Janhvi Kapoor Gives Tour Of Her Chennai Home Bought By Sridevi, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor Home Tour: 'అందుకే నా బాత్‌రూమ్‌కి లాక్‌ ఉండదు'.. రివీల్‌ చేసిన జాన్వీ కపూర్‌

Nov 17 2022 3:51 PM | Updated on Nov 17 2022 6:27 PM

Janhvi Kapoor Gives Tour Of Her Chennai Home Bought By Sridevi - Sakshi

అల‌నాటి అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.  భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు.  సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్న ఆమె 54 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాక ఎంతో కష్టపడి, ఇష్టపడి చెన్నైలో మొట్టమొదటిసారిగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది.

ఆ ఇల్లు అంటే తనకు ఎంతో ఇష్టమని స్వయంగా శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పింది. తాజాగా చెన్నైలోకి ఆ ఇంటికి వెళ్లిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తల్లి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన హోంటూర్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న జాన్వీ.. తన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోను చూపిస్తూ.. 'వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అందుకే ఈ ఫోటోల్లో ఇద్దరూ ఒత్తిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తన బెడ్‌రూమ్‌లో బాత్‌రూమ్‌కి గడియ ఉండదని చెప్పిన జాన్వీ ఇందుకు గల కారణాన్ని కూడా రివీల్‌ చేసింది. 'నేను బాత్‌రూమ్‌లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్‌లో మాట్లాడతానేమో అని అమ్మ భయపడేది. అందుకే నా బాత్‌రూమ్‌కి లాక్‌ పెట్టించలేదు. ఇప్పటికే ఇంటికి మరమత్తులు చేసినా నా బాత్‌రూమ్‌కి మాత్రం లాక్‌ పెట్టించలేదు' అంటూ జాన్వీ సీక్రెట్‌ను రివీల్‌ చేసింది. మరి శ్రీదేవి లాగే ఎంతో అందమైన ఆమె ఇంటిని మీరూ చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement