అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్! | Then the Train Now tram .. !. | Sakshi
Sakshi News home page

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

Published Thu, Jun 25 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

అప్పుడు ట్రైన్.. ఇప్పుడు ట్రామ్!

‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో ట్రైన్ ఎక్కడానికి కాజోల్ పరిగెడుతుంటే, ఆమెకు సహాయం చేయడానికి షారుక్ ఖాన్ చేయి అందించడం గుర్తుందా? ఆ సన్నివేశం భలే రసవత్తరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు చూశాం.
 
 కానీ, షారుక్-కాజోల్ వేసిన ముద్ర మాత్రం చెరిగిపోలేదు. మళ్లీ.. కాజోల్ అలా పరిగెత్తనున్నారు. షారుక్ చేయి ఇవ్వనున్నారు. ఆశ్చర్యంగా ఉందా? ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇద్దరూ కలిసి ‘దిల్‌వాలే’లో నటిస్తున్నారు.
 
 ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లో మనసుని హత్తుకున్న ట్రైన్ సీన్‌లాంటిదే ఇందులో పెట్టాలని రోహిత్ శెట్టి అనుకుంటున్నారట. అయితే.. ఈ సీన్‌ని ట్రామ్‌లో తీయాలనుకుంటున్నారట. నాడు.. ట్రైన్ సీన్ మ్యాజిక్ చేసినట్లుగా.. రేపు ఈ ట్రామ్ సీన్ మ్యాజిక్ చేస్తుందా?.. వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement