Janhvi Kapoor Misses Mumma Sridevi Ahead Of Death Anniversary - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor : 'ఇప్పటికీ నీకోసం వెతుకుతూనే ఉన్నాను.. ఏదైనా నీతోనే ముగుస్తుంది'

Feb 21 2023 7:17 PM | Updated on Feb 21 2023 8:09 PM

Janhvi Kapoor Misses Mumma Sridevi Ahead Of Death Anniversary - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్‌. ధడక్‌సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఆమె గుంజన్ సక్సెనా ది కార్గిల్ గాళ్‌ చిత్రంతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీకపూర్‌ తాజాగా తల్లి శ్రీదేవిని తలుచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌చేసింది.

'ఇప్పటికీ నీకోసం ప్రతిచోటా వెతుకున్నాను అమ్మా. నేను చేసే ప్రతి పని నిన్ను గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ప్రతి పని నీతోనే మొదలవుతుంది, నీతోనే ముగుస్తుంది' అంటూ జాన్వీ తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ భావోద్వేగానికి గురైంది.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి సుమారు ఐదు సంవత్సరాలు కావొస్తుంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో అనుమానాస్పదంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement