Tom Cruise
-
Tom Cruise: ఘనంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్.. టామ్ క్రూస్ సందడి (ఫోటోలు)
-
క్రేజీ అప్డేట్.. : ‘టాప్‌గన్ 3’ స్టోరీ రెడీ
హాలీవుడ్ ఫిల్మ్ ‘టాప్‌గన్’ ఫ్రాంచైజీ నుంచి మూడోభాగం ‘టాప్‌గన్ 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రెండు భాగాలు ‘టాప్‌గన్’, ‘టాప్‌గన్: మావెరిక్’ లో హీరోగా నటించిన టామ్క్రూజ్యే ‘టాప్ గన్ 3’లోనూ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. ‘‘టాప్‌గన్ 3’ బేసిక్ కథ సిద్ధంగా ఉంది. టామ్ క్రూజ్‌కు స్టోరీలైన్ చెప్పాం. ఆయన నచ్చిందని చెప్పారు. కథకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం’’ అని ‘టాప్‌గన్’ ఫ్రాంచైజీ నిర్మాతల్లో ఒకరైన జెర్రీ బ్రూమ్ హైమర్ పేర్కొన్నారు. -
ఏది ఏమైనా... మిషన్ పాజిబుల్
హాలీవుడ్లో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ఈ ఫ్రాంచైజీల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఎనిమిదో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’లోని ఐదు, ఆరు, ఏడు విభాగాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్వారీయే ఎనిమిదో భాగాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లొకేషన్స్‌లో ప్రారంభమైంది. కొంత చిత్రీకరణ జరిగాక ఆ ్రపాంతంలోని ఎమ్ 25 అనే ఓ ప్రముఖ రోడ్డును తాత్కాలికంగా క్లోజ్ చేశారట. ఈ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని సమాచారం. కానీ ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ షూటింగ్‌ను కొనసాగించాలంటే ఈ రోడ్డు ద్వారా లొకేషన్‌కు వెళ్లాలట. దీంతో ప్రత్యేకంగా హెలికాప్టర్స్ని ఏర్పాటు చేశారట. రోడ్డు మార్గం ద్వారా కాకుండా గగన మార్గాన టామ్ క్రూజ్ అండ్ టీమ్ లొకేషన్‌కు వెళ్తున్నారని హాలీవుడ్ టాక్. పోనీ.. ఈ రోడ్డు మరమ్మతు పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తర్వాత షూటింగ్‌ను మళ్లీ ఆ లొకేషన్లో తిరిగి ఆరంభించానే ఆలోచన కూడా చేశారట. కానీ రోడ్డు రిపేర్‌కి చాలా టైమ్ పడుతుందని, హెలికాప్టర్స్‌తో లొకేషన్‌కి వెళ్లే ఖర్చుతో పోలిస్తే సినిమా ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని క్రూజ్ అండ్ టీమ్ భావించిందని హాలీవుడ్ భోగట్టా. ఇలా ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్‌ను ఏది ఏమైనా ఆగేదే లేదంటూ.. పాజిబుల్ చేశారు టామ్ క్రూజ్ అండ్ టీమ్. ఈ సినిమా 2025 వేసవిలో రిలీజ్ కానుంది. -
రిలీజ్‌కు రెడీ అయిన టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్’
టామ్ క్రూజ్ నటించిన చిత్రం ‘మిషన్: ఇంపాజిబుల్–డెడ్ రికనింగ్ పార్ట్ వన్’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో రేపు(బుధవారం) విడుదలవుతోంది. ‘‘మిషన్: ఇంపాజిబుల్–ఫాల్ అవుట్ (2018)కి సీక్వెల్, 7వ విడత ‘మిషన్: ఇంపాజిబుల్’ ఫిల్మ్ సిరీస్‌గా రూపొందిన చిత్రం ‘మిషన్: ఇంపాజిబుల్–డెడ్ రికనింగ్ పార్ట్ వన్’. ఏతాన్ హంట్ (టామ్ క్రూజ్), అతని ఐఎమ్ఎఫ్ (ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్) బృందం ఓ ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆ మిషన్ ఏంటి? టామ్ క్రూజ్ ఇప్పటివరకూ చేయని, ఈ మూవీలో చేసిన ప్రమాదకరమైన స్టంట్ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్ ఫిదా అవుతారు. ఈ సిరీస్‌లో ఏడో సినిమాగా వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ కింగ్ టామ్ క్రూజ్ ఫైటింగ్ సీన్స్‌తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయం. తాజాగా ఇందులో నంటించిన అమెరికన్ నటి హేలీ అట్వెల్ తనపై వస్తున్న రూమర్‌కు సమాధానం చెప్పారు. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం) యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌తో వస్తున్న డేటింగ్ వార్తలపై ఆమె ఇలా క్లారిటీ ఇచ్చింది. 'ఇప్పుడు నాకు 41 ఏళ్లు.. టామ్‌కు 61 ఏళ్లు ఉన్నాయి.. మేమిద్దరం శృంగారంలో పాల్గొన్నామని ఎలా ప్రచారం చేస్తారు. ఇదీ చాలా చెత్తగా ఉంది. ఇంతటి డర్టీ ఆలోచనలు ఎలా వస్తాయి. స్క్రీన్ మీద మాత్రమే మా మధ్య రోమాన్స్ ఉంటుంది. నాకు ఇప్పటికే సింగర్ కెల్లీతో నిశ్చితార్థం జరిగింది. ఇంతటితో ఈ ప్రచారాన్ని ఆపేయండి. టామ్ నాకు అంకుల్ లాంటివాడు. ఆయన కూడా నన్ను ఎప్పుడూ చెడు ఉద్ధేశంతో చూడలేదు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.' అని నటి హేలీ అట్వెల్ తెలిపింది. (ఇదీ చదవండి: విక్రమ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్) -
వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
4 వేల అడుగుల ఎత్తున్న ఒక పర్వతం.. అక్కడ ఫుట్‌పాత్ సైజులో ఉన్న స్టీల్ ర్యాంప్.. దానిపై ఒక వ్యక్తి 200 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.. అంతే.. ఒక్కసారిగా పర్వతం మీద నుంచి జంప్ చేసేశాడు.. అందరి గుండెలు దడదడలాడుతున్నాయి.. మృత్యువుకు అతనికి మధ్య ఉన్నది ఒక్క పారాచూట్ మాత్రమే.. దాన్ని సమయానికి తెరవకుంటే.. అతడి శవం ఆనవాలు కూడా దొరకదు.. పారాచూట్ తెరుచుకుంది. అతడు క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టంట్‌గా పేరొందిన ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆ వ్యక్తి.. టామ్ క్రూజ్.. హాలీవుడ్ డాషింగ్ హీరో.. వయసు జస్ట్ 61 ఏళ్లు!!! మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లోని తాజా చిత్రం డెడ్ రెకనింగ్ పార్ట్ 1 కోసం ఈ సాహసాన్ని చేశారు. సినిమాలో కేవలం 60 సెకన్లు ఉండే ఈ సన్నివేశం కోసం రిహార్సల్స్ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయని ఈ చిత్ర స్టంట్ కోఆర్డినేటర్ ఈస్ట్‌వుడ్ చెప్పారు. శిక్షణలో భాగంగా మన హీరో 13 వేల మోటార్ క్రాస్ జంప్స్, 500 స్కైడైవ్స్ చేశారట. ‘200 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్లి.. పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. అదే సమయంలో గాలిలో కరెక్టు టైంకి బైక్‌ను వదిలేయాలి.. భూమికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్‌ను తెరవాలి. సరిగా బాలెన్స్ చేసుకుంటూ నేలపై దిగాలి. ఇందులో ఏ ఒక్క విషయంలో చిన్నపాటి తేడా జరిగినా ఇక అంతే.. టామ్‌కు చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’ అని ఈస్ట్‌వుడ్ తెలిపారు. మీకో విషయంలో తెలుసా..? ఒక బైక్ మీద వేగంగా వెళ్లి.. పర్వతంపై నుంచి దూకి.. వెంటనే పారాచూట్ తెరిచి.. ల్యాండ్ అవ్వాలన్నది టామ్ క్రూజ్ చిన్నప్పటి కల అట. చిన్నప్పుడు ఇంట్లో ర్యాంప్లాంటిది ఏర్పాటు చేసుకుని.. సైకిల్ మీద ఇలా జంప్ చేసిన ఘటనలు ఎన్నోనట. అలాగే దెబ్బలు తిన్న ఘటనలు కూడా.. ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈ స్టంట్తో ఇన్నాళ్లకు ఆయన కల తీరిందన్నమాట. ఈ వీడియోను నెట్లో చూసినోళ్లంతా సూపర్ అనేస్తున్నారు. ఏంటీ సింపుల్‌గా సూపరా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!
కొలంబియాకు చెందిన 46 ఏళ్ల పాప్ సింగర్ షకీరా గతేడాది స్టార్ ఫుట్‌బాలర్ గెరార్డ్ పీక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షకీరా తరచుగా ఇద్దరు వ్యక్తులతో క్లోజ్‌గా మూవ్ అవడం కనిపించింది. అందులో ఒకరు ఏడుసార్లు ఫార్ములావన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ అయితే.. మరొకరు హాలీవుడ్ యాక్షన్ హీరో.. మిషన్ ఇంపాజిబుల్(Mission Impossible) ఫేమ్ టామ్ క్రూజ్. ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే లూయిస్ హామిల్టన్ పాల్గొన్న మియామి గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో షకీరా ప్రత్యక్షమయ్యింది. రేసు ముగిసిన తర్వాత హామిల్టన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ ఉన్నట్లు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. షకీరా మాత్రం మేమిద్దరం(లూయిస్ హామిల్టన్) మంచి ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకముందు ఈ ఇద్దరు యాచ్‌లో షిప్పింగ్‌తో పాటు పలు సందర్భాల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరగినట్లు సమాచారం. మరోవైపు యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌తో కూడా షకీరా ప్రేమాయణం నడుపుతుందని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ షకీరా కంటే టామ్ క్రూజ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా షకీరాతో డేటింగ్‌కు వెళ్లాలని టామ్ క్రూజ్ అనుకున్నాడని.. ఇంతలో వీరి మధ్యలోని లూయిస్ హామిల్టన్ వచ్చి చేరాడు. కాగా లూయిస్ హామిల్టన్‌తో షకీరా కలిసి తిరగడం టామ్ క్రూజ్‌కు నచ్చలేదని.. అందుకే ఈగో డెంట్ అంటూ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ 50 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న షకీరా తన అందంతో ఇద్దరు సూపర్స్టార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ఆసక్తి కలిగించింది. ఇక ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ 2015 వరకు పుస్సీక్యాట్ డాల్స్ సింగర్ నికోల్ షెర్జింజర్తో రిలేషన్లో ఉన్నాడు. మరోవైపు టామ్ క్రూజ్ మిమి రోజర్స్(1987-1990), నికోల్ కిడ్మన్(1990-2001), కేటీ హోమ్స్(2006-2012)తో రిలేషిన్షిప్ కొనసాగించాడు. చదవండి: #MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి -
ఒక్క సినిమాకే వెయ్యి కోట్ల పారితోషికం!
సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్ బడ్జెట్ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హీరోలు మాత్రం ఓస్, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట. హాలీవుడ్లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్ క్రూయిజ్ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్స్) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్ గన్: మావెరిక్ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్ క్రూయిజే కావడంతో బోనస్‌గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట. ఇక ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్ అయిన విల్ స్మిత్ ఎమాన్సిపేషన్ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్ డాలర్స్) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్ డాలర్స్) అందుకున్నారట. డ్వేన్ జాన్సన్ రూ.180 కోట్లు (22.5 మిలియన్ డాలర్స్), క్రిస్ హేమ్స్‌వర్త్, డెంజెల్ వాషింగ్టన్, విన్ డీజిల్, జాక్విన్ ఫోనిక్స్, టామ్ హార్డీ, విల్ ఫెరల్, ర్యాన్ రెనాల్డ్స్ తలా రూ.160 కోట్లు (20 మిలియన్ డాలర్స్) వెనకేసుకుంటున్నారట. చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్ రివ్యూ వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి? -
36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా!
వారిద్దరూ స్టార్ హీరోలే. ఒకరు యాక్షన్ హీరో అయితే.. మరొకరు యూనివర్సల్ హీరో. రియల్ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీన్లలో అదరగొట్టేది ఒకరైతే.. నటనలో విశ్వరూపం చూపిస్తూ మెస్మరైజ్ చేసేది ఇంకొకరు. ఈ ఇద్దరు ఆరు పదుల వయసువారే. ఒకరికి 60 అయితే మరొకరికి 67. ఈ వయస్సులో కూడా పోరాట సన్నివేశాలు చేస్తూ, నటనలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఐ ఫీస్ట్ చేస్తారు. వారిద్దరికీ ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. వీరి సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు పడిగాపులు పడుతుంటారు. వచ్చే వరకు ఆరాదిస్తూనే ఉంటారు. ఇలా ఒక సూపర్ హిట్ కోసం అటు ఆ హీరోలు.. ఇటు వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇద్దరు తమ సినిమాలను ఒకే ఏడాది రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. అందులోనూ సుమారు 36 ఏళ్ల క్రితం చిత్రాలను సీక్వెల్‌గా తెరకెక్కించి ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలుగా రికార్డు సైతం క్రియేట్ చేశారు. మరీ ఆ స్టార్ హీరోలెవరో తెలుసుకుందామా. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' సినిమా 2022 జూన్ 3న విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్‌కు మాసీవ్ కమ్‌బ్యాక్ హిట్ ఇచ్చింది ఈ మూవీ. అయితే ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మల్టీవర్స్ తరహాలో (LCU-లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) తెరకెక్కించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కార్తీ 'ఖైదీ' సినిమా సీన్లను చూపించడం, తర్వాత 'ఖైదీ 2'లో కూడా కమల్ హాసన్ విక్రమ్‌గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 'విక్రమ్ 3'లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని కమల్ హాసన్ ఒక ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ 'విక్రమ్ 3' అని ఎందుకు అన్నారు ? అంటే ఇప్పటికే 'విక్రమ్ 2' వచ్చిందా ? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి 'విక్రమ్: ది హిట్ లిస్ట్' కన్నా ముందు 1986లో 'విక్రమ్' సినిమా వచ్చింది. ఇదే 'రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్'లో 'ఏజెంట్ విక్రమ్ 007' రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాత్ర కొనసాగింపుగా తాజాగా 'విక్రమ్: ది హిట్ లిస్ట్'ను రూపొందించారు లోకేష్ కనకరాజ్. అంటే ఈ 'విక్రమ్: ది హిట్ లిస్ట్ (విక్రమ్ 2)', 1986లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్ 007' చిత్రాల కథా నేపథ్యం ఒకే లైన్‌పై ఆధారపడింది. దీన్ని బట్టి చూస్తే 'ఏజెంట్ విక్రమ్ 007'కు 'విక్రమ్ 2' సీక్వెల్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 1986లో కమల్ హాసన్‌కు ఒక క్రేజ్ తీసుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తడబడుతున్న కమల్ హాసన్‌కు ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రూ. కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ 'ఏజెంట్ విక్రమ్ 007' బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8 కోట్లను కొల్లగొట్టాడు. అంతేకాకుండా ఈ మూవీలోని టైటిల్ ట్రాక్‌లో (విక్రమ్ టైటిల్ సాంగ్) మొట్ట మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ వాయిస్ (రోబోటిక్ వాయిస్‌లా)ను ఉపయోగించారు సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఈ వాయిస్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ వాయిస్‌ను 'విక్రమ్: ది హిట్ లిస్ట్' టైటిల్ ట్రాక్‌లో కూడా కొనసాగించారు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్. ఈ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక్కో బీజీఎం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. 'విక్రమ్: ది హిట్ లిస్ట్' మూవీ సుమారు రూ. 120-150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 442.45 కోట్లు రాబట్టింది. కాగా సరైన హిట్ లేకుండా సతమవుతున్న కమల్ హాసన్‌కు.. 36 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ కథ నేపథ్యంగా తెరకెక్కిన ఈ 'విక్రమ్ 2' సెన్సేషనల్ హిట్‌గా నిలవడం విశేషం. 1986లో 32 ఏళ్ల వయసులో కమల్ ఎలాంటి నటనతో అలరించాడో 67 ఏళ్ల వయసులో కూడా అంతకుమించిన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక కమల్ హాసన్‌లానే కెరీర్ ప్రారంభంలో స్ట్రగులై అదే 1986లో హిట్ కొట్టిన మరో స్టార్ హీరో టామ్ క్రూజ్. ఈ హాలీవుడ్ యాక్షన్ హీరో రియల్ స్టంట్స్, ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరోకు కూడా కెరీర్ ఆరంభంలో సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన మూవీ 'టాప్ గన్'. 