సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం వెలుగుచూసింది. ఇంటర్ విద్యార్థినిపై చర్చి పాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెరంబులూరు జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన చర్చి పాస్టర్, అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబలూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబం కోనేరి పాలయం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ (53) ఇంటిలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో ప్లస్ వన్ విద్యార్థిని(16)పై ఎనిమిది నెలల క్రితం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో ఆయన ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తర్వాత ఆమెను తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన బాలిక మామ కుమారుడు కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి ఇష్టం లేని మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి చిన్నారుల సంక్షేమ కార్యాలయ అధికారికి సమాచారం అందించింది.
వెంటనే వారు పెరంబలూర్ మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ కళ.. పాస్టర్ వేలాయుధం స్టీఫన్, విద్యార్థిని తండ్రి, మామ కుమారుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వేలాయుధం స్టీఫెన్, విద్యార్థిని మామ కుమారుడిని ఆదివారం అరెస్టు చేసి తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment