కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.
చదవండి: కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!
‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్‌లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు.
చదవండి: కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
Comments
Please login to add a commentAdd a comment