
కేరళ నరబలి కేసులో పోలీసుల దర్యాప్తు.. నిందితుడు షఫీ(ఇన్‌సెట్)
ఇటీవల కేరళలో దంపతులు డబ్బుల కోసం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసి, వండుకుని తిని ప్రపంచ ప్రజలకు ఒళ్ళు జలదరింప చేశారు. దీనికి కారణం మూఢనమ్మకాలు మాత్రమే. ఈ సంఘటన మరువక ముందే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో కన్న తండ్రే తన 14 సంవత్సరాల కూతురిని భూతశక్తులు వస్తాయి అనే మూఢ నమ్మకంతో అగ్ని గుండంలో తోసేసి జనాన్ని విస్మయపరిచాడు.
అసలు నేటి సమాజం ఎటు పోతోంది? ఈ ఆధునిక 21వ శతా బ్దంలో, మానవుడు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఏమిటీ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు? దీనికి అంతటికీ కారణం మాయ మాటలు చెప్పి, మోసం చేసే బాబాలు, స్వామీజీలు, భూతవైద్యులు! ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతూంటే, కొందరు ఇంకా మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఆదిమ సమాజంలోనే కూరుకుపోవడం దురదృష్టకరం.
ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మరాదు. అంధ విశ్వాసాలను హేతువాదంతో జయించాలి. ఆధునిక కాలంలో అత్యాధునికమైన ఆలోచనలతో నవీన మానవుడుగా మసలడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ దిశలో మీడియా, ప్రభుత్వాలూ తగిన ప్రచారాన్ని చేపట్టాలి. (క్లిక్: కేరళ నరబలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!)
– రావుశ్రీ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment