కోల్‌కతా: కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఇవ్వజూపినట్లు ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం మమత స్పందిస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వపై చేస్తున్న అసత్య ఆరోపణలని అన్నారు.
‘నేను బాధితురాలి తల్లిదండ్రులకు ఎటువంటి డబ్బులు ఇవ్వజూపలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలు మాత్రమే. బాధితురాలి తల్లిదండులు ఒకటి చెప్పాను. తమ కూతురి జ్ఞాపకం కోసం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా. ఆర్జీ కర్ ఆస్పత్రిలో నిరసనల తర్వాత రాజీనామా చేస్తానని కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ వినీత్ గోయల్ అన్నారు. దుర్గాపూజకు ముందు శాంతిభద్రతలు తెలిసినవారిని సీపీగా నియమించాలని యోచిస్తున్నాం. తమ ప్రభుత్వంపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఇందులో లెఫ్ట్ పార్టీలు సైతం పాలుపంచుకుంటున్నాయి. కొందరు పొరుగు దేశంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం పేరుతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. కానీ వాళ్లు ఇండియా, బంగ్లాదేశ్ అనేవి రెండు వేర్వేరు దేశాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు’’ అని అన్నారు.
#WATCH | Howrah: West Bengal CM Mamata Banerjee says, "We are fulfilling all the requirements of CISF... This is all a conspiracy hatched by the central government and some leftist parties. They are involved in this conspiracy... We are not stopping you for anything... There are… pic.twitter.com/9zGOqjWSSL
— ANI (@ANI) September 9, 2024
‘ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటినుంచీ ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్‌స్టేషన్‌లోనే వెయిట్ చేయించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేశారు. మేం దాన్ని తిరస్కరించాం’ అని బాధితురాలి తండ్రి మాట్లాడినట్లు ఇటీవల ఓ విడియో వైరల్ అయింది. అదే రోజు మరో వీడియో కూడా కూడా వైరల్ అయింది. అందులో బాధితురాలి తల్లిదండ్రులు.. ‘పోలీసులు డబ్బులు ఇవ్వజూపారని మేము అనలేదు. మా కూతురికి న్యాయం జరగాలని కోరాం’ అని తెలిపారు. దీనిపై అదేరోజు టీఎంసీ ప్రతిపక్ష బీజేపీపై ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment