child welfare committee
-
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి..
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం వెలుగుచూసింది. ఇంటర్ విద్యార్థినిపై చర్చి పాస్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెరంబులూరు జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన చర్చి పాస్టర్, అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబలూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబం కోనేరి పాలయం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ (53) ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లస్ వన్ విద్యార్థిని(16)పై ఎనిమిది నెలల క్రితం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్ స్టీఫెన్ లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి చెప్పడంతో ఆయన ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తర్వాత ఆమెను తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన బాలిక మామ కుమారుడు కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి ఇష్టం లేని మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి చిన్నారుల సంక్షేమ కార్యాలయ అధికారికి సమాచారం అందించింది. వెంటనే వారు పెరంబలూర్ మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కళ.. పాస్టర్ వేలాయుధం స్టీఫన్, విద్యార్థిని తండ్రి, మామ కుమారుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వేలాయుధం స్టీఫెన్, విద్యార్థిని మామ కుమారుడిని ఆదివారం అరెస్టు చేసి తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. -
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: అభాగ్యులైన చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవలే బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లు ఏర్పాటయ్యాయి. బాలల సంక్షేమం, సంరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన వీటిలో అన్ని జిల్లాల నుంచి 85 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వీరందరికీ విజయవాడలోని హరిత బెరంపార్కులో నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారి పరిధిని వివరించడంతోపాటు పోక్సో, జువెనైల్ యాక్ట్, బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ వంటి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. కమిటీలు, బోర్డుల ఏర్పాటు ఇలా.. జువెనైల్ జస్టిస్–2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఈ నియామకాలను పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఒక బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), ఒక జువెనైల్ జస్టిస్ బోర్డును ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీలో చైర్పర్సన్, నలుగురు సభ్యులు, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. 18 ఏళ్లలోపు బాలల హక్కులు, సమస్యలు, సంక్షేమం, సంస్కరణ కోసం సీడబ్ల్యూసీ, జేజేబీలు పని చేస్తాయి. అభాగ్యులకు అండగా.. వీధి, అనాథ బాలలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని సంరక్షణ కేంద్రాలకు అప్పగించడం.. వారికి విద్య, వైద్యం, వసతి కల్పించడం వంటి చర్యలను సీడబ్ల్యూసీ, జువెనైల్ జస్టిస్ బోర్డు పర్యవేక్షిస్తుంటాయి. వివిధ కారణాలతో ఇంటికి దూరమైన బాలలను గుర్తించి.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తాయి. అక్రమ రవాణాకు గురైన బాలలకు ప్రభుత్వపరంగా సాయమందించేలా కృషి చేస్తాయి. నిర్బంధపు బాల కార్మికులు, వేధింపులకు గురైన వారికి చట్టపరంగా అండగా నిలుస్తాయి. బాల నేరస్తుల్లో పరివర్తన తెచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. అన్యాయానికి గురైతే అండదండలు అందించడం వంటి చర్యలు చేపడతాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదుకునే విధంగా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇలా అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి చిన్నారికి సీడబ్ల్యూసీ, జేజేబీ భరోసా ఇవ్వనున్నాయి. బాలల సంక్షేమం, సంస్కరణకు ప్రాధాన్యం బాలల సంక్షేమంతోపాటు వారి సంస్కరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ, జేజేబీలను ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు, బోర్డు సభ్యులు ఎలా పని చేయాలి, ఏం చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నాం. –కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
అనుపమ అలుపెరగని పోరాటం...ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!
Kerala Baby Kidnap Case Finally Woman Gets Custody Of Her Infant Son: కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. స్వయంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు ఇది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటంలో కేరళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైన సంగతి తెలిసిందే. పైగా యావత్తు ప్రజలంతా కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని ఆకాంక్షించిన విచిత్రమైన కేసు ఇది. అయితే అనుపమ ఎస్ చంద్రన్ గతేడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లి అయిన సంగతి విధితమే. అంతేకాక ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. పైగా ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో స్వయానా ఆమె తండ్రే బిడ్డను కిడ్నాప్ చేసి కూతుర్నీ మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. (చదవండి: చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్) అయితే ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా వెనుకడుగు వేస్తున్నారంటూ శిశు సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రిని వేడుకుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలివచ్చి ఆమె బిడ్డను సత్వరమే వెతికే చర్యలు తీసుకోవడమే కాక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన కేరళ పోలీసులు ఆ బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. అంతేకాదు ఆ బిడ్డ ఆ తల్లికే చెందాలని అక్కడి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షించారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారని చెప్పడంతో అనుపమ ఎంతో ఆవేదనగా ఎదురుచూస్తూ ఉంది. ఈ మేరకు న్యాయమూర్తి ఛాంబర్లో గంటన్నరసేపు జరిగిన విచారణలో నిర్మల శిశు భవన్లో సీడబ్ల్యూసీ కస్టడీలో ఉన్న బాబుని కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతేకాదు బాబుకి అన్ని వైద్యపరీక్షలు నిర్వహించడమే కాక చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన సత్వరమే ఆ చిన్నారిని తల్లికి అప్పగించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఈ కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. అయితే శిశువును వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వ ప్లీడర్ విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు అనుపమ ఒడికి ఆ చిన్నారి చేరుకుంది. అంతేకాదు సంవత్సరం నిరీక్షణ వారాల న్యాయ పోరాటాలు అన్ని ఫలించి ఈ రోజు అనుపమ తన భర్త అజిత్‌తో కలిసి తన చిన్నారిని ఎత్తుకుని ఆనందంగా కోర్టు నుంచి బయటకు వచ్చింది. అయితే మూడు రోజుల వయస్సు ఉన్నప్పుడు ఆమె చివరిసారిగా చూసిన తన బిడ్డ సంరక్షణ బాధ్యతను కోర్టు నేడు ఆమెకు అప్పగించింది. (చదవండి: వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!) -
కోవిడ్ ఎందరి జీవితాలనో ఛిద్రం చేసింది
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి దేశంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తును తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని వ్యాఖ్యానించింది. ఆ చిన్నారుల సంరక్షణ, చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమంపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పేర్కొంది. ‘కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం. ఇటువంటి చిన్నారుల గుర్తించి, వారి తక్షణ అవసరాలు తీర్చేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది’అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘లక్ష మందికిపైగా చిన్నారులకు ప్రభుత్వాల రక్షణ అవసరం ఉన్నట్లు బాలల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ)లు తెలిపాయి. మైనర్లకు అవసరమైన పథకాల ప్రయోజనాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలి’అని వివరించింది. పీఎం కేర్స్ కింద రిజిస్టరైన బాలల ఫీజులు, ఇతర ఖర్చుల బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని పేర్కొంది. గత ఏడాది మార్చి తర్వాత తల్లిదండ్రులిద్దరినీ లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించి ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారి ఫీజులను మాఫీ అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా, ప్రభుత్వాల సాయం అవసరం లేని బాధిత బాలల వివరాలను కూడా సేకరించాలని సీడబ్ల్యూసీలకు సూచించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు
రాంచీ: అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే అయినోళ్ళకు దూరమైన వారికి అవే ఆధారం. కాగా చీకట్లు కమ్ముకున్న చిన్నారులను ఈ ఆశ్రమాలు మరింత అంధకారంలోకి నెడుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయారు. మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ (ఎంటీడబ్ల్యూటీ)లోని పిల్లలను నాలుగేళ్లుగా లైంగిక వేధింపుల గురిచేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు శుక్రవారం జంషెడ్‌పూర్‌లోని గోబర్ఘౌసీలోని బాల్ కళ్యాణ్ ఆశ్రమానికి తరలించారు. అయితే నలభై మంది పిల్లల్లో 38 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదివారం గుర్తించింది. 17 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయినట్టు తెలిపారు. కాగా తప్పిపోయిన బాలికల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు తూర్పు సింగ్భూమ్ సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) డాక్టర్ ఎం తమిళ వనన్ తెలిపారు. ఎంటీడబ్ల్యూటీ డైరెక్టర్ హర్పాల్ సింగ్ థాపర్, అతని భార్య పుష్ప రాణి టిర్కీ, వార్డెన్ గీతా సింగ్, ఆమె కుమారుడు ఆదిత్య సింగ్, మరో వ్యక్తితో సహా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. కాగా మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ డైరెక్టర్ భార్య టిర్కీ, తూర్పు సింగ్భూమ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని, మదర్ థెరిసా వెల్ఫేర్ ట్రస్ట్ గత 10 సంవత్సరాలుగా ఖరంగజార్లో నడుస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. చదవండి: దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు -
దారుణం: మైనర్‌పై 38 మంది అత్యాచారం
తిరువనంతపురం: నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. కేరళలో ఓ మైనర్ బాలికపై గత కొద్ది నెలలుగా 38 మంది మృగాళ్లు రాక్షస క్రీడ కొనసాగించారు. నిర్భయ కేంద్రంలో కౌన్సెలింగ్ సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాలిక 13వ ఏట ఉండగా.. ఈ అత్యాచారాల పర్వం మొదలయ్యింది. అలా ఓ ఏడాది పాటు నరకం అనుభవించిన బాలికను చైల్డ్ హోమ్‌కు తరలించారు అధికారులు. కొద్ది రోజుల తర్వాత బాలికను ఆమె తల్లి, అన్నతో ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలిక కనిపించకుండా పోయింది. ఇక ఆమెని వెతగ్గా గతేడాది డిసెంబర్లో పాలక్కడ్‌లో ఆచూకీ లభ్యం అయ్యింది. ఆమెని నిర్భయ సెంటర్‌కి తరలించి.. కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించగా.. బాలిక హృదయం ద్రవించే విషయాలు వెల్లడించింది. (చదవండి: అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి) దాదాపు 38 మంది మృగాళ్లు ఆమెపై రాక్షస క్రీడ కొనసాగించారని తెలిపింది. బాధితురాలు చెప్పే విషయాలు విని అధికారుల కళ్లు చెమర్చాయి. మరో దారుణం ఏంటంటే.. బాలికపై అత్యాచారం చేసిన వారంతా ఆమెకి తెలిసిన వారే కావడం గమనార్హం. ఇక బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు అధికారులు నిందితులందరి లైంగిక దోపిడితో సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మలప్పురం సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ప్రెసిడెంట్ షాజేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘బాధితురాలిని ఏడాది క్రితం చైల్డ్ హోం నుంచి బయటకు పంపినప్పుడు ఆమె భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఒక్కసారి బాధితులను వారి సంరక్షకులకు అప్పగించిన తర్వాత సమస్యలు తలెత్తుతున్నాయి. సంరక్షులు బాధితులను సరిగా పట్టించుకోవడం లేదు. అందువల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి’ అని తెలిపారు. -
2,119 మంది చిన్నారుల రెస్క్యూ
సాక్షి, హైదరాబాద్: బాల కార్మికులుగా, బెగ్గింగ్ మాఫియాలో బలిపశువులుగా బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రెస్క్యూ చేసేందుకు ప్రారంభించిన ఐదో దఫా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. జనవరి 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,119 మంది చిన్నారులను బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌తోపాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా ఆ చిన్నారులను ఫేస్ రికగ్నైజేషన్ టూల్ దర్పన్ ఉపయోగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. వీరిలో బాలురు 1,653 మంది, బాలికలు 466 మంది ఉన్నారని పేర్కొన్నారు. 1,303 మంది చిన్నారులను తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 816 మందిని రెస్క్యూ హోంకు తరలించామని వెల్లడించారు. గుర్తించిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 763 మంది ఉన్నారని తెలిపారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై 58 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఆ...డపిల్లనట!
ఆడ పిల్ల పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. అవును మా అమ్మ పుట్టింది..కాదండీ అంతా మా నాన్న పోలిక. ఉప్పొంగిన తల్లిదండ్రుల ఆప్యాయత ఇది. క్రమేణా వీరి అమృతమంటి ప్రేమతోపాటు పసిబిడ్డా ఎదిగింది ఆడపిల్లగా.. ఇదిగో భయం.. అమ్మ అనురాగం ఆందోళన పడింది.. మమకారం నిండిన నాన్న గుండె బరువెక్కింది. ‘మంచి సంబంధం వచ్చింది. ఎన్ని రోజులు ఉంచినా ఆడ పిల్ల మనపిల్ల కాదే’.. ‘అవునండీ. ఆ...డపిల్లే.. పిల్ల చదువు మరి’.‘.ఆడ పిల్లకు చదువెందుకే’ .. రేనండీ’.. అదిగో బాల్యం మెడలో పడిన తాళి ఆలిని చేసింది. మెట్టినింట బానిసగా మార్చేసిన అజ్ఞానకేళి వెర్రిగా నవ్వింది. గుంటూరు(ఎస్వీఎన్కాలనీ): జిల్లాలో బాల్య వివాహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి పేదరికం, అజ్ఞానం, ప్రేమ పెళ్లిళ్లు, మూఢ నమ్మకాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద నమోదైన ఫిర్యాదుల్లో 7 నుంచి 11వ తరగతిలోపు, 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సామాజిక పరిరక్షణ పేరుతో బాల్య వివాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది. శాఖల మధ్యసమన్వయలోపం పసితనానికి మాంగల్య బంధం పడటానికి ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమే. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఉండేది గ్రామ పంచాయతీలకే. వీరు కనీసం తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిం చడం లేదు. పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఇందుకు కారణ. సర్పంచ్‌లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలతోపాటు ఉన్నతాధికారులు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడం లేదు. తాంబూలాలు మార్చుకుని తీరా వివాహానికి సిద్ధమైన రోజు గ్రామంలో ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థలకు, ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారమిస్తున్నారు. ఆ సమయంలో అధికారులు స్పందించి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా డబ్బులు పోగు చేసుకుని పెళ్లికి సిద్ధమైన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. వీరిలో 58 శాతం 19 ఏళ్లు కూడా నిండకుండానే తల్లులవుతున్నారు. యంగ్ లైవ్స్ ఇండియా, చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ సంయుక్త అ«ధ్యయనంలో వెల్లడైన చేదు నిజా లివి. 15 ఏళ్ల తరువాత కూడా చదువును కొనసాగించిన అమ్మాయిలతో పోల్చితే ఈలోపు చదువు ఆపేవారే ఎక్కువగా బాల్య వివాహాలకు లోనవుతున్నారు. బాల్య వివాహాల్లో పురుషుల కేవలం 2 శాతం మాత్రమే. బాల్య వివాహానికి హాజరయ్యే వారూ శిక్షార్హులే బాల్య వివాహానికి హాజరయ్యే వారందరూ శిక్షకు అర్హులేనని చట్టం చెబుతోంది. తమిళనాడులో ఓ బాల్య వివాహంలో పెళ్లి వీడియో ద్వారా దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు వివాహ వయసు నిర్ణయించింది. అతిక్రమిస్తే నేరానికిగాను రెండేళ్లు కారాగార శిక్ష, లక్ష జరిమానా విధిస్తుంది. పెళ్లి చేసిన, పెళ్లి చేసుకున్న, పౌరహిత్యం జరిపిన, వేదిక ఇచ్చిన, ప్రోత్సహించిన సంస్థలకూ శిక్ష వర్తిస్తుంది. చట్టంలో వధువుకు, వధువు తల్లికి, తండ్రికి శిక్ష వర్తింపు మినహాయింపు ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి బాల్య వివాహాలు ఆపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, పురోహితులు ఇందుకు ముఖ్యపాత్ర పోషించాలి. పెళ్లి రోజు వరకు రాకుండా ముందస్తుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. లేదంటే అధికారులకు సమాచారమివ్వాలి. మా వంతుగా అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.– శ్యామసుందరి, పీడీ ఐసీడీఎస్ -
ఇంటికి చేరిన పూర్ణిమ సాయి
ఎట్టకేలకు పూర్ణిమ కథ సుఖాంతం - కౌన్సెలింగ్‌తో ఆమెలో మార్పు హైదరాబాద్: పూర్ణిమసాయి కథ సుఖాంతమైంది. సినిమాల ప్రభావంతో బాలీవుడ్లో ప్రవేశించాలని ఇంటి నుంచి వెళ్లిన పూర్ణిమసాయి శుక్రవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు పూర్ణిమకు కౌన్సెలింగ్ నిర్వహించి నచ్చచెప్పారు. దీంతో ఆమె తన తల్లిదండ్రులు నాగరాజు, విజయలతో కలసి ఇంటికి వెళ్లేందుకు అంగీకరించింది. కూతురు తమతో పాటు వచ్చేందుకు అంగీకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత పూర్ణిమను కాచిగూడలోని బాలికాసదన్‌లో ఉంచారు. మూడురోజుల పాటు సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు అప్పగించారు. వారు సంతోషంగా తమ కూతురును ఇంటికి తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటకు చెందిన పూర్ణిమసాయి జూన్ 7న ప్రైవేటు క్లాస్‌కని ఇంటి నుంచి వెళ్లింది. సికింద్రాబాద్‌లో రైలెక్కి 8న షిర్డీలో దిగింది. అక్కడ పదిహేను రోజులపాటు బాబా ఆశ్రమంలో గడిపి ముంబై వెళ్లింది. పోలీసులు పూర్ణిమను సాయిసుధార్ అనే ఆశ్రమంలో చేర్పించారు. పూర్ణిమ మిస్సింగ్ ఫొటోలను బోయవాడ పోలీసులు గుర్తించి తుకారాం గేట్ సీఐకి సమాచారం ఇచ్చారు. ఆయన బాచుపల్లి పోలీసులకు వివరాలను అందజేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు అక్కడి పోలీసులతో మాట్లాడి పూర్ణిమసాయి ఆశ్రమంలోనే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే సాయిబాబా కలలోకి వచ్చాడని తాను ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ముప్పు అని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని పోలీసులకు తెలిపింది. కంటికి రెప్పలా చూసుకుంటాము... తమ కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటామని పూర్ణిమ తల్లిదండ్రులు నాగరాజు, విజయలు తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులు తమ కుమార్తెలో మార్పు తీసుకువచ్చి అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాలికాసదన్లోని తోటి బాలికలకు టాటా చెబుతూ తండ్రి నడుపుతున్న కారు ఎక్కింది. తీవ్ర ఉత్కంఠ... బాలికాసదన్ వద్ద శుక్రవారం ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10:30కే తల్లిదండ్రులు బాలి కాసదన్ వద్దకు వచ్చారు. కూతురిలో మార్పు వస్తుందో రాదోనని ఆందోళనగా గడిపారు. కౌన్సె లింగ్ అనంతరం పూర్ణిమసాయి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యులు వెంకటేశ్వర్లు, నామ నాగేశ్వర్రావు, బాల్‌రాజులు మీడియాకు వెల్లడించారు. మూడు రోజులపాటు తాము నిర్వహించిన కౌన్సెలింగ్‌తో పూర్తి మార్పు వచ్చిందని చెప్పారు. -
అమ్మానాన్నను చూడను.. వారి వద్దకు వెళ్లను
వారు బాగుండాలన్నదే నా కోరిక: పూర్ణిమ సాయి - తల్లిదండ్రులతో ఉంటే వారికి చెడు జరుగుతుందని ‘కల’వరపాటు - కూతురును కలవకుండానే హైదరాబాద్‌కు చేరుకున్న తల్లిదండ్రులు - నేడు పూర్ణిమను నగరానికి తీసుకురానున్న సైబరాబాద్ మహిళా పోలీసులు సాక్షి, హైదరాబాద్/ముంబై: ‘‘నా తల్లిదండ్రులు బాగుండాలి. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేను. ఏడాది పాటు నా వారికి దూరంగా ఉంటే ఇబ్బందులు తప్పుతాయని కలలో దేవుడు చెప్పిన మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి’’నగరంలో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి చెపుతున్న మాటలివీ. అమ్మానాన్నలను కలవడం కాదు కదా కనీసం చూసేందుకు కూడా ఆమె ఇష్టపడటంలేదు. దీంతో తల్లిదండ్రులు నాగరాజు, విజయకు మారి పూర్ణిమను కలవకుండానే ముంబై నుంచి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మానసిక నిపుణులు పూర్ణిమకు ఎంత చెప్పినా తల్లిదండ్రులతో వచ్చేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు సైబరాబాద్ మహిళా పోలీసు లు ముంబై చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆమెను హైదరాబాద్ తీసుకు రానున్నారు. జూన్ 7న నమోదైన మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మలచడంతో ఆ కేసు విషయంలో ఆమెను రంగారెడ్డి జిల్లాలోని జువెనైల్ కోర్టు ముందు హాజరుపరచను న్నారు. ఆ తర్వాత పూర్ణిమ ఇష్టపకారం తల్లిదండ్రుల వద్దకు వెళతానంటే పంపుతారు. లేదంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి ఏదైనా హోంలో ఉంచే అవకాశం ఉంది. ‘కల’ కదిలించింది.. జూన్ 7న అంటే మిస్సింగ్‌కు రెండు రోజుల ముందు వచ్చిన కల పూర్ణిమను ఆగమాగం చేసింది. 5వ తేదీ తెల్లవారుజామున కలలో సాయిబాబా వచ్చి ‘నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వారికి ప్రాణహాని ఉంది. చెడు జరుగుతుంది. నా దగ్గరకు వచ్చేయి. లేదంటే నీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు. ఎవరికీ తెలియని ప్రదేశానికి రా’అంటూ వచ్చిన కల ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే రోజు పూర్ణిమ అమ్మకు కడుపునొప్పి రావడంతో దానిని చెడుకు తొలి సంకేతంగా భావించింది. మరుసటి రోజు చెల్లెలు తీవ్రమైన దగ్గుబారిన పడటంతో కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయని అనుకుంది. దీంతో జూన్ 7న ఉదయం ఇంట్లో రూ.వెయ్యి తీసుకుని స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి షిర్డీ వెళ్లే రైలు ఎక్కింది. జూన్ 8న షిర్డీ సాయి దర్శనం చేసుకుని తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావొద్దని ప్రార్థించి.. జూన్ 9న ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ చేరుకుంది. అక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న బోయివాడ పోలీసుల వద్దకు వెళ్లిన పూర్ణిమ.. తన అసలుపేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు చెబితే వారిని పిలిపించి తనను పంపిస్తారన్న భయంతో తాను అనాథనని అబద్ధం చెప్పింది. తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు లేరని సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానంటూ వివరించింది. పోలీసులు ఆమెను డొంగ్రీలోని బాలసుదర్ గృహ్‌కు తరలించారు. సికింద్రాబాద్ సమీపంలోని ఠాణాలకు అనికశ్రీ పేరుతో ఎవరైనా తప్పిపోయారన్న కేసు నమోదైందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పేరుతో అదృశ్యమైన కేసు నమోదు కాలేదని తెలియడంతో బోయివాడ పోలీసులు ఊరకుండిపోయారు. తల్లిదండ్రులను కలిసేందుకు ససేమిరా.. ఇటీవల పూర్ణిమ తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి బాలల హక్కుల సంఘం ప్రతినిధులతో కలసి తమ పాప ఆచూకీ ఉంటే చెప్పండి అంటూ మీడియాతో మొరపెట్టుకున్నారు. ఆ వార్త ఫొటోలతో పాటు ప్రచురితం కావడంతో తుకారాం గేట్ ఇన్స్పెక్టర్ ముంబై పోలీసుల నుంచి తనకు వాట్సాప్‌లో వచ్చిన ‘అనికశ్రీ ఫొటో’కు పత్రికలో వచ్చిన ఫొటోకు దగ్గర పోలికలు ఉండటంతో ఆ ఫొటోను బాచుపల్లి ఇన్స్పెక్టర్ బాలకృష్ణరెడ్డికి పంపారు. ఆదివారం వారు తల్లిదండ్రులను పిలిపించి ఫొటోను చూపగా.. అందులో ఉన్నది తమ అమ్మాయేనని ధ్రువీకరించారు. సోమవారం పోలీసులతో కలసి తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి ముంబై వెళ్లగా.. వారిని కలిస్తే ఏమవుతుందోనన్న భయంతో పూర్ణిమ తల్లిదండ్రులను చూసేందుకు, కలిచేందుకు ససేమిరా అంది. మానసిక నిపుణులు కూడా ఆమె ఇష్ట్రపకారం మీరు కలవకండి అని చెప్పారని ముంబైకి వెళ్లిన బాచుపల్లి ఎస్సై శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ‘అనికశ్రీ’ పేరు వెనక కథ ఇదే.. స్టార్‌ప్లస్ టీవీ చానల్లో ప్రసారమయ్యే ఇష్క్బాజ్ సీరియల్‌ను పూర్ణిమ చూసేది. ఆ సీరియల్స్‌లో అనికశ్రీ పాత్రను ప్రముఖ సీరియల్ నటి సురభి చందన పోషిస్తోంది. ఆ పాత్రకు మంత్రముగ్ధురాలైన పూర్ణిమ ఏకంగా ఆ నటితో ఇన్‌స్ట్రాగామ్‌లో చాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పూర్ణిమ అని చెబితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండటంతో తనకు ఇష్టమైన అనికశ్రీ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. పూర్ణిమకు నటనపై ఉన్న మక్కువతోనే ముంబైకి వచ్చి ఉంటుందని, చివరకు ఆ సీరియల్లో పాత్ర పేరు ‘అనిక శ్రీ’నే తన పేరుగా బోయివాడ పోలీసులకు చెప్పడం దీన్ని స్పష్టం చేస్తోందని పోలీసులు చెపుతున్నారు. -
బుదియా సినిమా ప్రమోషన్‌కు వెళ్లాడా..?
బుదియా సింగ్.. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బుడతడి పేరు కొద్ది రోజులుగా న్యూస్ హెడ్ లైన్స్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బుదియా.. ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వెళ్లి హాస్టల్‌కు తిరిగి రాలేదు. దీంతో బుదియా ఏం అయ్యాడు..? ఎక్కడున్నాడు...? అని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజా సమచారం ప్రకారం బుదియా ఎక్కడికి పోలేదని తెలుస్తోంది. బుదియా జీవితం ఆదారంగా 'బుదియా సింగ్ : బోర్న్ టు రన్' అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈసినిమా ప్రమోషన్లో భాగంగా బుదియాను ఆ చిత్ర నిర్మాతలు ముంబై తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ ప్రకటన చేయకపోయినా. బుదియా తప్పిపోలదని మాత్రం చెపుతున్నారు. ఈ విషయం చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చిత్రనిర్మాత శుభమిత్ర సేన్‌కు శనివారం నోటీసులు జారీ చేసింది. బుదియా కనిపించకపోవటంపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది. అంతేకాదు సిటీ పోలీసులను బుదియా కనిపించకపోవటంపై కేసు నమోదు చేయాలని కోరింది. -
పరుగుల వీరుడు బుదియా సింగ్ ఎక్కడ?
భువనేశ్వర్: మూడేళ్ల కే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల వయసులోనే 40 మైళ్లు పరిగెత్తిన రికార్డు .. అతి చిన్న వయసులో ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేసి చరిత్ర సృష్టించిన పరుగుల (వీరుడు) బుడతడు.. ఒడిశా వండర్ కిడ్ బుదియా సింగ్ నెలరోజులుగా ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. బుదియా సింగ్ మిస్సింగ్ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. బుదియా సింగ్ స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ఆచూకీ లేకుండా పోయిన బుదియా గురించి తీసుకున్న చర్యలు ఏమటి? పోలీసులకు ఫిర్యాదు చేశారా? అనే విషయంపై మూడు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని స్పోర్ట్స్ హాస్టల్ ఇంచార్జ్ ని సీడబ్ల్యూసీ సభ్యుడు బెనుధర్ సేనాపతి ఆదేశించారు. సీడబ్ల్యూసీ కృషి వల్లనే బుదియా కళింగ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్నాడని సేనాపతి తెలిపారు. మే 10న వేసవి సెలవులకి తన తల్లి దగ్గరికి వెళ్లిన బుదియా ఇప్పటివరకు స్పోర్ట్స్ హాస్టల్ కు రాలేదు. -
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
-
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
చిన్నారి సానియాను చైల్డ్వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్నారిని ఎవరికి అప్పగించాలనే విషయమై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు సానియా బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. -
మూడు నెలల ఆడశిశువు విక్రయం!
విచారణ జరుపుతున్న ఐసీడీఎస్ అధికారులు హైదరాబాద్: మూడు నెలల పసిగుడ్డును బేరానికి పెట్టాడో తండ్రి. మధ్యవర్తి ప్రమేయంతో శిశువును అడిగిన వారికి అప్పగించాడు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికారులు శనివారం దీనిపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో బిడ్డను విక్రయించి నట్టు వారు అంచనాకు వచ్చారు. కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌కి చెందిన మాలోత్ రవీందర్‌నాయక్‌కు మెదక్‌జిల్లా రామాయంపేట మండలం కౌడిపల్లి గ్రామానికి చెందిన అంజలితో 2014లో పెళ్లయింది. వీరికి మొదటి కాన్పు(2015)లో కుమార్తె జన్మించింది. ఈ ఏడాది మార్చి 14న రెండో కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టింది. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో అంజలి ప్రసవించిన సమయంలో వీరికి రామాయంపేట లక్ష్మీపురం గ్రామానికి చెందిన రజితతో పరిచయమైంది. తనకు పిల్లలు లేరని, మీ బిడ్డను ఇస్తే పెంచుకుంటానని రజిత వారితో చెప్పింది. అనంతరం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. కాగా, ఏప్రిల్ 10న వారి బంధువు మధు మధ్యవర్తిత్వంతో రజితకు చిన్నారిని రవీందర్ అప్పగించాడు. స్థానికులు శిశువును విక్రయించారని ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్ మేడ్చల్ సూపర్వైజర్ స్పందన, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి లావణ్యరెడ్డి శనివారం రవీందర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బిడ్డను ఎందుకు విక్రయించారని నిలదీయగా తెలిసినవారికి దత్తత ఇచ్చానని ఒకసారి.. పిల్లలు లేరని ఓ మహిళ విలపించడంతో ఆమెకు ఇచ్చానని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంజలి... తనకేమీ తెలియదని, తన భర్త ఇవ్వమంటే బిడ్డను ఇచ్చానని చెప్పింది. దంపతులు విచారణకు సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. -
‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది’
-
‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. నొప్పిగా ఉంది’
♦ కంటతడి పెట్టించిన బాలుడి మాటలు ♦ రెండున్నరేళ్ల బాలుడిపై కన్నతల్లి కర్కశత్వం ఒంగోలు క్రైం: చెప్పిన మాట వినలేదని కన్నబిడ్డకు అట్లకాడతో వాతలు పెట్టిందో మహాతల్లి. ‘అమ్మ నన్ను అట్లకాడతో కాల్చింది.. బాగా నొప్పిగా ఉంది’ అంటూ బాలుడు చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న శ్రావణ్‌కుమార్, గీత దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు అఖిరానందన్. బాలుడు చెప్పిన మాట వినలేదనే కోపంతో తల్లి గీత సోమవారం ఇంట్లో ఉన్న అట్లకాడను స్టవ్‌పై ఎర్రగా కాల్చి పిరుదులు, తొడ, మూతి మీద వాతలు పెట్టింది. దీనిపై స్థానికులు మంగళవారం చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్ బాలుడి ఇంటి వద్దకు చేరుకుని శరీరంపై ఉన్న వాతలు గమనించి జిల్లా బాలల సంక్షేమ కమిటీ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
తల్లిదండ్రుల వద్దకు వీధి బాలలు
విజయవంతంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి.. బాలల అప్పగింత హైదరాబాద్: ఇంటినుంచి పారిపోయి వీధి బాలలుగా మారిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ కార్యక్రమం అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల నిమిత్తం పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, విద్యా శాఖల నుంచి ఒక్కో అధికారి, స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల నుంచి మరికొందరు సభ్యులుగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, కాగితాలు ఏరుకునే వారు, రైల్వే ఫ్లాట్‌ఫారాలపై ఉంటున్నవారు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తారు. బాలల నుంచి వారి స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేస్తారు. ఆపై ఎవరైనా తామే తల్లిదండ్రులమని తగిన గుర్తింపు పత్రాలతో వస్తే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ల సమక్షంలో విచారించి బాలలను అప్పగిస్తారు. వారం రోజుల్లో 970 మంది పట్టివేత వారం రోజులుగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో బాలల పరిరక్షణ బృందాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 970 మంది బాలలను పట్టుకున్నారు. వీరిలో బాలకార్మికులే ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో దొరికిన బాలలను ఆయా జిల్లా కేంద్రాల్లోని తాత్కాలిక వసతి గృహాల్లో ఉంచి, చదువు నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) నుంచి నిధులను కేటాయించారు. -
వివాహం ఇష్టం లేక...
♦ ఇంటి నుంచి ఒంగోలు చేరుకున్న యువతి ♦ చైల్డ్‌లైన్ చొరవతో బాలసదన్‌కు ఒంగోలు క్రైం : చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బి.వి.సాగర్ ఆ బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ బాలికది కనిగిరి మండలం రామాపురం. ప్రస్తుతం గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఆ బాలిక కుటుంబం ఉంటోంది. ఆ బాలిక నాన్న ముఠా పని చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. గత నెల 5వ తేదీ ఆ బాలికను మేనమామ జి. వెంకట్రావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ వివాహం ఇష్టం లేని ఆమె అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూనే వచ్చింది. చివరకు చేసేది లేక ఇంటి నుంచి తాను చదువుకున్న సర్టిఫికెట్లన్నీ తీసుకొని గుంటూరు నుంచి ఒంగోలుకు చేరుకుంది. బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఆ పరీక్షల్లో 8.9/10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. చదువుతో పాటు ఎన్సీసీలో కూడా బాగా రాణించింది. ఎవరైనా ఆదరించి చదివిస్తే చదువుకుంటానంటూ ఆ బాలిక ఆశగా వేడుకుంటోంది. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించారు. -
ప్రేమ్‌రాజ్ వర్మ అరెస్ట్
హైదరాబాద్: ‘అవేక్ ఓ వరల్డ్’ పేరుతో అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రేమ్‌రాజ్ వర్మను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపారు. అంతకుముందు నింబోలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల సదన్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణకు ప్రేమ్‌రాజ్ వర్మ హాజరయ్యారు. అనంతరం అతన్ని విచారణ నిమిత్తం కూషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘అవేక్’ చిన్నారులకు విముక్తి
ప్రేమ్ రాజ్ పై కేసు నమోదు హైదరాబాద్: నగర పరిధిలోని మౌలాలిలో ‘అవేక్ ఓ వరల్డ్’ సంస్థలో ఉంటున్న చిన్నారులకు అక్కడి బాధలనుంచి విముక్తి లభించింది. దీని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ తన వద్ద ఉన్న చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడి, వారిని ఇబ్బందులకు గురిచేసిన సంగతి వెలుగు చూడడంతో చైల్డ్వెల్ఫేర్ కమిటీ బాధితులకు అతని చెరనుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ‘అవేక్ ఓ వరల్డ్’ పై రెండు రోజులపాటు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరో మారు విచారణ చేపట్టింది. ఆశ్రమంలో ఉన్న పిల్లల అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసిన తరువాత పూర్తి ఆధారాలతో సంస్థ నిర్వాహకుడిపై కుషాయిగూడా పోలీస్ స్టేషన్ లో ‘ఫోక్సో’ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గత ఆరేళ్లుగా ప్రేమ్‌రాజ్ నడుపుతున్న ఈ సంస్థ చట్టవిరుద్ధమైందనీ, దీనిలో పిల్లలకు రక్షణ లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ పద్మావతి, సభ్యురాలు విజయాదేవి బృందం అభిప్రాయపడింది. తక్షణమే ఇక్కడి బాలికలను మేడిపల్లి లోని చైల్డ్ గెడైన్స్ సెంటర్‌కూ, మగపిల్లలను సైదాబాద్ లోని ప్రభుత్వ హోంకు తరలించారు. ‘అవేక్ ఓ వరల్’్డలో మొత్తం 35 మంది చిన్నారులు ఉండాల్సి ఉండగా ఏడుగురు మగపిల్లలు, 10 మంది బాలికలు కలిపి 17 మంది పిల్లలే ఉండడం గమనార్హం. మిగిలిన వారు ఏమయ్యారన్నది ప్రేమ్ రాజ్ స్పష్టం చేయాల్సి ఉంది. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నింబోలిఅడ్డాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రేమ్ రాజ్ హాజరు కావాల్సి ఉంది. ‘అవేక్’లో ఉన్న 7, 8 వ తరగతుల పిల్లల పరీక్షలు మధ్యలో ఉన్నందున వారి చదువులకు ఇబ్బందికలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిటీ చైర్పర్సన్ పద్మావతి,సభ్యురాలు విజయాదేవి పేర్కొన్నారు. పూర్తి విచారణ తరువాత చిన్నారులకు ప్రభుత్వం శాశ్వత భద్రత కల్పిస్తుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ‘అవేక్’ నిర్వాకాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఖండించారు. తక్షణమే నిందితుడిపై పూర్తి విచారణ జరిపించి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
అమ్మ లేదు..నాన్న రాలేదు
భివండీ, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం తల్లి వదిలేసి వెళ్లిన నలుగురు పాలమూరు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. కన్నతల్లి జాడే తెలియకపోగా, కన్నతండ్రి కనీసం చూసేందుకు కూడా రాలేదు. అయితే ‘సాక్షి’ చొరవతో అయిదు రోజుల తరువాత పిల్లలను తీసుకుపోయేందుకు మేనమామ వచ్చా రు. అయితే ‘బాల్ కల్యాణ్ సమితి’ (బాలల సంక్షేమ సంస్థ) పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని అప్పగించేందు కు నిరాకరించింది. ఆ పిల్లలను రెండు రో జుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చిన్నారుల పరిస్థితి అగమ్మగోచరంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోయ రాజేశ్వరి (9), బోయ స్వప్న (7), బోయ అఖిల (5), బోయ మహాలక్ష్మి (3)లను వారి క న్నతల్లి డిసెంబరు 31నస్థానిక కల్యాణ్ బ స్స్టాండ్లో వదిలి వెళ్లిన విషయం తె లిసిందే. వీరిని పోలీసులు స్థానిక బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. కాగా అయిదు రోజుల తర్వాత పిల్లలను తీసుకుపోయేందుకు వారి తల్లి బోయ సుజాత సోదరుడైన చంద్రకంటి ఆంజనేయులు, మరో వ్యక్తి జోగి నారాయణతో కలిసి సోమవారం కల్యాణ్ చేరుకున్నారు. మహాత్మఫులే పోలీస్ స్టేషన్లో అన్ని వివరాలు అందించిన తర్వాత పోలీసులు వా రిని పిల్లలు ఆశ్రయం పొందుతున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు. అయితే పిల్లలను మేనమామ ఆంజనేయులుకు అప్పగించేందుకు కమిటీ అధ్యక్షురాలు మీనల్ ఠాకోర్, సభ్యురాలు విద్యా ఆటపాడ్కర్, సభ్యుడు కిరణ్ మోరే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజనేయులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లలను తీసుకుపోయేందుకు తండ్రి రాలేదని, తదితర కారణాల చూపుతూ వారిని అప్పగించేందుకు నిరాకరించారు. ఆ నలుగురు పిల్లలను మహబూబ్‌నగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆనందంనుంచి తేరుకునేలోపే.... అయిదు రోజులుగా అయినవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు ఊరి నుంచి వచ్చిన మేనమామను చూసి ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. తమను ఊరికి తీసుకెళ్లమంటూ మేనమామ వద్ద గోళ చేశారు. అయితే చైల్డ్వెల్ఫేర్ కమిటీ వారిని అప్పగించేందుకు నిరాకరించడంతో పిల్లల ముఖాల్లో విషాదం నిండుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ సంక్షేమ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారు. మేనమామతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటూ చేసిన వారి రోదనలు స్థానికులను కంటతడిపెట్టించాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశానుసారం రెండు రోజుల్లో పిల్లలను మహబూబ్‌నగర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తామని పోలీస్ ఇన్స్పెక్టర్ నిషార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
బాలల సంక్షేమ సంస్థకు తెలుగు చిన్నారులు
భివండీ, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం తల్లి వదిలేసి పోయిన నలుగురు తెలుగు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. కన్నతల్లి జాడే తెలియకపోగా, కన్నతండ్రి కనీసం చూసేందుకు కూడా రాలేదు. అయితే ‘సాక్షి’ చొరవతో అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు మేనమామ వచ్చారు. కానీ ‘బాల్ కల్యాణ్ సమితి’ (బాలల సంక్షేమ సంస్థ) పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని అప్పగించేందుకు నిరాకరించింది. ఆ పిల్లలను రెండు రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోయ రాజేశ్వరి (9), బోయ స్వప్న (7), బోయ అఖిల (5), బోయ మహాలక్ష్మి (3)లను వారి కన్నతల్లి డిసెంబరు 31వ తేదీ తెల్లవారజామున కల్యాణ్ బస్‌స్టాండ్‌లో వదిలిపెట్టిపోయిన సంగతి తెల్సిందే. వీరిని పోలీసులు స్థానిక బాలల సంక్షేమ కేంద్రానికి పంపించారు. ఈ సంఘటన జరిగిన అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు వారి తల్లి బోయ సుజాత సోదరుడైన చంద్రకంటి ఆంజనేయులు, మరో గ్రామస్థుడు జోగి నారాయణ సోమవారం కల్యాణ్ చేరుకున్నారు. మహాత్మఫులే పోలీసు స్టేషన్లో అన్ని వివరాలను అందించిన వీరిని పోలీసులు పిల్లలనుంచిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు. అయితే పిల్లలను మేనమామ ఆంజనేయులుకు అప్పగించేందుకు కమిటీ అధ్యక్షురాలు మీనల్ ఠాకోర్, సభ్యురాలు విద్యా ఆటపాడ్కర్, సభ్యుడు కిరణ్ మోరేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజనేయులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లలను తీసుకుపోయేందుకు తండ్రి రాలేదని, తదితర కారణాల చూపుతూ వారిని అప్పగించేందుకు నిరాకరించారు. ఆ నలుగురు పిల్లలను తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆనందంనుంచి తేరుకునేలోపే.... అయిదు రోజులుగా అయినవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు ఊరి నుంచి వచ్చిన మేనమామను చూసి ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. తమను ఊరికి తీసుకెళ్లమంటూ మేనమామ వద్ద గోళ చేశారు. అయితే చైల్డ్వెల్ఫేర్ కమిటీ వారిని అప్పగించేందుకు నిరాకరించడంతో పిల్లల ముఖాల్లో విషాదం నిండుకుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ సంక్షేమ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారు. మేనమామతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటూ చేసిన వారి రోదనలు అక్కడ చేరిన వారిలో కంటతడిపెట్టించాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటి ఆదేశానుసారం రెండు రోజుల్లో పిల్లలను మహబూబ్‌నగర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటికి అప్పగిస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ నిషార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విజయనగరం అర్బన్: పట్టణంలోని ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థి బుధవారం చేసిన ఆత్మహత్యాయత్నం కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది. సంఘటన జరిగిన 12 గంటల వరకు ఇటు పోలీసులకుగాని సంబంధిత ఇంటర్ పర్యవేక్షణాధికారికిగాని కళాశాల యాజమాన్యం తెలపకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో విద్యార్థుల సంఘం గురువారం కళాశాలకు చేరుకుని నిరసన చేపట్టారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే యాజమాన్యం కనీసం స్పందించక పోవడం దారుణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కళాశాల బోధనా తరగతుల నుంచి విద్యార్థులను సేకరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. యాజమాన్య సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య రభస జరిగింది. పోలీసుల చొరవతో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ బోధనాతరగతుల విరామ సమయంలో ఈ సంఘటన జరిగిందని, విద్యార్థికి అవసరమైన వైద్యచికిత్సను కళాశాల యాజమాన్యం చేయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చదువుల వల్లే జూనియర్ ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం చేశాడని చెప్పారు. కొద్దిరోజులుగా మార్కుల విషయం లో విద్యార్థి తల్లిదండ్రులు కూడా మందలించడం వల్ల మానసికంగా కుంగిపోయాడన్నారు. విచారణ చేపట్టిన ఇంటర్ ఆర్ఐఓ బాబాజీ కార్పొరేట్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి ఎల్‌ఆర్‌బాబాజీ గురువారం విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థి మానసిక పరిస్థితి, ప్రవర్తనాతీరు, యాజమాన్య సిబ్బంది, అధ్యాపకుల ఒత్తిళ్లకు చెందిన పలు అంశాలపై తోటి విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా బాబాజీ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా సేకరించిన అభిప్రాయాల నివేదికను కలెక్టర్ ఎంఎంనాయక్, ఇంటర్మీడియెట్ పాలన ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. బాధిత విద్యార్థిపై ఒత్తిడి ఉన్నట్లు రుజువవుతోందన్నారు. ఒత్తిడి చదువులపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆరా..! విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కార్పొరేట్ కళాశాల నిర్వాకంపై చైల్డ్ వెలే ్ఫర్ కమిటీ శుక్రవారం ఆరా తీసింది. జిల్లా కమిటీ చైర్పర్సన్ కేసలి అప్పారావు కళాశాలకు వచ్చి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చదువులను ప్రేరేపించకూడదని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడుకు సూచించా రు. సంఘటన వివరాలను లిఖితపూర్వకంగా యాజమాన్యం నుంచి తీసుకున్నారు. కోలుకుంటున్నవిద్యార్థి విజయనగరం క్రైం: పట్టణంలోతోటపాలెంలో ఓ ప్రైవేటు ఇంటర్ మీడియట్కళాశాల మేడపైనుంచి దూకినవిద్యార్థి ఎం.శ్రీనివాస్ ప్రైవేటుఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాధితులనుంచి ఫిర్యాదురాకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ కె.రామారావు తెలిపారు. -
నగరంలో వాకథాన్
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలో గురువారం వాకథాన్ ని ర్వహించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ కా ర్యక్రమం కొనసాగింది. బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత అం దరిపై ఉందని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ క్రైం : బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్ సే దోస్తీ వారోత్సవాల్లో భాగంగా గురువారం ‘వాకథాన్’ కార్యక్రమం జరిగింది. హన్మకొండలోని జిల్లా పోలీసు కా ర్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ వాకథాన్ నిర్వహించారు. బాలల సమస్యలు, వారి హక్కులను పరిరక్షించడం, చైల్డ్‌లైన్ 1098 సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ వాకథాన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపా రు. కార్యక్రమ ప్రారంభంలో ఏజేసీ కృష్ణారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాలు విద్యార్థులు, పో లీసు సిబ్బందితో బాలల హక్కుల రక్షణకు పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేయించి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ మేరకు ఎస్పీ మా ట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఏజేసీ కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ తమ కమిటీ బాలల రక్షణకు కవచంగా పనిచేస్తోందని తెలి పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమేష్, ఆర్ఐ ప్రతాప్, శ్రీనివాస్, సదానందం, పోలీ సు సంక్షే మ అధికారి శ్రీనివాస్, పోలీసు అధికారుల అధ్యక్షుడు అశోక్‌కుమార్, చైల్డ్‌లైన్ నోడల్ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, కృష్ణమూర్తి, విద్యార్థులు, సభ్యులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ఒంగోలు క్రైం : మానవులను అక్రమంగా రవాణా చేయడం అత్యంత దారుణమని, దాన్ని పూర్తిగా అరికట్టాలని ఏఎస్పీ బి.రామానాయక్ పిలుపునిచ్చారు. బుధవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా బాలల సంక్షేమ కమిటీ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్‌ను స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా వల్ల పలు ప్రాంతాల్లో బాలలు, మహిళలు బలైపోతున్నారని పేర్కొన్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట ట్రాఫికింగ్ ఉచ్చులో పడి అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలు చూపించి యువతులను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారని ఆవేదన చెందారు. చిన్నారులను కూడా తరలించి భిక్షాటన చేయిస్తున్నారని, యువతులను వ్యభిచారంలోకి దించుతున్నారని, పలువురి అవయవాలను కూడా అమ్ముతున్నారని ఏఎస్పీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ముఖ్యంగా బాలలు, మహిళలను అప్రమత్తం చేయాలని కోరారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్ అనేకమందికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ సమితి, చైల్డ్‌లైన్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్బీ-2 సీఐ ఎన్.సత్యనారాయణ, డీసీఆర్బీ సీఐ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ-1 సీఐ టి.తిరుమలరావు, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ బీవీ శివప్రసాద్, సభ్యులు ఎం.కిషోర్‌కుమార్, ఎం.బెంజిమన్, ఎం.ఆనంద్, ఎం.సంజనకుమారి, తదితరులు పాల్గొన్నారు. నేడు ర్యాలీ... ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో బుధవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు బాలల సంక్షేమ సమితి, చైల్డ్‌లైన్ నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ విజయకుమార్ ప్రారంభిస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిరియాలపాలెంలోని హెచ్‌సీఎం జూనియర్ కళాశాలలో సభ జరుగుతుందని వారు పేర్కొన్నారు. -
బాల్యం బందీ
సాక్షి, మంచిర్యాల : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపడుతున్నాయి. జిల్లాస్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. ఎన్ని ఉన్నా బాల కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక బాలకార్మిలను గుర్తించిన కార్మిక శాఖాధికారులు కేవలం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. మంచిర్యాల పట్టణ పరిధిలోని ప లు మురికివాడల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి బదులు పనికి పంపిస్తున్నారు. బె ల్లంపల్లి పరిధిలోని షంషీర్‌నగర్‌లో సుమారు 20 కుటుంబాలు చెత్తపేపర్లు ఏరుకుని జీవిస్తున్నాయి. పెద్దలతోపాటే చిన్నారు లూ వెళ్తారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణం. మూతబడ్డ రెసిడెన్షియల్ కేంద్రాలు.. జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారికి చదువు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. బా లలను గుర్తించిన రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఆ కేంద్రాలలో చేర్పించారు. ఒక్కో కేం ద్రంలో 50 మంది చొప్పున ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు కేటాయిస్తోంది. ఏటా ఆ స్వచ్ఛంద సం స్థలు కేంద్రాలను రెన్యూవల్ చేయించుకునే వారు. జూన్ 2013 వరకు జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట, కుభీర్, సిర్పూర్(యు)లలో కేంద్రాలు నిర్వహించారు. కేంద్రాల గడువు పూర్తయిం ది. ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించలేదు. దీంతో ఆర్వీఎం అధికారులు బడిబయట గు ర్తించిన బాలలను సమీప ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో చేర్పించారు. అనంతరం వారు ఉన్నారో లేరో పట్టించుకోలేదు. ఈ విషయమై ఆర్వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కో-ఆర్డినేటర్ సత్తార్‌ను అడుగగా.. రె సిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పా టు కోసం కలెక్టర్‌కు ఫైలు పెట్టాం. ఆదేశా లందిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. మూసివేత దిశగా ఎన్సీఎల్పీలు.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2008-09 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్(ఎన్సీఎల్పీ)ను ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒ క్కో ప్రాజెక్టు నిర్వహణకు ప్రతినెలా రూ.18 వేలు కేటాయిస్తోంది. కార్ఖానాలు, హోటళ్లు, ఇ టుక బట్టీలు, పరిశ్రమల్లో కార్మికులుగా రోడ్ల పై భిక్షాటన చేస్తూ, కాగితాలు ఏరుకునే తొ మ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయస్సు ఉన్న చి న్నారులను చేర్పించి ప్రాథమిక విద్య అందించాలి. ఒక్కో పాఠశాలల్లో 50 మందికి మించకుండా విద్యార్థులు ఉండాలి. 2012 వరకు జిల్లా వ్యాప్తంగా 40 ప్రాజెక్టులు కొనసాగాయి. తర్వాత ప్రాజెక్టులపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో స్వచ్ఛంద సంస్థలు చిన్నారులు లేకున్నా బినామీలను సృష్టించి నిధులు కాజేశాయి. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు పాఠశా ల నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించాయి. విష యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణ జరిపి ఆయా కేంద్రాలు రద్దు చేసింది. ప్ర స్తుతం లక్సెట్టిపేట, మంచిర్యాల, కాగజ్‌నగర్ లో రెండు చొప్పున, రామకృష్ణాపూర్లో ఒకటి మొత్తం ఏడు కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కేంద్రాలూ మూ తబడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి తో డు ప్రస్తుతం కేంద్రం కూడా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం లేదు.