గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? )
అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?)
తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో అదిరిపోతోందట.
కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?)
ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్‌లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే.
Comments
Please login to add a commentAdd a comment