రక్షణ కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నాను : నటి | Nicole Kidman Says Why She Married Tom Cruise | Sakshi
Sakshi News home page

రక్షణ కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నాను : నటి

Published Wed, Oct 17 2018 2:20 PM | Last Updated on Wed, Oct 17 2018 3:27 PM

Nicole Kidman Says Why She Married  Tom Cruise - Sakshi

ఇప్పుడిప్పుడే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ పట్ల జరిగిన అన్యాయాలను వెల్లడిస్తున్నారు. ఈ వేధింపులు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలో అన్ని చోట్ల మహిళలు ఈ వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వేధింపుల నుంచి తప్పించుకోవడం కోసమే తాను ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు నటి నికోల్‌ కిడ్మన్‌. 22 ఏళ్ల వయసులోనే నికోల్‌ టామ్‌ క్రూజ్‌ను పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నికోల్‌, టామ్‌ విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులు తీసకుని ఇప్పటికి 17 ఏళ్లు అవుతోంది. టామ్‌తో విడిపోయాక అతని గురించి కానీ, అతనితో తనకు కలిగిన సంతానం గురించి కానీ నికోల్‌ ఎప్పుడూ మాట్లాడలేదు.

కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నికోల్‌ తన మాజీ భర్త గురించి సానుకూలంగా స్పందించారు. ‘నేను చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాను. అయితే ఈ వివాహం నాకు రక్షణ కల్పించింది. టామ్‌ క్రూజ్‌ లాంటి పవర్‌ఫుల్‌ వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల లైంగిక వేధింపుల లాంటి ప్రమాదాలు నా దరికి రాలేదు.  నా స్నేహితుల్లో చాలా మంది గృహహింస బాధితులే. కానీ టామ్‌ క్రూజ్‌ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. టామ్‌తో వివాహం నాకొక రక్షక కవచంలా నిలిచిందని చెప్పగలను’ అన్నారు. ఇప్పుడు నాకు మరొకరితో వివాహమైంది. కాబట్టి నా మాజీ భర్త గురించి ఇంతకంటే ఏమీ చెప్పలేను అని వెల్లడించారు నికోల్‌. విడాకుల అనంతరం నికోల్‌, కీత్‌ అర్బన్‌ అనే వ్యక్తిని  వివాహం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement