దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్‌జే).. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ నే కాదు భారతీయ చిత్రపర్రిశ్రమ స్థాయినే మరో లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోసెన్సెషనల్ క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేశాడు దర్శకుడు దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయన మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
మహారాష్ట్రలో ఒక థియేటర్‌లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటే ఈ మూవీ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ జీవితాన్నే మార్చేసింది. బాలీవుడ్‌లో ఆయన స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమా ఒక కారణం.
అయితే ఈ సినిమాకి తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదట డైరెక్టర్ ఆదిత్య చోప్రా. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌తో ఈ సినిమాని ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడట. హీరో పాత్రని ఇండియన్ కాకుండా ఫారన్ యువకుడిగా రాసుకున్నాడట. స్రిప్ట్ అంతా సిద్దం చేసుకొని నిర్మాత యశ్ చోప్రాకు వినిపించాడట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదట. యశ్ చోప్రా సలహా మేరకు కథను అంతా మార్చి రాజ్ పాత్రని సృష్టించాడట. ఆ తర్వాత షారూఖ్‌కి వినిపించి సినిమాను తెరకెక్కించినట్లు ఓ ఇంటర్యూలో ఆదిత్య చెప్పారు. ఇదే విషయాన్ని కాజోల్ కూడా ఓ సందర్భంలో చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment