వాలెన్సియా: ఎఫ్‌ఐహెచ్ హాకీ మహిళల ‘నేషన్స్ కప్’ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సవిత పూనియా గోల్‌పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలువడంతో భారత్ షూటౌట్‌లో 2–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. తొలిక్వార్టర్‌లో ఐర్లాండ్ స్ట్రయికర్ నవొమి క్యారొల్ (13వ ని.) గోల్ చేయడంతో ఐర్లాండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
రెండో క్వార్టర్‌లోనూ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే మూడో క్వార్టర్ ముగిసే దశలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (45వ ని.) గోల్‌గా మలచి స్కోరును సమం చేసింది. షూటౌట్‌లో భారత బృందంలో లాల్‌రేమ్సియామి, సోనిక గోల్స్ సాధించగా, ఐర్లాండ్ జట్టులో హన్నా మెక్‌లాలిన్ గోల్ చేసింది. ఎలెన్ కరన్ షాట్‌ను సవిత సమర్థంగా ఆడ్డుకుంది. అప్పటికి భారత్ 5 ప్రయత్నాలు ముగియగా... ఐర్లాండ్‌కు ఆఖరి షాట్ మిగిలుంది. కత్రిన్ ములన్ షాట్‌ను వైడ్‌గా కొట్టడంతో భారత్ 2–1తో విజయం సాధించింది. ఫైనల్ చేరిన భారత్... స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment