అమ్మను ఆవిష్కరించడానికి... | Swiss government decides to install a statue to honour veteran actor SriDevi | Sakshi
Sakshi News home page

అమ్మను ఆవిష్కరించడానికి...

Published Sat, Sep 15 2018 12:16 AM | Last Updated on Sat, Sep 15 2018 12:16 AM

Swiss government decides to install a statue to honour veteran actor SriDevi - Sakshi

జాన్వీ కపూర్‌

స్విస్‌ టూరిజమ్‌ను ఇండియన్స్‌ ఎక్కువ ఆకర్షించడానికి బాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని భావించిన స్విస్‌ గవర్నమెంట్‌ ఆ మధ్య బాలీవుడ్‌ దర్శక–నిర్మాత యశ్‌ చోప్రా విగ్రహాన్ని ప్రతిష్టించింది. తాజాగా శ్రీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఆ విషయం తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే శ్రీదేవి విగ్రహాన్ని ఆమె తనయ జాన్వీ కపూర్‌ ఆవిష్కరించనున్నారు. దాని కోసం జాన్వీ స్విస్‌ వెళ్లారు. బాలీవుడ్‌ ఫేమస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా కూడా జాన్వీతో పాటు స్విస్‌ చేరుకున్నట్టు తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో తెలిపింది జాన్వీ. అంటే..  అమ్మ బొమ్మను ఆవిష్కరించడానికి అమ్మాయి వెళ్లిందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement