Superstition
-
జాతకాలు చూసి ఉద్యోగాలిస్తున్న కంపెనీ!
చైనాలో మూఢనమ్మకాల పిచ్చి ముదిరింది. మూఢనమ్మకం చైనీస్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి, కార్పొరేట్ ప్రపంచంలోకి కూడా విస్తరించింది. ఇప్పటికీ కొన్ని వ్యాపార నిర్ణయాలు మూఢనమ్మకాల ఆధారంగానే తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. అదృష్ట సంఖ్యలు, రంగులు, తేదీల వరకు ఫెంగ్ షుయ్ సంప్రదాయాలను కార్పొరేట్ నిర్ణయాలలో పాటిస్తున్నారు.అయితే మూఢనమ్మకానికి పరాకాష్ట అనిపించేలా ఓ కంపెనీ అవలంభించిన అసాధారణ నియామక విధానం తాజాగా చర్చకు వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే సంస్థ ‘డాగ్’ సంవత్సరంలో జన్మించిన అభ్యర్థులను తమ కంపెనీలో ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోకుండా నిషేధించింది.3,000 నుంచి 4,000 యువాన్లు (సుమారు రూ. 35,140 నుంచి రూ. 46,853) నెలవారీ జీతం అందించే క్లర్క్ ఉద్యోగానికి శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. అయితే డాగ్ రాశిచక్రంలో జన్మించినవారు మాత్రం ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవద్దంటూ కోరింది.ఈ వ్యవహారం చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న వారి కారణం ఏమిటంటే, డాగ్ రాశిచక్రంలో జన్మించిన వారు డ్రాగన్ రాశిచక్రంలో పుట్టిన సంస్థ అధిపతికి దురదృష్టానికి కారణం కావచ్చు. చైనీస్ జ్యోతిషశాస్త్రంలో డ్రాగన్, డాగ్ రాశిచక్రాల మధ్య 12 సంవత్సరాల వైరుధ్యం ఉంది. -
అయ్యో నాగరాజా! జ్యోతిష్యుడు చెప్పాడని..
క్రైమ్: దైవ భక్తి మంచిదే. కానీ, ఆ భక్తి ముసుగులో మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేవాళ్లను నమ్మడం ఏమాత్రం మంచిదికాదు. పైగా బాగా చదువుకున్న వాళ్లు కూడా ఆ మత్తులో మోసపోతుండడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి మోసపోయి జేబు గుల్లజేసుకోవడంతోనే ఆగిపోలేదు. గుడ్డిగా జ్యోతిష్యుడు చెప్పింది చేసి వారంపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తమిళనాడు ఈరోడ్ జిల్లా, కోపిచెట్టిపాళయం సత్తి రోడ్డు నివాసి రాజా(54) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఆయన కలలో పాములు కనిపిస్తున్నాయట. ఆ దెబ్బకి ఆయన నిద్రపోవడమే మానేశాడు. నిద్రలేమితో ఆయన ఆరోగ్యం దెబ్బ తింటూ వచ్చింది. ఈ క్రమంలో.. ఓ జ్యోతిష్యుడ్ని కలిశాడు. తనకు నాగదోషం ఉందని చెప్పాడు. అదే అదను అనుకున్నాడేమో.. దోష పరిహారానికి ప్రత్యేక పూజలు చేయాలని ఏర్పాట్ల కోసం గట్టిగా డబ్బులు తీసుకున్నాడు. సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి.. నాగదోష పరిహార పూజలు చేయించాడు. ఆఖరి ఘట్టంగా.. తన వెంట బోనులో తెచ్చిన ఓ రస్సెల్ వైపర్ పామును రాజా ముందు ఉంచి.. మూడుసార్లు పాములా నాలుక ఆడించమన్నాడు. ఆయన నాలుక ఆడిస్తుండగా.. జ్యోతిష్యుడు ఏవో మంత్రాలు వల్లించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి నాలుక ఆడించడగా.. బోనులోంచి సర్రుమని తల బయట పెట్టిన పాము, రాజా నాలుక మీద కాటేసింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిపోయాడు ఆయన. ఇది గమనించిన ఆ ఆలయ పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి.. రాజాను రక్షించే ఉద్దేశంతో ఓ కత్తితో నాలుక కత్తిరించాడు. ఆలస్యం జరగకపోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి. కానీ, నాలుక పోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అతన్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాము విషానికి అతని నాలుక కణజాలం దెబ్బతింది. అయినప్పటికీ.. నాలుకను తిరిగి విజయవంతంగా సర్జరీ ద్వారా అతికించారు. వాపు తగ్గిన తర్వాత ఆయన ఇప్పుడు సాధారణంగా మాట్లాడగలిగే స్థితికి చేరడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్‌ను కలిగి ఉండడం, అంతకు మించి మోసం చేయడం తదితర నేరాల కింద ఆ జ్యోతిష్యుడిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
సమాజం ఎటు పోతోంది.. ఏ కాలంలో ఉన్నాం?
ఇటీవల కేరళలో దంపతులు డబ్బుల కోసం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసి, వండుకుని తిని ప్రపంచ ప్రజలకు ఒళ్ళు జలదరింప చేశారు. దీనికి కారణం మూఢనమ్మకాలు మాత్రమే. ఈ సంఘటన మరువక ముందే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో కన్న తండ్రే తన 14 సంవత్సరాల కూతురిని భూతశక్తులు వస్తాయి అనే మూఢ నమ్మకంతో అగ్ని గుండంలో తోసేసి జనాన్ని విస్మయపరిచాడు. అసలు నేటి సమాజం ఎటు పోతోంది? ఈ ఆధునిక 21వ శతా బ్దంలో, మానవుడు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఏమిటీ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు? దీనికి అంతటికీ కారణం మాయ మాటలు చెప్పి, మోసం చేసే బాబాలు, స్వామీజీలు, భూతవైద్యులు! ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతూంటే, కొందరు ఇంకా మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఆదిమ సమాజంలోనే కూరుకుపోవడం దురదృష్టకరం. ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మరాదు. అంధ విశ్వాసాలను హేతువాదంతో జయించాలి. ఆధునిక కాలంలో అత్యాధునికమైన ఆలోచనలతో నవీన మానవుడుగా మసలడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ దిశలో మీడియా, ప్రభుత్వాలూ తగిన ప్రచారాన్ని చేపట్టాలి. (క్లిక్: కేరళ నరబలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!) – రావుశ్రీ, కాకినాడ -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
చేతబడి చేశాడని కక్ష పెంచుకున్నాడు.. పక్కా ప్లాన్‌తో..
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: చేతబడి నెపంతో ఓ మరగుజ్జును హత్య చేసిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నల్ జిల్లా, పెంటపల్లి గ్రావనికి చెందిన నక్కాకృష్ణ (30), ప్రకాష్‌నగర్‌లో ఉంటూ పూల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కృష్ణ మేనత్త బాలమ్మ, బాబాయ్ వెంకటస్వామి వరుసగా చనిపోయారు. వెంకటస్వామి కుమారుడు చందు (30), కూతురు శుభాకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి కృష్ణ కూడా హాజరయాడు. అయితే నెల వ్యవధిలోనే చందు కూతురు సైతం అనారోగ్యానికి గురైంది. అయితే నక్కా కృష్ణ తండ్రికి చేతబడి చేయటం వస్తోందని తండ్రి ద్వారానే కృష్ణ అలవాటు చేసుకొని తన కూతురుకు చేతబడి చేశాడని కక్ష పెంచుకున్నాడు. కృషను ఎలాగైనా చంపేయాలని నిరయించుకున్నాడు. క్రమంలో జనవరి 4వ తేదీన చందు ప్రకాష్‌నగర్‌కు వచ్చి రాత్రైయిందని ఇక్కడే పడుకుంటానని కృషతో నమ్మబలికాడు. తాను అనుకున్న పథకం ప్రకారమే సమీపంలో ఉన్న రోకలి బండతో నక్కాకృష తలపై బాదడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఓ గోనెసంచిలో మూటగట్టి నల్ల చెరువులో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సమీపంలోని సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించటంతో సోమవారం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు, సీఐ నర్సింగ్‌రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. చదవండి: Banjara Hills: ఒక స్కూటీ.. 130 చలానాలు బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య -
క్షుద్రపూజలు చేయడం వల్ల పిల్లలు చనిపోతున్నారని
సాక్షి, తూర్పుగోదావరి: మూఢ నమ్మకాల కారణంగా సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన సంఘటన జిల్లాలోని ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గీతా రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు పిల్లలు పుట్టి, కొద్ది రోజుల్లోనే మరణించారు. వరుసకు బాబాయి అయిన వేల్పుల రత్తయ్యే (55) దీనికి కారణమని సత్యనారాయణకు అనుమానం వచ్చింది. ఓ అమావాస్య రాత్రి గ్రామ సమీపంలోని ఓ చెట్టు వద్ద రత్తయ్య నగ్నంగా పూజలు చేస్తున్నట్టు గమనించి, తాము వెళ్లగా దుస్తులు చేతబట్టుకుని అతడు పారిపోయాడని సత్యనారాయణ చెబుతున్నాడు. రత్తయ్య క్షుద్రపూజలు చేస్తున్నందు వల్లే తన పిల్లలు చనిపోతున్నారని సత్యనారాయణ భయపడ్డాడు. ఈ నేపథ్యంలో రత్తయ్యను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన అన్న ప్రసాద్ సాయంతో పథకం వేశాడు. ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం రత్తయ్య కంచె వేసేందుకు ఇంటి సమీపంలోని జామాయిల్ తోటకు వెళ్లాడు. అదే రోజు సత్యనారాయణ, ప్రసాద్‌లు మిర్చి బస్తాలు తొక్కేందుకు సమీప గ్రామానికి వెళ్లారు. కూలి పనుల అనంతరం వచ్చిన అన్నదమ్ములిద్దరూ చేనులో రత్తయ్య ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నారు. పథకం ప్రకారం అక్కడికి వెళ్లి రత్తయ్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో దాచి ఇంటికి వచ్చేశారు. రాత్రయినా తన తండ్రి ఇంటికి రాకపోవడంతో రత్తయ్య కుమారులు వెంకటేష్, సుధాకర్ చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రత్తయ్య పని చేసిన పొలం వద్ద మృతదేహాన్ని నేలపై ఈడ్చుకు వెళ్లిన ఆనవాళ్లు, అక్కడికి కొద్ది దూరంలో పొదల మధ్య రక్తం ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల రత్తయ్యకు, సత్యనారాయణ, ప్రసాద్ కుటుంబాల మధ్య రహదారి నిర్మాణం, పంట పొలంలో బోరు వేసే విషయంలో తగాదాలు జరిగాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ జరిపారు. దగ్గరి బంధువులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానించి, అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రత్తయ్యను తామే చంపినట్టు సత్యనారాయణ, ప్రసాద్ అంగీకరించారు. హత్య చేసిన రాత్రే మరో ముగ్గురి సాయంతో రత్తయ్య మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకుని సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి నదిలో ఇసుక ర్యాంపు సమీపాన పాతి పెట్టారు. ఈ సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని బుధవారం గుర్తించారు. గురువారం రత్తయ్య మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాగా, తన తండ్రికి క్షుద్రపూజలు రావని, నిందితులు కావాలనే ఇలా చెబుతున్నారని రత్తయ్య కుమారులు అంటున్నారు. -
దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే..
చెన్నై: మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే పొట్టన బెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామనాథపురానికి చెందిన వీరసెల్వం విపరీతంగా మూఢ నమ్మకాలు, తాంత్రీక పూజలను నమ్ముతాడు. ఆయన కూతురు తరుణి(19) గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే తరుణి ఇటీవల తన తల్లి సమాధి ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లి వచ్చింది. దీంతో తన భార్య ఆత్మ తరుణి శరీరంలోకి ప్రవేశించిందని అందువల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వీరసెల్వం భావించాడు. ఏదీఏమైనా ఆమె శరీరం నుంచి తన భార్య ఆత్మను బయటకు పంపించాలని తాంత్రికపూజలు చేయడం మొదలుపెట్టాడు. భార్య ఆత్మను కూతురు శరీరం నుంచి వెళ్లగొట్టాలని ఆమె మెడ, నడుముపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందడాని తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ -
‘కరోనా శివుడి రోమాల్లోంచి పుట్టింది’
మదనపల్లె: ‘మహాద్భుతంగా ఉన్న స్వర్గాన్ని నాశనం చేశారు. అరగంట ఆగితే నా బిడ్డలు సంతోషంగా బతికి వచ్చేవారు. పూజాఫలాన్ని మొత్తం నా భర్తే నాశనం చేశారు. లేకపోతే నాకు ఈ కర్మ వచ్చేది కాదు’ అంటూ పాశవికంగా కన్నబిడ్డలను హత్యచేసిన పద్మజ వాదించడం విస్మయానికి గురిచేసింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ఉమెన్ డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(22)ను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం మృతదేహాలకు బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి వల్లేరు పురుషోత్తం నాయుడు పిల్లల అంత్యక్రియలకు హాజరై మృతదేహాలకు నిప్పంటించి సాగనంపారు. తల్లి పద్మజను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకువచ్చినా దూరంగా ఉంచారు. ఆగస్టు 14న గృహప్రవేశం తవణంపల్లె మండలం కొండ్రాజుకాలువకు చెందిన పురుషోత్తం నాయుడు, చిత్తూరు పట్టణానికి చెందిన పద్మజ దంపతులు పాతికేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చారు. పురుషోత్తం నాయుడు పీహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ పూర్తిచేసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భార్య పద్మజ మాస్టర్‌మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా 23 ఏళ్ల నుంచి ఎందరో విద్యార్థుల భవిష్యత్‌కు బంగరుబాటలు వేశారు. ఇద్దరు కుమార్తెలు అంటే తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమ. ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో పనిచేస్తోంది. చిన్నమ్మాయి సాయిదివ్య బీబీఏ పూర్తిచేసుకుని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటోంది. ఆరు నెలల క్రితం వరకు ప్రశాంత్‌నగర్‌లోనే నివాసం ఉన్న ఈ కుటుంబం శివనగర్‌లో నూతనంగా ఇల్లు నిర్మించుకుని ఆగస్టు 14న గృహప్రవేశం చేసింది. ఇంట్లో చేరిన రోజు నుంచి ఏదో ఒక పూజ, వ్రతాలు చేస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా బంధుమిత్రులను ఆహా్వనించకుండానే సింపుల్‌గా గృహ ప్రవేశం కానిచ్చారని, ఇంట్లో నుంచి పిల్లలు, తల్లి బయటకు వచ్చేవారు కాదని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. కొత్త ఇంట్లో ఏదేని అనుకోని సంఘటన జరిగి ఉంటే కీడును శాంతింపజేసేందుకు ఎవరైనా క్షుద్రమాంత్రికులు పరిచయమై వారు వీరిని ఆ దిశగా ప్రేరేపించారా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా శివుడి రోమాల్లో నుంచి పుట్టింది యువతుల హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఇంట్లోకి వెళితే తల్లి పద్మజ ‘అనవసరంగా హైరానా పడవద్దు.. నా బిడ్డలు లేచి వస్తారు. శక్తి చెప్పింది’ అని వాదించింది. విద్యావంతులు మీరిలా మాట్లాడడమేంటని పోలీసులు అంటే మీకు మాకన్నా తెలుసా..? కరోనా చైనాలో పుట్టిందనుకుంటున్నారా..? శివుడి రోమాల నుంచి పుట్టింది. శివుడే అన్నింటికీ సమాధానం చెబుతారని వింతగా మాట్లాడినట్లు తెలిసింది. పెద్దమ్మాయి అలేఖ్య ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఓపెన్‌చేస్తే అందులో మూడురోజుల క్రితం ‘శివ ఈజ్ కమింగ్’ అంటూ పోస్ట్‌లు పెట్టింది. పైగా పెద్దమ్మాయి నాలుగు రోజుల క్రితం పురుషోత్తం నాయుడు సహోద్యోగి ఇంటికి వెళితే ‘మీరు బుద్ధుడిలాగా ఉన్నారు.. మిమ్మల్ని కౌగిలించుకోవాలనుంది. మీ ఇంటికి తీసుకెళ్లండి అంకుల్’ అంటూ మారాం చేసినట్టు సమాచారం. ఇన్‌స్ట్రాగాం పోస్ట్‌ల్లో ఆధ్యాతి్మకగురువు ఓషోను తనకు ఇష్టమైన వ్యక్తిగా పేర్కొంది. చనిపోయిన సమయంలో ఆమె పక్కనే మెహర్‌బాబా పుస్తకం ఉంది. ఇంట్లోనూ ఎక్కడ చూసినా షిర్డీసాయిబాబా, అవతార్ మెహర్‌బాబా, ఓషో పుస్తకాలు, ఫొటోలు కనిపించాయి. 4–5 రోజులుగా ఏవో పూజలు చేస్తున్నారని, అప్పుడప్పుడు కేకలు, అరుపులు వినిపించేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వామీజీ ఒకరు ఇంటికి వచ్చి ఇల్లంతా కలియదిరిగి మంత్రించిన నీళ్లను చల్లి నిమ్మకాయలు ఉంచి వెళ్లినట్లు తెలిసింది. బిడ్డలను అతికిరాతకంగా కడతేర్చింది నాలుగు రోజులుగా ఇద్దరు కూతుళ్లకు మతిస్థిమితం లేదని, పూర్తిగా ట్రాన్స్ (అలౌకిక జగత్తు)లోకి వెళ్లిపోయారని, తనతోనూ సరిగ్గా మాట్లాడలేదని పురుషోత్తం నాయుడు తెలిపారు. పెద్దమ్మాయి అలేఖ్య తొమ్మిదో తరగతి నుంచే తాను శివస్వరూపాన్ని అని చెప్పేదన్నారు. తనకు మహిమలు ఉన్నట్లు తెలిపేదని పేర్కొన్నారు. చిన్నమ్మాయి సాయిదివ్య ఇంట్లో శక్తులు తిరుగుతూ, భయపెడుతున్నాయని, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రాధేయపడేదని, లేకపోతే డాబాపై నుంచి దూకేస్తానని చెప్పడంతో మూడు రోజులుగా కాపలా కాసినట్లు వెల్లడించారు. దివ్యను తనదారిలో తెచ్చుకునేందుకు అలేఖ్య లేనిపోని భయాలను కలిగించి మెల్లగా తన వశం చేసుకుందని చెప్పారు. అలేఖ్య చిన్నచిన్న మహిమలు చూపించడంతో అతీతశక్తులు ఆవహించినట్లు నమ్మానని చెప్పారు. అమ్మాకూతుళ్లు అర్ధనగ్నంగా ఆదివారం ఉదయం నుంచి శక్తిపూజలు చేశారన్నారు. మధ్యలో అలేఖ్య చెల్లిలో ఉన్న దుష్టశక్తిని చంపేస్తున్నామని చెప్పి తల్లితో కలిసి కత్తితో నుదుటిపై శక్తిపూజకు సంబంధించి ముగ్గువేస్తూ క్రూరంగా చంపేసినట్టు వెల్లడించారు. తర్వాత పసుపునీళ్లతో శుద్ధిచేసి వేపాకుమీద పడుకోబెట్టారని తెలిపారు. తర్వాత అలేఖ్య ఎరుపు వ్రస్తాలు ధరించి శక్తి తనను ఆవహించిందని, కలి అంతమైపోతోందని, నన్ను చంపాక చెల్లికి ఎలాగైతే చేశామో అవన్నీ తనకూ చేసి మంత్రాన్ని చదివితే చనిపోయిన చెల్లిని తీసుకువస్తానని చెప్పినట్టు తెలిపారు. పూజ జరిగేంతసేపు తనను గంట మోగించాల్సిందిగా ఆదేశించారని, పూజ గంటసేపు జరిగాక పెద్దకూతురు చెప్పిన విధంగా తన భార్య ఆమెను కడతేర్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్య పూజలో ఉండగానే.. కొంతసమయం తర్వాత తేరుకుని సహోద్యోగి ఫిజికల్ డైరెక్టర్ రాజుకు ఫోన్‌చేసి స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పమన్నానని తెలిపారు. పోలీసులు ఇంటికివస్తే ఇంట్లో శివుడు ఉన్నాడు.. షూలు, చెప్పులు వేసుకుని రావద్దంటూ పద్మజ గట్టిగా కేకలు వేసిందని చెప్పారు. ఆ రూ.5కోట్లే హత్యకు కారణమా? పద్మజ కుటుంబీకుల నుంచి రూ.5కోట్ల ఆస్తి వాటాగా వచ్చిందని, ఆ డబ్బును కాజేసేందుకు పథకం పన్ని ఇలాంటి ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని మరికొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై అసలు కారణాలు వెలుగులోకి రావాలంటే పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి విచారణ నిగ్గు తేల్చాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఆమె మళ్లీ బతుకుతుందని 25 రోజులు..
సాక్షి, చెన్నై : మహిళా పోలీసు మృతదేహంతో 25 రోజులుగా ప్రార్థనలు నిర్వహించిన ఇద్దరిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతో ఇలా జరిపినట్లు విచారణలో తేలింది. టీ.నగర్‌లోని దిండుగల్ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర (38) పోలీసు కంట్రోల్‌రూంలో పనిచేసేది. భర్తను విడిచి తన బిడ్డతోపాటు అక్క వాసుకి, కుటుంబ స్నేహితుడు సుదర్శనంతో కలిసి ఉండేది. మెడికల్ లీవులో ఉన్న ఇందిర సెలవులు ముగిసినా విధులకు హాజరుకాలేదు. దీంతో గురువారం ఇద్దరు మహిళా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. ఆ సమయంలో ఇంటిలోని ఓ గది తలుపులు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన మహిళా పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. ఇందిర మృతదేహం వస్త్రాలతో చుట్టి ఉంది. దీనిపై వాసుకి, సుదర్శనం వద్ద విచారించగా ఇందిర డిసెంబర్ 7న మృతిచెందిందని, ఏసుక్రీస్తులా ఆమె మళ్లీ బతుకుతుందని, అందుకోసం రోజూ ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కోడలి కోసం నాలుక కోసుకున్న అత్త
రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించినా.. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నారు. మూఢనమ్మకంతో తాజాగా ఓ మహిళ తన నాలుకనే కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి నాలుకను సమర్పించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని ఎన్ఐటీ క్యాంపస్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి ఆగస్ట్ 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తన కోడలు సురక్షితం తిరిగి ఇంటికి రావాలని తన నాలుకను కత్తిరించుకుంది. శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె అలా చేసిందని లక్ష్మి భర్త నందూలాల్ నిరాల చెప్పారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అలాగే తప్పిపోయిన జ్యోతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తావీద్ మహిమా..!
-
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పూరి : ఒడిశాలో కొందరు భక్తులు ఆచరిస్తున్న మూఢ నమ్మకం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఎవరైనా అర్చకులు, వేద పండితులు తమ చేతులతో భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ ఒడిశాలోని ఖోర్దా జిల్లా భాన్పూర్ ప్రాంతంలో మాత్రం పూజరి తన కాళ్లతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ అర్చకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు వరుసలో కూర్చోని ఉంటే.. ఆ అర్చకుడు ప్రతి ఒక్కరి తలపై తన కాలును ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వెన్నుపై కూడా కాలుతో తొక్కుతాడు. ఆ భక్తుల్లో కొందరు చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన విజయదశమి వేడుకల సందర్భంగా వాహన పూజ చేయించుకున్న పలువురు భక్తులు అర్చకుని కాలును తమ నెత్తిపై పెట్టించుకుని ఆశీస్సులు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి మూఢ నమ్మకాలు వల్ల ప్రపంచంలో భారత్‌కు చెడ్డపేరు వస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆచారాలను పాటిస్తున్న ప్రజలు వాటి నుంచి బయటకు రావాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. -
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
-
మూఢనమ్మకం మసి చేసింది
మేడ్చల్/శామీర్‌పేట్: చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొంది.. ఆ మూఢనమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.. బతికుండగానే చితిలో పడేసి కాల్చేసేలా పురిగొల్పింది.. మానవత్వాన్ని మంటల్లో కాల్చేసిన ఈ ఘటన.. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. అటుగా వెళ్లడమే పాపమైంది.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యారలక్ష్మి (45)అనే మహిళ గత ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతబడి చేయడంతోనే లక్ష్మి చని పోయిందని బంధువులు అనుమానించారు. అదే నిజమైతే చేతబడి చేసిన వారు.. చితి కాలిపోయే లోపు అక్కడికి వస్తారనే నమ్మకంతో.. రాత్రి లక్ష్మి బంధువులు బలరాం, కిష్టయ్య లు చితికి సమీపంలోనే కాపు కాస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కెనాల్ కాలువ వద్దకు అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (29) రోజూ మాదిరిగానే రాత్రి 8.30 గంటలకు బహిరంగ మలవిసర్జన కోసం రావడంతో అతడిని అనుమానించారు. ఆంజనేయులు తండ్రి కిష్టయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం ఉండటంతో వారి అనుమానం బలపడింది. నగ్నంగా.. చితిలోకి నెట్టేసి.. ఆంజనేయులును గమనించిన బలరాం, కిష్టయ్యలు వెంటనే అతడిపై రాళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు శరీరంపై ఉన్న దుస్తులు తీసేసి.. కాలుతున్న లక్ష్మి చితిలో అతడిని పడేశారు. దీంతో అతడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ విషయం ఊరంతా పాకడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు గ్యార బలరాం, గ్యార కిష్టయ్య, గ్యార నర్సింహతోపాటు మరో వ్యక్తి బండల శ్రీరాములును గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మి, అంజనేయులు అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ కుటుంబం ఏకాకి.. పదో తరగతి వరకు చదువుకున్న ఆంజనేయులు కొంతకాలంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య క్షుద్రపూజలు చేస్తాడని ఆరోపణలు ఉండటంతో గ్రామస్తులంతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతేడాది కిష్టయ్య చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవరూ వెళ్లలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు: పద్మజారెడ్డి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామంలోని రెండువర్గాల వారు వేర్వేరు వాదనలు వినిపించారు. క్షుద్రపూజల నెపంతోనే అంజనేయులును చితిలో పడేశారా లేదా అనేది తెలుసుకుంటున్నాం. చితిలో నుంచి అస్తికలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుంది. ఘటనాస్థలి వద్ద రక్తపు మరకలు, చేతి రుమాలు లభ్యమయ్యాయి. -
400 ఏళ్లుగా ఊరి బయటే పురుడు..!
అమ్మాయికి పురుటినొప్పులు మొదలయ్యాయనగానే ఆ ఊరివారు∙చేసేపని..ఆమెను వెంటనే ఊరి పొలిమేరల్లోకి తరలించడమే. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 130 కి.మీ దూరంలోని రాజ్గర్లోని శంక శ్యామ్‌జీ గ్రామంలో ఏకంగా నాలుగు వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక్కడ గర్భిణులు ఇంటిలో పిల్లలకు జన్మనివ్వరు. వీలయితే ఆసుపత్రి లేదంటే ఊరి బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోనే జన్మనివ్వాల్సిందే! అది ఎర్రగా మండే ఎండాకాలంలో కానీయండి, భోరున వర్షాలు కురిసేపుడు అవనివ్వండి, గజ్జున చలి మెలిపెట్టేసే రోజుల్లో కానీయండి...ఎలాంటి మినహాయింపు లేదు. ఈ కట్టుబాటుకు సంబంధించి లిఖిత శాసనాలేమి లేకపోయినా, ఇక్కడ స్త్రీలు ప్రసవించడాన్ని మాత్రం అనుమతించరు. దీనికంతటికి ఓ మూఢవిశ్వాసమే కారణం...‘ 16వ శతాబ్దంలో ఈ గ్రామంలో ఓ గుడిని నిర్మిస్తున్న సందర్భంగా ఓ మహిళ గోధుమలతో పిండి పట్టించడం మొదలుపెట్టడంతో పనిచేసే వాళ్ల దృష్టి మళ్లి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. దాంతో దేవుళ్లకు కోపమొచ్చి ఈ గ్రామంపై శాపాలు కురిపించారు.. ఇక్కడ ఏ మహిళా బిడ్డకు జన్మనివ్వలేదంటూ శపించారు’ అంటూ ఈ ఊరి వయోధికులు వెల్లడించారు. ఈ మేరకు తమ గ్రామం శాపగ్రస్తమైందంటూ గ్రామస్థులు ఇప్పటికీ నమ్ముతున్నారు. దీనిని ఓ అంధ విశ్వాసంగా గ్రామస్థులు అంగీకరించరు. గతంలో అనుకోకుండా కొన్ని ప్రసవాలు జరిగినా వికలాంగులుగానో, మృతశిశువులో జన్మించిన సందర్భాలను తాము స్వయంగా చూశామని వారు చెబుతుంటారు. ఒకవేళ ఏ మహిళ అయినా గ్రామం లోపలే ప్రసవిస్తే తల్లి లేదా బిడ్డలలో ఒకరు మరణిస్తారని లేదా పుట్టిన శిశువులు వైకల్యంతో పుడతారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అత్యవసర పరిస్థితులను మరింత మెరుగ్గా ఎదుర్కునేందుకు వీలుగా ఊరవతల ప్రసవాల కోసమే ఓ గదిని గ్రామస్థులు నిర్మించారు. ‘దాదాపు 90 శాతం వరకు ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. తప్పని పరిస్థితుల్లోనే గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గదిలో పురుడుపోస్తుంటారు’ అని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జర్ పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆరాధన వెనుక ఆరోగ్యం
కొత్త కోణం తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ పేరుతో ఉన్న గ్రామదేవతల వృత్తాంతం కూడా ఇటు వంటిదే. అంబిగయి అమ్మన్కూ, పోచమ్మకు పోలికలున్నాయి. ప్రాంతానికి చెందిన అంబిగయి అమ్మన్ లాగానే పోచమ్మ కూడా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ఎన్నో చిట్కాలను అందించింది. అక్కడ ఏ విధమైన ఆరోగ్య సూత్రాలను అంబిగయి ప్రచారం చేసిందో అటువంటి పద్ధతులనే పోచమ్మ కూడా ఇక్కడి ప్రజలకు చెప్పిన వాస్తవం పంబాల, బైండ్ల కళాకారులు చెప్పే కథల్లో నిక్షిప్తమై ఉన్నది. తొలకరికి పల్లెల్లో పరుచుకునే పచ్చదనానికి తోడు ప్రతి ఇంట్లోని పసుపు పచ్చదనం కూడా తోడవుతుంది. గ్రామ దేవతల జాతరలు, కొలుపులు, బోనాలు, వన భోజనాల్లాంటి ఊరంతా ఉమ్మడిగా జరుపుకునే ఉత్సవాలతో పల్లెలు కళకళలాడతాయి. ఆషాఢ, శ్రావణ మాసాల్లో పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా జనం జాతరల్లో ఓలలాడుతుంటారు. ఈ ఉత్సవాల్లో కచ్చితంగా కనిపించే పదార్థాలు పసుపు, కుంకుమ, వేపమండలు. ముగ్గుల రూపంలోనో, ఇతరత్రా పద్ధతుల్లో సున్నం కూడా వాడుతుంటారు. కానీ ఇలాంటి ఉత్సవాలన్నీ, కొలుపులన్నీ ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే, వర్షాలు ఆరంభం అయ్యే రోజుల్లోనే జరుగుతాయి. ఈ సంప్రదాయంలో కొంత మూఢ నమ్మకం ఉంటే ఉండొచ్చు కానీ ఒక నమ్మకం కూడా ఉన్నది. గ్రామదేవతలను కొలిస్తే ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారనుకోవడం విశ్వా సమే. అయినా, దాని వెనుకనున్న శాస్త్రీయతను తెలుసుకునే యత్నం కూడా చేయాలి. ఇలాంటి ఆచారాలు ఆరంభం కావడానికి వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం ఏమిటో చరిత్ర మనకు అందిస్తుంది. కానీ ఇటువంటి పరిశోధనలు తక్కువ. తమిళనాడులో మాత్రం ఇటువంటి ఆవిష్కరణలు జరిగాయి. అవి మన సామాజిక దృక్పథాన్ని మార్చివేసే అవకాశముంది. గ్రామదేవతల ఆరాధన వెనుక... బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు పూర్వం, 19వ శతాబ్దం అర్థభాగంలో అయోతీదాస్ అనే దళిత తాత్వికవేత్త భారత సామాజిక, సాంస్కృతిక చరిత్రను భౌతికవాద దృష్టితో అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనతోనే అంతుపట్టని గ్రామ దేవతల చరిత్ర ఈరోజు మనందరికి అవగాహనకు వచ్చింది. పింగళి నిఘంటువు, జీవగ చింతామణి పుస్తకాల ఆధారంగా దాస్ చెప్పిన విషయాలు^è రిత్రను శాస్త్రీయ దృష్టితో పరిశీలించే అవకాశం ఇచ్చాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో తమిళనాడులో నాగపట్నం ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ గా«థను దాస్ ఉటంకించారు. అక్కడి ఒక గ్రామంలో పేద కుటుం బంలో జన్మించిన అంబిగయి అమ్మన్ బాల్యంలోనే చదువు నేర్చుకున్నది. అప్పటికే ఆ ప్రాంతంలో బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది. అందువల్లనే చదువు మీద ఆంక్షలు లేవు. పదమూడేళ్లకే బుద్ధుని బోధనలు అర్థం చేసుకున్నది. తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే అమ్మన్ తిరస్కరించి, బౌద్ధం ప్రచారానికే జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పింది. కూతురు బౌద్ధ భిక్కునిగా మారడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఆమె పట్టుదల ముందు ఓడిపోయాడు. కొద్ది కాలంలోనే బుద్ధుని బోధనలూ, బౌద్ధ సర్వస్వం త్రిపిటకాలూ అమ్మన్ క్షుణ్ణంగా చదివింది. అందుకే ఆమెను పిటకారి, పిటారి, పిడారి అని కూడా పిలిచేవారు. పిటక– అరిని వేరు చేసి చూస్తే పిటక బౌద్ధ సాహిత్యం, అరి అంటే జ్ఞాని అని అర్థం. ఆమె వేపచెట్టు కింద ధ్యానం చేస్తుండేది. కానీ ఒక్క ధ్యానమే కాదు, నిత్యం ప్రజలతో కలిసిపోయేది. వారి మంచి చెడ్డలను తెలుసుకునేది. తనకు తెలిసిన విషయాలను వాళ్ళకు వివరించేది. బుద్ధుని బోధనలను అర్థమయ్యే భాషలో బోధిస్తూనే, ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలను, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను చర్చిస్తూండేది. ఆ సమయంలో వర్షాలు లేక కరువు ఏర్పడింది. ఆకలి, అనారోగ్యం అతలాకుతలం చేశాయి. అనారోగ్యం పోయి, సుఖంగా ఉండాలంటే త్రిశుద్ధిని పాటించాలని కోరింది. మనస్సు, ఇల్లు, గ్రామం శుభ్రంగా ఉంచుకోవడమే దాని సారాంశం. పరిశుభ్రమైన పరిసరాలలో దైవం మనసులో ఉన్న క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయలను తొలగించుకోవాలని, ప్రేమను పెంచుకొని, పదిమందికీ పంచాలని కోరింది. ఇంటిని శుభ్రంగా ఉంచుకునే అంశం మీద కొన్ని పద్ధతులను ప్రత్యేకంగా బోధించింది. ముందుగా ఇల్లును ఎర్రమన్నుతో అలకాలనీ, వాకిలిలో పేడతో అలుకు చల్లాలనీ, సుద్దతో ముగ్గువేయాలని, గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలని చెప్పింది. రోగాల బారిన పడినవారు తమ ఇళ్ల గుమ్మాలకు వేపాకు మండలు తోరణాలుగా కట్టాలని కూడా ఆదేశించింది. ఎవరికైనా శరీరంలో పొక్కులు (మశూచి, పోచమ్మ, ఆటలమ్మ లాంటివి) వస్తే వారి మంచం నిండా వేపాకులు పక్కవేసినట్టు పరిచి ఉంచాలని కూడా ఆమె చెప్పేది. స్త్రీలు స్నానం చేసే సమయంలో శరీరం నిండా పసుపును రాసుకోవాలని, మగవారైతే పసుపును నుదుటి మీద రాసుకోవాలని ఆమె ప్రచారం చేసింది. అన్నంలో, కూరల్లో పసుపు వేసుకోవాలని అమ్మన్ ప్రచారం చేసింది. ఈ పద్ధతులతో అంటువ్యా«ధులు క్రమంగా తగ్గిపోయాయి. ఒకటి రెండు సంవత్సరాల్లో ఆ ఊరు రూపురేఖలు మారిపోయాయి. ఆమె మాటలు, చేతలు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొంతకాలం తర్వాత ధ్యానంలోనే అంబిగయి నిర్వాణం పొందారు. అంబిగయి అమ్మన్ శరీరాన్ని దహనం చేసి, ఆ బూడిదను వవేరీనదిలో కలిపారు. ఆ నీటిలో లక్షలాది మంది స్నానాలు చేశారు. అట్లా స్నానం చేసిన రోజునే ప్రతిఏటా నాగపట్నం ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఆషాఢమాసంలో జరుగుతుండడం విశేషం. ఇప్పటికీ ఆమెను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారనడానికి ఈ జాతరే ఉదాహరణ. అయితే అంబిగయి అమ్మన్ సేవలు, ఆమె గొప్పతనాన్ని తెలుసుకున్న ఎందరో బౌద్ధాచార్యులు తక్షశిల, నలందాల నుంచి ఆమెను సందర్శించడానికి వచ్చేవారు. ఆమె సాగించిన కృషి దేశమంతటా వ్యాప్తి చెందింది. అయితే నాగపట్నంలో ఆమె పేరుతో ఉన్న విగ్రహాన్ని పోర్చుగీసువారు తొలగించి, ఆ స్థానంలో మేరీమాత విగ్రహాన్ని పెట్టారు. 2005వ సంవత్సరంలో వచ్చిన సునామీలో ఆ విగ్రహం కూడా సముద్రంలో కలిసిపోయింది. పోచమ్మ, అంబిగయి– కొన్ని సారూప్యాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందీ, అన్వయించుకోవాల్సిందీ ఒకటుంది. సరిగ్గా ఇటువంటి సాంస్కృతిక జీవనమే మనకు కూడా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ పేరుతో ఉన్న గ్రామదేవతల వృత్తాంతం కూడా ఇటువంటిదే. అంబిగయి అమ్మన్కూ, పోచమ్మకు పోలికలున్నాయి. అంబిగయి అమ్మన్ లాగానే పోచమ్మ కూడా వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ఎన్నో చిట్కాలను అందించింది. నాగపట్నంలో ఏ విధమైన ఆరోగ్య సూత్రాలను అంబిగయి ప్రచారం చేసిందో అటువంటి పద్ధతులనే పోచమ్మ కూడా ప్రజలకు చెప్పిన వాస్తవం పంబాల, బైండ్ల కళాకారులు చెప్పే కథల్లో నిక్షిప్తమై ఉన్నది. పోచమ్మతో పాటు, మైసమ్మ, పోలేరమ్మ, మల్లమ్మ, అంకమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ– ఏడుగురు అక్కాచెల్లెళ్లుగా చెప్పే మౌఖిక సంప్రదాయ కథలు తెలంగాణలో నేటికీ ప్రచారంలో ఉన్నాయి. వీళ్లందరూ శివుని బిడ్డలుగా కూడా కథలు, గాథలు చెబుతూ ఉంటాయి. పోచమ్మ ఆరాధన మాత్రం పూర్తిగా ఆరోగ్య సమస్యలు, పరిరక్షణతో ముడిపడి ఉంది. అందుకే మన తెలుగు ప్రాంతంలో కూడా ఆషాఢమాసంలో బోనాలు, జాతరలు, పండుగలు చేస్తుంటారు. ఇందులో కూడా ప్రధానంగా వేపాకు, పసుపు, పసుపు అన్నంతో కూడిన బోనం పెడుతుంటారు. గ్రామదేవతలంతా బౌద్ధంలోని వారే అటు అంబిగయి అమ్మన్, ఇటు పోచమ్మ కూడా ఇద్దరూ బౌద్ధ భిక్కునిలేనని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంబిగయి అమ్మన్ జీవిత కథను ఆయోతీదాస్ సంపూర్ణంగా తన పరిశోధనలో బయటపెట్టారు. అయితే తెలుగునేల మీద ఉన్న గ్రామదేవతలు కూడా బౌద్ధ సంప్రదాయానికి చెందినవారుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామ దేవతలను ఇటీవలి కాలం వరకు హిందూమతం తనలో భాగంగా చూడలేదు. వారిని క్షుద్రదేవతలని, వారి ఆరాధనను మాలమాదిగల పూజలనీ తిరస్కరించారు. అందుకనే గ్రామ దేవతల కొలుపులకు పంబాల, బైండ్ల వాళ్లే పూజారులుగా ఉంటారు. ఇప్పటికీ వాళ్లే కొలుపు చేస్తుంటారు. అయితే గత ఇరవై, ముప్ఫయ్ సంవత్సరాల నుంచి ఈ గ్రామదేవతలపేరుతో గుళ్లు కట్టించడం మొదలైంది. కానీ అంతకు ముందు అవి కేవలం రాళ్లూ, రప్పలూ కొయ్యబొమ్మలే. ఎప్పుడైతే గుళ్లు నిర్మాణమై, ఆదాయం రావడం మొదలైందో, అక్కడ మళ్లీ బ్రాహ్మణ పూజారులు చేరారు. వాటిని కూడా హైందవీకరించే ప్రయత్నం జరుగుతున్నది. ఏది ఏమైనా ఈ గ్రామదేవతలు పూర్తిగా హైందవ సంప్రదాయానికి వెలుపల ఉన్నవారే. హిందూత్వానికి వ్యతిరేకంగా వచ్చి, శాస్త్రీయంగా నిలిచిన బౌద్ధాన్ని నమ్మిన వాళ్లే. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దం తరువాత బౌద్ధంపై హైందవ మతదాడులు పెరిగాయి. అందులో భాగంగానే వేలాది మంది బౌద్ధులను చంపేయడం లేదా పారిపోయేటట్టు చేయడమే జరిగింది. జ్యోతీరావుఫూలే తన ‘గులాం గిరీ’ పుస్తకంలో విష్ణువు దశావతారాలను స్థానిక ప్రజలపై ఆర్యులు జరిపిన పది దాడులుగా పేర్కొన్నారు. అందులో పరశురాముడు ఒకరు. ఆ పరశురాముడు బ్రాహ్మణ, క్షత్రియ వైరంలో అనేక మంది క్షత్రియులను హతమార్చినట్టు చెబుతారు. ఈ క్షత్రియులంతా బౌద్ధులేననేది ఫూలే వాదన. అందులో భాగంగానే పరశురాముడి వల్ల ఎల్లమ్మను హతమార్చడం, తల్లి మల్లమ్మను చంపడానికి ప్రయత్నించిన పరశురాముడిని తప్పించుకొని మాదిగవారి ఇంటిలో తోలును శుభ్రం చేసే లందలో తలదాచుకుంటుంది. తల్లి జాడను చెప్పినందుకు మాదిగ ఇంటి మహిళను తల నరుకుతాడు. ఒక రకంగా అపభ్రంశమైన కథ. ఎందుకంటే, ఎల్లమ్మ పరశురాముడి తల్లి అయితే చంపే అవకాశమే లేదు. కావాలనే దానిని ఆ విధంగా ఒక కథగా సృష్టించారు. ఎల్లమ్మ కూడా ఒక శక్తివంతమైన బౌద్ధ భిక్కునియే. ఎందుకంటే, ఆమె తలదాచుకున్నది మాదిగ ఇంట్లో, అంటే అప్పటికే మాదిగ, మాలలు అంతా వైదికమతానికి బయట ఉన్నారు. అందువల్ల ఎల్లమ్మతో పాటు, అడ్డం వచ్చిన వాళ్లను పరుశురాముడు చంపేస్తాడు. గ్రామదేవతల పూజలకు సంబంధించి శాస్త్రీయత ఉన్నదని చెప్పే చారి త్రక ఆధారం ఉన్నది. అవి కాలక్రమేణా మూఢనమ్మకాలుగా పరిణమించి, జంతుబలులు, రకరకాల పూజల పేరుతో తçప్పు దోవపట్టాయి. కానీ క్రీ.శ. ఒకటవ శతాబ్దం నాడు అంబిగయి అమ్మన్ అందించిన ఆరోగ్య పద్ధతులు చూపించిన జీవన విధానం కనీసం ఏదో ఓ రూపంలో ఆచరణలో ఉన్నాయి. భారత సమాజ పురోగమనానికి, ముఖ్యంగా మానవాళి రక్షణకు బౌద్ధ భిక్కునిలు చేసిన కృషి చరిత్ర మరువలేనిది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
దెయ్యం పట్టిందని కొడుకును చంపేశాడు
జలదంకి: మూఢ నమ్మకంతో కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధారం చోటు చేసుకుంది. జలదంకి మండలం గట్టుపల్లికి చెందిన గోపిశెట్టి శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు అశోక్ (23) ఐటీఐ చదివి ఇంటివద్ద ఉంటున్నాడు. సన్నకారు రైతైన శ్రీనివాసులుకు మూఢభక్తి ఎక్కువ. కుటుంబకష్టాలు గట్టెక్కేందుకు ఇటీవల ఓ స్వామీజీని ఆశ్రయించాడు. అశోక్‌కు దెయ్యం పట్టిందని, కాళ్లు చేతులు కట్టివేసి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై ఒత్తాలని.. అప్పుడు నీకు కూడా ఒంట్లోకి దేవుడు వచ్చి మీ కుమారుడికి దెయ్యం వదులుతుందని, కుటుంబం బాగుపడుతుందని అతను చెప్పినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులు భార్య మాధవి, రెండో కుమారుడిని ఒప్పించి అశోక్‌ను తాళ్లతో కట్టి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై గట్టిగా ఒత్తారు. దీంతో అశోక్‌కు ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం హడావుడిగా అశోక్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
16 ఏళ్లుగా ఒక్క కాన్పు కూడా జరగలేదు
-
ముహూర్తం కలిసి రాలేదు !
మూఢాఛారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గంలో కుదరని ఏకాభిప్రాయం ముసాయిదా బిల్లుపై వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు: మూఢాచారాల నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుపై మంత్రి వర్గంలో ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలో నరబలి, చేతబడులు వంటి వాటి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మూఢాచారాల నిషేధ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశల్లో చట్టసభల్లో ప్రవేశపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో చర్చించగా, మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రి వర్గంలోనే బిల్లుపై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూఢాచారాల నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలన్న నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇక శుక్రవారం జరిగిన మంత్రి మండలి భేటీలో మూఢాచారాల నిషేధానికి రూపొందించిన ముసాయిదా బిల్లుపై చర్చించారు. ఇప్పటికే ఈ బిల్లుపై పలువురు మఠాధిపతులు, కొన్ని సంఘాలు, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుపై కొంతమంది మంత్రులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక ఈ బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాలని సైతం కొంత మంది మంత్రులు సీఎం సిద్ధరామయ్యను కోరారు. దీంతో ఇప్పటికి ఈ బిల్లును ప్రవేశపెట్టే విషయాన్ని పక్కనపెట్టాలని సీఎం సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి మండలి పూర్తి సమ్మతితోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించిన సీఎం సిద్ధరామయ్య ఈ ముసాయిదా బిల్లులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరించాల్సిందిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ...‘మూఢాచారాల నిషేధ బిల్లుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించాం, మంత్రి వర్గ సభ్యులెవరూ ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు, కేవలం ఈ బిల్లును మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు, అందువల్ల మూఢాచారాల నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని కొంతకాలం వాయిదా వేస్తున్నాము’ అని తెలిపారు. ఇక ఇదే విషయంపై మంత్రి ఆంజనేయ మాట్లాడుతూ.....‘మూఢాచారాల నిషేధ బిల్లుకు సంబంధించిన సాదక, బాధకాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారు. రానున్న మంత్రి మండలి సమావేశంలో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. -
మంత్రాల నెపంతో దారుణ హత్య
మేడిపల్లి: ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం అభివృద్ధిపథాన దూసుకెళ్తుంటే.. మరో వైపు మంత్రాలు, చేతబడులు, బాణమతులను కొందరు ఇంకా నమ్ముతున్నారు. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం విలాయతాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూదరి రాజం(50) రాళ్లు కొట్టుకుం ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న రాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల రాజు, గంగాధర్ అనే అన్నదమ్ములు గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన రాజంను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజు, గంగాధర్‌ల బావ అనారోగ్యంతో మృతి చెందాడు. రాజం మంత్రాలు చేయడం ద్వారానే తమ బావ మృతి చెందాడని ఆగ్రహించిన అన్నదమ్ములు అతడిపై గొడ్డలితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
అద్దె ఇల్లు.. ఆరుబయట శవం!
♦ ఇంట్లోకి అనుమతివ్వని యజమాని ♦ గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు చండ్రుగొండ : అంటు అనే మూఢ నమ్మకంతో మృతదేహాన్ని తన ఇంట్లోకి తీసుకురావద్దన్న యజమాని. పుట్టెడు దుంఖఃలో ఉన్న ఆ కుటుంబం రామ నడిబొడ్డున టెంటు కింద మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన యన్నం పుల్లారావు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి నర్సమ్మతో కలిసి కొన్నేళ్లుగా ఓ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఏడాది క్రితం కల్లూరుకు చెందిన యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన పుల్లారావు పురుగుల మందు తాగాడు. కొత్తగూడెంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పుల్లారావు మృతదేహాన్ని మంగళవారం రాత్రి అద్దె ఇంటి వద్దకు తీసుకురాగా.. యజమాని లోపలికి తెచ్చేందుకు అనుమతించలేదు. చేసేది లేక మృతదేహాన్ని గ్రామ బొడ్రాయి సెంటర్లో టెంటు కింద ఉంచారు. విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి యజమానిని ఒప్పించేందుకు యత్నించినప్పటికీ వినలేదు. దీంతో బుధవారం మధ్యాహ్నం గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు నిర్వహించారు. సమాజం ఓ వైపు సాంకేతికపరంగా ముందడుగు వేస్తుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు మానవ విలువలను మంటగలుపుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఓటర్లతో ఒట్టు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఆవాలు
♦ ‘ఖేడ్’లో విచిత్ర పోకడ ♦ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రగాళ్లు ♦ మూఢనమ్మకాల ఉచ్చులో జనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ కల్హేర్: ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బుతో ఆకట్టుకుంటారని అందరూ అనుకంటే.. విచిత్రంగా ఆవాలు, వేపాకు, మంత్రాలపై ఆశలు పెట్టుకోవడం గమనార్హం. నిజానికి ఖేడ్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల నుంచి ఒట్టు పెట్టించి ఓట్లు రాబట్టారు. నియోజకవర్గంలో 168 గ్రామాలు ఉండగా దాదాపు 70 శాతం గ్రామాలు నిరక్షరాస్యత అధికంగా ఉన్న గ్రామాలే. మూఢ నమ్మకాలు ఎక్కువే. గ్రామీణ జనం గ్రామ దేవతను, క్షుద్ర శక్తులను బలంగా నమ్ముతారు. ఈ బలహీనతలను ఆసరా చేసుకున్న రాజకీయ నాయకులు.. కులాలు, తెగల వారీగా ఓటర్లను సమీకరించి చేతితో వేపాకు, పసుపు పట్టించి వారి వారి కుల దేవతల మీద ప్రమాణం చేయిస్తున్నారు. హన్మండ్ల కట్ట మీద ఒట్లు పెట్టిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఈ తంతు ప్రారంభమైంది. కంగ్టి, మనూరు, కల్హేర్,నారాయణఖేడ్ మండలాల్లో ఈ రకమైన క్షుద్ర ఒత్తిడి ఎక్కువగా ఉంది. తాజాగా శనివారం నాటి పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టిన వెంటనే ఓటర్లను కట్టడి చేసేందుకు ఓ పార్టీ నాయకులు మంత్రశక్తులు ప్రయోగించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్హేర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ దుండగులు ఆవాలు చల్లారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఏ పార్టీకి ఓటు వేద్దామనుకున్నా వారికి కావాల్సిన గుర్తు మీదే ఓటు వేస్తారనేది వారి నమ్మకం. ఓటును తమకు అనుగుణంగా వేయకుంటే క్షుద్రశక్తులు దాడి చేస్తాయనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చిన ఓ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం మంత్రాలు చేసిన ఆవాలు బూత్‌ల వద్ద పారబోశారనే విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయంశమైంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్లు తమకు అనుకులంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడి పోతున్నారు. పోలింగ్ నాటికి ఈ వదంతులు మరెంతగా వ్యాపిస్తాయోనని జనం చర్చించుకుంటున్నారు. -
దెయ్యం బూచితో మూతపడిన స్కూలు
చందంపేట (నల్లగొండ): ఆ ఊళ్లో ఓ మహిళకు అనారోగ్యం సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమెకు దయ్యం పట్టిందని అందుకే అలా జరుగుతోందని గ్రామంలో పుకారు లేచింది. గ్రామ పొలిమేరల్లోని సమాధుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్దకు ఆమె వెళ్లడమే కారణమని అనుకున్నారు. ఈలోపు మరొకరికి కూడా జబ్బు చేసింది. ఇంక అంతే... బడి వైపు వెళ్తే అలాగే జరుగుతుందని అనుమానించారు. దీంతో తమ పిల్లలను ఆ బడికి పంపడం మానేశారు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతబడింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకిందితండా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట పట్టిగా పిలువబడే చందంపేట గ్రామపంచాయతీ గట్టుకింది తండా ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యా వాలంటీర్‌తోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన వారి బంధువులు పలు చోట్ల తిప్పారు. ఎంతకూ తగ్గకపోవడం, మరొకరికి కూడా అనారోగ్యం రావడంతో సమాధులున్న చోట నిర్మించిన బడి వైపు వెళ్లడం వల్లే వారికి దెయ్యం పట్టిందని భావించారు. తమ పిల్లలకు కూడా ఎక్కడ దెయ్యం పడుతుందోనని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు బడికి పంపడం మానేశారు. విషయం చందంపేట ఎంఈఓ సామ్యనాయక్‌కు తెలియడంతో ఆయన ఈనెల 4న గ్రామానికి వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పిల్లలను పంపించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో వారు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టుకున్నారు. మూఢవిశ్వాసాలపై ఆయన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మా పిల్లలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా' అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆయన ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రవీణ్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
ఆచారాలతో అరాచకాలు
సాక్షి, గుంటూరు : ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్న ఇప్పటి రోజుల్లో కూడా మూఢ నమ్మకాలకు బలి అవుతున్నారు. చేతబడి, బాణామతి వంటివి చేశారనే అనుమానంతో ఎదుటి వ్యక్తులను హతమారుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాలతోపాటు, శివారు గ్రామాలు, తండాలలో మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. ప్రమాణాల పేరుతో పెద్దలు పంచాయతీలు నిర్వహిస్తూ ఆచారం పేరుతో అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదం చోటు చేసుకున్నా, అనుమానాలు రేకెత్తినా ఆచారం పేరుతో ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డిని నిప్పుల్లో నుంచి తీయాలని, అలాతీస్తేనే అనుమానాలకు తావు ఉండదని నమ్ముతున్నారు. అదేవిధంగా దొంగతనాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న వ్యక్తిని బాగా మరిగించిన నూనెలో చేతులు పెట్టాలని, చేతులు కాలక పోయినట్లయితే దొంగతనం చేయనట్లుగా నిర్ధారిస్తూ పెద్దలు పంచాయతీలు నిర్వహించడం ఇప్పటికీ కొన్ని తండాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగితే తమకు ఎదుటి వారు చేతబడి చేయించారనే అనుమానంతో దాడిచేసి హతమార్చిన సంఘటన ఇటీవల వెలుగు చూసింది. మాచర్ల మండలం తాళ్ళపల్లి గ్రామంలో చేతబడిపేరుతో ఓ వ్యక్తిని అమ్మ వారి గుడిముందు గొడ్డలితో నరికి చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 20 రోజులు ముందు పెద్దలు పంచాయతీ చేసినప్పటికీ ఈ హత్య జరగడం దారుణ విషయం. పోలీసులు తమకేమీ పట్టనట్లు వదిలేయడం వల్లే ఇంతటి అనర్థం జరిగిందని, ముందుగా ఇరువర్గాల వారిని హెచ్చరించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిఘా నామమాత్రమే ... శివారు గ్రామాలు, తండాల్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వ హిస్తూ ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. కుల, మత పెద్దలు ఆచారాల పేరుతో మూఢ నమ్మకాలు పాటిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాలపై పోలీసులు దృష్టి సారించాలి. గ్రామం, తండాను పోలీసులు దత్తత తీసుకు నేలా చేసి ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలు, తండాల్లో జరిగే సంఘటనలు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. మూఢనమ్మకాలను పారదోలాలి. -
మంత్రాల నెపంతో కొట్టి చంపారు...
మెదక్: మూఢ నమ్మకాలు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో మంత్రాల నెపంతో ఓ కుటుంబానికి చెందిన వారిని గ్రామస్తులు విచక్షణ రహితంగా కొట్టటంతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన రొడ్డ రామస్వామి(62) మంత్రాలు వస్తాయని కొందరు గ్రామస్తులకు అనుమానం. అతని కారణంగానే తమ కుటుంబాల్లో కీడు కలుగుతోందని కొన్ని రోజులుగా వారు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి రామస్వామి ఇంటి వద్దకు వెళ్లి, అతనిని పనుందంటూ బయటకు పిలిచారు. కుటుంబసభ్యుల ఎదుటే రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టటంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అతని భార్య పోచమ్మ(55), కూతురు రేణుక(22) కుమారుడు సాయి(21)లపైనా దాడి చేయటంతో వారు గాయాలపాలయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (తూప్రాన్) -
మూఢనమ్మకం పొమ్మంది భూమాత రమ్మంది
కీడు సోకిందని ఊరు ఖాళీ సిరులు పండిస్తున్న భూములు ఇళ్లు కట్టిస్తే తిరిగొస్తామంటున్న ప్రజలు మారుమూల గ్రామమైన సిరివంచకోట అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పూరిగుడిసెలు, పెంకుటిళ్లు, దాబాలు అన్నీ కలిసి ఓ వంద ఉన్నాయి. తాగునీరు, రోడ్డులాంటి కనీస సౌకర్యాలూ కరువే. విద్యుత్ సౌకర్యం లేక చిమ్మచీకట్లో కాలం వెళ్లదీశారు. అయినా భూమాతను నమ్ముకుని బతికారు. గ్రామానికి కీడు సోకిందనే ఒకే ఒక్క మూఢనమ్మకం ఆ ఊరిని అడవిగా మార్చింది. ఒక్కొక్కరుగా అందరూ ఇళ్లు ఖాళీ చేసి చుట్టుపక్కల ఊళ్లలో స్థిరపడ్డారు. కానీ, భూమాతను నమ్ముకున్న ఆ రైతులు భూములు సాగు చేస్తూ సిరులు కురిపించుకుంటున్నారు. - ధర్మపురి సిరివంచకోట పేరుకు తగ్గట్లే ఆ ఊరి భూములు రైతుల్లో సిరులు కురిపిస్తున్నాయి. గ్రామంలో వంద గృహాలున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. కనీస సౌకర్యాలు కరువైన ఆ ఊళ్లో రాత్రుళ్లు అనుకోని ఆపదొచ్చినా ఆదుకునే వైద్యులు కూడా లేరు. చదువుకుంటే పిల్లలు అభివృద్ధి చెందుతారని భావించిన గ్రామస్తులు 1995లో గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే శికారి విశ్వనాథం చేతులమీదుగా ప్రారంభింపజేసుకున్నారు. దశాబ్ధం క్రితం ఒకే ఒక్క పుకారు ఆ ఊరును ఖాళీ చేసేలా చేసింది. గ్రామానికి చెందిన లక్ష్మి వాంతులు విరేచనాలతో సకాలంలో వైద్యం అందక మృతిచెందింది. వారం రోజుల్లో ఆ ఇంటిపక్కనే ఉన్న నర్సయ్య అనే వృద్ధుడు కూడా వాంతులు, విరేచనాలతో మృతిచెందాడు. ఇలా ఒక్క ఏడాదిలో 15 మంది వివిధ కారణాలతో మరణించారు. అంతే గ్రామానికి కీడు సోకిందనే అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఒక్కొక్కరుగా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కొందరు జగిత్యాల వెళ్లగా మరికొందరు సమీప గ్రామాలైన బుగ్గారం, గోపులాపూర్, మద్దునూర్‌కు వలస వెళ్లారు. ఇప్పుడు ఆ గ్రామం మొత్తం ఖాళీనే. ఈ పదేళ్లలో కొన్ని గృహాలు శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. చెట్ల పొదలతో ఊరు ప్రస్తుతం అడవిని తలపిస్తోంది. సిరులకోట ఇళ్లు వదిలి వెళ్లినప్పటికీ ఆ ఊరి భూములపై వారికి మమకారం పోలేదు. సారవంతమైన సాగుభూముల్లో ఇప్పటికీ సాగు చేసుకుంటూనే ఉన్నారు. భూముల్లో వరి, మొక్కజొన్న, పసుపు, పత్తి ఇతర కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. వారు ఉంటున్న ఊరు నుంచి వచ్చి పగలంతా పొలం పనులు చూసుకుని సాయంత్రం వారి నివాస ప్రాంతాలకు వెళ్తున్నారు. గ్రామానికి విద్యుత్ లైన్లు వేయడంతో కరెంటు మోటార్ల సాయంతో సాగు చేస్తున్నారు. 3వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా. సిరులు కురిపిస్తున్న ఈ భూములకు విపరీతంగా డిమాండ్ ఉంది. ఒక్కో ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. మమకారం పోలేదు మా ఊరు సిరివంచకోట. ఇప్పుడు మేం బుగ్గారంలో ఉంటున్నం. మా ఊళ్లె ఏం సౌలత్లు లేక ఇల్లు విడిచిపెట్టి వెళ్లినం. మాకు సిరివంచకోటలో మూడెకరాల భూమి ఉంది. ఊరు విడిచి వెళ్లినా మమకారం చావలేదు. అందుకే పగలంతా ఈ మూడెకరాల్లో పొలం పనులు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. రాత్రి మళ్లీ బుగ్గారం వెళ్లిపోతున్నాం. మా భూముల్లల్ల మంచి పంటలు పండుతున్నయ్. - మొగిలి రాజన్న ఇండ్లు కట్టించాలి ఏం సౌలత్లు లేక ఊరు విడిచి వెళ్లినం. ఊళ్లో ఆ కాలంలో ఒక్క వైద్యుడు, చాకలి అంటూ లేడు. ఊరు చీకట్లో ఉంది. రాత్రిళ్లు ఏదైనా ఆపద వస్తే అడవిగుండా ఎక్కడికి వెళ్లేటోళ్లం కాదు. కనీసం రోడ్డు కూడా లేదు. అంతలోనే మా ఊరికి కీడు సోకిందని భయం చెప్పిండ్రు. ఒకరిని చూసి ఒకరం వెళ్లిపోయినం. ప్రభుత్వం స్పందించి మాకు అన్ని వసతులతో ఇండ్లు కట్టిస్తే ఇక్కడే ఉంటం. - రాచర్ల రామస్వామి మా ఊరు మాకే మాది సిరివంచకోట. తొమ్మిదేండ్ల క్రితం భార్యా, ఇద్దరు పిల్లలతో ఊరు విడిచి బుగ్గారం వచ్చినం. సిరివంచకోటల నాకు రెండెకరాల పొలం ఉంది. రోజు బుగ్గారం నుంచి ఎడ్లబండి మీద వచ్చి ఎవుసం చేసుకొంటున్నం. అప్పుడు వంద ఇండ్ల వరకుండే. ఐదో తరగతి దాకా ఒక్క బడి ఉండె. మంచినీళ్లు, రోడ్లు, లైట్లు లేకుండె. ఇప్పుడున్న మా భూముల్లో ఇండ్లు కట్టించి వసతులు కల్పిస్తే మా ఊరు మాకే ఉంటది. - గాండ్ల నర్సయ్య అడవిలా అయింది మేం ఎవుసం చేసుకుంట బతుకుతం. ఏడేండ్ల కింద ఇల్లు వదిలి బుగ్గారం వెళ్లిపోయనం. అప్పుడు ఇండ్లు మంచిగుండె. ఒకల వెనక ఒకలు ఇండ్లు విడిచిపెట్టి పోవడంతో ఊరు అడవి లెక్కయింది. ఒక్కలు కూడా ఉంటలేరు. అయినా ప్రతీరోజు ఎవుసం పనులు చేసుకునేటందుకు ఇక్కడికే వస్తున్నం. గవర్నమెంటోళ్లు ఆదుకుని మాకు మంచి ఇండ్లు కట్టిస్తే ఇక్కడికే వస్తం. మా ఊళ్లెనే ఉండి ఎవుసం చేసుకుంటం. - నక్క నర్సింగం -
భార్యను చంపిన భర్త, రక్తం పూసుకొని నృత్యాలు
ఒంటికి రక్తం పూసుకొని నృత్యాలు అరుపులు వినిపించకుండా భజన పాటలు నిజామాబాద్: మూఢ నమ్మకంతో భార్యను కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి యాదగిరిబాగ్‌లో అద్దెకుంటు న్న నవీన్ సెల్‌ఫోన్ మెకానిక్. ఇతనిది రెంజల్ మండలం నీలా గ్రామం. రెండేళ్ల క్రితం నగర శివారులోని గంగాస్థాన్‌కు చెందిన సవిత(20)తో వివాహమయ్యింది. కొన్ని నెలల క్రితం అత్తమామలు సుశీల, మామిడి గోపాల్‌ను తమ ఇంటి వద్ద మరో ఇంట్లో అద్దెకు ఉండాలని నవీన్ సూచించగా, అలాగే ఉంటున్నారు. శుక్రవారం మృతురాలి తల్లి కూతురు వద్దకు వచ్చింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో నవీన్ అత్తను బయటకు వెళ్లాలని ఆదేశించడంతో ఇంటికి వెళ్లిపోయింది. తర్వాత నవీన్ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె కేకలు బయటకు వినపడకుండా కంప్యూటర్లో పెద్ద సౌండ్‌తో భజ నపాటలు పెట్టాడు. కాలనీవాసులు కొందరు సౌండ్ తగ్గించమని చెప్పేందుకు రాగా, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భార్య కాళ్లు, చేతులు ఓ లుంగీతో గట్టిగా కట్టి కత్తితో ఆమె గొంతును కోశాడు. దీంతో తీవ్రరక్త స్రావమై సవిత మృతి చెందింది. భార్య రక్తాన్ని నిందితుడు ఒంటికి పూసుకుని భజ నపాటలకు నృత్యం చేయటం చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఉద యం కాలనీవాసులు వారు నాల్గో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లగా రక్తపుమడుగులో సవిత మృతదేహం కనిపించింది. మృతదేహం పక్కనే భర్త కూర్చొని ఉన్నాడు. విషయాన్ని ఎస్సై నరేశ్, ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లుకు తెలపటంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల నుంచి వింత ప్రవర్తన: నవీన్ వివాహమైన నాటి నుంచి భార్యపై అనుమానంతో హింసించేవాడని తెలిసింది. మూడునెలలుగా వింతగా ప్రవర్తించేవాడని కుటుంబీకులు చెప్పారు. గుప్త నిధులు ఉన్నాయని, వాటికోసం ప్రయత్నం చేస్తున్నాని చెప్పేవాడని అన్నారు. ఇందులో భాగంగా అజ్మీర్‌కు సైతం వెళ్లివచ్చాడు. అక్కడినుంచి తయాత్తులు తెచ్చుకున్నాడని, వాటికి పూజలు చేస్తూ నన్ను దేవుడు అవతరించాడని చెప్పేవాడని తెలిసింది. -
ఘనంగా సైన్స్‌కాంగ్రెస్
మాక్లూర్ : ప్రజలు మూఢనమ్మకాలను వదిలి పెట్టి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దాస్‌నగర్ శివారులో గల నవ్యభారతి గ్లోబల్‌స్కూల్‌లో ఆదివారం 22వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వారోత్సావాలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ సైన్స్‌ను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలన్నారు. సైన్స్‌పై అవగాహన లేకపోవడం మూలంగానే చాలామంది మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారని చెప్పారు. సక్రమైన శాస్త్రీయ పద్ధతిలో సైన్స్‌ను వినియోగించుకుంటే మనందరికి వరంగా మారుతుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సైన్స్‌కాంగ్రెస్ స్టేట్ కో-ఆర్డినేటర్ వై. నగేశ్ మాట్లాడుతూ వైజ్ఞానిక దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలతో పిల్లలు ఎదగాలన్నారు. భవిష్యత్ తరాలకు మంచి విజ్ఞానాన్ని అందించాలన్నారు. జిల్లా కో-ఆర్డినేటర్ నర్ర రామారావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌లో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి 82ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయన్నారు. ఇందులో 13 ప్రాజెక్టులను ఎంపిక చేసి జాతీయస్థాయి సైన్స్‌కాంగ్రెస్‌కు పంపుతామన్నారు. 86 మంది బాల శాస్త్రవేతలు, నిర్ధేశక ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారని చెప్పారు. అనంతరం కంటి, దంత వైద్యశిబిరాలు నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ పోచాద్రి, ఎన్జీఎస్ చైర్మన్ సంతోష్, ప్రిన్సిపాల్ శ్రీదేవి, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
దోషం ఉందంటూ దోచేసింది
12 కాసుల నగలతో ఉడాయించిన మాయ‘లేడి’ లబోదిబోమంటున్న బాధితులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రంపంచ అగ్ర రాజ్యాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా అక్కడక్కడ మూఢనమ్మకాలు రాజ్యమేలు తున్నాయి. అమాయక సామాన్యజనాన్ని నట్టేట ముంచుతూనే ఉన్నాయి. కైకలూరు : ఇంట్లో దోషం ఉందంటూ నమ్మించి 12 కాసుల నగలు, రూ. 9వేలుతో ఉడయించిన మహిళ ఉదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. సినీఫక్కీలో జరిగిన ఈ దొంగతనం పట్టణంలో కలకలం రేపింది. స్థానిక వెలంపేటలో పోలన సతీష్, భార్య గౌరి, తల్లి, సోదరుడితో కలసి నివసిస్తున్నారు. వారం రోజుల క్రితం గౌరి వద్దకు ఓ మహిళ వచ్చి ముఖంపై పెద్ద బొట్టు, చేతిలో సంచితో ఓ మహిళ రావడం చూశారా అని ప్రశ్నించింది. గౌరి ఏవరని అడిగింది. ఆమె మా ఇంటిలో దోషాలను పరిష్కరించిందని, ఆమె కనిపిస్తే కొవ్వూరు నుంచి ఓ మహిళ వచ్చిందని చెప్పండని నమ్మించి వెళ్లిపోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గౌరి వద్దకు నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకున్న ఓ మహిళ వచ్చింది. ఆమె కరక్కాయిలు, మూలికలు అమ్ముతానని చెప్పింది. దీంతో గౌరీ వారం రోజుల కిత్రం చెప్పిన మహిళ అనుకుని లోపలికి రమ్మంది. ఇంట్లోకి వెళ్లిన ఆ మాయలేడి గోడపై ఉన్న ఫొటోను చూసి చేతబడి చేయడం వల్లే ఆయన చనిపోయారని చెప్పింది. చేతబడి నివారణకు వివాహం కాని బ్రాహ్మణుడితో పూజలు చేయించాలని, ఆయనకు ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదని నమ్మబలికింది. గౌరి అమాయకంగా డబ్బులు తీసుకోకుండా ఎవరు పూజ చేస్తారని అడగడంతో 10 నిముషాల్లో నేను చెస్తానని ఆమె చెప్పింది. ఇంట్లో బియ్యం తీసుకురమ్మని నగలు ఉంచాలని కోరింది. తూకం రాయి చూపించి బరువు సరిపోలేదని డబ్బు ఉంచాలని కోరింది. పుసుపు, కుంకుమతో పూజ చేసి డబ్బాలో నగలు, డబ్బును ఉంచింది. దానిపై తాయత్తలు కట్టి దేవుడి పూజ గదిలో ఉంచాలని చెప్పింది. ఈ విషయం మరుసటి రోజు ఉదయం వరకు ఎవరికీ చెప్పకూడదని, పూజ చేసి నగలు, డబ్బులు తీసుకోవాలని చెప్పింది. నమ్మకం కలగడానికి తన పేరు నాగమ్మ అని కొవ్వూరులో డోర్ నెంబరు 101లో నివాసముంటున్నానని, అక్కడకు వచ్చి నా పేరు చెబితే ఇంటికి తీసుకొస్తారని చెప్పి ఊడాయించింది. మరుసటి రోజు ఉదయం గౌరి బాక్సు తీసి చూస్తే బియ్యం మాత్రమే అందులో ఉన్నాయి. మోసపోయానని గుర్తించిన గౌరి విషయాన్ని ఇంటిలో చెప్పింది. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగలకు మెరుగు పెడతాం, దోషాలను నివారిస్తాం అంటూ వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. -
మూఢవిశ్వాసంతోనే హత్య
మొయినాబాద్, న్యూస్‌లైన్: మూఢ విశ్వాసమే వృద్ధుడి హత్యకు దారితీసింది. వృద్ధుడు బాలయ్య తన కుటుంబానికి బాణామతి చేసి భార్య, తల్లి మృతికి కారణమయ్యాడని అనుమానించి ఆయనను చంపేసినట్లు నిందితుడు యాదయ్య అంగీకరించాడని సీఐ రవిచంద్ర తెలి పారు. మండల పరిధిలోని బాకారంలో ఈనెల 15న జరిగిన బాలయ్య హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. సీఐ రవిచంద్ర విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఎలా చిక్కాడు..? బాకారం గ్రామానికి చెందిన మాల బాలయ్య(70)ను అదే గ్రామానికి చెందిన కాశ యాదయ్య(42) ఈనెల 15న సాయంత్రం దారుణంగా కొట్టిచంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పారిపోయాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం యాదయ్య శంషాబాద్ బస్టాండు సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మొయినాబాద్ ఠాణాకు తరలించి విచారించారు. ఎందుకు చంపేశాడు..? బాలయ్య బాణామతి చేస్తాడని గ్రామస్తులు విశ్వసించేవారు. యాదయ్య 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు వారి పూరి గుడిసె తగులబడిపోయింది. దానికి బాలయ్యే కారణమని యాదయ్య బలం గా విశ్వసించాడు. పదిహేడేళ్ల క్రితం యాదయ్య చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన అరుణను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆమె గర్భవతిగా ఉండగా మృతిచెందింది. బాలయ్య బాణామతి చేయడంతోనే తన భార్య మృతిచెందిందని యాదయ్య నమ్మి పగ పెంచుకున్నాడు. అనంతరం ఆయన మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం యాదయ్య తల్లి ముత్తమ్మ మరణించింది. ఆమెను సైతం బాలయ్యే బలిగొన్నాడని విశ్వసించాడు. తన కుటుంబాన్ని బాలయ్య పొట్టనబెట్టుకున్నాడని భావించాడు. ఈక్రమంలో బాలయ్య హత్యకు గురయ్యేకంటే వారం రోజుల ముందు యాదయ్య అతడిపై దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకుని అతణ్ని పోలీసులకు అప్పగించా రు. యాదయ్యను పోలీసులు నగరంలో ని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. సంక్రాం తి పండుగ నేపథ్యం లో ఆయనను కుటుంబీకులు ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆయన ఈనెల 15న సాయంత్రం బాలయ్య మేకలు మేపుతుండగా అతడి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశావ’ని గొడవపడ్డాడు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో వృద్ధుడి తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కటాకటాల్లోకి యాదయ్య.. యాదయ్యను శనివారం మొయినాబాద్ పోలీసులు రిమాండుకు తరలిం చారు. మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు రమేష్, కృష్ణ, చంద్రయ్య, రాజమల్లేష్, పండరి, నర్సింలును ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో ఏఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
దయ్యం నెపంతో తొక్కి చంపారు
నెన్నెల: మూఢ నమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మైలారంలో ఏడాది క్రితం చనిపోయిన వృద్ధురాలు దయ్యంగా మారి తమను వేధిస్తోందని ఆమె కొడుకును అదే గ్రామానికి చెందిన మహిళలు కొట్టి చంపారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన టేకం చిన్నయ్య(50) తల్లి మారక్క ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, ఆమె దయ్యంగా మారి కొద్ది రోజులుగా వేధిస్తోందని దీంతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన ఎండల పద్మ, ప్రవళిక అనుమానం. దీంతో తమను రక్షించేందుకు దేవుడి మొక్కులు తీర్చాలని చిన్నయ్యతో వారు గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న చిన్నయ్యపై వారిద్దరూ దాడి చేశారు. అతన్ని విచక్షణ రహితంగా కాళ్లతో తొక్కి, స్పృహ కోల్పోయే వరకు కొట్టి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆదివారం ఉదయం ఇరుగు పొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కరీంనగర్ వెళ్లేందుకు డబ్బుల్లేక వెనక్కి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య బాయక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోయిన బిడ్డ కోసం 30 గంటలు నిరీక్షించిన తల్లిదండ్రులు
నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించిన అధికారులు మంత్రాలయం, న్యూస్‌లైన్: ఒక్కగానొక్క కుమారునిపై వారి మమకారం మూఢనమ్మకాల వైపునకు దృష్టి మరల్చేలా చేసింది. బతికొస్తాడనే ఆశ 30 గంటల నిరీక్షణకు కారణమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గర్భగుడిలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన శ్రీదత్త(4) పాముకాటుతో మృతి చెందాడు. అదే రోజు కల్లుదేవకుంట ప్రాథమిక కేంద్రం వైద్యుడు ప్రతాప్ బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే కొందరు పాము కాటు లక్షణాలు లేవని, మరికొందరు చర్మం నల్లబడలేదని.. ఇంకొందరు చలనం కనిపించిందనే పుకార్లు పుట్టించడంతో బాలుడు బతికొస్తాడని తల్లిదండ్రులతో పాటు బంధువుల్లో నమ్మకం కలిగింది. అదే భావనతో దాదాపు 30 గంటల పాటు నిరీక్షించారు. బాలుడి శరీరమంతా ఆవుపేడ పూశారు. ఓ వైద్యుడు నోట్లో మాత్ర వేశాడు. కొందరు నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా మింగినట్లు భ్రమపడ్డారు. అలా వాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు. శనివారం కల్లుదేవకుంటకు చెందిన హోమియో వైద్యుడు తిమ్మారెడ్డి బాలుడిని పరిశీలించి ప్రాణం లేదని చెప్పినా వారికి నమ్మకం కలగలేదు. సాయంత్రం 5గంటల వరకు కన్నీళ్లు పెట్టుకుంటూనే.. ఎంతో ఆశగా బతికొస్తాడని ఎదురుచూడసాగారు. ఈ విషయం బయటకుపొక్కడంతో అధికారులు రంగప్రవేశం చేశారు. బాధిత కుటుంబానికి నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు. కాగా, స్వామీజీ ఒకరు చెప్పడంతో తామిలా చేశామని వస్తున్న వార్తలు సత్యదూరమని మృతుడి తల్లిదండ్రులు ఖండించారు.