Perambalur
-
ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి..
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం వెలుగుచూసింది. ఇంటర్ విద్యార్థినిపై చర్చి పాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెరంబులూరు జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన చర్చి పాస్టర్, అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబలూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబం కోనేరి పాలయం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ (53) ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లస్ వన్ విద్యార్థిని(16)పై ఎనిమిది నెలల క్రితం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో ఆయన ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తర్వాత ఆమెను తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన బాలిక మామ కుమారుడు కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి ఇష్టం లేని మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి చిన్నారుల సంక్షేమ కార్యాలయ అధికారికి సమాచారం అందించింది. వెంటనే వారు పెరంబలూర్ మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కళ.. పాస్టర్ వేలాయుధం స్టీఫన్, విద్యార్థిని తండ్రి, మామ కుమారుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వేలాయుధం స్టీఫెన్, విద్యార్థిని మామ కుమారుడిని ఆదివారం అరెస్టు చేసి తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. -
టిక్‌టాక్ చేస్తూ విషం తాగేసింది...
సాక్షి, చెన్నై: భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకుంటూ టిక్‌టాక్‌లో వీడియో పెట్టింది ఓ మహిళ. ఈ సంఘటన తమిళనాడులో చోటు వేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెరంబలూరుకు చెందిన శివ, అనిత దంపతులకు ఏడేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. శివ ఉపాధి కోసం సింగపూర్ వెళ్లగా అనిత పిల్లలను చూసుకుంటూ పెరంబలూరులోనే నివశిస్తుంది. అనిత ఖాళీగానే ఉండటంతో టిక్‌టాక్ అలవాటు వ్యసనంగా మారింది. దీంతో పిల్లలను కూడా పట్టించుకోకుండా టిక్‌టాక్ ఏంటని శివ భార్యను మందలించాడు. అయినా ఆమె తీరు మారలేదు. రెండు రోజుల కిందట చిన్న కొడుకు కిందపడటంతో దెబ్బలు తగిలాయి. అయినా అనిత పట్టించుకోకుండా టిక్‌టాక్ లోకంలో ఉందంటూ ఇరుగు పొరుగు వారు శివకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో శివ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెందిన అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా భర్త మందలించాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పురుగుల మందు తాగుతూ వీడియోతీసి టిక్‌టాక్‌లో పెట్టింది. అనిత పురుగుల మందు తాగడం, వెంటనే మంచి నీళ్లు తాగడం వంటి దృశ్యాలు టిక్‌టాక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. క్షణాల్లో ఆమె స్పృహ తప్పడం వంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అనితను బంధువులు తిరుచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. కాగా గతంలో టిక్‌టాక్‌పై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బ్యాన్ తొలగించారు. -
మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్ సెల్వం చనిపోయాడు. రాజ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, జయశంకర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు. -
మహిళ అని కూడా చూడకుండా కార్పొరేటర్ ఘాతుకం
-
కార్పొరేటర్ ఘాతుకం
సాక్షి, చెన్నై : ప్రజల మంచి చెడులు చూడాల్సిన ఓ రాజకీయనాయకుడు, మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడికి దిగాడు. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డీఎంకే కార్పొరేటర్ సెల్వకుమార్‌కు బ్యూటీపార్లర్ యజమాని సత్యకు మధ్య మే25న తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సెల్వకుమార్ ఆమెను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న మహిళలు ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా కిందపడేసి కాలుతో ఇష్టానుసారంగా తన్నాడు. వీడియో ఆధారంగా సెల్వకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
తమిళనాడులో నరబలి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరంబలూరులో ఓ ఇంట్లో యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఒకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా పూర్తిగా కుళ్లిన యువతి మృతదేహం పడి ఉంది. మృతదేహం చుట్టూ, ఇతర గదుల్లో పూజాసామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణతో కార్తికేయన్ అనే అతడిని తొమ్మిదిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్‌పై వచ్చాకే యువతి మృతదేహం బయటపడడంతో ఆమెను సైతం నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని కనుగొన్న ఇల్లు ఎవరిదో తెలియరాలేదు. కార్తికేయన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వణుకు పుట్టించిన పేలుడు
చెన్నై సమీపం పెరంబలూరులో గురువారం రాత్రి బస్సులో సంభవించిన పేలుడు పోలీసు అధికారుల వెన్నులో వణుకు పుట్టించింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకున్నా పెట్రో బాంబు పేలుడు ధాటికి 9 మంది గాయపడ్డారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాదులు ఎంతకైనా తెగబడవచ్చు తస్మాత్ జాగ్రత్త అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్ర పోలీస్ యంత్రాగాన్ని నెల క్రితమే అప్రమత్తం చేశారు. పంద్రాగస్టు సమీపించే కొద్దీ పోలీసు తనిఖీలు పెరిగిపోయాయి. చీమచిటుక్కుమన్నా అనుమానించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెల్లారితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనగా బస్సులో పెట్రో బాంబు పేలుడుతో అధికారులు బెంబేలెత్తిపోయారు. చెన్నై శివారులోని పెరంబలూరు నుంచి దురైయూరుకు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేటు బస్సు బయలుదేరింది. మావిలంగు ప్రాంతానికి చెందిన చంద్రన్ (28) బస్సును నడుపుతుండగా కురుంబలూరుకు చెందిన రాజేష్ డ్రైవర్ విధులను నిర్వర్తిస్తున్నాడు. రాత్రి 8.15 గంటల సమయంలో బస్సు ఈచ్చంపట్టి లాడపురం ప్రాంతంలో వెళుతుండగా డ్రైవరు సీటుకు వెనుక నాలుగో వరుసలోని ప్రయాణికుల సీట్ల కింద నుంచి అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో డ్రైవరు బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయంతో కేకలు వే స్తూ కిందకు దూకేశారు. సీటు కింద భాగంలో కాలిన గుర్తులతో పేలుడు జరిగి ఉండటాన్ని గుర్తించారు. ఈ పేలుడులో ప్రయాణికులు రామాయి, రాజేశ్వరి, విజయరాఘవన్, చిన్నదురై, కలియపెరుమాళ్, నాగలాపురం సెల్వరాజ్, నక్కసేలం లోకనాథన్, దినేష్, సతీష్‌కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను పెరంబలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పేలుడు జరిగిన చోట దొరికిన ఆనవాళ్లను బట్టీ పెట్రో బాంబుగా నిర్ధారించారు. అనేక వైర్లతో ఛిద్రమై ఉన్న ప్లాస్టిక్ పెట్టె, బ్యాటరీ, బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈచ్చంపట్టిలో నలుగురు వ్యక్తులు బస్సులో ఎక్కారని కండక్టర్ చెప్పాడు. వారంతా ఆపెట్టెను వదిలి మార్గమధ్యంలో దిగిపోయినట్లు తెలుసుకున్నారు. ఇదే బస్సులో పేలుళ్లు జరపాలని దుండగులు భావించారా లేక మరేదైనా పెద్ద లక్ష్యమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లారితే వేడుకలు ప్రారంభం అవుతుండగా ముందురోజు రాత్రి జరిగిన ఈ సంఘటన అధికారులను కలవరపాటుకు గురిచేసింది.