కోల్‌కతా:కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాట ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఓ లగ్జరీ రెండతస్తుల ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈడీ గుర్తించిన లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ‘‘సంగీతసందీప్ విల్లా’’ అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ కుటుంబంతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించారని, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్‌కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఇటీవల ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment