ఆస్పత్రిలో చేరడం మొదటిసారి.. భయంతో వణికిపోయా: జాన్వీ కపూర్ | Janhvi Kapoor Shares doctors panicked during her hospitalisation | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: రిపోర్ట్ చూసి డాక్టర్లు కూడా భయపడ్డారు: జాన్వీ కపూర్

Published Wed, Jul 24 2024 7:45 PM | Last Updated on Wed, Jul 24 2024 8:19 PM

Janhvi Kapoor Shares doctors panicked during her hospitalisation

దేవర భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్త అధికారి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో అనారోగ్యానికి గురి కావడంపై నోరు విప్పింది. ఫుడ్‌ పాయిజన్‌తో చాలా భయానికి గురైనట్లు వెల్లడించింది. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను ఆస్పత్రిలో చేరడం ఇదే మొదటిసారి. మూవీ ప్రమోషన్లు, షూటింగ్‌లతో బాగా అలసిపోయా. ఒక ఈవెంట్ కోసం చెన్నైకి వెళ్లా. అక్కడ విమానాశ్రయంలో ఫుడ్ తీసుకున్నా. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేసింది. దీంతో భయంతో వణికిపోయా. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్‌ ఎక్కేముందు పక్షవాతం వచ్చిందా అన్న ఫీలింగ్ కలిగింది. సాయం లేకుండా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయానని' తెలిపింది.

'కానీ ఆస్పత్రిలో చేరాక వైద్య పరీక్షలు చేశారు. రిపోర్డులు చూసిన డాక్టర్లు సైతం భయపడ్డారు. లివర్‌ బాగా ఇబ్బందికి గురైనట్లు పరీక్షల్లో తేలింది. దీంతో మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్‌ చేయగలనో, లేదో అని భయపడ్డా. ప్రస్తుతం మళ్లీ వర్క్‌లో బిజీ అవుతున్నా' అని తెలిపింది. అయితే ఇప్పుడంతా బాగానే ఉందని వెల్లడించింది. కాగా.. జాన్వీ కపూర్‌ నటించిన తాజా చిత్రం ఉలజ్‌ ఆగస్టు 2న  ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement