కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసింది.
ఆ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్‌లోని బెంగాలీ హిందువులు దుర్గాపూజ చేస్తున్నారు. ఇంతలో కలకలం నెలకొంది. పూజలో భాగంగా శంఖం ఊదుతుండగా, సీఎం మమతా బెనర్జీ మద్దతుదారులు మండపంలోకి ప్రవేశించి, వేడుకలను వెంటనే ఆపకపోతే, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని బీజేపీ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు తాము నమాజ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఆపివేస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ‘న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగాల్ బీజేపీ ఈ ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గామండపంలోకి 50 మంది బలవంతంగా ప్రవేశించారని, వారు మహిళలను కూడా దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీజేపీ షేర్ చేసింది. నిందితులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Disturbing scenes have emerged from West Bengal, in KMC Ward 133, Metiaburuz, where Bengali Hindus were celebrating Durga Puja. This year, many of the Tithis occurred in the morning, which led to the sound of Dhaks and conch shells being heard earlier in the day.
This angered a… pic.twitter.com/h8JYHCBYX8— BJP West Bengal (@BJP4Bengal) October 11, 2024
ఇది కూడా చదవండి: అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment