Dilwale Dulhania Le Jayenge
-
DDLJ: 26 ఏళ్ల తర్వాత.. మళ్లీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’
షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్జే) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1995లో విడుదలైన ఈ క్లాసిక్‌ను మళ్లీ డైరెక్ట్ చేయనున్నారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్ కాదు.. సీక్వెలూ కాదు. ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్ ఫాల్ ఇన్ లవ్: ది డీడీఎల్జే మ్యూజికల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య చోప్రా మాట్లాడుతూ – ‘‘డీడీఎల్జే’ను నా 23ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలనుకోలేదు. ఒకటి.. రెండు ఇండియన్ సినిమాలను తీశాక హాలీవుడ్లో టామ్క్రూజ్తో తీయాలనుకున్నాను.. కుదర్లేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌లతో తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్రాడ్ వే మ్యూజికల్‌గా రానుంది. అమెరికన్ అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య ఈ కథనం ఉంటుంది. మళ్లీ నా వయసు నాకు 23 ఏళ్లలా అనిపిస్తోంది. 2022లో ‘డీడీఎల్జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు. -
DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్జే).. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ నే కాదు భారతీయ చిత్రపర్రిశ్రమ స్థాయినే మరో లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోసెన్సెషనల్ క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేశాడు దర్శకుడు దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయన మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలో ఒక థియేటర్లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటే ఈ మూవీ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ జీవితాన్నే మార్చేసింది. బాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమా ఒక కారణం. అయితే ఈ సినిమాకి తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదట డైరెక్టర్ ఆదిత్య చోప్రా. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌తో ఈ సినిమాని ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడట. హీరో పాత్రని ఇండియన్ కాకుండా ఫారన్ యువకుడిగా రాసుకున్నాడట. స్రిప్ట్ అంతా సిద్దం చేసుకొని నిర్మాత యశ్ చోప్రాకు వినిపించాడట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదట. యశ్ చోప్రా సలహా మేరకు కథను అంతా మార్చి రాజ్ పాత్రని సృష్టించాడట. ఆ తర్వాత షారూఖ్‌కి వినిపించి సినిమాను తెరకెక్కించినట్లు ఓ ఇంటర్యూలో ఆదిత్య చెప్పారు. ఇదే విషయాన్ని కాజోల్ కూడా ఓ సందర్భంలో చెప్పింది. -
మచాలియా
‘ధూమ్’.. అంటే బ్లాస్ట్ ఇంగ్లిష్‌లో. తెలుగులో విస్ఫోటనం అంటారు. కానీ వాడుకలో బ్లాస్టే బెటర్. బాక్సాఫీసుని కొల్లగొట్టిన భారతీయ సినిమాలు చాలా వాటిల్లో అంతర్లీనంగా ఒకే ఫార్ములా ఉంటుంది- ‘బ్రేక్ ద రూల్స్’. రూల్స్‌ని బ్రేక్ చేసి కొత్త రూట్ క్రియేట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ని కలెక్షన్లతో బ్లాస్ట్ చేసింది. అదే ‘ధూమ్’. 2004, ఆగస్టు 27న అలాంటి ఒక బ్లాస్ట్ బాక్సాఫీసుని బద్దలుకొట్టింది. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అనే రాముడు మంచి బాలుడు టైప్ సూపర్‌హిట్ సినిమా తీసిన ఆదిత్య చోప్రా తను నిర్మాతగా మారి సంజయ్ గాధ్వి అనే ఊరూ పేరూ తెలీని దర్శకుణ్ని పెట్టుకుని తనే కథ ఇచ్చి మరీ సూపర్‌హిట్ సినిమా తీయించాడు. ఒక కథలో ప్రొటాగనిస్ట్, అంటే హీరో, యాంటాగనిస్ట్ అంటే విలన్. ఒక దొంగని హీరోగా పెట్టి సినిమా తీసినప్పుడు ఆ దొంగ ప్రొటాగనిస్ట్, అతణ్ని పట్టుకోవాలని ప్రయత్నించే మంచి, సిన్సియర్ పోలీసాఫీసర్ విలన్, అంటే యాంటాగనిస్ట్ అవుతాడు. ఇలా రివర్స్ చేసి రాసుకున్న కథ ‘ధూమ్’.సాధారణంగా ఒక సినిమా సీక్వెల్ తీస్తే అందులో హీరోని మాత్రం కంటిన్యూ చేస్తూ, మిగిలిన పాత్రల్ని మారుస్తారు. ‘ధూమ్’తో ఆ రూల్‌ని కూడా బ్రేక్ చేశారు ఆదిత్య చోప్రా. హీరోల్ని మాత్రమే మారుస్తూ మిగిలిన పాత్రల్ని కంటిన్యూ చేయిస్తూ, ‘ధూమ్’ మూడు భాగాలు తీశారు. నాలుగోది తీయబోతున్నారు. నాలుగో భాగంతో కలిపి ‘ధూమ్’ చిత్రాల వ్యాపారం వేయి కోట్లకు చేరుతుంది. అందుకు ఆద్యమైన మొదటి సినిమా ‘ధూమ్’ కథా కమామీషు ఈ వారం మన ‘వ్యాసం’గం. కథ ముందు, కమామీషు తర్వాత. ముంబైలో బైకర్స్గ్యాంగ్ ఒకటి ఏర్పడి, పోలీస్ డిపార్ట్మెంట్కి పెనుసవాలు విసురుతుంది. చిత్ర విచిత్రమైన దొంగతనాలతో, క్షణాల్లో మాయమైపోతూ వాళ్లని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని నియమిస్తుంది. అతను వాళ్ల వివరాల కోసం ఒక చిల్లర దొంగని సహాయకుడిగా పెట్టుకుంటాడు. బైక్గ్యాంగ్ నాయకుడు హీరో - జాన్ అబ్రహామ్. పట్టుకోవాలని ప్రయత్నించే పోలీసాఫీసర్ - యాంటీ హీరో - అభిషేక్ బచ్చన్. అతని సహాయకుడు - చిల్లర దొంగ - ఉదయ్ చోప్రా. వీళ్ల మధ్య చిన్నపిల్లలాడుకునే దొంగ-పోలీస్ ఆట, చోర్ - చోర్, ఐస్ బాక్స్, టామ్ అండ్ జెర్రీ, క్యాట్ అండ్ మౌస్ ఇత్యాది ఆటల్లాంటి ఆటే సినిమా అంతా.దొంగ తన తెలివితేటలతో, స్కిల్స్‌తో పోలీసుకి దొరక్కుండా తప్పించుకు తిరగడం, ఆ ప్రయత్నంలో అతనికో ప్రేమకథ, ఇలాంటి మసాలాలన్నీ దట్టించి చాలా స్టైలిష్‌గా, లావిష్‌గా తీసిన భారీ యాక్షన్ సినిమా ‘ధూమ్’. ‘‘ధూమ్ మచాలే...’’ టైటిల్ సాంగ్ మూడు భాగాలకీ బెస్ట్ సాంగ్. ఏడు కోట్లతో తీసిన చిన్న సినిమా పదిరెట్లు అంటే డెబ్భై కోట్లు వసూలు చేసి, చాలా పెద్ద సినిమా అయింది. అదీ విశేషం. ఈ సినిమా ఇచ్చిన లాభంతో ఇంకా భారీగా ‘ధూమ్-2’ తీశారు నిర్మాత, దర్శకుడు - జాన్ అబ్రహామ్ బదులు హృతిక్ రోషన్‌ని, ఈషాడియోల్ బదులు ఐశ్వర్యారాయ్‌ని పెట్టి. అదిచ్చిన లాభంతో ‘ధూమ్-3’ తీశారు- ఆమిర్‌ఖాన్‌ని, కత్రినాకైఫ్‌ని పెట్టి. ఇప్పుడు నాలుగో భాగం ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇలా ఒకదాన్ని మించి ఒకటి రెట్టింపు లాభాలతో విజయవంతమవుతున్నా యంటే ‘ధూమ్-1’లో కుదిరిన ఫార్ములా ఎంత గట్టిదో, ఎంత కరెక్టో అర్థమౌతోంది. పునాది బలంగా ఉంటేనే కదా, బిల్డింగ్ ఎన్ని అంతస్తులైనా కట్టుకోగలం. అలాంటి బలమైన పునాదే ‘ధూమ్’.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తీసిన దర్శకుడు నిర్మాతగా మారి, మారుతున్న మిలీనియం యువత నాడిని పర్ఫెక్ట్గా పట్టుకుని, విజయవంత మవ్వడం ఎందరికో స్ఫూర్తినిచ్చే విషయం. ఈ ‘ధూమ్’ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి మొదటి చిత్రం ‘తేరేలియే’ విడుదల కాకుండానే ఆగిపోయింది. రెండో చిత్రం ‘మేరే యార్కి షాదీ’ చాలా యావరేజ్ చిత్రం. అలాంటివాడికి అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఆదిత్య చోప్రాని మరీ మరీ అభినందించాలి. ఈ వ్యాసం రాయడం కోసం ఇప్పుడు మళ్లీ చూసినా ఈ చిత్రం అంతే గ్రిప్పింగ్‌గా ఉంది. క్లైమాక్స్ సూపర్.ఇంగ్లిష్‌లో ఇలాంటి చిత్రాలు చాలానే చూసుంటాం. జాకీచాన్ చిత్రాల్లో ఇలాంటి సీన్లు, ఛేజ్‌లు, ఫైట్లు చాలానే చూసుంటాం. కానీ మన నేటివిటీలో మన పాత్రలు, మన నటీనటులతో ఆ స్థాయి చిత్రాలు తీయడమే అసలైన పురోగతి. ‘ధూమ్’ హిట్టవ్వడం వల్ల హిందీ సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిందని కచ్చితంగా చెప్పొచ్చు. వచ్చేవారం మరో మంచి చిత్రంతో కలుద్దాం. మెచ్చుకోదగ్గ డైలాగుల్లో మచ్చుకి కొన్ని... ‘వేగం బుల్లెట్లో ఉండదు. కాల్చేవాడిలో ఉంటుంది.’ ‘నా రూల్స్ ఎవడూ బ్రేక్ చేయలేడు, నేను కూడా.’ ‘ఏదీ శాశ్వతం కాదు - నువ్వు, నేను, ప్లాన్, టైమ్.’ ‘నీ అదృష్టం మారబోతోంది - నువ్వు కూడా మారిపోతావ్.’ ‘చెడు ఎంత వేగంగా ముందుకెళ్లినా, అదెప్పుడూ మంచికి వెనకాలే ఉంటుంది.’ -
అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!
‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో ట్రైన్ ఎక్కడానికి కాజోల్ పరిగెడుతుంటే, ఆమెకు సహాయం చేయడానికి షారుక్ ఖాన్ చేయి అందించడం గుర్తుందా? ఆ సన్నివేశం భలే రసవత్తరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు చూశాం. కానీ, షారుక్-కాజోల్ వేసిన ముద్ర మాత్రం చెరిగిపోలేదు. మళ్లీ.. కాజోల్ అలా పరిగెత్తనున్నారు. షారుక్ చేయి ఇవ్వనున్నారు. ఆశ్చర్యంగా ఉందా? ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇద్దరూ కలిసి ‘దిల్వాలే’లో నటిస్తున్నారు. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో మనసుని హత్తుకున్న ట్రైన్ సీన్‌లాంటిదే ఇందులో పెట్టాలని రోహిత్ శెట్టి అనుకుంటున్నారట. అయితే.. ఈ సీన్‌ని ట్రామ్‌లో తీయాలనుకుంటున్నారట. నాడు.. ట్రైన్ సీన్ మ్యాజిక్ చేసినట్లుగా.. రేపు ఈ ట్రామ్ సీన్ మ్యాజిక్ చేస్తుందా?.. వెయిట్ అండ్ సీ. -
ఏళ్లు గడిచినా తరగని అభిమానం
-
అపూరూప ప్రేమ కావ్యం
-
1000 వారాల ప్రేమకధ
-
1000 వారాల డిడిఎల్జె
-
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ విడుదలైన ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళవుతోంది. ఈ వారంలో ముంబయ్‌లోని ‘మరాఠా మందిర్’ హాలులో ఈ చిత్రం వెయ్యి వారాల ప్రదర్శన పూర్తి చేసుకోనుంది. మొదట్లో రోజు 4 ఆటలు ప్రదర్శించి, ఆ తరువాత కేవలం ఉదయం ఆటలకు పరిమితమైన ఈ సినిమాను తక్కువ టికెట్ రేట్లకు ప్రదర్శిస్తుండడం విశేషం. కాగా, ఈ వెయ్యి వారాల రికార్డు పండుగ సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఓ ప్రత్యేక కార్యక్రమం, విందు ఏర్పాటు చేస్తోంది. హీరో హీరోయిన్లు ఈ చిత్ర నిర్మాణ విశేషాల గురించి వేదికపై సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. ఈ చిత్రానికి తమకు అవకాశమెలా వచ్చిందన్న దగ్గర నుంచి నిర్మాణ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనల లాంటివన్నీ ఆ రోజు ఈ జంట పంచుకోనుంది. -
‘దిల్వాలే...’ మేజిక్ రిపీట్ అవుతుందా?
హీరోలకు అభిమానులుంటారు. హీరోయిన్లకూ ఉంటారు. కామెడీ ఆర్టిస్ట్‌లకు, కేరక్టర్ ఆర్టిస్ట్‌లకూ అభిమానులుంటారు. కానీ, ‘సినిమా’కి అభిమానులు ఉండటం అరుదైన విషయం. ఆ ఘనతను దక్కించుకున్న సినిమాల్లో మనకు ‘మాయాబజార్’ లాంటి కొన్ని సినిమాలుంటే, బాలీవుడ్లో ‘షోలే’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు ఆ జాబితాలో చేరతాయి. ఇంకా చెప్పాలంటే ‘షొలే’ కన్నా ‘దిల్వాలే...’ ఓ మెట్టు పైనే. ముంబయ్‌లోని మినర్వా థియేటర్లో ‘షోలే’ ఐదేళ్లు ఆడితే, ఆ రికార్డ్‌ని ‘దిల్ వాలే..’ అధిగమించింది. 1995లో విడుదలైన ‘దిల్వాలే..’ ఇంకా ఆడుతోంది. ఇప్పుడు దీన్ని రీమేక్ చేయడానికి చిత్రదర్శకుడు ఆదిత్య చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్ వాలే..’ని ఓసారి స్మరించుకుందాం... అది ముంబయ్‌లోని మరాఠా మందిర్. అంటే.. సినిమా థియేటర్ అన్నమాట. 1995 వరకు ఆ థియేటర్ గురించి ఉత్తరాదివారికి బాగానే తెలుసు. ఆ తర్వాత మాత్రం మరాఠా మందిర్ ఇతర రాష్ట్రాలవారి దృష్టిని కూడా ఆకర్షించింది. దానికి కారణం ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్). రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఆడుతున్నా, ఇంకా ఈ సినిమాని ఆ థియేటర్ నుంచి తీసేయలేదు. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూడటం, చూడనివాళ్లు చూడటంతో.. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రోజులాడుతున్న సినిమాగా డీడీఎల్ నమోదైంది. 2006లో 500 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విట్జర్లాండ్ టూరిజమ్ ప్రత్యేకంగా ఓ భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి, నిర్మాత యశ్ చోప్రాతో పాటు యూనిట్ సభ్యులను భారీగా సన్మానించింది. వెయ్యి వారాల దిశలో: ఆ మధ్య ముంబయ్‌లో థియేటర్స్ స్ట్రయిక్ జరిగినప్పుడు, ఈ చిత్రప్రదర్శనను ఆపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారనే వార్త వచ్చింది. కానీ, మరాఠా మందిర్ అధినేతను యశ్ చోప్రా సంప్రదించి, వెయ్యి వారాల వరకు ఆడిస్తే బాగుంటుందని కోరారట. ఓ నిర్మాత, థియేటర్ అధినేత కోరుకున్నంత మాత్రాన ఓ సినిమా ఏళ్ల తరబడి ఆడేయదు. ప్రేక్షకాదరణ ఉంటేనే పైసా వసూల్ అవుతుంది. డీడీఎల్కి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని, వెయ్యి వారాలు గ్యారంటీ అని యశ్ చోప్రా ఫిక్స్ అయ్యారు. అందుకే, అన్ని వారాలూ సినిమాని ఉంచమని ఎగ్జిబిటర్‌ని కోరారు. ఆ ఎగ్జిబిటర్ కూడా ఈ చిత్రాన్ని తీసేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకంటే, 50 సార్లకు పైనే ఈ సినిమాని చూసినవాళ్లు ఉన్నారని, చూసిన ప్రతిసారీ చప్పట్లు కొట్టడం స్వయంగా చూశానని తనసన్నిహితుల దగ్గర ఆ ఎగ్జిబిటర్ చెప్పారట. ‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది: ‘1001 మూవీస్ యు మస్ట్ సీ బిఫోర్ యు డై’ పేరుతో ఓ ఆంగ్ల పుస్తకం ఉంది. అద్భుతః అనిపించే చిత్రాల జాబితా మాత్రమే ఆ పుస్తకంలో ఉంటుంది. అందులో ఉన్నవన్నీ హాలీవుడ్ సినిమాలే. మన భారతదేశానికి సంబంధించి ‘మదర్ ఇండియా’, ‘డీడీఎల్’కే ఆ ఘనత దక్కింది. అలాగే ‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’లో స్థానం సంపాదించు కున్న క్రెడిట్ కూడా ‘డీడీఎల్’ సొంతం. అద్భుతమైన క్లాసిక్: ఈ సినిమాలో ప్రేయసీప్రియుల మధ్య ప్రేమ కబుర్లు ఉండవు. చెట్టాపట్టాలేసుకుని తిరగరు. మాటలతో కాకుండా మనసులతోనే ప్రేమించుకుంటారు. ఈ సినిమా అందరి మనసులకూ దగ్గరవడానికి కారణం అదే. ఆధునిక యుగంలో వచ్చినటువంటి అద్భుతమైన క్లాసిక్ ‘డీడీఎల్’. జతిన్ లలిత్ స్వరపరచిన ప్రతి పాటా ఆణిముత్యమే. దర్శకుడు ఆదిత్య చోప్రాకి ఇది తొలి సినిమా కావడం విశేషం. రాజ్ మల్హోత్రా, సిమ్రాన్ సింగ్ పాత్రల్లో షారుక్ ఖాన్, కాజోల్ జీవించారు. ఇంకా అమ్రిష్‌పురి, అనుపమ్‌ఖేర్, ఫరీదా జలాల్.. చేసినవి సహజమైన పాత్రలే అన్నట్లుగా అనిపిస్తాయి. అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోశారు. మనం చూస్తున్నది సినిమా అని మరిచిపోయి జీవితాన్నే చూస్తున్నామా! అనే భావన కలిగిస్తుందీ సినిమా. డీడీఎల్ మహత్యం అదే. తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్టే: ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమించి పెళ్లాడతా’ పేరుతో అనువాదమైంది. ఓవైపు హిందీ సినిమా ఆడుతున్నా, మరోవైపు తెలుగు చిత్రానికి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. కొన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది కూడా. ట్రెండ్, భాష, ప్రాంతానికి అతీతమైన సినిమాగా ‘డీడీఎల్’ నిలిచింది. గత 19 ఏళ్లలో అన్ని భారతీయ భాషల చిత్రాలపైనా ‘డీడీఎల్’ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ చిత్రంలోని ఒక సీనైనా ఏదో సినిమాలో కనిపించడం విశేషం. డీడీఎల్’ రీమేక్‌ల జోడీ ఎవరు? షారుక్ ఖాన్, కాజోల్ ‘డీడీఎల్’లో అద్భుతంగా జీవించారు. వారి మనసుకి సంబంధించిన కెమిస్ట్రీ అద్భుతం. మరి.. ఈ రీమేక్‌లో ఈ సత్తాని పండించబోతున్నది ఎవరు? అనే విషయానికొస్తే.. ఫరాన్ ఖాన్ అనే బుల్లితెర నటుణ్ణి హీరోగా, మహికా శర్మ అనే కొత్తమ్మాయిని హీరోయిన్గా ఎంపిక చేయాలనుకుంటున్నారట ఆదిత్య చోప్రా. అనుపమ్ ఖేర్ పాత్రను బొమన్ ఇరానీ చేయనున్నారట. అమ్రిష్ పురి చేసిన పాత్రను పరేష్‌రావల్‌తో చేయించాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘దుల్హనియా చలే దిల్వాలే కే సాత్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కాగా, ‘డీడీఎల్’ హిట్ పెయిర్ అనిపించుకున్న షారుక్, కాజోల్ ఈ రీమేక్‌లో అతిథి పాత్రలు చేస్తారని బాలీవుడ్ టాక్. మరి.. ఈ రీమేక్ సెట్స్‌కి వెళుతుందా? ఒకవేళ రీమేక్ అయినా, ‘డీడీఎల్’ మేజిక్‌ని రిపీట్ చేస్తుందా?... కాలమే చెప్పాలి. - డి.జి.భవాని -
సాధన చేయాలి : నటనపై అనుపమ్‌ఖేర్
నటన అనేకమందికి సహజంగా వస్తుందని, అయితే దానిని నేర్చుకోవడంతోపాటు సాధన చేయాల్సిన అవసరం కూడా ఉందని అగ్ర నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనుపమ్‌ఖేర్ పేర్కొన్నాడు. ‘సాధన అనేది నటుడిని మరింత తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుంది. ఇది సైక్లింగ్, మోటార్ డ్రైవింగ్ వంటిది. ఇదొక కళ. మీ జీవితంలో మీరు అనేక హావభావాలను ప్రదర్శిస్తుంటారు. అయితే వాటినే ఇక్కడ సాధన చేయాల్సి ఉంటుంది’ అని అన్నాడు. ‘మీలోని నటుడిని బయటికి తీసుకొస్తామనేదే మా నినాదం. ప్రతి రోజూ మనిషి మెదడు అనేక సంకేతాలను పంపుతుంది. అయితే నటనలో అటువంటి సంకేతాలు ఏమీ ఉండవు. మిమ్మల్ని మీరు గొప్పగా చూపుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. మా స్కూల్ మిమ్మల్ని మంచి నటుడిగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎవరు బాగా నటించగలుగుతున్నారనే విషయం తెలిసేవిధంగా చేస్తుంది. అంతేకాకుండా చక్కని క్రమశిక్షణ నేర్పుతుంది. ఎలా జీవించాలో కూడా తెలియజేస్తుంది’ అని అన్నాడు. కాగా ఖేర్ ఓ యాక్టింగ్ స్కూల్‌ను నడుపుతున్నాడు. కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేస్తున్న యురేకా ప్రొడక్షన్స్ సంస్థ సహకారంతో ఖేర్ స్కూల్ ప్రపంచంలోని గొప్ప గొప్ప పాఠశాలలపై ‘స్కూల్స్ లైక్ నో అదర్స్’ పేరిట కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. ఈ పాఠశాలను అనుపమ్ ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. దీనికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ విషయమై ఖేర్ మాట్లాడుతూ ఈ పాఠశాలకు మంచి గుర్తింపు రావడం వ్యక్తిగతంగా తనకే కాకుండా, దేశానికి కూడా గొప్ప గౌరవమన్నాడు. కేవలం ఎనిమిది సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప అనుభూతిగా అభివర్ణించాడు. సారాంశ్, డాడీ, కర్మ, డర్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, మైనే గాంధీకో నహీ మారా వంటి వాణిజ్య సినిమాల్లో అనుపమ్ తన అద్భుత నటనాశైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా బెండ్ ఇట్ లైక్ బెఖమ్, బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ వంటి ఆంగ్ల సినిమా ప్రాజెక్టుల్లోనూ అనుపమ్ భాగస్వామే. ఇటీవల ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ అనే ఆంగ్ల సినిమాలోనూ నటించాడు అనుపమ్.