Human sacrifice
-
మహారాష్ట్రలో 9 ఏళ్ల బాలుడు నరబలి
నాసిక్: నిధులు దొరుకుతాయనే కొందరి మూఢ విశ్వాసం తొమ్మిదేళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ ఘోరం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా పొహనె షివార్ గ్రామంలో ఈ నెల 16న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఒక బాలుడిని నిర్బంధించి తాంత్రిక పూజల్లో భాగంగా గొంతుకోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గుంతలో సగం వరకు పూడ్చిపెట్టారు. ఈ నెల 18న ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిధి దొరుకుతుందనే మూఢ నమ్మకంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా?
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లో దారుణం వెలుగుచూసింది. అల్లావుద్దీన్ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే అమావాస్య రోజున బాలుడిని ఓ హిజ్రా నరబలి ఇచ్చిన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. అయితే రాత్రి అవుతున్న బాలుడి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు బకెట్లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. కాగా వహీద్ ఇంటి పక్కనే ఉంటున్న ఇమ్రాన్ అనే మహిళ(హిజ్రా).. బాలుడిని మజీద్ నుంచి నేరుగా తనతో తీసుకెళ్లిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతో స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు) విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరబలి ఇచ్చిన్నట్లుగా అనుమానిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మంత్రి తలసాని విచారం.. సనత్ నగర్ బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. (Hyderabad: బాత్రూమ్లో జారిపడి గర్భిణి మృతి ) -
యూపిలో దారుణం.. తలలేని చిన్నారి మృతదేహం కలకలం..
ఒక చిన్నారి తల, అవయవాలు లేకుండా మొండెంతో... దారుణమైన హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...యూపీలోని మీరట్‌లో ఒక పొలంలో తల లేకుండా ఉన్నా మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పొరుగింటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు నరబలిలో భాగంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో బాలుడిని చెరుకుతోటలో వదిలేసినట్లు చెప్పడంతో.. పోలీసుల బృందం మీరట్‌లోని ఇంచోలిలోని నాంగ్లీ-ఇసా గ్రామానికి చేరుకుంది. అక్కడ సమీపంలోనే ఆ బాధిత చిన్నారి తలను కనుగొన్నారు. ఆ చిన్నారి వస్తువులు, బట్టలు ఆధారంగా నవంబర్ 30న తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో తప్పిపోయిన చిన్నారిగా గుర్తించారు పోలీసులు. చిన్నారి దారుణ హత్య గురించి తెలుసుకుని...కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. ఐతే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
సమాజం ఎటు పోతోంది.. ఏ కాలంలో ఉన్నాం?
ఇటీవల కేరళలో దంపతులు డబ్బుల కోసం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసి, వండుకుని తిని ప్రపంచ ప్రజలకు ఒళ్ళు జలదరింప చేశారు. దీనికి కారణం మూఢనమ్మకాలు మాత్రమే. ఈ సంఘటన మరువక ముందే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో కన్న తండ్రే తన 14 సంవత్సరాల కూతురిని భూతశక్తులు వస్తాయి అనే మూఢ నమ్మకంతో అగ్ని గుండంలో తోసేసి జనాన్ని విస్మయపరిచాడు. అసలు నేటి సమాజం ఎటు పోతోంది? ఈ ఆధునిక 21వ శతా బ్దంలో, మానవుడు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఏమిటీ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు? దీనికి అంతటికీ కారణం మాయ మాటలు చెప్పి, మోసం చేసే బాబాలు, స్వామీజీలు, భూతవైద్యులు! ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతూంటే, కొందరు ఇంకా మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఆదిమ సమాజంలోనే కూరుకుపోవడం దురదృష్టకరం. ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మరాదు. అంధ విశ్వాసాలను హేతువాదంతో జయించాలి. ఆధునిక కాలంలో అత్యాధునికమైన ఆలోచనలతో నవీన మానవుడుగా మసలడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ దిశలో మీడియా, ప్రభుత్వాలూ తగిన ప్రచారాన్ని చేపట్టాలి. (క్లిక్: కేరళ నరబలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!) – రావుశ్రీ, కాకినాడ -
నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం?
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన కేరళలోని పతనంతిట్ట జిల్లా నరబలి కేసు దర్యాప్తులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ చేతిలో చాలా మంది బలైపోయినట్లు తెలుస్తోంది. నరబలి కేసు బయటపడిన క్రమంలో కనిపించకుండా పోయిన మహిళల కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నాయి. వారు కనిపించకుండా పోవటం వెనక నరబలి నిందితుడు షపీ హస్తం ఉండి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఎలంతూర్ గ్రామంలో ఇద్దరు మహిళలను బలిచ్చిన కేసులో షఫీ, భగవల్ సింగ్, అతడి భార్య లైలాను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 2013 నుంచి కనిపించకుండా పోయిన బింధు పద్మనాభన్ అనే మహిళ బంధువులు.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆమె మిస్సింగ్‌కు కొద్ది రోజుల ముందు షఫీకి సంబంధించిన ఓ వ్యక్తితో బింధును చూసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై షఫీని ప్రశ్నించామని, ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు తెలిపారు. బింధు పద్మనాభన్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కందకరపల్లిలో ఒంటరిగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయినట్లు 2013లో కేసు నమోదైంది. 2017లో మరోమారు ఆమె ఆస్తులను నకిలీ పత్రాలను ఉపయోగించి సీజ్ చేశారని బాధితురాలి సోదరుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సంఘటనలో 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కే. సరోజిని నివాసం.. ఎలాంతూర్ నిందితులకు కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో ఆమె కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని బంధువులు కోరుతున్నారు. కనిపించకుండా పోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరిగి దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో 12, ఎర్నాకులం జిల్లాలో 14 కేసులు గత ఐదేళ్లలో నమోదైనట్లు సీనియర్ అధికారోకరు తెలిపారు. ఈ 26 మంది మహిళల మిస్సింగ్ వెనుక షఫీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. తల నరికి, నాలుక కోసి.. -
నరబలి ఘటన: కేరళ ప్రభుత్వానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేరళ నరబలి ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కేరళ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణాలను ఊహించలేమని పేర్కొంది. చట్టాలంటే ఏమాత్రం భయంలేకుండా మూఢనమ్మకంతో మనుషులను చంపడం చాలా ఘోరమని పేర్కొంది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదీ చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
నరబలి కలకలం.. డోర్లు మూసి తాంత్రిక పూజలు చేస్తుండగా..
కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేశారు. ఈ ఘటన మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోని పూజ గదిలో కూర్చుని క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం ఎస్బీ నగర్‌లోని ఓ ఇంటిలోని వ్యక్తులు మూడు రోజులుగా బయటకు రాలేదు. దీంతో, వారింట్లో నరబలి పూజలు జరుగుతున్నాయని స్థానికంగా వార్తలు, పుకార్లు బయటకు వచ్చాయి. స్థానికుల అనుమానాలను బలపరుస్తూ.. ఇంటి లోపలి నుంచి తాంత్రిక పూజలు జరుగుతున్న అలికిడి వినిపించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. దీంతో, ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తీయాలని పోలీసులు ఇంట్లో ఉన్న వారిని కోరారు. అయినప్పటికీ వారు తలుపులు తీయలేదు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న వారు పూజలు చేస్తున్న శబ్ధాలు, గంటల చప్పుడు వినిపించింది. దీంతో, పోలీసులు.. బుల్డోజర్ సాయంతో ఇంటి ముందు భాగాన్ని కూల్చివేయాలని అగ్నిమాపకశాఖ సిబ్బందిని ఆదేశించారు. ఇలా కూల్చివేసిన అనంతరం.. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. పూజగదిలో ఆరుగురు కూర్చుని తాంత్రిక పూజలు జరుపుతూ కనిపించారు. దీంతో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పూజలపై వారిని ప్రశ్నించగా వారింట్లో ఒకరికి దెయ్యం పట్టిందని సమాధానం ఇవ్వడం గమనార్హం. Acting on a tip-off, Tamil Nadu police thwarted a ritual in Tiruvannamalai, suspecting it to be a ritual of human sacrifice | @Akshayanath https://t.co/Vs65NumjFG — IndiaToday (@IndiaToday) October 15, 2022 -
కేరళ నరబలి కేసు: పోర్న్ సినిమాల్లో నటిస్తే రూ.10 లక్షలు!
కేరళలోని పతనంతిట్ట ఎలంతూరు నరబలి ఉదంతంలో.. వెన్నులో వణుకుపుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులను ప్రేరేపించడంతో పాటు బాధితులకు డబ్బు ఆశతో ఎర చూపించడం, ఆపై వాళ్లను తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా బలి ఇవ్వడం.. ఇలా దాదాపు ప్రతీ దాంట్లోనూ మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అంతేకాదు స్థానికంగా 12 మంది మహిళల మిస్సింగ్ కేసుకు.. వీళ్లకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేరళ జంట నరబలి కేసులో షఫీ(52) ఆకృత్యాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతారని షఫీ చెప్పిన మాయమాటలతో తాము ఎలా నేరం చేశామన్నది భగవల్ సింగ్- లైలా దంపతులు పోలీసులకు వివరించారు. ఈ వివరాలను, దర్యాప్తులో వెలుగు చూసిన మరిన్ని విషయాలను పోలీసులు మీడియాకు తాజాగా వివరించారు. ఈ ఉదంతం కంటే ముందే షఫీపై కొన్ని కేసులు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో ఆమెను లైంగికంగా హింసించగా.. అదే ఆనవాలు ఇప్పుడు రోసిలీ, పద్మమ్ ఒంటిపై అయిన గాయాల్లోనూ కనిపించాయి. నిందితులు భగవల్ సింగ్, అతని భార్య లైలా షఫీ ఓ సైకోపాత్. కేరళ ఎర్నాకులం జిల్లా పెరుంబవూరులో పుట్టిపెరిగాడు. ఆరో తరగతి దాకా చదువుకున్న అతనికి వివాహం కూడా అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడేళ్ల మనవరాలు కూడా ఉంది. డ్రైవర్ నుంచి మెకానిక్ వరకు చాలా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం కొచ్చిలో ఒక చిన్న హోటల్ని నడుపుతున్నాడు. బాధితులిద్దరూ తరచూ ఈ హోటల్‌కు వెళ్తుండేవాళ్లని, ఈ క్రమంలో వాళ్ల మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చే మహిళల్లో కుటుంబాలకు దూరంగా, బాధల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తన సైకో గుణం బయటపెట్టేవాడని పోలీసులు వివరించారు. అయితే షఫీ కుటుంబం మాత్రం అతనిలో ఏనాడూ తమకు ఎలాంటి సైకో గుణం కనిపించేది కాదని అంటోంది. భగవల్ సింగ్ ఇంటి బయట గుమిగూడిన జనం పైశాచిక ఆనందం కోసమే.. లైంగిక ఆనందం కోసం షఫీ ఎక్కడిదాకా అయినా వెళ్తాడు. చంపేందుకు కూడా వెనకాడడు. ఈ క్రమంలో గతంలో కొందరు సెక్స్ వర్కర్లపై అతను దాడి కూడా చేసినట్లు తేలింది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్లను ట్రాప్ చేసేందుకు ఫేస్బుక్లో డాక్టర్ శ్రీదేవి అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచాడు. ఈ అకౌంట్ ద్వారానే ఆర్థికంగా చితికిపోయి ఉన్న భగవల్ సింగ్ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. భగవల్ సింగ్ ఓ ట్రెడిషినల్ హీలర్.. మసాజ్ థెరపిస్ట్. మూడేళ్ల పాటు ఆ పరిచయం కొనసాగి.. చివరకు తనను తాను మంత్రగాడిగా చెప్పుకుని.. కష్టాలు తొలగిస్తానని వాళ్లను నమ్మబలికాడు. అలా ఈ జంట ద్వారా ఇతరులను వేధించి.. మానసిక ఆనందం పొందాలని యత్నించాడు. కనిపించకుండా పోయిన రోజు సీసీ ఫుటేజ్‌లో పద్మమ్ పోర్న్ సినిమాల ఆఫర్‌తో.. భర్తకు దూరంగా ఉంటూ.. లాటరీ టికెట్లు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్న రోసిలీని మొదట టార్గెట్ చేశాడు షఫీ. పోర్న్ చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. దీంతో డబ్బు కోసం ఆమె ఆ పనికి సిద్ధపడింది. జూన్ 6వ తేదీన ఆమె షఫీ వెంట వెళ్లగా.. తిరిగి రాలేదు. ఒంటరి మహిళ కావడంతో ఆమె అదృశ్యం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మమ్ను అదే తరహాలో టార్గెట్ చేశాడు షఫీ. తనకు పడక సుఖం అందిస్తే.. రూ.15 వేలు ఇస్తానని ఆశ పెట్టాడు. నమ్మి వెంట వెళ్లిన ఆమె కూడా తిరిగి రాలేదు. పద్మమ్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసును చేధించగలిగారు పోలీసులు. ఆపై నరబలి ఉదంతం, షఫీ రాక్షసత్వం ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. నిందితులు లైలా, షఫీ, భగవల్ సింగ్(ఎడమ నుంచి కుడి) క్లోజ్ ఫ్రెండ్‌నే ఇరికించే డ్రామా ఈ కేసులో రెండో నిందితురాలు.. భగవల్ సింగ్ భార్య అయిన లైలా సైతం షఫీతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో హత్యల గురించిన సమాచారాన్ని లీక్ చేస్తారనే భయంతో సింగ్‌ని తొలగించడానికి షఫీ, లైలా ప్లాన్ చేశారని తెలిసింది. మరోవైపు షఫీ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ ముహమ్మద్ బిలాల్‌ను ఈ కేసులో ఇరికించే యత్నం చేశాడు. తన స్కార్పియోను బిలాల్ వాడుకున్నాడని, కిడ్నాప్ వెనుక అతని హస్తం కూడా ఉందని షఫీ చెప్పడంతో.. రెండు రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. చివరికి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకుని పోలీసులు వదిలేశారు. నరబలి జరిగింది ఇదే ఇంట్లో.. వండుకుని తిన్నది నిజమేనా? కేరళ ఎలంతూరు నరబలి కేసును చేధించిన కొచ్చి డీసీపీ శశిధరన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక విచారణ బృందం(సిట్)కే ఈ కేసును అప్పజెప్పింది కేరళ హోం శాఖ. పోర్న్ సినిమాల్లో నటించాలని, పడక సుఖం అందించాలని డబ్బు ఆశజూపి బాధితులిద్దరినీ షఫీనే ట్రాప్ చేసి.. చంపినట్లు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో డబ్బు ఆశతోనే భగవల్ సింగ్, లైలాలను షఫీ లోబర్చుకుని.. ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో షఫీని ప్రధాన నిందితుడిగా, ఆ జంటను సహనిందితులుగా పేర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు వివరాల్ని వెల్లడిస్తున్న కొచ్చి పోలీస్ కమిషనర్ నాగరాజు బాధితులిద్దరినీ ఒకే రీతిలో బలి ఇచ్చినట్లు లైలా-భగవల్లు అంగీకరించారు. అయితే మంచానికి కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కేసి.. ఆపై ప్రైవేట్ భాగాలపై కత్తితో గాయాలు చేసి.. వక్షోజాలను కోసేసి.. చివరికి గొంతు కోసి షఫీనే చంపాడని ఆ దంపతులు చెప్తున్నారు. తాము నర బలికి సహకరించామని, ఆపై ముక్కలుగా నరికి.. పాతేశామని వెల్లడించారు. అయితే.. శరీర భాగాలను వండుకుని తిన్నారనే అనుమానాలు ఉన్నా.. అందుకు సంబంధించిన నిర్ధారణ ఇంకా కాలేదని పోలీసులు వెల్లడించారు. వీళ్ల రక్త చరిత్ర ఇది మాత్రమే అయ్యి ఉండదని, మరో 12 మంది మహిళల మిస్సింగ్ కేసులతో సంబంధం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ ముగ్గురిని విచారించేందుకు మరో రెండు వారాల కస్టడీకి కోర్టును అనుమతి కోరారు. రాజకీయ విమర్శలు ఇక ఈ కేసులో భగవల్ సింగ్‌ను తప్పించే యత్నం జరుగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. అధికార పార్టీ మద్దతుదారుడు కావడంతోనే షఫీని హైలైట్ చేసి.. భగవల్ను తప్పించాలని చూస్తున్నారంటూ పోలీస్ శాఖపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఖండిస్తోంది. ఇదీ చదవండి: విద్యార్థినిపై హత్యాచారం.. ఆపై యాక్టింగ్! -
మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం
గాంధీనగర్: కేరళలో మహిళల నరబలి ఘటన మరువక ముందే గుజరాత్లో మరో దారుణం వెలుగుచూసింది. కన్నతండ్రే క్షుద్రపూజలు చేసి 14ఏళ్ల కూతుర్ని చంపాడు. ఆమెకు గంటలపాటు నరకం చూపించి చావుకు కారణమయ్యాడు. గిర్ సోమ్‌నాథ్ జిల్లా ధవా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భవేశ్ అక్బరీ అనే వ్యక్తి తన కూతురికి దెయ్యం పట్టిందని అనుమానించాడు. దీంతో ఆమెకు భూతవైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. పాత దుస్తులు ధరించమని ఇచ్చి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. భవేశ్తో పాటు అతని సోదురుడు దిలీప్ కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి పెద్ద మంట పెట్టారు. బాలిక జుట్టుకు కట్టె కట్టి ఆ మంటల ముందు రెండు కుర్చీల మధ్యన రెండు గంటలపాటు నిల్చోబెట్టారు. చాలా సేపు ఆమెకు ఆహారం, నీరు ఏమీ ఇవ్వలేదు. దీంతో ఈ నరకం భరించలేక బాలిక కన్నుమూసింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాలిక మృతదేహాన్ని బ్లాంకెట్‌లో తీసుకెళ్లి తగలబెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. బాలిక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్బరీ కుటుంబం 6 నెలల క్రితమే సూరత్ నుంచి ఈ గ్రామానికి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. అక్బరీ గ్రామంలో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని వెల్లడించారు. చదవండి: నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
ఆ మందును భర్తకు తినిపిస్తే కొంగు పట్టుకు తిరుగుతాడని చెప్తే! ఏంటి ఇదంతా?.. ఇకనైనా
Kerala Human Sacrifice Incident : ‘వొదినా... ఇది విన్నావా... దిండు కింద కరక్కాయ పెట్టుకుంటే మంచిరోజులొస్తాయట’.. ‘అక్కా.. ఈ సంగతి తెలుసా? నల్లకోడితో దిష్టి తీస్తే జ్వరం తగ్గుతుందట’.. ‘వ్రతం చేసి నెల రోజులు ఉపవాసం పాటిస్తే.. ఇక సంపదే సంపద’.. ‘బాబాగారి దగ్గరికెళ్లి తాయెత్తు కట్టుకొస్తే.. కష్టాలన్నీ పోతాయి’... ఇరుగమ్మలు పొరుగమ్మలు ఏమేమో చెబుతుంటారు. వాటిని గడప దాటి లోపలికి రానిస్తే ఇంటికే ప్రమాదం. కష్టాలు అందరికీ ఉంటాయి. సరైన దిశ లేనప్పుడు మూఢవిశ్వాసాలు పాటించైనా బయటపడాలనుకుని ప్రమాదాలు తెచ్చుకుంటారు. స్త్రీ చదువు, స్త్రీ చైతన్యం మూఢ విశ్వాసాల నుంచి కుటుంబాన్ని కాపాడగలదు. అప్పుడే కేరళలో జరిగిన ఉదంతాల వంటివి పునరావృత్తం కాకుండా ఉంటాయి. మేలుకో మహిళా.. మేలుకో. ఆ మధ్య యూ ట్యూబ్‌లో ఒక ఇరుగమ్మ పర్సులో లవంగాలు పెట్టుకుంటే డబ్బు నిలుస్తుంది అని చెప్పింది. యూ ట్యూబ్‌లో కాబట్టి అందరూ వేళాకోళం చేశారు. జోకులేశారు. కాని అదేమాట ఆ ఇరుగమ్మ కేవలం తన పక్కింటామెతో చెప్పి ఉంటే? ఆ పక్కింటామె అమాయకంగా దానిని నమ్మి ఉంటే? భర్త పర్సులో లవంగాలు పెట్టి డబ్బు కోసం ఎదురు చూసి ఉంటే? ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు దేవుణ్ణి పూజించడం, మొక్కులు మొక్కుకోవడం, కష్టాల నుంచి బయట పడేయమని గుడిలో అర్చనలు చేయడం ఇవి ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కాని సంప్రదాయానికి ఆవల అంగీకరం లేని పుకార్లుగా మూఢవిశ్వాసాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఫలానా లాకెట్ ధరిస్తే మేలు, ఉంగరం ధరిస్తే వశీకరణం, ఫలానా వ్యక్తిని సంప్రదిస్తే చేతబడి, ఫలానా మందును భర్తకు అన్నంలో పెట్టి తినిపిస్తే అతడిక కొంగు పట్టుకు తిరుగుతాడని... ఇలాంటివి లక్ష. అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు వస్తే మనిషి మానసిక స్థయిర్యం దెబ్బ తింటుంది. ఎలాగైనా వాటి నుంచి గట్టెక్కాలని చూస్తాడు. ఆ సమయంలోకి ఇరుగువారు, పొరుగువారు తోచిన మూఢ సలహాలు ఇస్తారు. వాటిని పాటించడం వల్ల ఇంకా ప్రమాదంలోకి వెళ్లడం తప్ప మరో ఉపయోగం లేదు. అనారోగ్యం వస్తే తగిన వైద్యం చేయించుకుని ఆత్మస్థయిర్యంతో ఆ జబ్బు మీద పోరాడాలి. మంత్రాలకు కాసులు రాలవు దేవుని మీద విశ్వాసం ఉంటే ప్రార్థన మేలు చేస్తుంది. అంతే తప్ప మంత్రగాళ్లు మేలు చేయరు. ఆర్థిక కష్టాలు వస్తే విజ్ఞుల సలహా తీసుకుని అయినవారి మద్దతుతో వాటి నుంచి బయటపడాలి తప్ప మంత్రాలకు కాసులు రాలవు. అయినా సరే మూఢవిశ్వాసాలు గట్టిగా లాగుతాయి. వాటిని స్త్రీలు నమ్మడం మొదలెడితే చాలా ప్రమాదం. మగవాడికి కనీసం బజారులో అలాంటి పనులు ఖండించేవారు తారసపడతారు. ఇరుగమ్మలు, పొరుగమ్మలు కలిసి తమ లోకంలో తాము ఉంటూ ఇలాంటివి నమ్ముతూ పోతే ఇంటి మీదకే ప్రమాదం వస్తుంది. ఒకప్పుడు సమాజంలో నాస్తికవాదం, హేతువాదం, అభ్యుదయ వాదం మూఢవిశ్వాసాలకు జవాబు చెప్పేవి. బాబాల, స్వామిజీల ట్రిక్కులను తిప్పి కొట్టేవి. అతీంద్రియ శక్తుల మీద కంటే మనిషికి తన మీద తనకు విశ్వాసం కల్పించేవి. కాని ఇవాళ ఎటు చూసిన చిట్కాలు, కిటుకులు చెప్పేవారు తయారయ్యారు. మంగళవారం ఫలానా రంగు బట్ట కట్టమని, బుధవారం ఫలానా పని చేయొద్దని, శుక్రవారం ఫలానా ప్రయాణం చేయొద్దని... ఇలా ఉంటే సమాజం ఎలా ముందుకు వెళుతుంది? వెంటనే పోలీసులకు పట్టించాలి ఎవరికీ హాని చేయని మూఢ విశ్వాసాలనైనా క్షమించవచ్చు. కాని ఎవరికైనా హాని చేస్తే తప్ప తాము బాగు పడము అనే మూఢవిశ్వాసం వ్యాపింప చేసేవారిని వెంటనే పోలీసులకు పట్టించాలి. అలాంటి ఆలోచనలో ఉన్నవారు ఆ మత్తు నుంచి తక్షణమే బయటపడి స్పృహలోకి రావాలి. హైదరాబాద్‌లో ఆ మధ్య ఒక రియల్టర్ ముక్కుముఖం తెలియని స్వామిని పూజకు పిలిస్తే అతడు ప్రసాదంలో మత్తు మందు కలిపి ప్రాణం మీదకు తెచ్చాడు. ఇవాళ కేరళలో నరబలి ఇస్తే తప్ప ఆర్థిక కష్టాలు పోవు అని ఎవరో నూరిపోస్తే ఒక దంపతులు అంతకూ తెగించారు. అదీ అక్షరాస్యతలో మొదటిగా ఉండే కేరళలో జరిగిందంటే ఇరుగు పొరుగువారు నూరిపోసే మూఢ విశ్వాసాల శక్తిని అంచనా వేయొచ్చు. చీకటిలో దారి ఎప్పటికీ తెలియదు. అంధ విశ్వాసం అనేది కారు నలుపు చీకటి. వెలుతురు ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. లేనిపోని ఆశలు రేకెత్తిస్తుంది. హేతువును నాశనం చేస్తుంది. ఆలోచనకు ముసుగేస్తుంది. ఏదైనా చేసి సులభంగా గట్టెక్కడానికి తెగించమంటుంది. జ్వరం వచ్చిన పిల్లవాడికి దిష్టి తీయడం సంప్రదాయమే కావచ్చు. డాక్టరుకు చూపించి మందులు వాడుతూ సంప్రదాయం ప్రకారం దిష్టి తీసి తృప్తి పడితే దానికో అర్థం ఉంటుంది. ఆ మాత్రపు ఇంగితంతో లేకపోతే ఎంతో ప్రమాదం. ఎంతెంతో ప్రమాదం. చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
కేరళలో ఇద్దరు మహిళల నరబలి
-
నరబలి ఉదంతం: చంపేసి ముక్కలు చేసి తిన్నారా?
తిరువనంతపురం: కేరళ నరబలి ఉదంతం.. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత బాధిత మహిళలు రెస్లీ, పద్మను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి.. పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే.. కాల్చేసిన, పాతేసిన ఆనవాలు ఎక్కడా దొరక్కపోవడంతో.. క్లూస్ టీమ్‌కు సైతం ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో తినేసి ఉంటారని భావిస్తున్నారు. రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలుగా చేసినట్లుగా నిందితులు(దంపతులు భగవంత్ సింగ్, లైలా.. స్నేహితుడు షఫీ).. అంగీకరించారు. బహుశా తర్వాత ఆ భాగాలను తినేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఈ మేరకు వాంగ్మూలం ఇవ్వగా.. భగవంత్ సింగ్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో ఈ విషయంపై ధృవీకరణ కోసం.. ముగ్గురు నిందితులను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. తాంత్రికుడు చెప్పాడని.. జూన్ 8, సెప్టెంబర్ 26వ తేదీల్లో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ ఇద్దరినీ నర బలి ఇచ్చినట్లు విచారణలో తేలింది. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక నిందితుల కస్టడీ కొరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భగవంత్ సింగ్ మసాజ్ థెరపిస్ట్. దీంతో డబ్బు ఆశతో పాటు నిందితుల లైంగిక ఆనందం, తాంత్రిక పూజల కోణంలోనూ ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. రోజెలిన్, పద్మను కట్టేసి.. ఆపై క్రూరంగా చంపి.. ఆపై ముక్కలు చేసినట్లు తెలుస్తోంది. రోజెలిన్ జూన్ నుంచి కనిపించకుండా పోగా.. కడవంతర(ఎర్నాకుళం)కు చెందిన పద్మ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయ్యింది. పద్మ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఈ నరబలి వ్యవహారం చిక్కింది. షఫీ వాళ్లను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. సీఎం పినరయి విజయన్ స్పందన ఇక భగవంత్ సింగ్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, అధికార పార్టీ మూలాలు ఉండడంతో.. బీజేపీ విమర్శలకు దిగింది. దీంతో ఈ ఉదంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కేసును త్వరగా చేధించిన పోలీసులను అభినందిస్తూ.. సిట్ బృందం ద్వారా విచారణ కూడా అంతే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరబలి రాకెట్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారాయన. జబ్బుపడిన మనస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కార్యకలాపాల్లో మునిగిపోతారని, ఇలాంటి ఆచారాలు నాగరిక సమాజానికి సవాలుగా పరిణమిస్తాయని విజయన్ పేర్కొన్నారు. సంబంధిత వార్త: మహిళల బలి.. తల నరికి, నాలుక కోసి.. -
కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. అత్యంత క్రూరంగా..
కొచ్చి: కేరళలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే మూఢ నమ్మకంతో దంపతులు ఏకంగా ఇద్దరు మహిళలను బలిచ్చారు. ఈ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. వారి సెల్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలిద్దరినీ పత్తనంతిట్ట జిల్లా తిరువల్లలో ఉండే మసాజ్ థెరపిస్ట్ భగావల్ సింగ్, అతడి భార్య లైలా బలి ఇచ్చినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపన్నులు కావాలంటే నరబలి తప్పదని వారి మిత్రుడైన పెరుంబవరూర్‌కు చెందిన రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ సలహా ఇచ్చాడు. ఇతడే బాధిత మహిళలకు డబ్బు ఆశ చూపి భగావల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లోనే మంత్రాలు చేసి, ఒకరిని జూన్‌లో మరొకరిని సెప్టెంబర్‌లో గొంతుకోసి చంపారు. అనంతరం షఫీ సాయంతో మృతదేహాలను ముక్కలుగా నరికి సొంతింటి ఆవరణలో, ఇలాంతూర్‌లో పాతిపెట్టారు. సింగ్ దంపతులతోపాటు షఫీని మంగళవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కోచి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం పీటీఐకి చెప్పారు. కాలడికి చెందిన మహిళ ఆచూకీ తెలుసుకునే క్రమంలోనే రెండో ఘటన వెలుగు చూసిందన్నారు. వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ పి.ప్రకాశ్ అన్నారు. స్థానికంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే భగావల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డానే విషయం నమ్మలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు. అధికార సీపీఎంకు చెందిన భగావల్ సింగ్ మహిళలను బలి ఇవ్వడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్ Kerala | Three people arrested for killing two people in 'human sacrifice' ritual. The incident happened in the Pathanamthitta district. The deceased women used to sell lottery tickets. The bodies were buried at a house in the district: Kochi City Police Commissioner, CH Nagaraju pic.twitter.com/mt3kqaOs1j — ANI (@ANI) October 11, 2022 -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
భార్యకు అబార్షన్... క్షుద్రపూజల కోసం బాలిక కళ్లు పీకి..
పట్నా: సాంకేతికత ఎంత పెరుగుతున్నా తాంత్రిక, క్షుద్ర పూజల పేరిట జరిగే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బిహార్‌లో ఓ వ్యక్తి పదేళ్ల చిన్నారిని క్షుద్ర పూజాల కోసం దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగేర్ జిల్లాలోని ఓ గ్రామంలో దిలీప్ కుమర్ చౌదరి తన భార్యకు తరచూ అబార్షన్ అవుతుండటంతో ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అబార్షన్ కాకుండా శాశ్వతంగా నివారించాలకున్నాడు. దాని కోసం స్థానిక తాంత్రికుడు పర్వేజ్ ఆలమ్‌ను ఆశ్రయించాడు. అయితే పదేళ్ల ఓ బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజ చేస్తే అబార్షన్ కాకుండా నివారించవచ్చని పర్వేజ్ చెప్పాడు. ఈ క్రమంలో ఆగస్టు 4న ఓ బాలిక తన తండ్రికి భోజనం ఇచ్చి తిరిగి వస్తుండగా.. దిలిప్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి కళ్లను పీకి, రక్తం సేకరించాడు. అయితే ఆ బాలిక తిరిగి ఇంటికి ఎంతకు రాకపోవటంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మరుసటి రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పర్వేజ్ ఆలమ్, దిలీప్ కుమర్ చౌదరి, తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే నరబలి కారణంగా తమ కుమర్తెను హత్య చేయలేదని, హత్యాచారం చేసి చంపారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
బాలుడి హత్య.. నరబలిగా అనుమానం
ఆ బాలుడికి 15 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. పదో తరగతి విద్యార్థి దశలోనే దారుణ హత్యకు గురై ప్రాణాలు విడిచాడు. భూ వివాదం నుంచి బయటపడేందుకు ఓ మాంత్రికుని చేతిలో నరబలికి గురైనాడా ? లేక క్రికెట్ పోటీల గొడవలు అతడిని పొట్టనపెట్టుకున్నాయా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారణం ఏదైనా ఓ ఘోరం జరిగిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై : విళ్లుపురం జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని అయన్కుంజరం గ్రామానికి చెందిన కేశవన్ (45) సౌదీ అరేబియాలో కూలీ పనులు చేస్తుంటాడు. కూలీ కార్మికురాలైన ఇతని భార్య పరాశక్తి (36) తమ సంతానమైన కుమారుడు శరత్‌కుమార్ (20), కుమార్తె సౌందర్య (18), మరో కుమారుడు శివకుమార్ (15)లతో గ్రామంలో నివసిస్తోంది. చిన్న కుమారుడు శివకుమార్ అక్కడికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన అవ్వ బాలాయీని వెతుక్కుంటూ ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లిన శివకుమార్ రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బాలుడి తల్లి, అన్న శరత్‌కుమార్, బంధువులు అనేక చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. బాలుడి ఇంటి ముందు గుమిగూడిన గ్రామస్తులు ఇదిలా ఉండగా కుంజరం కారడవుల్లో ఒక బాలుడి శవం పడి ఉందని ఆదివారం రాత్రి సమాచారం రావడంతో అడవిలోకి గ్రామస్తులు బయలుదేరారు. సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఒక మారుమూలగుట్టలో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైన స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న శివకుమార్ శవాన్ని చూసి తల్లి, అన్న స్పృహతప్పి పడిపోయారు. వారితోపాటు వచ్చిన గ్రామస్తులు తల్లీ, కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉళుందూరుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విళుపురం ముండియంపాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవుల్లోకి వెళ్లి గాలించగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుప్పటితో ముసుగువేసుకుని ధ్యానం చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు పోలీసులను చూడగానే పరుగులు పెట్టాడు. పోలీసులు అతడి వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగావిభూది, కుంకుమ, తాయత్తులు తదితర పూజాసామగ్రితోపాటు బ్లేడు సైతం దొరికింది. తాను ఒక భూమి వివాదాన్ని ఎదుర్కొంటున్నానని, అందుకే ఆడవుల్లో పూజలు చేస్తున్నానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ భూ వివాదం నుంచి బయటపడేందుకే బాలుడిని నరబలి ఇచ్చి ఉండవచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు. పోలీసులు ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకుని నరబలి కోణంలో విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పాఠశాల స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగగా ఇతర విద్యార్థులకు హతుడు శివకుమార్‌కు మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ పోటీలు, గొడవలు శివకుమార్ హత్యకు దారితీసాయా అనే అనుమానంతో ఏడుగురు విద్యార్థులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు. -
‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’
బెగుసరాయి : కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి సైతం సై అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బీహార్‌కు చెందిన ఓ తాంత్రికుడు. తన కొడుకు బలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించాడు. వివరాలు.. బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్, ఇంజినీర్ అయిన తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖ, సురేంద్ర ప్రసాద్ ఓ విలేకరితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో సురేంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘ నరబలి నేరం కాదు. ఇంజనీర్ అయిన నా కొడుకును మా ఆరాధ్య దేవత అయిన కామాఖ్యదేవికి బలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా మొదటి నరబలి. నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు రావణాసూరుడు లాంటి వాడు. నరబలికి అనుమతి ఇవ్వండి’ అంటూ అధికారులకు విన్నవించాడు. అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా సురేంద్రప్రసాద్ సింగ్ ఓ పిచ్చోడని, ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. -
క్షుద్రశక్తుల కోసం నాలుగేళ్ల చిన్నారి నరబలి
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనిషిలోని మూఢనమ్మకాలకు, శక్తిమంతురాలైన మంత్రగత్తెను కావాలన్న స్వార్థానికి నాలుగేళ్ల చిన్నారి నర బలైంది. నిందితురాలి అరెస్ట్‌తో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుదుకోట్టై జిల్లా కరుంపట్టికి చెందిన పళనిస్వామి (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని కుమార్తె షాలిని (4) గతనెల 25న ఇంటికి సమీపంలో ఆటలాడుకుంటుండగా కనిపించకుండా పోయిం ది. ఇంటికి ఒక కిలోమీటర్ల దూరంలో బ్లేడుతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. శవం దొరికిన ప్రదేశంలో సెమ్ముని ఆలయం ఉండడంతో బాలికను బలి ఇచ్చి ఉండొచ్చనే కోణంలో ఇలుప్పూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే ప్రాంతానికి చెందిన సోది చెప్పే శింగారం భార్య చిన్నపిల్లై (47) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చేతిలో సైతం బ్లేడుతో కోసుకున్నట్లుగా గాయం ఉండడంతో విచారణను తీవ్రతరం చేసి చిన్నపిల్లైని సోమవారం అరెస్ట్ చేశారు. గగుర్పొడిచే వివరాలతో పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నిందితులరాలి వాగ్మూలం.. ‘‘చిన్నారి షాలిని ఇంటికి సమీపంలోనే కొన్నేళ్లుగా నేను నివసిస్తున్నాను. దేవుడి పూనినట్లుగా ఆడడం, సోది చెప్పడం వంటి చేస్తూ జీవనం సాగిస్తున్నాను. సమీపంలోని అడవిలో ఉన్న సెమ్ముని ఆలయంలో కోడి, పొట్టేలు, గొర్రెలను బలిఇచ్చి సోది చెబుతుంటాను. నరబలి ఇవ్వడం ద్వారా నా మంత్రశక్తి పెంచుకోవాలని భావించాను. ఇందుకు చిన్నారి షాలినీని ఎంచుకున్నాను. షాలినీని ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తుండగా గతనెల 25వ తేదీన ఒంటరిగా ఆడుకుంటోంది, జనసంచారం పెద్దగా లేకపోవడంతో షాలినీని చంకనవేసుకున్నాను. నేను బాగా పరిచయం ఉండడంతో మారం చేయకుండా నాతో వచ్చేసింది. నేరుగా సెమ్ముని ఆలయంకు వెళ్లి పూజలు చేసి నా వద్దనున్న బ్లేడుతో షాలిని గొంతుకోసి బలిచ్చాను. ఆ తరువాత శవాన్ని ఆలయానికి దూరంగా విసిరివేసి ఇంటికి వెళ్లిపోయాను’’ అని వివరించింది. మంత్రగత్తె చిన్నపిల్లైౖని తిరుమయం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తిరుచ్చిరాపల్లి జైల్లో పెట్టారు. -
అర్ధరాత్రి పూజల కలకలం , నరబలి
నెల్లూరు, కలిగిరి: మండలంలోని తూర్పుదూబగుంట ఎస్సీకాలనీలో ఒక కుటుంబం అర్ధరాత్రి పూజలు, నరబలికి పాల్పడినట్లు కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఒక అర్ధరాత్రి పూజలు చేసే వ్యక్తిని తీసుకు వచ్చారని, అర్ధరాత్రులు పూజలు చేశారని గ్రామస్తులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి పూజలు జరిపి మళ్లీ పూడ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాల్యాద్రి కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ పెద్ద మాల్యాద్రికి అనారోగ్యంగా ఉండటంతో గ్రామానికి వచ్చిన కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల గుంత తవ్వి నాలుగు రోజులు పూజలు చేసి గుమ్మడికాయను పూడ్చి పెట్టామంటున్నారు. అయితే కాలనీవాసుల ఫిర్యాదుతో ఏఎస్సై అజ్మతుల్లా సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్విస్తున్నారు. తవ్వకాల్లో బయట పడే వస్తువులను బట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. -
గుప్తనిధుల కోసం నరబలికి యత్నం
పెద్దపల్లి : గుప్త నిధుల కోసం కొందరు కిరాతకులు నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి సమీపంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. మొట్టుపల్లి సమీపంలోని సుంకరికోట వద్ద కొందరు గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేసి, గజ్జర్ల రమేశ్ అనే యువకుడిని బలిచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ముఠా కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు తన కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. స్థానికులంతా కలిసి గుప్త నిధుల ముఠా సభ్యులను పట్టుకుని, దేహశుద్ధిచేసి, పోలీసులకు అప్పగించారు. బాధితుడు రమేశ్‌ది కిష్టంపేట అని, ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
కుక్క.. ఎలుక..ఓ నరహరి!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. కానీ ఎన్నో ట్విస్టుల అనంతరం నరహరి నిరపరాధిగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి అతడే ముందు వెళ్లి రావడం వల్ల....పోలీసు జాగిలం ఇతని ఇంటి వైపే వెళ్లడంతో.. నరహరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఎట్టకేలకు అన్నికోణాల్లో విచారించిన పోలీసులు అసలు దోషి రాజశేఖర్ అని తేల్చడంతో నరహరి కుటుంబం ఊపిరిపీల్చుకుంది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి, పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఉప్పల్ చిలుకనగర్ నరబలి కేసులో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎంతో మంది అనుమానితుల్ని విచారించిన ఈ కేసులో ఆద్యంతం నరహరి మీదే పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. అతని ఇంటికి వెళ్లని జాగిలానికి వాసన రావడమే. ఈ నరబలి కేసులో గత నెల 31న చోటు చేసుకుని, ఈ నెల 1న వెలుగులోకి వచ్చి, 15న కొలిక్కి చేరిన విషయం విదితమే. అందరికంటే ముందు రావడంతో.. ఈ కేసులో ఆది నుంచి క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ కంటే ఎక్కువగా అతడి ఇంటి ఎదురుగా ఉండే మెకానిక్ నరహరి ప్రధాన అనుమానితుడిగా మారాడు. బాలిక తల విషయం వెలుగులోకి వచ్చిన రోజు ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు నేరుగా నరహరి ఇంటికి వెళ్లాయి. ఈ నెల ఒకటో తేదీ ఉదయం రాజశేఖర్ ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన అతడి అత్త బాల లక్ష్మి అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసింది. అప్పటికే రాజశేఖర్ యథావిధిగా తన క్యాబ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి కూడా డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ తొలుత వచ్చి వెళ్ళిన నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. దీంతో అతడు మొదటిసారి పోలీసులకు అనుమానితుడిగా మారారు. కడిగేయడంతో ఇంట్లోకి వెళ్ళలేదు... వాస్తవానికి పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్ళాల్సి ఉన్నా... ఇంటిని కడిగేయడంతో అలా జరగలేదని పోలీసులు చెబుతున్నారు. గత నెల 31న బోయగూడ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్ళి హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో (రెండు గదులకు మధ్య ఉన్న ఆర్చ్ ప్రాంతంలో) పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి నగ్నంగా పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టిన అతగాడు భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసన్ని బట్టి ముందుకు వెళ్ళే పోలీసు జాగిలాలు నీళ్ళతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజ«శేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లలో పూర్తిగా కడిగేసిన నేపథ్యంలో అతడి ఇంటి లోపలకు వెళ్ళకుండా సమీపంలో తిరిగాయి. ఈ డాబా పైకి వచ్చి, నేరుగా తన ఇంట్లోకి వెళ్ళడంతోనే నరహరి ఇంటి లోపల వరకు వెళ్ళి కలియ తిరిగాయి. వాసన రావడంతో మరోసారి... ఈ నెల ఒకటి నుంచే నరబలి కేసు దర్యాప్తు ప్రారంభమైంది. రాజశేఖర్, అతడి భార్యలతో పాటు నరహరి, ఇంకా అనేక మందిని పోలీసులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూపోయింది. ఓ పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం వివిధ దఫాలుగా రాజశేఖర్, నరహరిలతో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో గాలించారు. ఈ నెల 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా వచ్చిన దుర్వానస అతడిపై పోలీసులకు మరోసారి అనుమానం బలపడేలా చేసింది. ఆ రోజు అతడి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఓ గది నుంచి తీవ్రమైన దుర్వానస వెలువడటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అందులోనే మొండాన్ని దాచి ఉండచ్చని, తొమ్మిది రోజులు గడవటంతో దుర్వాసన వస్తోందని భావించారు. మొండాన్ని వెలికి తీస్తే కేసు కొలిక్కి వచ్చినట్లేననే ఉద్దేశంతో ఆ గదిలో క్షుణ్ణంగా అణువణువూ తనిఖీ చేశారు. చివరకు అక్కడ ఓ చనిపోయిన ఎలుక దొరకడంతో నరహరిపై అనుమానాలు తొలగిపోయాయి. చీపురుకు కట్టిన ఎండు గరికతో... రాజశేఖర్‌పై అనుమానాలు బలపడటంతో ఈ నెల 9న అతడి ఇంటిని పోలీసులు మరోసారి అణువణువూ గాలించారు. ఇంటి లోపల భాగా న్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తనమూనాలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్‌షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడం తో పూజలు చేసిన ఆనవాళ్ళుగా భావించారు. వీటన్నింటికీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. దీంతో రక్తనమూనాలతో పాటు ఈ నమానాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. ఈ కేసులో హత్యకు వాడిన కత్తి, చిన్నారి తల్లిదం డ్రులు, మొండాన్ని గుర్తించడం కీలకం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరా చిన్నారి?
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి ఠాణా పరిధిలోని బొటానికల్ గార్డెన్ వద్ద మృతదేహంగా లభించిన గర్భిణి హత్య... ఉప్పల్ చిలుకానగర్‌లో వెలుగు చూసిన మూడు నెలల చిన్నారి నరబలి... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతాలు పోలీసులను పరుగులు పెట్టించాయి. ఈ రెండు కేసులను సైబరాబాద్, రాచకొండ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చినా.. ఇంకా కొన్ని ‘మిస్టరీలు’ అలాగే మిగిలిపోయాయి. మరోపక్క ఈ కేసుల్లో ఆసక్తికర అంశాలు, కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బొటానికల్ గార్డెన్’ కేసులో హతురాలు పింకి ఫొటో పోలీసులు సేకరించలేకపోయారు. బిహార్‌కు చెందిన ఆ కుటుంబం వద్ద పేదరికం కారణంగా ఒక్క ఫొటో కూడా లేకుండా పోయింది. ఈ ఉదంతంతో ఫొటో మిస్ కాగా... నరబలి కేసులో ప్రతాప్‌సింగారం వద్ద మూసీలో పడేసిన కారణంగా చిన్నారి మొండెం గల్లంతైంది. అదృశ్యంపై అందని ఫిర్యాదు ? తన భార్య ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు తీరడానికి నరబలి ఇవ్వడానికి సిద్ధమైన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ గతనెల 31 అర్ధరాత్రి దాటిన తర్వాత బోయగూడ నుంచి శిశువును అపహరించాడు. రోడ్డు పక్కనే పడుకున్న దంపతుల నుంచి చిన్నారిని ఎత్తుకు వచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఎవరైనా తమ బిడ్డను కోల్పోతే పోలీసులను ఆశ్రయిస్తారు. కనీసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికే ప్రయత్నమైనా చేస్తారు. అయితే సదరు చిన్నారి అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాచకొండ పోలీసులు బోయగూడ వద్ద ఆరా తీసినా ఎవ్వరూ బిడ్డను పోగొట్టుకున్నట్లు వెలుగులోకి రాలేదని తేలడంతోఈ చిన్నారిని బెగ్గింగ్ మాఫియా ఎక్కడ నుంచో ఎత్తుకు వచ్చిందనే సందేహాలు కలుగుతున్నాయి. చిన్నారి అదృశ్యమైందని ఫిర్యాదు చేస్తే అసలు కథ బయటకు వస్తుందనే భయంతో ఆ దంపతులు మిన్నకుండినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. సిటీ అధికారుల సాయం కోరారా? రాజశేఖర్ శిశువును కిడ్నాప్ చేసినట్లు పేర్కొంటున్న బోయగూడ ప్రాంతం హైదరాబాద్‌లోని ఉత్తర మండల పరిధిలోకి వస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి చిన్నారి సంబంధీకులను గుర్తించడానికి, మరికొన్ని ఆధారాలు సేకరించడానికి రాచకొండ పోలీసులు నగర అధికారుల సాయం కోరాల్సిందే. ఉత్తర మండలంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. కిడ్నాప్ చేసిన ప్రాంతంలో అవి లేకున్నా... అక్కడ నుంచి ఉప్పల్ రోడ్ వరకు ఉన్న వాటిని అధ్యయనం చేసే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా రాజశేఖర్ కదలికలకు సంబంధించి మరింత పక్కా ఆధారాలు సేకరించడంతో పాటు శిశువును పోగొట్టుకున్న లేదా బెగ్గింగ్ మాఫియాపై వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఉత్తర మండలంలోని పెట్రోలింగ్ పోలీసులు ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఫుట్‌పాత్‌లపై ఉన్న వారి వివరాలు ఆరా తీస్తుంటారు. రాచకొండ పోలీసులు వీరిని సంప్రదిస్తే మరికొన్ని ఆధారాలు లభించే ఆస్కారం ఉన్నా పట్టించుకోలేదని సమాచారం. ఒక్క క్లూస్ టీమ్ విషయంలో మాత్రమే సిటీ నుంచి సహకారం తీసుకున్నారు. ఆధారాలు దొరికినా తప్పించుకునే యత్నం... శిశువును బలివ్వడం, క్షుద్రపూజల వెనుక రాజశేఖర్‌తో పాటు అతడి భార్య శ్రీలత సైతం కీలక పాత్ర పోషించింది. రాజశేఖర్ శిశువు తలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి నగ్న పూజలు చేశారు. రెండు గదులున్న ఆ ఇంటి మధ్యలో తలను ఉంచాలనే ఉద్దేశంతో ఆర్చ్ దగ్గర పెట్టి తంతు పూర్తి చేశారు. ఆపై ఆ ప్రాంతాన్ని పూర్తిగా కడిగేశారు. దాదాపు నాలుగు రోజుల క్రితం ఘటనాస్థలిని పరిశీలించిన హైదరాబాద్ క్లూస్ టీమ్ అధికారులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న లుమినాల్ అనే రసాయనం, జర్మనీ నుంచి ఖరీదు చేసిన సూపర్ లైట్–ఎంఓ5 వినియోగించి ఆర్చి వద్ద తనిఖీలు చేశారు. ఫలితంగా అక్కడ రక్తం మరకలు ఉన్నట్లు తేలినా.. అవి మనిషివా? వేరే జంతువుకు చెందినవా? అనే సందేహం ఉంది. ఓపక్క దీనిని నిర్థారించడానికి నమూనాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. శ్రీలతను ఈ విషయంపై ప్రశ్నించగా గత నెల 24న తాము సమ్మక్క పూజ నేపథ్యంలో కోడిని బలిచ్చామంటూ చెప్పి తప్పించుకోజూసింది. చివరకు ఫోరెన్సిక్, డీఎన్ఏ రిపోర్టులు అసలు నిజాలు బయటపెట్టి భార్యభర్తల్ని కటకటాల్లోకి పంపాయి. ముందే చెప్పిన ‘సాక్షి’... ఉప్పల్‌లోని చిలుకనగర్ చిన్నారి కేసులో రెండు అంశాలు ‘సాక్షి’ ముందే చెప్పింది. ఈ ఉదంతం ఈ నెల 1న వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఘటన పూర్వాపరాలను పరిశీలించి నరబలిగా అనుమానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ‘నగరంలో నరబలి?’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది జరిగిన పది రోజుల వరకు ఆ చిన్నారి మగ, ఆడ శిశువా అనే స్పష్టత లేదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు ఈ నెల 9న గుర్తించారు. దీనికి సంబంధించి ‘ఆ తల ఆడ శిశువుదే!’ పేరుతో 10న కథనం ప్రచురించింది. అది డబుల్ మర్డరే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోటానికల్ గార్డెన్ వద్ద ముక్కలుగా లభించిన గర్భిణి కేసులో హత్యకు గురైంది ఒక్కరు కాదు ఇద్దరుగా పరిగణించే ఆస్కారం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) ప్రకారం గర్భిణి హత్యకు గురైన సందర్భాల్లో గర్భస్థ శిశువు వయస్సు ఐదు నెలలకు మించి ఉంటే ఇద్దరు చనిపోయినట్లు పరిగణిస్తారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మృతుల్లో ఓ గర్భిణి సైతం ఉండటంతో చనిపోయిన వారి సంఖ్య 18గా నిర్థారిస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దీని ప్రకారం చూస్తే పింకీ ఉదంతాన్నీ డబుల్ మర్డర్‌గా (జంట హత్యలు) తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు డబుల్ మర్డర్‌గా అధికారికంగా పరిగణిస్తే నిందితులకు త్వరగా బెయిల్ లభించదని, నేరం నిరూపితమైతే శిక్ష కూడా ఎక్కువ పడే ఆస్కారం ఉందని చెబుతున్న నిపుణులు సైబరాబాద్ పోలీసులు ఈ కోణంలో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
తమిళనాడులో నరబలి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరంబలూరులో ఓ ఇంట్లో యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా పూర్తిగా కుళ్లిన యువతి మృతదేహం పడి ఉంది. మృతదేహం చుట్టూ, ఇతర గదుల్లో పూజాసామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్ అనే అతడిని తొమ్మిదిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కనుగొన్న ఇల్లు ఎవరిదో తెలియరాలేదు. కార్తికేయన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కుమారుడి నరబలికి యత్నం
తండ్రి అరెస్ట్ టీనగర్: కొడుకును నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించిన తండ్రిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆరూర్ సమీపంలోని ఆలయంలో చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా ఆరూర్ సమీపానగల టి.పుదూరు గాంధీనగర్‌కు చెందిన సుబ్రమణి. ఇతని కుమారుడు పరశురామన్ (35) మినీ టెంపో డ్రైవర్. ఇతని కుమారుడు సంజీవ్ (5). వీరు ముగ్గురూ శనివారం రాత్రి గోపినాథంపట్టి క్రాస్‌రోడ్డులోగల మునియప్పన్ ఆలయానికి మినీ టెంపోలో వచ్చారు. ఆ సమయంలో పరశురామన్ ఆలయం సమీపంలో టెంపో నిలిపి మద్యం తాగాడు. సుబ్రమణి టెంపోలో ఉన్నాడు. ఈ దశలో పరశురామన్‌కు మత్తెక్కడంతో ఐదేళ్ల కుమారుడు సంజీవ్ తలను పట్టుకుని చేతిలో ఉన్న కత్తితో నరబలి ఇస్తున్నట్లుగా నిలుచున్నాడు. దీంతో సంజీవ్ బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. టెంపోలో ఉన్న సుబ్రమణి దిగి వచ్చాడు. ప్రజలు పరశురామన్పై దాడి చేశారు. కొందరు దీనిగురించి ఎ.పల్లిపట్టు పోలీసులకు సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సుబ్రమణి, పరశురామన్, బాలుణ్ని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు సుబ్రమణి వద్ద విచారణ జరిపారు. 2008లో పరశురామన్‌కు సుజాత అనే యువతితో వివాహం అయింది. ఇలాఉండగా కొన్ని నెలలుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాలుగు నెలల క్రితం ఏర్పడిన గొడవల్లో సుజాత పరశురామన్ నుంచి విడిపోయి బెంగళూరులో గల పినతల్లి ఇంటికి సంజీవ్‌తోపాటు వెళ్లింది. దీంతో పరశురామన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పరశురామన్ భార్య, కుమారుడిని చూసేందుకు బెంగళూరు వెళ్లాడు. అక్కడ భార్యను తన వెంట రమ్మని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో పరశురామన్ ఆగ్రహించి కుమారుడిని తన వెంట తీసుకెళుతున్నానని తెలిపి సంజీవ్‌ను వెంట తీసుకువచ్చాడు. ఇలా ఉండగా భార్య ఎడబాటుతో అధికంగా మద్యం తాగి పరుశురామన్ స్వామి సన్నిధిలో నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో చిన్నారి సంజీవ్‌ను అతని తాత సుబ్రమణితో పంపివేశారు. పోలీసులు పరశురామన్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
'నలుగురి నరబలి'
మదురై: తమిళనాడులో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ గ్రానైట్ కుంభకోణం కేసులోని వ్యక్తులు అంతకుముందు నలుగురు వ్యక్తులను బలిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 1999లో జరిగిన ఈ ఘటన ఆ కుంభకోణంలో ఉన్న వ్యక్తి కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పరిష్కారం అయింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మధురైలోని ఓ స్మశాన వాటికలో పోలీసులు తవ్వకాలు జరిపి చూడగా అందులో నాలుగు పుర్రె భాగాలు బయల్పడ్డాయి. అంతకుముందు ఆ డ్రైవర్ మాత్రం ఇద్దరినీ పాతిపెట్టేందుకు తాను సహాయపడ్డానని చెప్పడం గమనార్హం. అందులో పూడ్చినవారు ఇద్దరు మానసిక వికలాంగులని, పాతిపెట్టేముందు వారి గొంతుకోసినట్లు పోలీసులకు వెల్లడించారు. వీరిద్దరిని కూడా పుదుక్కోటి నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా గ్రానైట్ క్వారీ నిర్వాహకుడు మాత్రం తనకు ఏ సంబంధం లేదని, కావాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు.