షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు | Shah Rukh Khan To Get Yash Chopra Memorial Award | Sakshi
Sakshi News home page

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు

Published Thu, Dec 29 2016 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు - Sakshi

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ‘యశ్‌ చోప్రా నేషనల్‌ మెమోరియల్‌ అవార్డు’కు ఎంపికయ్యారు. ‘టి. సుబ్బరామిరెడ్డి (టి.ఎస్‌.ఆర్‌) ఫౌండేషన్‌’ ద్వారా ప్రముఖ సినీ నిర్మాత – రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి గత మూడేళ్లుగా ప్రతి ఏటా ఒకరికి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును ఇచ్చేందుకు సుబ్బరామిరెడ్డి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మినీ కొల్హాపురి, బోనీ కపూర్‌ నిర్ణయించారు. లతా మంగేష్కర్, అమితాబ్‌ బచ్చన్, రేఖలకు గతంలో ఈ అవార్డును ఇచ్చారు. రానున్న ఫిబ్రవరి 25న ముంబయ్‌లో అమితాబ్, ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, శ్రీదేవి తదితరులు పాల్గొనగా, భారీయెత్తున జరిగే ఒక కార్యక్రమంలో షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement