రాంచీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శనివారం) జార్ఖండ్ రానున్నారు. రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొని, 500 మందికి పైగా ప్రతినిధులతో ఆయన సంభాషించనున్నారు.
రాహుల్ గాంధీ తన జార్ఖండ్ పర్యటనలో పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లాక అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అదే రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. అభ్యర్థుల పేర్లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నామని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి గులాం అహ్మద్ మీర్ మీడియాకు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి మూడు దఫాలుగా చర్చించామని, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కూడా చర్చలు జరిగాయన్నారు.
ఇది కూడా చదవండి: మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’
Comments
Please login to add a commentAdd a comment