1986 మే 16న విడుదలైన 'టాప్ గన్' అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 1.5 కోట్ల (యూఎస్ డాలర్స్) బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35.73 కోట్లు (యూఎస్ డాలర్స్) రాబట్టింది. తర్వాత అనేక యాక్షన్ మూవీస్‌తో అదరగొట్టిన టామ్ క్రూజ్‌కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అయితే సుమారు 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్‌గా 'టాప్ గన్: మావెరిక్' వచ్చి టామ్ క్రూజ్‌కు సాలిడ్ సక్సెస్ ఇచ్చింది. 'టాప్ గన్'లో 24 ఏళ్ల వసయసులో బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్, యాక్టింగ్, రొమాన్స్‌తో టామ్ క్రూజ్ ఎలా అయితే ఆకట్టుకున్నాడో 59 ఏళ్ల (సినిమా చిత్రీకరణ సమయంలో) వయసులోనూ అదే జోష్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో రియల్ స్టంట్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాప్ గన్: మావెరిక్' సుమారు 170 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద సుమారు 1. 131 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక ఆరు పదుల వయసులోనూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న కమల్ హాసన్, టామ్ క్రూజ్.. యాక్టింగ్, యాక్షన్ స్టంట్స్‌లో 'ఇద్దరూ.. ఇద్దరే' అనిపించుకుంటున్నారు. కాగా 36 ఏళ్ల క్రితం సినిమాలను సీక్వెల్‌గా తెరకెక్కించి, హిట్ లేని సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్, టామ్లది ఎంతటి యాదృచ్ఛికం. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
స్టార్ హీరో.. కోకిల రెట్టను రోజు మొహానికి పూసుకుంటాడట!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ఆ బుద్ధిలోనే మనిషికో అలవాటునూ కలిపేసుకోవచ్చు. సామాన్యుల అలవాట్లు, ప్రవర్తన ఎంత అసామాన్యంగా ఉన్నా ప్రాచుర్యంలోకి రావు. అసామాన్యులు లేదా పదిమందికీ తెలిసిన ప్రముఖుల అలవాట్లు ఎంత సామాన్యమైనవైనా ఇట్టే ప్రచారమవుతాయి. అలా వైరలైన కొందరు సెలబ్రిటీల వింత అలవాట్లు తెలుసుకుందాం.. సరదాగా! ఎంతిష్టమైతే మాత్రం.. చెప్పులంటే ఎంతిష్టమైతే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటామా!? కానీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అలాగే చేస్తాడు ఇంచుమించుగా! అంటే .. తల మీద పెట్టుకోడు అలాగని చెప్పుల స్టాండ్‌లోనూ పెట్టడు. షారుఖ్‌కి షూస్ అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే ఇరవై నాలుగ్గంటలూ ఇంటాబయటా షూస్ వేసుకునే ఉంటాడు. రాత్రి కూడా చాలాసార్లు షూస్‌తోనే నిద్రపోతాడట. ఏమయ్యా క్రూజూ.. ఏంటయ్యా అది? వ్వాక్.. ఎంత సౌందర్య పోషణయితే మాత్రం ఆ పనేంటండీ బాబూ.. ! ఏం చేశాడేంటి ఆ అమెరికన్ యాక్టర్ టామ్ క్రూజ్.. అంతమాటనేసినారు? తన ముఖారవింద చర్మ సంరక్షణ కోసం రోజూ నైటింగేల్ పిట్ట (కోకిల) రెట్టనింత తీసుకుని ఫేషియల్ క్రీమ్‌లా మొహానికి పూసుకుంటాడట!! అవాక్కయ్యారా! అది మరి మ్యాటర్... అట్లుంది వీళ్లలోని! అన్నింట్లోకి.... పెరుగు ఉండాల్సిందే ఆలియా భట్‌కు. ఉండొచ్చు .. పరోటా.. ఉప్మా.. పోహా.. ఆఖరుకు చపాతీకీ పెరుగు కాంబినేషన్ బాగానే ఉంటుంది. కానీ ఆలియాకు చైనీస్.. ఇటాలియన్.. మెక్సికన్.. ఇలా ఏ దేశపు వంటకానికైనా తోడు కూడా పెరుగు లేకపోతే ముద్ద దిగదట. ఆలియా పెరుగు పిచ్చి చూసి తోటివాళ్లంతా నవ్వుకుంటారట. నవ్విపోదురు గాక.. నాకేటి.. ప్లేట్లో పెరుగుంటే చాలు అనుకుంటూ వేళ్లకంటిన పెరుగును చప్పరించేస్తుందట. గుడ్లప్పగించి... సెలబ్రిటీలనెవరైనా గుడ్లప్పగించి చూస్తే బౌన్సర్లు వచ్చి కనుగుడ్లు పీకేసినా పీకేస్తారు. మరి సెలబ్రిటీలే అలా చూస్తే..! ఆ బుద్ధి ఉన్నది ఎవరికి?అని అడిగితే దీపికా పడుకోణ్ అని చెప్పాలి మరి. అవును.. ఎయిర్ పోర్ట్స్‌లో.. షాపింగ్ మాల్స్‌లో.. ఇలా పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడైనా కొత్తవాళ్లను కన్నార్పకుండా చూస్తుందట. ఆమెకున్న ఈ అలవాటు తెలియక ఆ స్ట్రేంజర్స్ జడుసుకుని వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోతారట. పాఫం..! ఆరుబయట... సొంత ఇల్లయినా.. అద్దె ఇల్లయినా సౌకర్యాలకు సంబంధించి రాజీ పడని అంశం.. బాత్రూమ్. మాజీ మిస్ యూనివర్స్.. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా అంతే. అసలు కాంప్రమైజ్ కాదు.. బాత్రూమ్లో స్నానం చేయని విషయంలో! మీరు చదువుతున్నది కరెక్టే.. ఆమెకు మేడ మీద.. ఆరుబయట స్నానం చేయడం ఇష్టం.. కంఫర్ట్ కూడా! అందులో రాజీ సమస్యే లేదు అంటుంది. ఈ గుట్టు చెప్పాం కదా అని ఆమె ఇంటి చుట్టూ ఉన్న మేడల మెట్లెక్కేయకండి! ఆ జాగ్రత్త ఆమెకు తెలుసు. -
36 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్.. 'టాప్ గన్: మావెరిక్' రివ్యూ
టైటిల్: టాప్ గన్ మావెరిక్ (హాలీవుడ్) నటీనటులు: టామ్ క్రూజ్, మైల్స్ టెల్లర్, జెన్నిఫల్ కాన్లీ, వాల్ కిల్మర్, గ్లెన్ పావెల్ తదితరులు నిర్మాతలు: టామ్ క్రూజ్, జెర్రీ బ్రూక్హైమర్, క్రిస్టోఫర్ మెక్ క్యూరీ, డేవిడ్ ఎల్లిసన్, డాన్ గ్రాంగర్ దర్శకత్వం: జోసెఫ్ కోసిన్స్కీ సినిమాటోగ్రఫీ: క్లాడియో మిరిండా విడుదల తేది: మే 26, 2022 హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కెరీర్ ప్రారంభంలో హిట్ సాధించిన సినిమాల్లో 'టాప్ గన్' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రానికి సుమారు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ 'టాప్ గన్: మావెరిక్'. ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా రావడం టీజర్లు, ట్రైలర్లతో మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ మూవీ ట్రైలర్ 2019లోనే విడుదలైంది. సినిమా కూడా అప్పట్లోనే రావాల్సింది. కానీ కరోనా వల్ల, పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ మూవీ చివరికీ మే 27న విడుదల కావాల్సింది కానీ మే 26 నుంచే షోలు ప్రదర్శించారు. మరీ భారీ అంచనాల నడుమ విడుదలైన 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: పీట్ మావెరిక్ మిచెల్ (టామ్ క్రూజ్) అమెరికా ఆర్మీలో ఫైటర్ పైలెట్‌గా పనిచేస్తాడు. అతనికి 36 ఏళ్ల అనుభవం ఉంటుంది. ఒక యుద్ధ విమానాన్ని టెస్ట్ చేసేందుకు అపరిమిత స్పీడ్‌లో వెళతాడు. అది చూసిన తన పైఅధికారులు పైలెట్‌గా విధుల నుంచి తప్పించి 'టాప్ గన్' అకాడమీలో బెస్ట్ పైలెట్స్‌కు శిక్షణ ఇవ్వమని పంపిస్తారు. 36 ఏళ్ల అనుభవం ఉన్న పీట్ మావెరిక్ ఎందుకు పైలెట్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది ? అతన్ని బెస్ట్ పైలెట్స్‌కు శిక్షణ ఇవ్వమని చెప్పడానికి అసలు కారణం ఎవరు ? వారికి ఎందుకోసం శిక్షణ ఇవ్వమంటారు ? ఆ శిక్షణ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ ? హీరో ఫ్రెండ్ గూస్ కొడుకు రూస్టర్‌కు పీట్ అంటే ఎందుకు కోపం ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: 'టాప్ గన్' సినిమాను గుర్తు చేస్తూ 'టాప్ గన్ మావెరిక్' మూవీ ప్రారంభం అవుతుంది. టాప్ గన్ మూవీ నచ్చిన వాళ్లకు ఈ మూవీ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. ఉన్నతాధికారులను ఏమాత్రం లెక్కచేయిని పాత్రగా మావెరిక్ను పరిచయం చేశారు. 36 ఏళ్ల తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు లేదన్నట్లుగా చూపించారు. ఆకాశంలో సాహోసోపేతమైన విన్యాసాలు, ఏరియల్ స్టంట్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. యుద్ధ విమానాలతో వాళ్లు చేసే ఫీట్లు ఆసక్తికరంగా ఉంటాయి. కంబాట్ సీన్స్, ట్రైనింగ్ సీన్స్ బాగున్నాయి. సినిమాలో అడ్వెంచర్ షాట్స్, కామెడీ డైలాగ్స్‌తోపాటు ఎమోషనల్ ఫీల్ సీన్లు ఎంతో ఆకట్టుకుంటాయి. కథలో భాగంగా పీట్ ఫ్రెండ్ గూస్ మరణం కారణంగా తనపై అనుమానాలు తలెత్తడం, వాటన్నింటిన దాటుకొని తిరిగి విధుల్లోకి రావడం, గూస్ కుమారుడు రూస్టర్‌తో వచ్చే సన్నివేశాలు ఉద్వేగభరితంగా బాగున్నాయి. సినిమా ప్రారంభం నుంచి గూస్ కొడుకు రూస్టర్‌ను పీట్ చూసే విధానం ఎమోషనల్‌గా ఉంటుంది. మావెరిక్కు అతని లవర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు నవ్వు తెప్పిస్తాయి. పీట్ ఫ్రెండ్ ఐస్ మ్యాన్ (వాల్ కిల్మర్) మధ్య సంభాషణ ఎమోషనల్‌గా సాగి చివరిగా ఒక్కసారి నవ్వు తెప్పించడం భలే హాయిగా ఉంటుంది. వాల్ కిల్మర్కు రియల్ లైఫ్‌లో ఉన్న ఆరోగ్య సమస్యలను సినిమాలోని పాత్రకు ఆపాదించడం బాగుంది. క్లైమాక్స్, చివరి అరగంట ముందు మంచు కొండల్లో వచ్చే సీన్లు ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? హీరోగా చేసిన టామ్ క్రూజ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్షన్ సీన్స్, రియల్ స్టంట్స్‌కు పెట్టింది పేరు. సినిమాలో ఆయన నటన హైలెట్. 1986లో టాప్ గన్ మూవీ వచ్చినప్పుడు టామ్ వయసు 24. ఈ సీక్వెల్ సమయానికి 59 ఏళ్లు. అయినా ఆయనలో ఏమాత్రం జోరు తగ్గలేదు. అదే జోష్, అదే బాడీ లాంగ్వేజ్, అదే సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్, ఫైట్స్, రొమాన్స్‌లో తనదైన స్పెషాల్టీ చూపించాడు. మిగతా క్యారెక్టర్లు వారి పాత్రలకు అనుగుణంగా అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు, టెక్నికల్ వర్క్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే కచ్చితంగా మంచి అనుభూతి కలుగుతుంది. -సంజు, సాక్షి వెబ్‌డేస్క్ -
కొండపై నుంచి బైక్‌తో సహా దూకిన హీరో..
Tom Cruise Mission Impossible Dead Reckoning Part One Trailer Released: యాక్షన్ ప్రియులను సీట్ ఎడ్జ్‌లో కూర్చుండపెట్టే సినిమాలలో మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఏజెంట్ 'ఈథన్ హంట్'గా ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ మూవీ సిరీస్‌కు క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ యాక్షన్ సీక్వెన్స్, అడ్వంచెర్స్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్ అందిస్తాయి. ఇక పరిస్థితులకు తగినట్లు వివిధ పాత్రల గెటప్పుల్లోకి హీరో మారే సన్నివేశాలు మంచి కిక్కిస్తాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆరు సినిమాలు ఎంతో అలరించాయి. ప్రస్తుతం సిరీస్ నుంచి 7, 8వ సినిమాలు రానున్న విషయం తెలిసిందే. తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ వన్'గా ఏడో సినిమా ట్రైలర్‌ను సోమవారం (మే 24) రాత్రి విడుదల చేశారు. ''గ్రేటర్ గుడ్'గా పిలవబడే మీ పోరాట రోజులు ముగిశాయి'' అంటూ ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో ఆద్యంత ఆకట్టుకునేలా ఉంది. లొకేషన్లు, సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఏదో ఒక 'కీ' నేపథ్యంలో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో కొండపై నుంచి బైక్‌తో సహా హీరో దూకే సీన్ థ్రిల్లింగ్‌గా ఉంది. 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' మొదటి సినిమాలోని ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ యూజీన్ కిట్రిడ్జ్గా కనిపించిన హెన్రీ జెర్నీ ఇందులో నటించడం విశేషం. చదవండి:👇 36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు ఈ సినిమాకు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కథ, దర్శకత్వం అందించారు. ఇతను 2015లో 'రోగ్ నేషన్', 2018లో 'ఫాల్ అవుట్' సినిమాలను డైరెక్ట్ చేశాడు. 'డెడ్రెకనింగ్ పార్ట్ 1' జూలై 14, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024లో 'డెడ్రెకనింగ్ పార్ట్ 2' విడుదల కానుంది. అయితే ఇదే ఈథన్ హంట్‌గా టామ్ క్రూజ్ చివరి సినిమా అని సమాచారం. -
36 ఏళ్ల తర్వాత సీక్వెల్.. బడ్జెట్ రూ. 12 వందల కోట్లు
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కెరీర్లో హిట్ సాధించిన సినిమాల్లో 'టాప్ గన్' ఒకటి. 1986లో వచ్చిన ఈ చిత్రం టామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుమారు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టాప్ గన్: మేవరిక్' రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ప్రదర్శించారు. 36 ఏళ్ల తర్వాత 'టాప్ గన్'కు సీక్వెల్‌గా రావడం, కేన్స్ ఫెస్టివల్లో ప్రీమియర్ వేయడంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. ఈ మూవీని మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీని రూ. 12 వందల కోట్ల బడ్జెట్‌తో జోసెఫ్ కోసిన్స్కీ తెరకెక్కించారు. క్రిస్టోఫర్ మెక్ క్వారీ రచనా సహకారం అందించారు. కాగా 1996లో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌ను సుమారు 25 ఏళ్లుగా తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈసినిమా సిరీస్‌తో టామ్ క్రూజ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్లో మంచి హిట్ ఇచ్చిన టాప్ గన్ సీక్వెల్‌కు మాత్రం 36 ఏళ్లు పట్టింది. అయితే ఈ సీక్వెల్‌ను మూడేళ్ల క్రితమే స్టార్ట్ చేసిన కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
దుబాయ్‌లో 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ !.. అతిథిగా హాలీవుడ్ స్టార్ హీరో ?
Tom Cruise Chief Guest In RRR Movie Pre Release Event At Dubai: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)'. 14 భాషల్లో తెరకెక్కిన సినిమా కోసం ప్రేక్షకలోకం, అభిమానగనం ఎంతగానో ఎదురచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో చిత్రబృందం త్వరలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక క్రేజీ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రీరిలీజ్ వేడుకను త్వరలో దుబాయ్‌లో జరిపేందుకు జక్కన్న టీం సన్నహాలు చేస్తుందని టాక్. ఈ అతిపెద్ద ఈవెంట్‌కు ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నడనే వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగుతోంది. కాగా ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్త ఆర్ఆర్ఆర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతోంది. -
మార్వెల్ సూపర్ హీరోలో కొత్త అవతారమెత్తిన హాలీవుడ్ యాక్షన్ హీరో!
డిస్నీ - మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించే అవెంజర్స్ తదితర సూపర్ హీరో సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సూపర్ హీరో సినిమాల సిరీసుల్లో ఐరెన్ మాన్ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐరన్ మాన్ మూవీ సిరీస్‌తో పాటు అవెంజర్స్ మూవీ సిరీస్‌లో కూడా ఐరెన్ మాన్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్, అయితే అవెంజన్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ముగిసిపోతుంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత వచ్చిన మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఐరెన్ మ్యాన్ తిరిగివస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు వాటికి మరింత ఊతం ఇచ్చే రీతిన మార్వెల్ స్టూడియోస్ వారి నుంచి వస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ చిత్రంలో ఐరన్ మాన్ తిరిగి వస్తున్నాడని తెలిసింది. ఈ పాత్రను ప్రముఖ ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ పోషిస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు అంతటా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా విడుదలైన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మే 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది. -
ఆ యాక్షన్ చిత్రాల ఫ్యాన్స్‌కు నిరాశే.. మళ్లీ వాయిదా
ప్రేక్షకులను అద్భుతంగా అలరించే హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఒకటి. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ హీరోగా నటించే ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, సాహసాలు ఆడియెన్స్‌ను సీటుకు కట్టిపడేస్తాయి. ఇక ఈథన్ హంట్ (సిరీస్‌లో టామ్ క్రూజ్ పాత్ర పేరు) తరచుగా మార్చే గెటప్పులు ఆహా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలోని ప్రతినాయకుల విలనిజం, హీరోయిన్లు గ్లామర్ అదనపు ఆకర్షణ. అయితే ఇంతగా అలరించే ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలు మళ్లీ వాయిదా పడి అభిమానులకు నిరాశకు గురిచేశారు. (చదవండి: అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు) ఈ సిరీస్‌లో ఇదివరకు 6 సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు కొత్తగా 7, 8 సినిమాలు వరుస పెట్టి రానున్న సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమాను సెప్టెంబర్ 2022లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత జూలై 2023లో ఎనిమిదవ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొవిడ్ కారణంగా ఈ సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ విషయాన్ని పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ నిర్మాణ సంస్థలు శుక్రవారం (జనవరి 21) ఒక ప్రకటనలో తెలిపాయి. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) అనేక పరిశీలనల తర్వాత ఆలోచించుకుని కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సినిమాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సిరీస్‌లోని 7వ చిత్రాన్ని జూలై 14, 2023న, 8వ మూవీని జూన్ 28, 2024న విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక ఈ సినిమాలు ఆ తేదీల్లో విడుదలవుతాయో లేదా కరోనా కారణంగా ఇంకా వాయిదా పడతాయో చూడాలి. (చదవండి: ఆస్కార్ బరిలో 'నో టైమ్ టు డై'.. 4 విభాగాలకు నామినేట్) -
టామ్‌క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్ పూర్తి
హాలీవుడ్ మూవీ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ (ఎమ్ఐ)కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ సినిమాల్లోని హీరో తన అసిస్టెంట్స్‌తో కలిసి చేసే సాహసాలు అబ్బురపరిచేలా ఉంటాయి. అందుకే సిరీస్‌లోని మరో సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఎప్పుడెప్పుడా అభిమానులు ఎదురుచూస్తుంటారు. హాలీవుడ్ స్టార్ నటుడు టామ్‌క్రూజ్ హీరోగా నటిస్తున్నా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో ఆరు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సిరీస్‌లో వస్తున్నా తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన.. ఏడో పార్ట్ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌తోపాటు ఎమ్ఐ 8ని కూడా త్వరగా పూర్తి చేసి 2023లో విడుదల చేయాలని మూవీ టీం భావించింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఎమ్ఐ 7 చిత్రీకరణ, విడుదల ఆలస్యం, ఇతర కారణాల వల్ల ఆ మూవీ కూడా ఆలస్యం అవుతోంది. కాగా ఇటీవల ‘ఎమ్ఐ 7’ షూటింగ్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్లో జరిగింది. టామ్‌క్రూజ్ కాస్ట్లీ కారును మూవీ టీం బస చేసిన హోటల్లో బయట పార్క్ చేయగా ఎవరో దొంగిలించారు. పోలీసులకు సమాచారం అందించగా కారుకు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దగ్గరలోకి ఓ విలేజ్‌లో గుర్తించారు. కోట్ల విలువ చేసే కారు దొరికినా అందులోని లగేజీ, నగదు పోయినట్లు తెలిసింది. -
సినీ ఫక్కీలో స్టార్ హీరో కారు చోరీ
హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్ చేయగలిగిన పోలీసులు. కానీ.. కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్హమ్(ఇంగ్లండ్)లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్లో సినిమా యూనిట్ బస చేసింది. అయితే కారు బయట పార్కింగ్ చేసిన కాస్ట్లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. చాలా తెలివిగా.. మోడ్రన్ డే కారులు కీలెస్గా, ఇగ్నిషన్ ఫోబ్స్తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్లెస్ ట్రాన్స్మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారు చోరీకి గురైంది. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్‌ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పని చేయకుండా చేశారు. అటుపై దర్జాగా కారును వేసుకుని వెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్ క్రూజ్ బాడీగార్డులు.. పోలీసులకు సమాచారం అందించారు. ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ట్రేస్ చేసి.. స్మెత్విక్ విలేజ్‌లో కారును గుర్తించారు. అయితే కారు దొరికినప్పటికీ.. అందులో లగేజీ, కొంత డబ్బు మాయమైనట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష పౌండ్లు విలువ(మన కరెన్సీలో కోటి రూపాయలు) చేసే బీఎండబ్ల్యూ ఎక్స్7.. 4.4 లీటర్ V8 ఇంజిన్, 523 హార్స్ పవర్ ఇంజిన్, నాలుగు సెకన్లలో 96 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునే సామర్థ్యం ఉంది. టాప్ స్పీడ్ 249 కిలోమీటర్లు. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న.. MI-7 వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. -
ప్లాన్..ఇంపాజిబుల్..కరోనాతో ఆగిన షూటింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోయింది. టామ్ క్రూజ్ నటిస్తున్న ఈ యాక్షన్ స్పై ఫిల్మ్‌కి క్రిస్టోఫర్ మెక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ యూకేలో జరుగుతోంది. అయితే రెగ్యులర్ కోవిడ్ టెస్టుల్లో భాగంగా చిత్రబృందానికి కరోనా పరీక్షలు చేయగా కొంతమందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 10మందికి పైనే ఉందని హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్‌ను జూన్ 14 వరకు నిలిపి వేశారు. ఇక గత ఏడాది అక్టోబరులో కూడా ఈ చిత్రబృందంలో 12 మందికి కరోనా వచ్చి, షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వల్ల మరోసారి షూటింగ్ ప్లాన్ ఇంపాజిబుల్ (అసాధ్యం) అయింది. ఈ ఏడాది విడుదల కావాల్సిన ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. -
Tom Cruise: మిషన్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌కు సడెన్ బ్రేక్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కి కరోనా బారినపడ్డాడా?.. అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. మిషన్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌ను అర్థాంతరంగా ఆపేయడంతో ఈ ఊహాగానాలకు తెరలేపాయి. టామ్‌తో పాటు చిత్రయూనిట్‌లోని కొందరు కరోనా బారినపడ్డట్లు ఆ కథనాలు ఉటంకించాయి. అయితే కొన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్స్ మాత్రం కేవలం సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడిందని, క్రూజ్‌తో సహా మిగతా వాళ్లంతా ఐసోలేషన్‌కి వెళ్లారని ప్రస్తావించడం విశేషం. కాగా, కొందరు సిబ్బందికి పాజిటివ్ తేలడంతో షూటింగ్‌కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే టామ్ క్రూజ్ ఆరోగ్య స్థితిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక నైట్‌క్లబ్‌లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చిత్రయూనిట్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పదకొండు మంది కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టామ్ క్రూజ్ ఉన్నాడా? లేదా? అనేది మాత్రం నిర్ధారించలేదు. దీంతో హాలీవుడ్ ప్రముఖ వెబ్‌సైట్స్ క్రూజ్ సైతం పాజిటివ్ బారినపడ్డాడని కథనాలు ప్రచురించాయి. అయితే బ్రిటన్ మీడియా హౌజ్‌లు మాత్రం టామ్ ఓ లగ్జరీ హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపాయి. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కావాల్సిన మిషన్ ఇంపాజిబుల్ 7.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది. పోయినేడాది ఇటలీలో జరిగాల్సిన షెడ్యూల్ కరోనాతో ఆలస్యమైంది. మొన్నీమధ్యే టామ్ క్రూజ్, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన సిబ్బందిపై మండిపడినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది కూడా. అయితే తాను నిర్లక్ష్యంగా ఉన్న కొందరిపైనే అరిచానని టామ్ క్రూజ్ క్లారిటీ ఇచ్చాడు కూడా. కాగా, 58 ఏళ్ల క్రూజ్ ఆరోగ్య స్థితిపై ఆయన సిబ్బంది స్పందించాల్సి ఉంది. చదవండి: సంచలనం: నగ్నంగా నన్ను చేసి.. -
DDLJ: తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదు
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్జే).. ఈ ఒక్క సినిమా బాలీవుడ్ నే కాదు భారతీయ చిత్రపర్రిశ్రమ స్థాయినే మరో లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోసెన్సెషనల్ క్రియేట్ చేసింది. షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ కొంచె సేపు అయినా కళ్లప్పగించి ఈ సినిమాను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేశాడు దర్శకుడు దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయన మేకింగ్ స్టైల్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలో ఒక థియేటర్లో ఈ సిసిమా 1009 రోజులు ఆడిందంటే ఈ మూవీ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా షారుఖ్ ఖాన్ సినీ జీవితాన్నే మార్చేసింది. బాలీవుడ్లో ఆయన స్టార్ హీరోగా మారడానికి ఈ సినిమా ఒక కారణం. అయితే ఈ సినిమాకి తొలుత షారుఖ్‌ని హీరోగా అనుకోలేదట డైరెక్టర్ ఆదిత్య చోప్రా. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌తో ఈ సినిమాని ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడట. హీరో పాత్రని ఇండియన్ కాకుండా ఫారన్ యువకుడిగా రాసుకున్నాడట. స్రిప్ట్ అంతా సిద్దం చేసుకొని నిర్మాత యశ్ చోప్రాకు వినిపించాడట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదట. యశ్ చోప్రా సలహా మేరకు కథను అంతా మార్చి రాజ్ పాత్రని సృష్టించాడట. ఆ తర్వాత షారూఖ్‌కి వినిపించి సినిమాను తెరకెక్కించినట్లు ఓ ఇంటర్యూలో ఆదిత్య చెప్పారు. ఇదే విషయాన్ని కాజోల్ కూడా ఓ సందర్భంలో చెప్పింది. -
35 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ అయిన సంచలన చిత్రం!
ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ అంతర్జాతీయ స్టార్‌గా ప్రపంచానికి పరిచయమై నేటికి సరిగ్గా 35 ఏళ్లు. 1986 మే 16న టోనీ స్కాట్ దర్శకత్వంలో ట్రామ్ క్రూజ్ నటించిన యాక్షన్ సినిమా ‘టాప్‌గన్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. అప్పట్లో టాప్‌గన్ ప్రేక్షకుల మనసులు దోచుకుని.. 353 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే టాప్‌గన్ విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను అమెరికా వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో తిరిగి విడుదల చేశారు. డాల్బీ సినిమా ఏఎమ్‌సీ థియేటర్లలో 150 స్క్రీన్లపై సినిమాను విడుదల చేశారు. ఇప్పటి లేటెస్ట్ సినిమా టెక్నాలజీ డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఆడియోను జోడించించడమే కాకుండా.. ట్రామ్క్రూజ్, టాప్‌గన్ నిర్మాత జెర్రీ బ్రుక్హైమర్ల ఇంటర్య్వూలతో పాటు 35 ఏళ్ల టామ్ క్రూజ్ లెగసీని వివరిస్తూ అదనపు సమాచారాన్ని అందించడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లకు వెళ్లడానికి భయపడే వాళ్ల కోసం ప్రత్యేకంగా డిజిటల్, 4కే అల్ట్రా హెచ్డీ, బ్లూ రేలలో టాప్గన్ను అందుబాటులో ఉంచారు. ఇన్నేళ్ల తర్వాత ‘టాప్‌గన్’కు సీక్వెల్‌గా ‘టాప్‌గన్ మావెరిక్’ను తెరకెక్కించారు. నిరుడే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్–19 కారణంగా వాయిదా పడి ఈ ఏడాది నవంబర్‌లో విడుదలకు సన్నాహమవుతోంది. చదవండి: బాత్రూంలో ప్రియాంక చర్చలు: వేరే చోటే లేదా? షారుక్ ఖాన్‌కి ఓ కథ చెప్పాం. ఆయనకు నచ్చింది -
హాలీవుడ్ బాక్సాఫీస్‌పై కరోనా ఎఫెక్ట్
హాలీవుడ్ బాక్సాఫీస్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మ్యావరిక్’, ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ చిత్రాల రిలీజ్లు వాయిదా పడ్డాయి. 1986లో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్’కు సీక్వెల్‌గా ‘టాప్ గన్: మ్యావరిక్’ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జూలై 2న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా వేశారు. అలాగే ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ చిత్రం 2022 నవంబరు 4 నుంచి 2023 జూలై 7కి వాయిదా పడింది. వీటితో పాటుగా ఈ ఏడాది జూలై 23న విడుదలకు షెడ్యూల్ అయిన ‘స్నేక్ ఐస్’ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 22కి పోస్ట్‌పోన్ అయ్యింది. వీటితో పాటు మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే ఇండియన్ మూవీస్ రిలీజ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా కారణంగా మరోసారి కుదేలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది. చదవండి: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్ షాక్! -
అవును.. నేను చనిపోయాననుకున్నా!
జెమ్స్ కామెరూన్ ‘అవతార్–2’ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా కోసమే కాదు షూటింగ్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సినీ అభిమానులు. ఈ సినిమాలో టైటానిక్ ఫేమ్ కెట్ విన్స్లేట్ ‘రోనల్’ అనే కీలక పాత్ర పోషించింది. ఊపిరి బిగపట్టి నీటి అడుగు భాగంలో 7 నిమిషాల 14 సెకన్ల సీన్ ఒకటి చేసినప్పుడు కొన్ని నెలల క్రితం ఆ ఫోటోను సోషల్ మీడియాలో చూసి అభిమానులు ఆహా, ఓహో అన్నారు. ఈ సీన్‌కు సంబంధించి తన అనుభవాన్ని తాజాగా ‘అబ్జర్వర్’ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది కెట్ విన్స్లేట్. ‘మది స్తంభించిపోయింది. కనిపిస్తున్న నీటిబుడగలను చూడడం తప్ప ఏ ఆలోచనా లేదు. ఒక దశలో నేను చనిపోయానా? అవును... నేను చనిపోయాను...అనుకున్నాను’ అని చెప్పింది. భయం సంగతి ఏమిటో గానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా కోసం టామ్‌క్రూజ్ ఆరునిమిషాల అరసెకను పాటు ఊపిరిబిగపట్టిన రికార్డ్‌ను కెట్ విన్స్లేట్ బ్రేక్ చేసింది. చదవండి: వైరల్: టైటానిక్ మరో క్లైమాక్స్ సీన్ వీడియో!