వినూత్న ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఒక బెయిల్ కేసులో వినూత్న పోకడకు శ్రీకారం చుట్టింది. బెయిల్‌కు ముందు పూర్తిచేయాల్సిన విధివిధానాలపై కిందికోర్టు సంతృప్తి చెందితే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటోతేదీ లోపు మాజీ మంత్రి పార్థా ఛటర్జీని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టుకు వినూత్న ఉత్తర్వులు జారీచేసింది.
సాధారణంగా ఏదైనా కేసులో ఇరువైపులా వాదనలు విన్నాక బెయిల్‌కు అవకాశం ఉంటే వెంటనే బెయిల్ ఉత్తర్వులు ఇస్తారుగానీ ఇలా కొద్దిరోజుల తర్వాతనే బెయిల్‌పై విడుదల చేయాలని సూచించడం ఇదే తొలిసారి అని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. నగదుకు ఉద్యోగం కుంభకోణంలో 2022 జూలై 22న అరెస్టయి ఇన్నాళ్లుగా విచారణ ఖైదీగా జైళ్లో గడుపుతున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత పార్థా ఛటర్జీ బెయిల్ కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వినూత్న ఉత్తర్వులు జారీచేసింది.
#SupremeCourt to shortly pronounce judgment on the #bail plea of former West Bengal Education Minister and now MLA #ParthaChatterjee in the money laundering case arising out of the West Bengal cash-for-jobs scam
Bench: Justices Surya Kant and Ujjal Bhuyan pic.twitter.com/IB9mOBSFHI— Live Law (@LiveLawIndia) December 13, 2024
‘‘జనవరి రెండో, మూడో, నాలుగో వారా ల్లో సాక్షుల వాంగ్మూలాలతోపాటు నేరాభి యోగాల సమర్పణ ట్రయల్ కోర్టులో పూ ర్తవ్వాలి. ఇదంతా పూర్తయితే ఫిబ్రవరి ఒకటి లోపు ఆయనకు బెయిల్ ఇవ్వండి’’ అని జడ్జి సూర్యకాంత్ తీర్పు రాశారు. భవిష్యత్ బెయిల్‌గా అభివర్ణించిన ఈ కేసులో ఫిబ్రవరిలో కూడా ఆయన బెయిల్‌పై బయటికొచ్చే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించిన వేరే కేసుల్లోనూ ఆయనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం.
మనీలాండరింగ్, ఇతర అక్ర మాల కోణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి విచారిస్తున్నాయి. ఈయనపై ఈడీ 3, సీబీఐ 5 కేసులను నమోదు చేశాయి. అరెస్ట్ సమయంలో మంత్రిగా ఉన్నా రన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఛటర్జీ తరఫు లాయర్ల వాదనను కోర్టు తప్పుబట్టింది. ‘‘ఎవరైనా నిందితుడు మంత్రి వంటి పదవులు, హోదాల్లో ఉన్నంత మాత్రాన వారికి బెయిల్ ఇచ్చే విషయంలో ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏవీ ఉండవు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment