Yash Chopra
-
రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!
గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? ) అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?) తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో అదిరిపోతోందట. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్‌లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే. -
బాలీవుడ్లో విషాదం.. యశ్ చోప్రా భార్య కన్నుమూత
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత యశ్ చోప్రా భార్య, నిర్మాత, సింగర్ పమేలా(74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలను కూడా నిర్వహించారు. పమేలా చోప్రా కు ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. యశ్ చోప్రా 2012లో మృతి చెందారు. ఆమె కుమారుడు ఆదిత్య చోప్రా ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్‌గా ఉన్నారు. మరో కుమారుడు ఉదయ్ చోప్రా యాక్టింగ్‌లో ఉన్నారు. నటి రాణీ ముఖర్జీని ఆదిత్య చోప్రా పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) -
ఆ చిత్రం చూసే అమ్మాయిలతో మాట్లాడటం నేర్చుకున్నా: రణ్‌బీర్
దర్శక-నిర్మాత యశ్ రాజ్ చొప్రా స్మృత్యంజలిగా నెటిఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీజ్‌చేస్తోంది. ‘ది రొమాంటిక్స్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరిని రేపు(ఫిబ్రవరి 14న) వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో యశ్ చొప్రాతో ఉన్న అనుబంధం, ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు లవ్‌స్టోరి చిత్రాలపై వారి అభిప్రాయలను సేకరించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సందర్భంగా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఉద్దేశిస్తూ ‘ది రొమాంటిక్స్’లో షారుక్ ఖాన్, కాజోల్ ఈ మూవీ విశేషాలను పంచుకోగా.. ఆయుష్మాన్ ఖురానా, రణ్‌బీర్ కపూర్ ఈ మూవీ తమని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిపారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఈ సందర్భంగా బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘దిల్వాలే దుల్హనియా లేజాయంగే(DDLJ) మా తరానికి నిర్వచనంగా నిలిచింది. ఈ సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాట్లల్లో చెప్పలేను. డిడిఎల్జే నాపై ఎంతో ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఈ సినిమా చూశాకే నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలిసింది. అలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా ఈ సినిమా చూసే నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ని ఆస్కార్, ఎమ్మీ అవార్డుల నామినీ స్మృతి ముంద్రా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. చదవండి: ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
900 కోట్ల రూపాయల అప్పు.. చీకటి రోజులవి: అమితాబ్
అమితాబ్ బచ్చన్.. పరిచయం అక్కరలేని పేరు.. భారతీయ సినీ రంగానికి మకుటం లేని మహారాజు అంటారు ఆయన అభిమానులు. 78 ఏళ్ల వయసులో కూడా కుర్ర నటలకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఎంతో ఉత్సాహంగా వరుసగా ప్రాజెక్ట్‌లు పట్టాలేక్కిస్తున్నారు. నటుల కెరీర్లో ఎత్తు పల్లాలు సహజం. సినిమాలు ఫెయిల్ అవ్వడం సహజం. కానీ అమితాబ్ జీవితంలో సినిమాలతో పాటు వ్యాపారం కూడా ఫెయిలయ్యింది. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో అమితాబ్ పేరిట 900 కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయిందట. అప్పిచ్చినప్పుడు ఎంతో మర్యాదగా ఉన్న వ్యక్తులు.. ఆ తర్వాత ఎంతో దారుణంగా మాట్లాడారట. అసభ్య పదాలు వాడటమే కాక.. ఇంటికి వచ్చి మరి గొడవ చేశారట. ఆ సమయంలో తాను ఎంతో వేదనకు గురయ్యాను అన్నారు అమితాబ్. తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు గురించి ఓ లీడింగ్ పత్రికచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ‘‘44 ఏళ్ల నా సినీ కెరీర్లో 1999 కాలం నిజంగా చీకటి రోజులే. ఆ సమయంలో నేను స్థాపించిన ఓ వెంచర్ దారుణంగా విఫలమయ్యింది. ఫలితంగా నా ముందు 900 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. అప్పుల వాళ్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వారు నా ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడారు.. కొందరు ఏకంగా బెదిరించారు. ఆ సమయంలో ఏం చేయాలో నాకు పాలుపోలేదు. ఆ సమస్య నుంచి బయటపడతాననే నమ్మకం కూడా లేదు నాకు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘అలాంటి సమయంలో ఓ సారి కూర్చుని పరిస్థితులను సమీక్షించుకున్నాను. ఏలాగైనా సరే అప్పులన్ని తీర్చాలని నిర్ణయించుకున్నాను. అలా ఒక దాని తర్వాత ఒకటి చొప్పున అప్పు తీరుస్తూ వచ్చాను. దూరదర్శన్‌కు బకాయి పడ్డ మొత్తాన్ని కూడా చెల్లించాను. వడ్డీ చెల్లింపుల కోసం ఆ చానెల్లో కొన్ని ప్రకటనల్లో కనిపించాను. అయితే అప్పు ఇచ్చిన వారు నాతో ప్రవర్తించిన పద్దతిని నేను ఎప్పటికి మర్చిపోను. నా ఇంటి దగ్గరకు వచ్చి.. నన్ను నిలదీశారు.. అసభ్య పదజాలంతో దూషించారు.. బెదిరించారు’’ అంటూ చెప్పకొచ్చారు బిగ్ బీ. ‘‘2000 సంవత్సరం నాకు బాగా కలసి వచ్చింది. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించింది. అప్పుడు నేను నా ఇంటి వెనక నివాసం ఉండే యష్ చోప్రా దగ్గరకు వెళ్లి.. నాకు ఏదైనా పని చూపించండి అని అడిగాను. ఆయన ఇచ్చిన అవకాశమే మొహబ్బతేన్. ఆ సినిమా రూపంలో అదృష్టం తిరిగి నా జీవితంలోకి ప్రవేశిచింది. ఆ తర్వాత నేను ప్రారంభించిన కౌన్ బనేగా కరోడ్‌పతి బాగా క్లిక్ అయ్యింది’’ అన్నారు. 78 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ ఎంతో హుషారుగా పని చేస్తున్నారు. గతేడాది ఆయన గులాబో సితాబోతో డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించారు. ప్రసుత్తం ఆయన చెహ్రే, ఝుండ్, బ్రహ్మస్త్ర, మేడే, గుడ్‌బై చిత్రాలతో నటిస్తున్నారు. -
DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్జే).. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ నే కాదు భారతీయ చిత్రపర్రిశ్రమ స్థాయినే మరో లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోసెన్సెషనల్ క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేశాడు దర్శకుడు దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయన మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలో ఒక థియేటర్లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటే ఈ మూవీ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ జీవితాన్నే మార్చేసింది. బాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమా ఒక కారణం. అయితే ఈ సినిమాకి తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదట డైరెక్టర్ ఆదిత్య చోప్రా. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌తో ఈ సినిమాని ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడట. హీరో పాత్రని ఇండియన్ కాకుండా ఫారన్ యువకుడిగా రాసుకున్నాడట. స్రిప్ట్ అంతా సిద్దం చేసుకొని నిర్మాత యశ్ చోప్రాకు వినిపించాడట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదట. యశ్ చోప్రా సలహా మేరకు కథను అంతా మార్చి రాజ్ పాత్రని సృష్టించాడట. ఆ తర్వాత షారూఖ్‌కి వినిపించి సినిమాను తెరకెక్కించినట్లు ఓ ఇంటర్యూలో ఆదిత్య చెప్పారు. ఇదే విషయాన్ని కాజోల్ కూడా ఓ సందర్భంలో చెప్పింది. -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
గన్‌దరగోళం
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మెషీన్‌గన్ ‘గాట్లింగ్’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘వార్’. యశ్ చోప్రా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. యాక్షన్ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్గన్తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్. ఈ సీన్స్ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్’
16 ఏళ్లుగా షారుక్ ఖాన్‌కు, తనకు మధ్య మాటల్లేవ్ అంటున్నార్ బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. 1993లో యశ్‌చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘డర్’ సినిమాలో షారుక్, సన్నీ డియోల్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వీరి మధ్య వివాదం తలెత్తింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య మాటల్లేవ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సన్నీ డియోల్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. డర్ సినిమా షూటింగ్ సమయంలో యశ్ చోప్రా, షారుక్ మిమ్మల్ని చూసి భయపడ్డారా అని ప్రశ్నించగా.. అవును నేను అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు తప్పు వారిదే అన్నారు సన్నీ. ఆనాడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్. ‘ఆ రోజు షూటింగ్లో షారుక్ నన్ను పొడిచే సన్నివేశం ఉంది. దాని గురించి యశ్ చోప్రాకు నాకు మధ్య సీరియస్ డిస్కషన్ జరగుతుంది. సినిమాలో నేను కమాండో పాత్ర పోషిస్తున్నాను. అంటే చాలా స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉంటాను. అలాంటిది ఆ కుర్రాడు(షారుక్) నన్ను అంత తేలిగ్గా ఎలా కొట్ట గల్గుతాడు’ అని యశ్ జీని ప్రశ్నించాను. ‘నేను అతడిని గమనించనప్పుడు మాత్రమే నన్ను కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ నేను చూస్తుండగానే అతడు నన్ను కత్తితో పొడిస్తే.. నేను కమాండోను ఎలా అవుతాను. ఇదే విషయాన్ని యశ్ చోప్రాకు వివరించే ప్రయత్నం చేశా’ అన్నాడు. ‘కానీ ఆయన నా మాట పట్టించుకోలేదు. యశ్ జీ వయసులో నా కన్నా పెద్ద వ్యక్తి. అతడ్ని నేను చాలా గౌరవించా, తిరిగి ఎదురుచెప్పలేదు. చాలా కోపం రావడంతో నా చేతుల్ని నా పాకెట్లో పెట్టుకున్నా. తర్వాత కోపం ఇంకా ఎక్కువైపోయింది. నాకు తెలియకుండానే నా జేబు చించేశాను’ అంటూ అనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్. ‘16 ఏళ్లుగా మీరు షారుక్‌తో మాట్లాడటం లేదా ’ అని ప్రశ్నించగా.. ‘నేను మాట్లాడలేదు. వారి నుంచి దూరంగా వచ్చేశానంతే. నేను ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిని కాదు. కాబట్టి మేం ఎప్పుడూ ఒకరికొకరం ఎదురుపడలేదు. ఇక మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది’ అన్నారు సన్నీ డియోల్. -
అమ్మను ఆవిష్కరించడానికి...
స్విస్ టూరిజమ్‌ను ఇండియన్స్ ఎక్కువ ఆకర్షించడానికి బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని భావించిన స్విస్ గవర్నమెంట్ ఆ మధ్య బాలీవుడ్ దర్శక–నిర్మాత యశ్ చోప్రా విగ్రహాన్ని ప్రతిష్టించింది. తాజాగా శ్రీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఆ విషయం తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే శ్రీదేవి విగ్రహాన్ని ఆమె తనయ జాన్వీ కపూర్ ఆవిష్కరించనున్నారు. దాని కోసం జాన్వీ స్విస్ వెళ్లారు. బాలీవుడ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా జాన్వీతో పాటు స్విస్ చేరుకున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపింది జాన్వీ. అంటే.. అమ్మ బొమ్మను ఆవిష్కరించడానికి అమ్మాయి వెళ్లిందన్నమాట. -
శ్రీదేవికి నాడు యశ్ చోప్రా చెప్పని నిజం
సాక్షి, ముంబయి : ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గొప్ప నటిగా ఉన్నా శ్రీదేవి మాత్రం తన సహజత్వాన్ని ఎన్నడూ కోల్పోలేదు. అన్నిసార్లు, అన్ని వేళలా ఆమె ఒక మాములు మనిషిగానే ఉన్నారు. బాధ వస్తే చిన్నపిల్లలా ఏడ్చేయడం, సంతోషం వస్తే ఎగిరిగంతేసినంత పని చేయడం ఆమె చేసేవారు. అందుకే, ఆమె సున్నిత మనస్తత్వాన్ని సున్నిత మనస్తత్వాన్ని యశ్‌చోప్రా కూడా ఓ కీలక సందర్భంలో నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయారంట. ఆయన బతికున్న రోజుల్లో ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ చేసిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీదేవి అకాల మరణంతో ఇప్పుడు ఆ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ యశ్ చోప్రా చెప్పలేకపోయిన ఆ విషయం ఏమిటంటే ఆమె తండ్రి మరణ వార్త. అవును.. లంహే అనే చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు వారంతా మాంచెస్టర్‌లో ఉన్నారంట. ఆ సమయంలో అనుకోకుండా శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ యంగర్ చనిపోయినట్లు కబురు వచ్చింది. దీంతో ఆ వార్తను యశ్‌చోప్రా ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. దాంతో ఆమెను దగ్గరకు పిలుచుకొని, తండ్రిగారి ఆరోగ్యం బాగాలేదంటా వెళ్లి చూసి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి మెల్లగానే సినిమా షూటింగ్‌కు వచ్చేయ్ అని చెప్పారట. దాంతో శ్రీదేవి ఇంటికి వెళ్లి చూసే వరకు కూడా ఆమె తన తండ్రిని కోల్పోయిందనే విషయం తెలుసుకోలేకపోయారంట. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని 16 రోజుల తర్వాత ఆమె తిరిగి షూటింగ్‌కు వచ్చినట్లు యశ్‌చోప్రా చెప్పారు. ఇప్పుడు ఆ విషయం వైరల్ అవుతోంది. -
షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డు’కు ఎంపికయ్యారు. ‘టి. సుబ్బరామిరెడ్డి (టి.ఎస్.ఆర్) ఫౌండేషన్’ ద్వారా ప్రముఖ సినీ నిర్మాత – రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి గత మూడేళ్లుగా ప్రతి ఏటా ఒకరికి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును ఇచ్చేందుకు సుబ్బరామిరెడ్డి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మినీ కొల్హాపురి, బోనీ కపూర్ నిర్ణయించారు. లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖలకు గతంలో ఈ అవార్డును ఇచ్చారు. రానున్న ఫిబ్రవరి 25న ముంబయ్‌లో అమితాబ్, ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, శ్రీదేవి తదితరులు పాల్గొనగా, భారీయెత్తున జరిగే ఒక కార్యక్రమంలో షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును అందించనున్నారు. -
రేఖకు యశ్‌చోప్రా జాతీయ అవార్డు
అలనాటి బాలీవుడ్ అందాల తార రేఖను యశ్‌చోప్రా జాతీయ అవార్డు వరించింది. ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి తమ ఫౌండేషన్ తరపున ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ నెల 25న ముంబయ్‌లో జరిగే వేడుకలో ఈ పురస్కారాన్ని రేఖకు అందించనున్నారు. -
ఏడేళ్ల విరామం తరువాత..
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఏడేళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నాడు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని మలుపు తిప్పిన ఆదిత్యచోప్రా, 2008లో షారూఖ్, అనుష్క శర్మ జంటగా రబ్నే బనాదే జోడి సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రమే చూస్తూ వస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత 'బేఫికర్' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు ఆదిత్య చోప్రా. తన తండ్రి బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ యాష్ చొప్రా జయంతి సందర్భంగా ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాను లో బడ్జెట్ తో తెరకెక్కించాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. -
వాళ్లతో గడిపిన క్షణాలు...
బాలీవుడ్ దర్శకనిర్మాత యాష్ చోప్రా జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. తన ప్రతి అనుభూతిని ట్విటర్ లో అభిమానులతో పంచుకునే బిగ్‌బి... తనకు దివార్, కబీ కబీ, కాలాపత్తర్, సిల్సిలా లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన యష్ చోప్రాను ఆయన 83వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యాష్ చోప్రాతో పాటు ఆయన మేనల్లుడు రవి చోప్రా జయంతి కూడా కావటంతో వారిద్దరితో కలిసి పనిచేసిన రోజులను మరోసారి మననం చేసుకున్నారు అమితాబ్. చోప్రా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే అమితాబ్ 2012లో ఆయన స్మారకార్థం ఏర్పాటుచేసిన యాష్ చోప్రా మెమోరియల్ అవార్డ్ అందుకున్నారు. యాష్ చోప్రా 2012, అక్టోబర్ 12న మరణించారు. T 2008 - Yash ji's birth anniversary .. Yash Chopra and the glorious times spent together .. pic.twitter.com/nRGiVr2xqb — Amitabh Bachchan (@SrBachchan) September 26, 2015 T 2008 - Yash Chopra ji's birth anniversary falls on the same day as Ravi Chopra his nephew .. with whom I had great times too .. — Amitabh Bachchan (@SrBachchan) September 26, 2015 T 1098 - RT @MosesSapir #HappyBirthdayYashChopra @SrBachchan pic.twitter.com/d02jVpDR6s @yrf pic.twitter.com/mLQw78Lent — Amitabh Bachchan FC (@Thekkapoor) September 26, 2015 -
ఇప్పటికీ నాకు సిగ్గే!
భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. నాలుగున్నర దశాబ్దాల సినిమా కెరీర్లో ఆయన అందుకోని అభినందనలు లేవు. అయితే, కెరీర్లో మొదటి అభినందన అందుకున్నప్పుడు బిడియపడినట్లే ఇప్పటికీ పొగడ్తలంటే బిడియమే అంటున్నారు అమితాబ్. ఇన్నేళ్లయినా ఇంకా అభినందనలకు అలవాటుపడలేదని ప్రముఖ దర్శక, నిర్మాత యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ మాటే అందరితో చెప్పడంతో పాటు తన బ్లాగ్‌లో కూడా ప్రస్తావించారు. వేదికపైన అందరూ అభినందిస్తుంటే, కూర్చుని వింటున్న నేను తెగ ఇబ్బందిపడిపోతుంటాననీ, ఈ అభినందనలకు నేను అర్హుణ్ణి కాదని నా ఫీలింగ్ అనీ అమితాబ్ పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తులు అభినందిస్తున్న సమయంలో ఎలాంటి హావభావాలు పెట్టాలో తెలియడం ఓ కళ అనీ, ఆ కళను తానెప్పటికీ నేర్చుకోలేననీ ఆయన అన్నారు. అయితే, అందరూ అభినందిస్తున్నప్పుడు... ఓ నటుడిగా సాధించింది తక్కువ అనీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనీ అనుకుంటానని తెలిపారు అమితాబ్ బచ్చన్. ఇలా చెప్పడంలోనే అమితాబ్ సంస్కారం ఏంటో తెలుస్తోంది కదూ! -
తెరపైకి యశ్‌చోప్రా జీవితకథ!
డర్, చాందిని, లమ్హే, దిల్ తో పాగల్ హై, వీర్ జారా... యశ్ చోప్రా పేరు తలచుకోగానే ఈ సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. బాలీవుడ్లో రొమాంటిక్ సినిమాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడాయన. యశ్ చోప్రా చనిపోయి రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం ‘యశ్‌రాజ్ మెమోరియల్ అవార్డు’ని ప్రవేశపెట్టారు. గత ఏడాది ఈ అవార్డును ప్రముఖ గాయని అతా మంగేష్కర్‌కి ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్‌కి ఇవ్వనున్నారు. ఈ వేడుక డిసెంబర్లో జరగనుంది. కాగా, అమితాబ్ బచ్చన్‌కి అవార్డు ప్రదానం చేయనున్న విషయాన్ని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రకటించారు. ఈ సమావేశంలో.. యశ్ చోప్రా జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాలనే ఆలోచన ఉందని ఆయన సతీమణి పమేలా చోప్రా పేర్కొన్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని ఆమె తెలిపారు. -
పెళ్లయితే లిప్ లాక్ సీన్స్ చేయకూడదా?
‘‘ఇప్పటివరకు నా సినిమాలు మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటూ వచ్చాను. ఇకనుంచీ మా యశ్‌రాజ్ ఫిలింస్ రూపొందించే చిత్రాలన్నీ విజయం సాధించాలని కోరుకోవాలి. ఆ ఇంటి కోడల్ని కాబట్టి.. ఇప్పుడీ అదనపు బాధ్యత’’ అని రాణీ ముఖర్జీ అన్నారు. ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా తనయుడు, దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాను రాణీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాణీ నటించిన ‘మర్దానీ’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఆమె అందుకున్న తొలి విజయం ఇది. ఈ సందర్భంగా తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి బోల్డన్ని విశేషాలను రాణీ ఈ విధంగా పంచుకున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి ‘ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి కదా.. ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకూడడదు.. పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి’ అని కొంతమంది సన్నిహితులు నాతో అంటున్నారు. ఆ మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. పెద్దింటి కోడలైతే కెరీర్‌ని మానుకోవాల్సిందేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు దొరికిన సమాధానం ’అవసరం లేదు’ అని. నా భర్త ఆదిత్య చోప్రా మంచి దర్శక, నిర్మాత. తన ఆలోచనలన్నీ ఆధునికంగా ఉంటాయి. పెళ్లయిన తర్వాత నువ్వు నటించకూడదని నాకెప్పుడూ చెప్పలేదు. అందుకని నిక్షేపంగా నేను సినిమాలు చేస్తా. నా కెరీర్ అంటే నాకు ప్రాణం. అలాగని చివరి శ్వాస వరకూ నటించాలనుకోవడంలేదు. ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు చేస్తా. నాకు సంతృప్తికరంగా అనిపించే పాత్రలు వచ్చేవరకూ చేస్తాను. నచ్చలేదనుకోండి.. ఇంట్లోనే కూర్చుంటా. వాళ్లే నోళ్లు మూసుకుంటారు ప్రస్తుతం హిందీ రంగంలో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. కానీ, పెళ్లయినవాళ్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని అంటుంటారు. సీన్ డిమాండ్ చేసిందనుకోండి.. చేయాల్సిందే. కుదరదని చెప్పి, సినిమాకి అన్యాయం చేయాలా? లిప్ లాక్ సీన్స్‌లో నటించాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయం. ఒకవేళ ఆ హీరోయిన్‌కి నచ్చితే చేస్తారు. విమర్శించేవాళ్లు నోళ్లు ఎలాగూ ఆగవు. వాగీ వాగీ నోళ్లు మూసుకుంటారు. గర్భవతిగా ఉన్నా నటిస్తా.. గర్భం దాల్చిన తర్వాత వచ్చే శారీరక మార్పులు, ఏర్పడే ఇబ్బందుల కారణంగా ఓ ఏడాది పాటు కెరీర్‌కి దూరంగా ఉండాలని కొంతమంది ఆడవాళ్లు కోరుకుంటారు. కానీ, గర్భం దాల్చినా నేను నటించడానికి రెడీయే. కానీ, దర్శకులు అంగీకరించాలి కదా. హాలీవుడ్ తారల్లో చాలామంది గర్భంతో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా నటించారు. మరి.. మనకేంటి సమస్య? ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ‘మర్దానీ’లో నేను క్రిమినల్ బ్రాంచ్‌కి చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసమే నేర్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆడవాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నది నా అభిప్రాయం. ఆత్మరక్షణకు అది ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు తండ్రి లేక సోదరుల తోడు, పెళ్లి తర్వాత భర్త తోడు లేనిదే బయటికి వెళ్లలేని స్త్రీలు ఇప్పటికీ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. అలాగే, లైంగిక వేధింపులను ఎదిరించలేని స్త్రీలూ ఉన్నారు. తిరగబడే ధోరణిని పెంచుకోవాలి. మార్షల్ ఆర్ట్స్‌వంటి వాటివల్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. నా భర్త దర్శకత్వంలో నేను నటించాను యశ్‌రాజ్ ఫిలింస్ మా సొంత సంస్థ కాబట్టి, ఇకనుంచీ నాకు సినిమాలకు కొదవ ఉండదని కొంతమంది భావన. ‘మర్దానీ’ ఈ సంస్థే రూపొందించింది కానీ, నా తదుపరి చిత్రం ఈ సంస్థలో ఉండదు. నేను బయటి సంస్థల్లో కూడా సినిమాలు చేస్తాను. నా భర్త ఆదిత్య చోప్రా దర్శకత్వంలో అస్సలు సినిమాలు చేయాలనుకోవడంలేదు. ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో తనను కేవలం ఓ దర్శకునిగా ట్రీట్ చేయడం నావల్ల కాదు. నా భర్త అనే ఫీలింగ్ నా మనసులో ఉంటుంది కాబట్టి, లొకేషన్లో తనేమైనా నియమాలు పెడితే, అలిగే ప్రమాదం ఉంది. మా మాధ్య చిరు అలకలు, చిన్ని చిన్ని గొడవలు కామన్. అవన్నీ ఉన్నాయి కాబట్టే.. మాది ‘హ్యాపీ ఫ్యామిలీ’ అనొచ్చు. -
'వదిన మా కుటుంబాన్ని ఏకం చేసింది'
ముంబై: తన వదిన బాలీవుడ్ తార రాణీ ముఖర్జీపై నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ప్రశంసలతో ముంచెత్తారు. తన కుటుంబాన్ని ఒక్కటి చేసిన ఘనత రాణీ ముఖర్జీకి చెందుతుందని ఉదయ్ అన్నారు. అంతేకాక రాణీ ముఖర్జీ ఉత్తమ ఇల్లాలు, గృహిణీ అని ఆదిత్య చోప్రా సోదరుడు, యష్ చోప్రా కుమారుడు ఉదయ్ కితాబిచ్చారు. రాణీ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయముందని.. తాను, రాణీ కలిసి ముజ్ సే దోస్తి కరోగే అనే చిత్రంలో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాణి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందని.. అలాంటి వ్యక్తి తన వదినగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి యష్ చోప్రా తమ నుండి దూరమయ్యారనే దుఖాన్ని కూడా రాణీ దూరం చేసిందని ఉదయ్ తెలిపారు. చాలా సందర్భాల్లో తనకు బాసటగా నిలిచిందని.. గొప్పవాడివి అవుతావని రాణీ ఎప్పుడూ చెబుతుంటుందని ఉదయ్ మీడియాకు వెల్లడించారు. చాలా ఏళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతున్న ఆదిత్య, రాణి ముఖర్జీలు ఏప్రిల్ నెలలో ఇటలీ దేశంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
‘దిల్వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా?
హీరోలకు అభిమానులుంటారు. హీరోయిన్లకూ ఉంటారు. కామెడీ ఆర్టిస్ట్‌లకు, కేరక్టర్ ఆర్టిస్ట్‌లకూ అభిమానులుంటారు. కానీ, ‘సినిమా’కి అభిమానులు ఉండటం అరుదైన విషయం. ఆ ఘనతను దక్కించుకున్న సినిమాల్లో మనకు ‘మాయాబజార్’ లాంటి కొన్ని సినిమాలుంటే, బాలీవుడ్లో ‘షోలే’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు ఆ జాబితాలో చేరతాయి. ఇంకా చెప్పాలంటే ‘షొలే’ కన్నా ‘దిల్వాలే...’ ఓ మెట్టు పైనే. ముంబయ్‌లోని మినర్వా థియేటర్లో ‘షోలే’ ఐదేళ్లు ఆడితే, ఆ రికార్డ్‌ని ‘దిల్ వాలే..’ అధిగమించింది. 1995లో విడుదలైన ‘దిల్వాలే..’ ఇంకా ఆడుతోంది. ఇప్పుడు దీన్ని రీమేక్ చేయడానికి చిత్రదర్శకుడు ఆదిత్య చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్ వాలే..’ని ఓసారి స్మరించుకుందాం... అది ముంబయ్‌లోని మరాఠా మందిర్. అంటే.. సినిమా థియేటర్ అన్నమాట. 1995 వరకు ఆ థియేటర్ గురించి ఉత్తరాదివారికి బాగానే తెలుసు. ఆ తర్వాత మాత్రం మరాఠా మందిర్ ఇతర రాష్ట్రాలవారి దృష్టిని కూడా ఆకర్షించింది. దానికి కారణం ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్). రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఆడుతున్నా, ఇంకా ఈ సినిమాని ఆ థియేటర్ నుంచి తీసేయలేదు. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూడటం, చూడనివాళ్లు చూడటంతో.. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రోజులాడుతున్న సినిమాగా డీడీఎల్ నమోదైంది. 2006లో 500 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విట్జర్లాండ్ టూరిజమ్ ప్రత్యేకంగా ఓ భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి, నిర్మాత యశ్ చోప్రాతో పాటు యూనిట్ సభ్యులను భారీగా సన్మానించింది. వెయ్యి వారాల దిశలో: ఆ మధ్య ముంబయ్‌లో థియేటర్స్ స్ట్రయిక్ జరిగినప్పుడు, ఈ చిత్రప్రదర్శనను ఆపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారనే వార్త వచ్చింది. కానీ, మరాఠా మందిర్ అధినేతను యశ్ చోప్రా సంప్రదించి, వెయ్యి వారాల వరకు ఆడిస్తే బాగుంటుందని కోరారట. ఓ నిర్మాత, థియేటర్ అధినేత కోరుకున్నంత మాత్రాన ఓ సినిమా ఏళ్ల తరబడి ఆడేయదు. ప్రేక్షకాదరణ ఉంటేనే పైసా వసూల్ అవుతుంది. డీడీఎల్కి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని, వెయ్యి వారాలు గ్యారంటీ అని యశ్ చోప్రా ఫిక్స్ అయ్యారు. అందుకే, అన్ని వారాలూ సినిమాని ఉంచమని ఎగ్జిబిటర్‌ని కోరారు. ఆ ఎగ్జిబిటర్ కూడా ఈ చిత్రాన్ని తీసేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకంటే, 50 సార్లకు పైనే ఈ సినిమాని చూసినవాళ్లు ఉన్నారని, చూసిన ప్రతిసారీ చప్పట్లు కొట్టడం స్వయంగా చూశానని తనసన్నిహితుల దగ్గర ఆ ఎగ్జిబిటర్ చెప్పారట. ‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది: ‘1001 మూవీస్ యు మస్ట్ సీ బిఫోర్ యు డై’ పేరుతో ఓ ఆంగ్ల పుస్తకం ఉంది. అద్భుతః అనిపించే చిత్రాల జాబితా మాత్రమే ఆ పుస్తకంలో ఉంటుంది. అందులో ఉన్నవన్నీ హాలీవుడ్ సినిమాలే. మన భారతదేశానికి సంబంధించి ‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది. అలాగే ‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో స్థానం సంపాదించు కున్న క్రెడిట్ కూడా ‘డీడీఎల్’ సొంతం. అద్భుతమైన క్లాసిక్: ఈ సినిమాలో ప్రేయసీప్రియుల మధ్య ప్రేమ కబుర్లు ఉండవు. చెట్టాపట్టాలేసుకుని తిరగరు. మాటలతో కాకుండా మనసులతోనే ప్రేమించుకుంటారు. ఈ సినిమా అందరి మనసులకూ దగ్గరవడానికి కారణం అదే. ఆధునిక యుగంలో వచ్చినటువంటి అద్భుతమైన క్లాసిక్ ‘డీడీఎల్’. జతిన్ లలిత్ స్వరపరచిన ప్రతి పాటా ఆణిముత్యమే. దర్శకుడు ఆదిత్య చోప్రాకి ఇది తొలి సినిమా కావడం విశేషం. రాజ్ మల్హోత్రా, సిమ్రాన్ సింగ్ పాత్రల్లో షారుక్ ఖాన్, కాజోల్ జీవించారు. ఇంకా అమ్రిష్‌పురి, అనుపమ్‌ఖేర్, ఫరీదా జలాల్.. చేసినవి సహజమైన పాత్రలే అన్నట్లుగా అనిపిస్తాయి. అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. మనం చూస్తున్నది సినిమా అని మరిచిపోయి జీవితాన్నే చూస్తున్నామా! అనే భావన కలిగిస్తుందీ సినిమా. డీడీఎల్ మహత్యం అదే. తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్టే: ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడతా’ పేరుతో అనువాదమైంది. ఓవైపు హిందీ సినిమా ఆడుతున్నా, మరోవైపు తెలుగు చిత్రానికి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. కొన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది కూడా. ట్రెండ్, భాష, ప్రాంతానికి అతీతమైన సినిమాగా ‘డీడీఎల్’ నిలిచింది. గత 19 ఏళ్లలో అన్ని భారతీయ భాషల చిత్రాలపైనా ‘డీడీఎల్’ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ చిత్రంలోని ఒక సీనైనా ఏదో సినిమాలో కనిపించడం విశేషం. డీడీఎల్’ రీమేక్‌ల జోడీ ఎవరు? షారుక్ ఖాన్, కాజోల్ ‘డీడీఎల్’లో అద్భుతంగా జీవించారు. వారి మనసుకి సంబంధించిన కెమిస్ట్రీ అద్భుతం. మరి.. ఈ రీమేక్‌లో ఈ సత్తాని పండించబోతున్నది ఎవరు? అనే విషయానికొస్తే.. ఫరాన్ ఖాన్ అనే బుల్లితెర నటుణ్ణి హీరోగా, మహికా శర్మ అనే కొత్తమ్మాయిని హీరోయిన్గా ఎంపిక చేయాలనుకుంటున్నారట ఆదిత్య చోప్రా. అనుపమ్ ఖేర్ పాత్రను బొమన్ ఇరానీ చేయనున్నారట. అమ్రిష్ పురి చేసిన పాత్రను పరేష్‌రావల్‌తో చేయించాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘దుల్హనియా చలే దిల్వాలే కే సాత్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కాగా, ‘డీడీఎల్’ హిట్ పెయిర్ అనిపించుకున్న షారుక్, కాజోల్ ఈ రీమేక్‌లో అతిథి పాత్రలు చేస్తారని బాలీవుడ్ టాక్. మరి.. ఈ రీమేక్ సెట్స్‌కి వెళుతుందా? ఒకవేళ రీమేక్ అయినా, ‘డీడీఎల్’ మేజిక్‌ని రిపీట్ చేస్తుందా?... కాలమే చెప్పాలి. - డి.జి.భవాని -
నాన్న దర్శకత్వంలో నటించలేకపోవడం బాధకరం: ఉదయ్ చొప్రా
ముంబై: బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత యాష్ చొప్రా తనయుడు బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా నటిస్తున్న తాజా చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధూమ్ -౩. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉదయ్ చొప్రా మూడేళ్ల తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షులకు ముందుకు రానుంది. ధూమ్ -౩ లో ఉదయ్ `అలీ` అనే ఎమోషన్ ల్ పాత్ర పోషిస్తున్నాడు. అంతకమందు ధూమ్ రెండు సీరిస్ లలో ఉదయ్ చొప్రా తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఆదిత్య చొప్రా నిర్మాతగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ -3 ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలపై బాలీవుడ్ నటుడు ఉదయ్ చొప్రా పిటిఐతో మాట్లాడుతూ.. బాలీవు్డ్ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద దర్శకుడైన తన తండ్రి యాష్ చొప్రా దర్శకత్వంలో తాను నటించలేకపోకపోయనందుకు చాలా బాధపడుతున్నట్టు చెప్పాడు. తాను ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్ లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంతవరకూ ఆ అవకాశం రాలేదని, ఆ కల తీరేలోపే తన తండ్రి యాష్ చొప్రా అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఇది నా జీవితంలో పెద్ద విషాద సంఘటనగా పేర్కొన్నాడు. యాష్ చొప్రా దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పడు తనకు ఏదైనా చిన్న సన్నివేశంలో పాత్ర ఇవ్వమని సోదరుడు ఆదిత్యను కోరినట్టు చెప్పాడు. `జబ్ తక్ హాయ్ జాన్` అనే చిత్రం చివరి దశలో ఉండగా, యాష్ చొప్రా అనుకోని విధంగా డెంగ్యూ బారిన పడి మరణించారని తెలిపాడు. అప్పటికి తండ్రి యాష్ చొప్రాకు 80ఏళ్ల వయస్సు. తాను ధూమ్ -౩ చిత్రం కోసం చికాగోలో ఉండగా, ఆ సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ ఫోన్ వచ్చింది. అప్పటికి తండ్రి మరణించిన విషయం తన సోదరుడు ఆదిత్య చెప్పలేదన్నాడు. తన తండ్రి మరణవార్త వినడంతోనే తాను దిగ్బ్రాంతికి లోనైయన్నాడు. ప్రస్తుతం రాబోతున్న ధూమ్ -౩ చిత్రంలో తాను పోషిస్తున్నరోల్ `అలీ` (తపొరీ - రౌడీ)గా అందరినీ ఆకట్టుకుంటుందన్నాడు. వరుస పరాజయాల అనంతరం మరల తెరపైకి కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నెగిటివ్ రోల్ లో ఆమీర్ ఖాన్ నటించడం అందరికీ తెలిసిందే. -
కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ , జూహి చావ్లాషారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్ రేఖశ్రీదేవి , రాణి ముఖర్జీకత్రినా కైఫ్మాధురీ దీక్షిత్ప్రీతి జింతా , జూహి చావ్లాఅనుష్కశర్మపరిణీతి చోప్రా , షారుక్ ఖాన్ -
కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. అసలు బాలీవుడ్లో రొమాన్స్‌ని అంత చక్కగా, చిక్కగా ఇంకెవరూ తీయలేరేమో! అందుకే ఆయన్ని ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’గా అభివర్ణిస్తుంటారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. యశ్ చోప్రా లేని లోటుని ఇప్పటికీ బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఏదో ఒక సందర్భంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేఖ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహి చావ్లా, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అనుష్కశర్మ, పరిణీతి చోప్రా ఇత్యాది బ్యూటీ క్వీన్స్ అంతా ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఈ తొమ్మిది మంది తారలతో షారుక్ ఖాన్ కూడా ర్యాంప్ వాక్ చేశారు. యశ్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు. -
యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురి ర్యాంప్ వాక్
ముంబై: ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు ర్యాంప్‌వాక్ చేయనున్నారు. చోప్రా జయంతిని వైవిధ్యంగా జరపాలని భావించిన ఆయన సతీమణి పమేలా చోప్రా ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న ఈ ఫ్యాషన్ షోలో దశాబ్దకాలానికిపైగా బాలీవుడ్‌ను ఏలిన శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌తోపాటు రాణీ ముఖర్జీ, జూహీ చావ్లా, ప్రీతీ జింతా తదితర తారలు కూడా తమ అందచందాలతో ఆహూతులను అలరించనున్నారు. దేశంలో ఏటా నిర్వహించే ఫ్యాషన్ షోలకు ధీటుగా దీనిని నిర్వహించాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పమేలా భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. బాలీవుడ్‌కు ఫ్యాషన్‌ను పరిచయం చేసినవారిలో యశ్‌చోప్రాకు ప్రత్యేక స్థానముందని, ఆ ఫ్యాషన్‌తోనే ఆయనకు నివాళులర్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన కరోల్‌బాగ్ శారీ హౌస్ తమవంతు సహకారాన్ని అందిస్తోందన్నారు. దేశంలోని వివిధ భాషా చిత్రాల్లో నటిస్తున్న తొమ్మిది మంది నటీమణులు ఈ షోలో పాల్గొంటారని, వీరితోపాటు ప్రముఖ డిజైర్లు కూడా తాము రూపొందించిన దుస్తులను ఈ షోలో ప్రదర్శించే అవకాశముందని చెప్పారు. ఇక సినీ తారలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ కెరీర్‌ను మలుపుతిప్పిన దర్శకుల్లో యశ్‌చోప్రా ఒకరని, ఆయనకు నివాళి అర్పించే అవకాశం ఈ రూపంలో దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఇందులో పాల్గొనే తారలు చెబుతున్నారు.