ఆస్పత్రిలో చేరిన దేవర హీరోయిన్.. అసలేం జరిగిందంటే? | Janhvi Kapoor Hospitalised Due To Food Poisoning All Events Cancelled, Deets Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor Health Update: ఆస్పత్రిలో చేరిన జాన్వీ కపూర్.. ఎందుకంటే?

Published Thu, Jul 18 2024 5:19 PM | Last Updated on Thu, Jul 18 2024 5:54 PM

Janhvi Kapoor Hospitalised Due To Food Poisoning All Events Cancelled

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే జూలై 12న అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన ముద్దుగుమ్మ ఆస్పత్రిలో చేరారు. జాన్వీ కపూర్‌ ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ సైతం కపూర్ ధృవీకరించారు.

జాన్వీ అనారోగ్యానికి గురి కావడంతో ఈ వారంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుందని జాన్వీ సన్నిహితులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూలై 12న ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే  మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో అభిమానులను అలరించింది. ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ఉలజ్‌ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల మూవీ ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement