ, జనరల్ స్టోర్ అన్నింటి మీద సరాసరిన నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని చూస్తోంది. ఉదయం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పడుతున్న శ్రమకు దక్కుతున్న ప్రతిఫలం అది. ఆమె కొడుకు ఎలక్ట్రానిక్స్‌లో కోర్సు చేస్తున్నాడు. కూతురు పోలీస్ సర్వీస్‌లో చేరడానికి శిక్షణ తీసుకుంటోంది. స్వశక్తితో జీవించాలి ‘‘మసాలా పొడి మెషీన్ నడిపేటప్పుడు కళ్లలో పడుతుంది, ఒంటి మీద పడి చర్మం మండుతుంది. ఆ మంటలకు భయపడి మెషీన్‌ని అమ్మేద్దాం అని కూడా అనిపించింది. నేను ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే ఇవి పెద్దవి కాదని మనసు గట్టి చేసుకున్నాను. జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఆడవాళ్లు సున్నితంగా, శ్రమ లేకుండా హాయిగా జీవించేయాలనుకోకూడదు. స్వశక్తితో జీవించాలి. కష్టాలెదురైనప్పుడు నిశ్శబ్దంగా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని కలిగి ఉండాలి’’ అంటోంది సవిత. -
అతడు చనిపోయాడు ఆశయం బతికి ఉంది
యాభై ఐదేళ్ల వయసులో ఏ తల్లికీ రాకూడని గర్భశోకాన్ని దిగమింగుకున్నారు శిశిర్ తల్లి సవిత. ఆమెకు ధైర్యం చెబుతూ.. కొడుకు ఆశయాన్ని ఆమెకు గుర్తు చేశారు శిశిర్ తండ్రి. జాతి నిర్మాణంలో ప్రతి పౌరుడూ తన శక్తిమేరకు పాలు పంచుకోవాలన్నదే ఆ కొడుకు ఆశయం! అందుకోసం వాళ్లు ఎంచుకున్న మార్గం.. చదువు చెప్పడం. సైన్యంలో పనిచేసి గ్రూప్ కెప్టెన్‌గా రిటైరయ్యారు శరద్ తివారి. ఆయన స్ఫూర్తితో కొడుకు శిశిర్ కూడా డిఫెన్స్ ఉద్యోగంలో చేరాడు. 2017, అక్టోబర్ 6న శిశిర్ స్క్వాడ్రన్ లీడర్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఓ ప్రమాదం జరిగింది. ఎమ్ఐ–17 విఫైవ్ విమానం కూలిన ఆ ప్రమాదంలో శిశిర్ చనిపోయాడు. అతడి ఆశయాన్ని బతికించడం కోసం శిశిర్ తల్లిదండ్రులు గత ఏడాది ఆగస్టు నెలలో ‘షహీద్ స్క్వాడ్రన్ లీడర్ శిశిర్ తివారీ మొమోరియల్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభించారు. ఢిల్లీలోని యమునా తీరంలో ఉన్న మురికివాడలో పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టారు. వంద మంది పిల్లలతో మొదలు పెట్టిన అనియత (నాన్ ఫార్మల్) విద్యాకేంద్రం ఇప్పుడు 350 మందికి చేరువైంది. మురికివాడల్లో నివసించే వారికి వారి రోజును వెళ్లదీయడంలోనే సరిపోతోంది. పిల్లలకు మంచి చదువు చెప్పించడం, శుభ్రత నేర్పించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ వాటికైనా తమ పిల్లలను రోజూ పంపించాలనే ఆసక్తి కూడా ఉండడం లేదు. పిల్లవాడు బడికి పోనంటే తమతోపాటు ఏదో ఒక పనికి తీసుకెళ్లవచ్చనే ధోరణిలో ఉంటున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను రోజూ బడికి పంపించేటట్లు నచ్చ చెప్పారు శిశిర్ తల్లిదండ్రులు. ఆ తర్వాత కాలనీలోనే బహిరంగ ప్రదేశంలో షెడ్ నిర్మించి పాఠశాల తెరిచారు. ఏడాదిలో ఎంతో మార్పు మధ్యాహ్నం, సాయంత్రం రెండు షిఫ్టులుగా పిల్లలకు పాఠాలు చెప్తున్నారు తివారీ, సవిత. ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి పిల్లల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పాతిక మంది విద్యా వాలంటీర్లను నియమించారు సవిత దంపతులు. మెట్రో స్టేషన్ పనుల్లో ఉన్న తల్లిదండ్రులతోపాటు తాత్కాలిక నివాసాల్లో రోజులు గడుపుతున్న యాభై మంది పిల్లల కోసం అక్కడే మరొక అనియత పాఠశాలను పెట్టారు. ‘‘ఈ ఏడాది కాలంలో పిల్లల్లో మేము ఆశించిన మార్పు కనిపిస్తోంది. పిల్లలకు వారి పట్ల వారికి ఆసక్తి పెరిగింది. పరిశుభ్రత పాటిస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిదవ తరగతి నుంచి స్కూలు మానేస్తున్న ఆడపిల్లల్లో కెరీర్ గురించి ఆలోచనలు రేకెత్తుతున్నాయి. తాము శుభ్రంగా ఉండడంతోపాటు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే స్పృహ కూడా కనిపిస్తోంది. అన్నిటికన్నా కూడా ఎవరైనా పలకరించినప్పుడు బదులిచ్చే విధానంలో మార్పు వచ్చింది. వీరి నుంచి దేశానికి మంచి ఇంజనీర్లు, లాయర్లు, పైలట్లు, సోల్జర్లు, జర్నలిస్టులు వస్తారనే నమ్మకం కలుగుతోంది. శిశిర్ కోరుకున్నటువంటి పౌరులను దేశానికి ఇవ్వడంలో నేను విజయవంతం అవుతాననే ధైర్యం వస్తోంది’’ అన్నారు సవిత. – మను ►మా అబ్బాయి కోరుకున్న జాతి నిర్మాణం కోసం పని చేస్తున్నాం. ఈ పని మాకు సంతోషాన్నిస్తోంది. ఇంకా విస్తృతం చేస్తాం. – శరద్ తివారీ, సవిత -
అబార్షన్... విప్లవాత్మక తీర్పు
డబ్లిన్ : గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు చేస్తున్న పోరాటంపై విప్లవాత్మక తీర్పు వచ్చింది. అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై చేపట్టిన రిఫరెండంలో, 66 శాతం మంది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలనే ఓటు వేశారు. శనివారం రోజు దీని తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 40 నియోజకవర్గాల్లో తొలి నాలుగింటిన్ని వెల్లడించారు. దీనిలో 66.36 శాతం మంది నిషేధం ఎత్తివేయాలని ఓటు వేయగా.. 33.64 శాతం మంది మాత్రం నిషేధ ఎత్తివేతకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు డుబ్లిన్లోని సెంట్రల్ కౌంట్ సెంటర్ వెల్లడించింది. డుబ్లిన్ సెంట్రల్లో 77 శాతం మంది, కార్క్ సౌత్-సెంట్రల్లో 69 శాతం మంది, కార్క్ నార్త్ సెంట్రల్లో 64 శాతం మంది, గాల్వే ఈస్ట్‌లో 60 శాతం మంది అబార్షన్ల నిషేధ ఎత్తివేతకు ‘యస్’ అని ఓటు వేసినట్టు తెలిసింది. దీంతో ఎంతో కట్టుదిట్టంగా అమలవుతున్న అబార్షన్ వ్యతిరేక చట్టానికి ఇక చరమగీతం పాడాల్సివసరం వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు అబార్షన్లకు అనుమతి ఇచ్చే ఓ కొత్త చట్టం తీసుకొస్తామని ప్రధాని లియో వరడ్కర్ చెప్పారు. కొత్త చట్టం డ్రాఫ్టింగ్ కోసం మంగళవారం కేబినెట్ సమావేశమవుతుందని తెలిపారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశమున్నప్పుడు అబార్షన్‌కు అనుమతించేలా ఈ కొత్త చట్టం రూపుదిద్దుకోనుంది. అబార్షన్ నిషేధం అనే కఠినతర చట్టం వల్ల ఆరేళ్ల క్రితం సవిత అనే ఓ భారతీయ మహిళ మృతి ఎందరినో కలచివేసింది. దీంతో ఐర్లాండ్ ప్రభుత్వం ఈ రిఫరెండాన్ని చేపట్టింది. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నేడు వెల్లడైన తొలి ఫలితం కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తోంది. -
అబార్షన్ చట్టబద్ధమయ్యేనా?
తల్లి ప్రాణం మీదికి వచ్చినా సరే..కడుపులో ఉన్న బిడ్డను తొలగించకూడదు అక్కడ. ఐర్లాండ్‌లో మొదటి నుంచి అబార్షన్ వ్యతిరేక చట్టం కట్టుదిట్టంగా అమలవుతోంది. మరి ఒక భారతీయ మహిళ విషాదభరిత మృతి ఆ చట్టాన్ని మారుస్తుందా? గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు చేస్తున్న పోరాటం ఫలించేనా? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై నేడు రిఫరెండం జరగనుంది. సుమారు ఆరేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర అనే మహిళ ఈ కఠిన చట్టం వల్లే సకాలంలో అబార్షన్ జరగక మరణించింది. ఆమె మృతి ఎందరినో కదిలించడంతో ప్రజాభిప్రాయ సేకరణకు ఐర్లాండ్ ప్రభుత్వం సిద్ధమైంది. అప్పుడేం జరిగిందంటే.. ఐర్లాండ్‌లో నివసిస్తున్న దంత వైద్యురాలు సవిత(31) మూడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో విపరీతమైన నడుం నొప్పితో 2012 అక్టోబర్ 21న గాల్వేలోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అబార్షన్ చేయాల్సిందేనని నిర్ధారించారు. గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు.. సహజంగా గర్భస్రావం అవుతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈలోపు ఆమె గర్భాశయానికి ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదికొచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకి మందుల ద్వారా అబార్షన్ చేశారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్ 28న తుది శ్వాస విడిచింది. దేశంలోని కఠినమైన అబార్షన్ చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ చట్టాల్ని తక్షణమే ప్రక్షాళన చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. సవిత మృతిపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్.. గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ సిఫార్సు చేసింది. సవితను గుర్తుకు తెచ్చుకోండి ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలోనూ తమ కుమార్తె దేశంకాని దేశంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కలచివేసింది. తమ కూతుర్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిఫరెండంలో ఓటేసే ముందు ఐర్లాండ్‌వాసులు తమ కూతురిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరేతల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలనుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అనుమతి లేని బోటులో రాష్ట్రపతి సతీమణి, కుమార్తె
భవానీపురం/సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పవిత్ర సంగమం వద్ద ఇటీవల పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో కృష్ణా నదిలో ప్రైవేట్ సంస్థలకు చెందిన బోట్లన్నింటినీ నిలిపివేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతిని బుధవారం పున్నమిఘాట్ నుంచి భవానీ ద్వీపానికి అనుమతి లేని ప్రైవేట్ బోటులో తీసుకురావడం గమనార్హం. మూసివేసిన చాంపియన్ యాచ్ట్ క్లబ్‌కు చెందిన బోటులో వీరిని తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ బోటులో రాష్ట్రపతి భార్య, కుమార్తెను ఎండలో కూర్చోబెట్టారు. తిరుగు ప్రయాణంలో పర్యాటక శాఖకు చెందిన బోధిసిరి పడవలో తీసుకొచ్చారు. భవానీ ద్వీపానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే బోటులో తీసుకెళితే బాగుండేది కదా అని సవితా కోవింద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి సతీమణి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకుమారి, ట్రస్టు బోర్డు చైర్మన్ గౌరంగబాబు, పాలక మండలి సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. సవితాకోవింద్, స్వాతి అమ్మవారికి సహస్ర నామార్చన చేయించుకున్నారు. అనంతరం వారు భవానీ ద్వీపం చేరుకున్నారు. పున్నమిఘాట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో వారు కృష్ణానదిలో విహరించారు. అంతకు ముందు స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ గులాబీల ప్రదర్శనను, గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన ధింసా నృత్యాన్ని తిలకించారు. భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంగళగిరి పట్టు చీరల స్టాల్‌ను సందర్శించి వాటి నాణ్యత ప్రమాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి స్టాల్‌ను సందర్శించి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి వాటి విశేషాలను తెలుసుకున్నారు. బందరు మిఠాయి స్టాల్ వద్ద బందరు లడ్డూ రుచులను ఆస్వాదించారు. ప్లోటింగ్ పౌంటేయిన్, మ్యూజికల్ లేజర్ షోను తిలకించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం: అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రాజగోపురం నుంచి నడుస్తున్న సవితా కోవింద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజగోపురం లోపలకు ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ ర్యాంప్ వద్ద సవితా కోవింద్ అదుపు తప్పి జారిపోగా, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆమెను పట్టుకున్నారు. ఆమె వెంట ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
సవితను ఆదుకుంటాం: కేంద్ర క్రీడల మంత్రి
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియాను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. 13 ఏళ్ల తర్వాత భారత మహిళల జట్టు ఆసియా కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సవితకు ఇంకా ఉద్యోగమే లేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తున్న తనకు ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడం బాధిస్తోందని మీడియాతో పేర్కొంది. దీనిపై మంత్రి రాథోడ్ స్పందించారు. ‘సవితకు ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందజేసేలా మా క్రీడాశాఖ అధికారులను ఆదేశించాను. దీనిపై పూర్తి వివరాలను సేకరించాలని వారికి చెప్పా. దేశానికి పేరుతెచ్చే క్రీడాకారులకు తగిన గౌరవ మర్యాదలు దక్కేలా చూడటమే మా ప్రధాన ఉద్దేశం’ అని రాథోడ్ ట్వీట్ చేశారు. -
ఇకనైనా ఉద్యోగం ఇస్తారేమో...
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్‌కు 13 ఏళ్ల తర్వాత టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన గోల్‌కీపర్ సవితా పునియా ఈ విజయం తన జీవితంలోనూ మార్పు తెస్తుందని ఆశాభావంతో ఉంది. తొమ్మిదేళ్లుగా ఆమె భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉంది. ‘మెడల్ లావో... నౌక్రీ పావో’ (పతకం గెలవండి, ఉద్యోగం పొందడి) పథకం కింద ఉద్యోగం ఇస్తామని హరియాణా ప్రభుత్వ క్రీడాధికారులు హామీలు ఇస్తున్నా... అదింకా కార్యరూపం దాల్చడం లేదు. ఆసియా కప్ విజయంతోనైనా వారి హామీ ఆచరణ సాధ్యం కావాలని 27 ఏళ్ల సవిత కోరుకుంటోంది. -
భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు
ఒంటికి రక్తం పూసుకొని నృత్యాలు అరుపులు వినిపించకుండా భజన పాటలు నిజామాబాద్: మూఢ నమ్మకంతో భార్యను కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి యాదగిరిబాగ్‌లో అద్దెకుంటు న్న నవీన్ సెల్‌ఫోన్ మెకానిక్. ఇతనిది రెంజల్ మండలం నీలా గ్రామం. రెండేళ్ల క్రితం నగర శివారులోని గంగాస్థాన్‌కు చెందిన సవిత(20)తో వివాహమయ్యింది. కొన్ని నెలల క్రితం అత్తమామలు సుశీల, మామిడి గోపాల్‌ను తమ ఇంటి వద్ద మరో ఇంట్లో అద్దెకు ఉండాలని నవీన్ సూచించగా, అలాగే ఉంటున్నారు. శుక్రవారం మృతురాలి తల్లి కూతురు వద్దకు వచ్చింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో నవీన్ అత్తను బయటకు వెళ్లాలని ఆదేశించడంతో ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత నవీన్ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె కేకలు బయటకు వినపడకుండా కంప్యూటర్లో పెద్ద సౌండ్‌తో భజ నపాటలు పెట్టాడు. కాలనీవాసులు కొందరు సౌండ్ తగ్గించమని చెప్పేందుకు రాగా, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భార్య కాళ్లు, చేతులు ఓ లుంగీతో గట్టిగా కట్టి కత్తితో ఆమె గొంతును కోశాడు. దీంతో తీవ్రరక్త స్రావమై సవిత మృతి చెందింది. భార్య రక్తాన్ని నిందితుడు ఒంటికి పూసుకుని భజ నపాటలకు నృత్యం చేయటం చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఉద యం కాలనీవాసులు వారు నాల్గో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లగా రక్తపుమడుగులో సవిత మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కనే భర్త కూర్చొని ఉన్నాడు. విషయాన్ని ఎస్సై నరేశ్, ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లుకు తెలపటంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల నుంచి వింత ప్రవర్తన: నవీన్ వివాహమైన నాటి నుంచి భార్యపై అనుమానంతో హింసించేవాడని తెలిసింది. మూడునెలలుగా వింతగా ప్రవర్తించేవాడని కుటుంబీకులు చెప్పారు. గుప్త నిధులు ఉన్నాయని, వాటికోసం ప్రయత్నం చేస్తున్నాని చెప్పేవాడని అన్నారు. ఇందులో భాగంగా అజ్మీర్‌కు సైతం వెళ్లివచ్చాడు. అక్కడినుంచి తయాత్తులు తెచ్చుకున్నాడని, వాటికి పూజలు చేస్తూ నన్ను దేవుడు అవతరించాడని చెప్పేవాడని తెలిసింది. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
మూడు నెలల తరువాత వెలుగు చూసిన హత్యోదంతం కోలారు : వివాహేతర సంబంధం కొనసాగించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఈ హత్యోదంతం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..విజయపుర తాలూకా గురప్పనమఠ ప్రాంతానికి చెందిన హరీష్ (29)కు సవిత (25)అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వీరు విజయపురం సమీపంలోని భట్రేనహళ్లి వద్ద నివాసం ఉండేవారు. వివాహానికి ముందే సవితకు సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. వివాహం తర్వాత కూడా దాన్ని కొనసాగించింది. విషయం తెలిసి భర్త నిత్యం గొడవ పడేవాడు. దీంతో సవిత ప్రియుడుతో కలిసి వెళ్లిపోగా మనో వేదనకు గురైన హరీష్ ఆత్యహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. తర్వాత పెద్దలు కల్పించుకొని సవితను కాపురానికి పంపారు. అయినప్పటికీ సవిత నడవడికలో మార్పు రాలేదు. ఈక్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సవిత సునీల్‌తో కలిసి పథకం రచించింది. అందులో భాగంగా హరీష్‌తో స్నేహంగా ఉండాలని సునీల్‌కు సూచించింది. అదే సమయంలో హరీష్‌కు డబ్బు అవసరం కాగా భార్య సలహాతో సునీల్‌ను ఆశ్రయించాడు. కేబి హొసహళ్లిలో డబ్బు ఇస్తానని హరీష్‌ను సునీల్ గత ఏప్రిల్ 7న ఆ గ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజు హరీష్‌ను గ్రామ సమీపంలోని చెరువువద్దకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో తూగుతున్న సమయంలో గొంతు, ఎద భాగంలో సునీల్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంద మీటర్ల దూరంలోని నీటికుంట వద్దకు తీసుకెళ్లి మృతదేహానికి రాళ్లు కట్టి నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత సవిత తన భర్త కనిపించలేదని విజయపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్‌ను అదుపులోకి విచారణ చేపట్టడంతో హత్యోదంతం వెలుగు చూసింది. సునీల్ ఇచ్చిన సమాచారంతో బుధవారం ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు తహశీల్దార్ సమక్షంలో హరీష్ మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలాన్ని దొడ్డబళ్లాపురం డీవైఎస్పీ కోనప్పరెడ్డి, విజయపుర సీఐ మహేష్‌కుమార్, వేమగల్ ఎస్ఐ యశ్వంత్ పరిశీలించారు. నిందితులు సవిత, సునీల్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.