తమిళనాడులో నరబలి? | Human sacrifice in tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో నరబలి?

Published Sat, Mar 11 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

తమిళనాడులో నరబలి?

తమిళనాడులో నరబలి?

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరంబలూరులో ఓ ఇంట్లో యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా పూర్తిగా కుళ్లిన యువతి మృతదేహం పడి ఉంది. మృతదేహం చుట్టూ, ఇతర గదుల్లో పూజాసామగ్రి చిందరవందరగా పడి ఉంది.

ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్  అనే అతడిని తొమ్మిదిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కనుగొన్న ఇల్లు ఎవరిదో తెలియరాలేదు. కార్తికేయన్  కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement