రాంచీ: కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారంపై ఆందోళనలు కొనసాగుతుండగానే అలాంటి తరహా ఘటన మరొకటి జార్ఖండ్‌లో జరిగింది. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) మెడికల్ కాలేజీ ఆస్పత్రి లిఫ్టులో మహిళా జూనియర్ డాక్టర్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వేధింపులకు గురైన డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు.
జూనియర్ డాక్టర్‌కు వేధింపుల ఘటనను నిరసిస్తూ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. డాక్టర్లకు భద్రత పెంచుతామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రతి లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్‌ను నియమించడంతో పాటు ఆస్పత్రి క్యాంపస్‌లోఎ 100 మంది సాయుధులైన భద్రతా సిబ్బందిని మోహరించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది.
ఇదీ చదవండి.. మమత అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి
Comments
Please login to add a commentAdd a comment