luxurious
-
కోల్‌కతా: ఈడీ దాడుల్లో సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా గుర్తింపు!
కోల్‌కతా:కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాట ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఓ లగ్జరీ రెండతస్తుల ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈడీ గుర్తించిన లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ‘‘సంగీతసందీప్ విల్లా’’ అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ కుటుంబంతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించారని, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.డాక్టర్ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఇటీవల ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం
భూమికి దిగువన అద్భుతాలు ఉంటాయని, వాటిని చూస్తే ఎంతో ఆశ్యర్యం కలుగుతుందనే విషయం మీకు తెలుసా? పైగా అక్కడ నివాసయోగ్యానికి అనువైన సకల సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన ప్రత్యేకతల కారణంగా ఒక హోటల్ చర్చల్లో నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ఈ హోటల్ భూమికి 1,375 అడుగులు(419 మీటర్లు) లోతున ఉంది. దీనిలో బస చేసేందుకు విలాసవంతమైన గదులు, పసందైన ఆహార పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కపుల్స్ కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హోటల్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అండర్‌గ్రౌండ్ హోటల్ బ్రిటన్‌లో ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే.. భూమికి అత్యంత లోతున ఉన్న హోటల్‌గా పేరొందింది. ఇది నార్త్వేల్స్లోని స్నోడోనియా పర్వతాలపై భూమికి 419 మీటర్ల దిగువన ఉంది. దీనిలో 4 పర్సనల్ ట్విన్-బెడ్ క్యాబిన్‌తో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అయితే ఈ హోటల్లోని గదులను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. హోటల్‌కు చేరుకునేందుకు ట్రెక్కింగ్ ఈ హోటల్‌కు వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సివుంటుంది. కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ చేసిన తరువాతనే ఈ హోటల్‌కు చేరుకోగలుగుతారు. ఈ మార్గంలో జలపాతాలు, అందమైన కొండలు, ఎగుడుదిగుడు రహదారులు, సొరంగమార్గాలు మొదలైనవి ఉంటాయి. ఈ హోటల్‌కు వెళ్లేవారికి ఒక గైడ్ తోడుగా ఉంటాడు. ఆయన హోటల్లో స్టే చేసేవారిని అందమైన మార్గం గుండా తీసుకువెళతారు. ఈ ప్రయాణం సాగించేవారికి హార్నర్స్ రోప్, హెల్మెట్, బూట్లు, లైటు మొదలైనవి అవసరం అవుతాయి. ఎంట్రీ గేటు వద్ద.. ఈ హాటల్‌కు వెళ్లే మార్గంలో పలు కళాఖండాలు కనిపిస్తాయి. ముందుకు సాగుతున్నప్పుడు వీటి గురించి గైడ్ వివరిస్తాడు. చివరగా హోటల్ ఎంట్రీలో ఒక పెద్ద ఇనుప తలుపు కనిపిస్తుంది. లోనికి ప్రవేశించగానే వెల్కమ్ డ్రింక్, స్నాక్స్‌తో స్వాగత సత్కారం లభిస్తుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది. హోటల్ బుకింగ్ ధర ఎంతంటే.. గో బిలో అనే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ క్యాబిన్ బుకింగ్ ధర రూ. 36,000. గుహ రూము బుకింగ్‌కు రూ. 57,000 వెచ్చించాల్సి ఉంటుంది. దీనిలో టీ, టిఫిన్ ఖర్చులు కలిసి ఉంటాయి. డైలీ స్టార్ స్యూస్ వెబ్‌సైట్‌తో ఈ హోటల్ మేనేజర్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ బస చేసేవారికి మంచి నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చేవారు అన్నిరకాల ఆందోళనలను విడిచి పెట్టి, ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. అందుకే ఈ హోటల్‌కు ‘డీప్ స్లీప్’ అనే పేరుపెట్టామన్నారు. ఈ హోటల్లో చిన్నచిన్న క్యాబిన్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని రాళ్ల మధ్యలో రూపొందించారు. ఇక గదుల విషయానికి వస్తే అవి గుహలను పోలివుంటాయి. వీటిలో పెద్దసైజు బెడ్లను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ.. -
రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!
గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? ) అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?) తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో అదిరిపోతోందట. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్‌లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే. -
రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్ హోటల్ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం: అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి ఆంటిలియాలోనే ఉంటారు. పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్ వారికి పెద్ద లెక్కే కాదు. యాంటిలియా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా. 60 ప్లోర్లతో 27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్మెంట్లో నివసించేవారు. 17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు. యూకేలోని స్టోక్ పార్క్ లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్ అంబానీ సొంతం. అల్ట్రా-రిచ్ ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని లావిష్ హోటల్ దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్లోని పాపులర్ హోటల్లో అంబానీ 248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని 2022లో 98.15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట. పామ్ జుమేరియా ఇల్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్స్. అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్ కాలనీలు, అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి. -
ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా మాజీ సారధి, టూ టైమ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతమైన టూరక్లో అత్యంత విలాసవంతమైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేశాడు. లగ్జరీ స్విమ్మింగ్ పూల్తో పాటు టెన్నిస్ కోర్ట్ కలిగిన ఈ మాన్షన్ ఖరీదు 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించబడ్డ ఈ అత్యధునిక విల్లాలో ఇండోర్-అవుట్డోర్ లివింగ్ స్పేస్‌లతో పాటు ఆధునిక వంటగది సమకూర్చబడింది. పాంటింగ్ ఇంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2013లో ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ 9.2 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్రైటన్‌లోని బీచ్‌సైడ్ శివారులో ఓ లగ్జరీ మ్యాన్షన్‌ను కొన్నాడు. ప్రస్తుతం పాంటింగ్ కుటంబంతో కలిసి అందులోనే నివాసం ఉంటున్నాడు. బ్రైటన్ గోల్డెన్ మైల్గా పిలవబడే ఆ సుందర భవనంలో 7 పడక గదులు, ఎనిమిది స్నానపు గదులు, అంతర్గత థియేటర్ మరియు బీచ్‌కి ప్రైవేట్ లేన్వే ఉన్నాయి. ఈ రెండు భవనాలే కాక పాంటింగ్ 2019లో మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 3.5 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు పడక గదులు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. ఈ విల్లా పోర్ట్ వ్యూ కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పాంటింగ్.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్ట్ మ్యాచ్‌ల్లో 51.85 సగటున 41 సెంచరీల సాయంతో 13,378 పరుగులు చేశాడు. 374 వన్డేల్లో 41.81 సగటున 29 సెంచరీల సాయంతో 13,589 పరుగులు చేశాడు. -
అత్యంత ఖరీదైన రైలు టిక్కెట్..ధర వింటే అవాక్కవుతారు
బస్సు టిక్కెట్ ధరలే ఎక్కువని చాలామంది ప్రజలు ట్రైయిన్‌లో ప్రయాణించి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. పైగా ట్రైయిన్‌లో బెర్త్ బుక్ చేసుకుని హాయిగా పడుకుని వెళ్లిపోవచ్చు. సాధారణంగా సంపన్నులు మంచి ఫస్ట్ క్టాస్ ట్రైయిన్‌లో ప్రయాణిస్తారు లేదా లగ్జరియస్ బోగి బుక్ చేసుకుని వెళ్లడం గురించి విన్నాం. కానీ అత్యంత ఖరీదైన రైల్వే టిక్కెట్ ఒకటి ఉంటుందని, అక్కడ రైల్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఎప్పుడైనా విన్నారా!. ఔను} ఈ ట్రైయిన్ టిక్కట్ ధర అత్యంత ఖరీదు. పైగా లోపల ఫైవ్ స్టార్ రేంజ్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. చూస్తే మనకు ఇది ట్రైయిన్ లేక హోటల్ అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. మహారాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో రాజభవనాన్ని తలపించేలా రాయల్ ట్రీట్మెంట్తో కూడిన సౌకర్యాలు ఉంటాయి. ఐతే టిక్కెట్ ధర ఎంతంటే అక్షరాల 19 లక్షలు పై చిలుకే ఉంటుంది. ఈ లగ్జరీ రైలు 2010 నుంచి తన సేవలను అందిస్తోంది. ఈ రైలుని మన సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత రాజసంగా తీర్చి దిద్దారు. ఈ రైలులో అత్యంత సంపన్నులు బుక్ చేసుకునే బోగిలోని గదులను నవరత్నగా పిలుస్తారు. ఆ గది ఎంత విలాసవంతంగా ఉంటుందో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నెటిజన్లు మాత్రం నమ్మశక్యంగా లేదంటూ కామెంటు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by 𝗞𝗨𝗦𝗛𝗔𝗚𝗥𝗔 | Video Creator (@kushagratayal) (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా
వాషింగ్టన్: కరోనా ముప్పేట దాడితో అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది మందిపై కరోనా ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఓ యువకుడికి ఉపాధి అవకాశం పోయింది. నిరుద్యోగిగా మారిపోయాడు. అయితే కరోనా వలన నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సహాకాలు, రుణాలు తదితర సౌకర్యాలు కల్పించి వారు తిరిగి స్థిరపడేలా అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడు. కరోనా లోన్లు తీసుకుని ఏకంగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన యువకుడు ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని పొంది ముస్తఫా విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. ఏకంగా 50 లక్షల కోవిడ్ సహాయ నిధిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. తనకు ఒక కంపెనీ ఉందని.. కరోనా వలన నష్టపోయినట్లు సహాయం కోసం దరఖాస్తు పంపాడు. ఆ దరఖాస్తులకు సమర్పించివన్నీ నకిలీవే. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పే చెక్ ప్రొటెక్షన్’ కార్యక్రమంతో ముస్తఫా లబ్ధి పొందాడు. బ్యాంక్‌లకు వెళ్లి లక్షల రూపాయల రుణం పొందాడు. నకిలీ చెక్కులు, ఐటీ రిటర్న్‌లు సమర్పించి మూడు బ్యాంకులను మోసగించాడు. దీనిపై ఫిర్యాదు రాగా పోలీసులు విచారణ చేపట్టారు. తీరా అతడి వద్దకు వెళ్లగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ముస్తఫా వద్ద ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లు కనిపించాయి. విచారణ చేపట్టగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో ఆ కార్లు కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న కార్లు, బ్యాంక్ ఖాతాలో ఉన్న 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ దూకిన చిన్నారులు తెలంగాణతో పాటు లాక్డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే! -
లగ్జరీ మాస్క్‌లతో కరోనాపై యుద్ధం
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్ ధరించడం అనివార్యంగా మారిపోయింది. కాస్త తగ్గినట్టే మళ్లీ కోవిడ్-19 పంజా విసురుతున్న తరుణంలో మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ చాలా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. నిబంధనలు ఉల్లఘించిన వారి జరిమానా కూడా విధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో కుదేలైన ఫ్యాషన్ రంగం మాస్క్‌ల తయారీలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా ముత్యాలు, వజ్రాలు పొదిగన ఆకర్షణీయమైన, విలువైన లగ్జరీ మాస్క్‌లను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి. జపాన్ అత్యంత ఖరీదైన విలాసవంతమైన మాస్క్‌తో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. ఖరీదైన, స్టయిలిష్ మాస్క్‌లతో కరోనాకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాక్స్ కో మాస్క్.కామ్ చెయిన్ ముత్యాలు పొదిగిన మాస్కులతో సందడి చేస్తోంది. గత వారం చేతితో తయారు చేసిన ముత్యాలు, వజ్రాలు పొదిగిన మాస్క్‌లను అమ్మడం ప్రారంభించిన సంస్థ ఏకంగా మిలియన్ డాలర్లు ఖరీదు చేసే మాస్క్‌లను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ఒక్కో మాస్క్ ఖరీదు (9,600 డాలర్లు) ఒక మిలియన్ యాన్ ధర ఉంటుందని తయారీదారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా నైరాశ్యంలో మునిగిన వారు తమ మాస్క్‌ల ద్వారా కొత్త అనుభూతి చెందుతారని కంపెనీ అధినేత అజుసా కజితకా రాయిటర్స్‌తో చెప్పారు. కరోనాతో జపాన్‌లో చాలా పరిశ్రమలు సంక్షోభంలో పడిపోయాయి. ముఖ్యంగా ఆభరణాలు, ఫాబ్రిక్ పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అందుకే ఇక్కడి ఆర్థిక పునరుజ్జీవనంలో సహాయపడే ప్రాజెక్టులో భాగంగా దీన్ని చేపట్టామని ఆమె తెలిపారు. వజ్రాల మాస్క్‌లను 0.7 క్యారెట్ డైమండ్లతో, 300 స్వరోవస్కి క్రిస్టల్, 330 ప్రసిద్ధి చెందిన జపనీస్ అకోయ ముత్యాలతో ముత్యాల మాస్క్‌లను రూపొందించినట్టు చెప్పారు. జపాన్‌కు చెందిన మాస్క్‌లే ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఆభరణాల వ్యాపారి వైవెల్ రూపొందించిన 250 గ్రాముల 18 క్యారెట్ల బంగారంతో చేసిన 1.5 మిలియన్ల డాలర్లు కాస్ట్లీ ముసుగునుతయారుచేసిన సంగతి తెలిసిందే. ది.రిటైలింగ్ గ్రూప్ అయాన్ కోలో భాగమైన కాక్స్, సెప్టెంబర్ నుండి మాస్క్.కామ్ ఆన్లైన్లో, ఆరు ఫిజికల్ స్టోర్ల ద్వారా లగ్జరీ విక్రయాలను ప్రారంభించింది. వీటి ధరలు 500 యెన్ల నుండి ప్రారంభమయ్యే 200 కి పైగా మాస్క్‌లను విక్రయిస్తోంది. -
ఆకట్టుకునే.. సెలబ్రిటీల స్నానాల గదులు
గృహ నిర్మాంణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్ కూ ప్రాముఖ్యతను ఇస్తారు. అయితే ఇటీవల సంపన్నుల ఇళ్ళలోనే కాక సాధారణ ప్రజలు కూడ గృహ నిర్మాణంలో ఆకట్టుకునే ఇంటీరియర్ డెకరేషన్ కు లక్షలకు లక్షలు కుమ్మరిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఇళ్ళలో ఇంటీరియర్ గురించి వర్ణించడం కూడ కష్టమే. బెడ్ రూం నుంచి... బాత్రూం వరకూ ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ఇటీవల విడుదలైన కొందరు ప్రముఖులు, సెలబ్రిటీల బాత్ రూమ్ ల ఇంటీరియర్ డెకరేషన్ ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. న్యూయార్క్ లోని హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్... ప్రపంచ ప్రఖ్యాత సెక్సీతార మార్లిన్ మన్రో... అపార్ట్ మెంట్లోని బాత్రూం... ఇంద్ర భవననాన్ని తలపిస్తోంది. పాలరాతి మెట్లమీద నల్లని జాకూజ్జీతో పాటు... అద్దాలు అమర్చిన గోడలు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. తీర్చి దిద్దిన అలంకరణ... కనువిందు చేస్తోంది. అలాగే మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సౌథింగ్టన్ ఓహియో హోమ్ లోని పైకప్పులు, గోడలు, గదుల్లోని ప్రతి అలంకరణకు తోడు.. బాత్రూం ఇంటీరియర్లు.... అతడి విలాసవంతమైన జీవితాన్ని బహిర్గత పరుస్తున్నాయి. 1980, 90 లమధ్య మైక్.. నివసించిన ఓహియో హోమ్ లోని రెస్ట్ రూం, బంగారపు వన్నెచిన్నెలద్దిన బ్రహ్మండమైన బ్లాక్ హాట్ టబ్, అద్దాల గోడలు, ఆకట్టుకునే డైజనర్ కిటికీలు అత్యున్నత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1999 లో 49 ఏళ్ళ వయసున్న మైక్.. తన ఇంటిని అమ్మేసి లాస్ వెగాస్ లో నివసిస్తున్నాడు. ఆ తర్వాత అతడి ఇల్లు చర్చిగా రూపాంతరం చెందింది. కెనడాలోని ఓ ప్రైవేట్ ద్వీపంలో ఉన్న కెనడియన్ గాయని సెలిన్ డయాన్ అందమైన ఆరు బెడ్ రూమ్ ల ఇంట్లో ఉండే బాత్ రూం లోని టబ్.. బంగారు వన్నెలతో అలంకరించి ఉంది. అలాగే 47 ఏళ్ళ ఓ గాయకుడి ఇంట్లోని బాత్ టబ్ కూడ ఎర్రని రంగులో రిచ్ క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఐకానిక్ సినిమా స్టార్ కాథరిన్ హెప్ బర్న్ ఒకప్పటి లాస్ ఏంజిల్స్ మాన్షన్ లోని బాత్ రూం చూపరుల కళ్ళు మిరుమిట్లు గొలుపేట్టు చేస్తోంది. బాత్ రూమ్ లోని మార్బుల్ ఫ్లోర్, హాట్ టబ్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్లోరిడాలోని పాప్ స్టార్ జాసన్ డెరూలో స్నానాల గది.. డినీస్ రిచర్డ్స్ లేడీస్ రూం, లివింగ్ రూం లా కనిపించే కెవిన్ కాస్టనర్ ఇంట్లోని బాత్ రూమ్ లు కూడ విభిన్న అలంకరణలు, ఆకట్టుకునే అందమైన గోడలు, క్లాసిక్ లుక్ నిచ్చే బాత్ టబ్ లతో కళ్ళు తిప్పుకోలేని సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక న్యూయార్క్ లోని ప్రముఖ కళాకారుడు ఎడ్వర్డ్ హోపర్స్ వాష్ రూమ్... విక్టోరియా మాన్షన్ ను తలపిస్తుండగా.. బకింగ్ హామ్ షైర్ లో.. బ్రిటిష్ సినిమాల షూటింగ్ లకు తరచుగా వాడే.. జేమ్స్ బాండ్ స్టార్ రోగర్ మూరె ఇంట్లో కాంతులీనే తెల్లని బాత్ రూమ్ లు ఇంటీరియర్ డిజైన్లకే మోడల్స్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మాంఛెస్టర్ సిటీలోని ఇరవై ఏళ్ళ అతి చిన్న వయసైన సాకర్ స్టార్ రహీమ్ స్టెర్లింగ్ రెస్ట్ రూం ఏకంగా ఎందరికో కలల సౌధంగా కనిపిస్తుండటం ఇంటీరియర్ డిజైనింగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. వారి వారి ఇష్టాలకు అనుగుణంగా నిర్మించుకున్న ఇంటీరియర్ డిజైన్లు ప్రముఖులు, సెలబ్రిటీల అనుభూతులను, వారి విలాసవంతమైన జీవితాలను కళ్ళముందుంచుతున్నాయి.