సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. హీరోయిన్‌ టీం క్లారిటీ! | Janhvi Kapoor Team Clarity On Repost of Obscene Photos On X | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఖాతాలో అశ్లీల చిత్రాలు.. టీమ్ క్లారిటీ!

Published Mon, Jun 17 2024 4:59 PM | Last Updated on Mon, Jun 17 2024 5:16 PM

Janhvi Kapoor Team Clarity On Repost of Obscene Photos On X

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్‌ మహి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు సరసన నటించింది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్‌ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే .

తాజాగా జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఊహించని విధంగా జాన్వీ కపూర్‌ తన ఎక్స్‌ ఖాతాలో అశ్లీల చిత్రాలు పోస్ట్‌ చేసినట్లు కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. అయితే ఇది గమనించిన జాన్వీకపూర్‌ టీమ్‌ ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది.

అసలు జాన్వీకపూర్‌కు ఎక్స్‌లో అకౌంట్‌ లేదని తెలిపారు. జాన్వీ కపూర్‌ పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్‌గా గుర్తించారు. ఆమె పేరుతో ఖాతా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్‌ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్‌ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా ఖాతాను సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. కాగా.. జాన్వీ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి దేవరలో కనిపించనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కించనున్న రామ్ చరణ్‌ చిత్రంలో నటించనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement