కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్‌ ఆసక్తికర కామెంట్స్! | Janhvi Kapoor Open About the qualities she wants to see in her partner | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: పార్ట్‌నర్‌ ఎలా ఉండాలంటే?.. దేవర భామ ఆసక్తికర కామెంట్స్!

Published Wed, May 15 2024 8:00 PM | Last Updated on Wed, May 15 2024 8:08 PM

Janhvi Kapoor Open About the qualities she wants to see in her partner

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీకపూర్. త్వరలోనే మిస్టర్ అండ్‌ మిసెస్‌ మాహీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా బుధవారం ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారికి ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడిగారు. అయితే దీనికి జాన్వీ కపూర్‌ ఆసక్తికర సమాధానమిచ్చింది. అదేంటో మీరు చూసేయండి.

జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ..' నా కలలను తనవిగా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. బాలీవుడ్ భామ తన స్నేహితుడు శిఖర్‌ పహారియాతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. చాలా సింపుల్‌గా శ్రీవారి ఆలయంలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరోవైపు జాన్వీకపూర్‌ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే మూవీలో నటించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement