రాంచీ: అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే అయినోళ్ళకు దూరమైన వారికి అవే ఆధారం. కాగా చీకట్లు కమ్ముకున్న చిన్నారులను ఈ ఆశ్రమాలు మరింత అంధకారంలోకి నెడుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయారు. మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ (ఎంటీడబ్ల్యూటీ)లోని పిల్లలను నాలుగేళ్లుగా లైంగిక వేధింపుల గురిచేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు శుక్రవారం జంషెడ్పూర్‌లోని గోబర్ఘౌసీలోని బాల్ కళ్యాణ్ ఆశ్రమానికి తరలించారు. అయితే నలభై మంది పిల్లల్లో 38 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదివారం గుర్తించింది. 17 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయినట్టు తెలిపారు.
కాగా తప్పిపోయిన బాలికల ఆచూకి కోసం గాలిస్తున్నట్లు తూర్పు సింగ్భూమ్ సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్ఎస్పీ) డాక్టర్ ఎం తమిళ వనన్ తెలిపారు. ఎంటీడబ్ల్యూటీ డైరెక్టర్ హర్పాల్ సింగ్ థాపర్, అతని భార్య పుష్ప రాణి టిర్కీ, వార్డెన్ గీతా సింగ్, ఆమె కుమారుడు ఆదిత్య సింగ్, మరో వ్యక్తితో సహా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. కాగా మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్ డైరెక్టర్ భార్య టిర్కీ, తూర్పు సింగ్భూమ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని, మదర్ థెరిసా వెల్ఫేర్ ట్రస్ట్ గత 10 సంవత్సరాలుగా ఖరంగజార్లో నడుస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
చదవండి: దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు
దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు
Published Mon, Jun 14 2021 10:32 AM | Last Updated on Mon, Jun 14 2021 10:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment