భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు | Husband kills wife surreptitiously in nizamabad | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు

Published Sun, Dec 21 2014 8:11 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు - Sakshi

భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు

  • ఒంటికి రక్తం పూసుకొని నృత్యాలు  
  • అరుపులు వినిపించకుండా భజన పాటలు
  • నిజామాబాద్: మూఢ నమ్మకంతో భార్యను కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ  ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి యాదగిరిబాగ్‌లో అద్దెకుంటు న్న నవీన్ సెల్‌ఫోన్ మెకానిక్. ఇతనిది రెంజల్ మండలం నీలా గ్రామం. రెండేళ్ల క్రితం నగర శివారులోని గంగాస్థాన్‌కు చెందిన సవిత(20)తో వివాహమయ్యింది.

    కొన్ని నెలల క్రితం అత్తమామలు సుశీల, మామిడి గోపాల్‌ను తమ ఇంటి వద్ద మరో ఇంట్లో అద్దెకు ఉండాలని నవీన్ సూచించగా, అలాగే ఉంటున్నారు. శుక్రవారం మృతురాలి తల్లి కూతురు వద్దకు వచ్చింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో నవీన్ అత్తను బయటకు వెళ్లాలని ఆదేశించడంతో ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత నవీన్ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.

    ఆమె కేకలు బయటకు వినపడకుండా కంప్యూటర్‌లో పెద్ద సౌండ్‌తో భజ నపాటలు పెట్టాడు. కాలనీవాసులు కొందరు సౌండ్ తగ్గించమని చెప్పేందుకు రాగా, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భార్య కాళ్లు, చేతులు ఓ లుంగీతో గట్టిగా కట్టి కత్తితో ఆమె గొంతును కోశాడు. దీంతో తీవ్రరక్త స్రావమై సవిత మృతి చెందింది. భార్య రక్తాన్ని నిందితుడు ఒంటికి పూసుకుని భజ నపాటలకు నృత్యం చేయటం చేసినట్లు తెలుస్తోంది.

    శనివారం ఉద యం కాలనీవాసులు వారు నాల్గో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లగా రక్తపుమడుగులో సవిత మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కనే భర్త కూర్చొని ఉన్నాడు.  విషయాన్ని ఎస్సై నరేశ్, ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వర్లుకు తెలపటంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
     
    మూడు నెలల నుంచి వింత ప్రవర్తన: నవీన్ వివాహమైన నాటి నుంచి భార్యపై అనుమానంతో హింసించేవాడని తెలిసింది. మూడునెలలుగా వింతగా ప్రవర్తించేవాడని కుటుంబీకులు చెప్పారు. గుప్త నిధులు ఉన్నాయని, వాటికోసం ప్రయత్నం చేస్తున్నాని చెప్పేవాడని అన్నారు. ఇందులో భాగంగా అజ్మీర్‌కు సైతం వెళ్లివచ్చాడు. అక్కడినుంచి తయాత్తులు తెచ్చుకున్నాడని, వాటికి పూజలు చేస్తూ నన్ను దేవుడు అవతరించాడని చెప్పేవాడని తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement