Nicole Kidman
-
రక్షణ కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నాను : నటి
ఇప్పుడిప్పుడే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ పట్ల జరిగిన అన్యాయాలను వెల్లడిస్తున్నారు. ఈ వేధింపులు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచంలో అన్ని చోట్ల మహిళలు ఈ వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వేధింపుల నుంచి తప్పించుకోవడం కోసమే తాను ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను పెళ్లి చేసుకున్నానని అంటున్నారు నటి నికోల్ కిడ్మన్. 22 ఏళ్ల వయసులోనే నికోల్ టామ్ క్రూజ్‌ను పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నికోల్, టామ్ విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులు తీసకుని ఇప్పటికి 17 ఏళ్లు అవుతోంది. టామ్‌తో విడిపోయాక అతని గురించి కానీ, అతనితో తనకు కలిగిన సంతానం గురించి కానీ నికోల్ ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నికోల్ తన మాజీ భర్త గురించి సానుకూలంగా స్పందించారు. ‘నేను చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాను. అయితే ఈ వివాహం నాకు రక్షణ కల్పించింది. టామ్ క్రూజ్ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల లైంగిక వేధింపుల లాంటి ప్రమాదాలు నా దరికి రాలేదు. నా స్నేహితుల్లో చాలా మంది గృహహింస బాధితులే. కానీ టామ్ క్రూజ్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. టామ్‌తో వివాహం నాకొక రక్షక కవచంలా నిలిచిందని చెప్పగలను’ అన్నారు. ఇప్పుడు నాకు మరొకరితో వివాహమైంది. కాబట్టి నా మాజీ భర్త గురించి ఇంతకంటే ఏమీ చెప్పలేను అని వెల్లడించారు నికోల్. విడాకుల అనంతరం నికోల్, కీత్ అర్బన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. -
21ఏళ్ల అమ్మాయిలా నటిస్తా: ప్రముఖ నటి
ఆస్కార్ విన్నర్, ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్మాన్ సుపరిచితురాలే. ఆమె వయసు ఇప్పుడు 49 ఏళ్లు. కానీ కెమెరా ముందుకొచ్చి నటించేటప్పుడు ఆమె అసలు 49ఏళ్ల మహిళల కనిపించరట. 21 ఏళ్ల అమ్మాయిలాగానే తాను నటిస్తానంటోంది నికోల్ కిడ్మాన్. కేన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఈమె, ఎక్కువగా బోల్డ్ ఛాయిస్ లు తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పింది. తనకు పనిలేకపోయినా.. పనిచేస్తూనే ఉంటానని, సినిమా తన ప్యాషన్ అని కిడ్మాన్ తెలిపింది. ఇటీవల ''ది కిల్లింగ్ ఆఫ్ ది సీక్రేడ్ డీర్' లో సైకలాజికల్ థ్రిల్లర్ హర్రర్ లో కిడ్ మాన్ నటించారు. కిడ్మాన్ కు ఇద్దరు పిల్లలు. వారిని కూడా సైకలాజికల్ థ్రిల్లర్ లో చూడాలనుకుంటున్నట్టు కిడ్మాన్ చెప్పారు. తను 21 ఏళ్లప్పుడు కెరీర్ ప్రారంభంలో ఎలాగైతే నటించానో ఇప్పటికీ అలాగే నటిస్తానని కిడ్మాన్ తెలిపారు. ఈ వయసులో తాను చాలా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నమ్మిన ఫిల్మ్ మేకర్స్ ను సపోర్టు చేస్తున్నానని తన మనసులోని భావాలను వెల్లడించారు. ''ది కిల్లింగ్ ఆఫ్ ది సీక్రేడ్ డీర్'' లో నటించిన కిడ్మాన్, నేత్ర వైద్యురాలు అన్నా మర్ఫీగా నటించారు. ఈ సినిమాను నేడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేశారు. నవంబర్ 3న అమెరికాలో విడుదల చేసేందుకు షెడ్యూల్ ప్రీపేర్ చేశారు. -
'నా భార్య గ్రేట్ గ్యాంబ్లర్'
లాస్ ఏంజిల్స్: 'డెడ్ కామ్', 'డేస్ ఆఫ్ థండర్' 'ది అవర్స్' వంటి హాలీవుడ్ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆస్ట్రేలియన్ నటి నికోల్ కిడ్మన్ ను ఉద్దేశించి ఆమె భర్త సంగీతకారుడైన కీత్ ఉర్బన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తరచూ జూదం ఆడే అలవాటున్న నికోల్ ను గ్రేట్ గ్యాంబ్లర్ గా అభివర్ణించాడు కీత్. అయితే తన భర్త చెప్పినట్లు అంత గొప్పగా కాకపోయనప్పటికీ జూదంలో అందెవేసిన చెయ్యేనని ఒప్పుకుందామె. 'జూదం నికోల్ క్రమశిక్షణగా మెలుగుతుంది. ఆ లక్షణమే ఆమెను మంచి జూదగత్తెగా మార్చి ఉంటుంది'అని కీత్ భార్యను పొగిడాడు. 'నేను సంపాదించే డబ్బులో కొంత పక్కకుపెట్టి దానితో జూదం ఆడతాను. ఓ ఛాలెంజ్ విషయమై నా ఇంటిని కూడా జూదంలో పెట్టాలనుకుంటున్నాను' అంటూ గ్యాంబ్లింగ్ పై తనకున్న ప్రేమను దాచుకోకుండా వెల్లడించింది నికోల్ కిడ్ మన్. ఈ జూదం వ్యవహారం ఆ కుటుంబాన్ని ఎక్కడిదాకా తీసుకెళుతుందో వేచిచూడాలిమరి! -
తండ్రికి నివాళిగా ఫొటోగ్రాఫ్ 51
ఒకప్పుడు సినిమాల్లోకి రావాలనుకునేవాళ్లు ముందు రంగస్థలంపై తమ ప్రతిభ నిరూపించుకునేవారు. కొంతమంది కళల పట్ల ఉన్న మక్కువతో రంగస్థల నటీనటులుగా కొనసాగేవాళ్లు. అలాంటి రంగస్థలం సినిమా వచ్చాక దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. కానీ, సినిమాల్లో రాణిస్తున్న తారల్లో రంగస్థలం మీద ఇంకా మమకారం ఉన్నవాళ్లు ఉన్నారు. అలాంటివాళ్లల్లో హాలీవుడ్ నటి నికోల్ కిడ్మేన్ ఒకరు. ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం ఆమె ‘ది బ్లూ రూమ్’ అనే నాటకంలో నటించారు. లైంగిక దాడుల నేపథ్యంలో సాగే ఆ ప్లేలో నికోల్ నటనను, అప్పటి క్రిటిక్ ‘ప్యూర్ థియేటరికల్ వయాగ్రా’ అని పేర్కొన్నారు. రంగస్థలం మీద మక్కువ ఉన్నప్పటికీ ఆ తర్వాత సరైన అవకాశం రాకపోవడం, గాయనిగా, నటిగా, సినిమాలతో బిజీగా ఉండటంతో మళ్లీ స్టేజిపై కనిపించలేకపోయారు నికోల్. ఇటీవల ఆమెకు ఆ అవకాశం వచ్చింది. ‘ఫొటోగ్రాఫ్ 51’ అనే ప్లేలో నటించారామె. ఇందులో రోజలిండ్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్తగా నటించారు. ఈ పాత్ర తనకు చాలా ఆత్మసంతృప్తి మిగిల్చిందని నికోల్ పేర్కొన్నారు. ఎందుకంటే ఆమె తండ్రి పెద్ద పేరున్న శాస్త్రవేత్త. ఏడాది క్రితం ఆయన చనిపోయారు. ఈ ‘ఫోటోగ్రాఫ్ 51’ తన తండ్రికి ఘన నివాళిలా భావిస్తున్నాననీ, చిన్నప్పుడు తండ్రితో సైన్స్ ల్యాబ్‌లో గడిపిన క్షణాలను ఈ నాటకం గుర్తుచేసిందని నికోల్ తెలిపారు. -
ఐ వాంట్ మోర్!
ప్రపంచమంతా ఫ్యామిలీ ప్లానింగ్ వైపు అడుగులు వేస్తుంటే... హాలీవుడ్ స్టార్ నికోల్ కిడ్మన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నా... తనకు ఇంకా పిల్లలు కావాలంటోందీ తార. ఉన్న నలుగురులో ఇద్దరు మాజీ భర్త టామ్ క్రూజ్‌కు సంబంధించిన సంతానం. మిగిలిన ఇద్దరినీ దత్తత తీసుకుంది. ‘నా సంతానాన్ని ఎనిమిదికి పెంచాలని కోరుకుంటున్నా. మా అమ్మ లాగా నా సోదరికి ఆరుగురు పిల్లలు. అలాగే నాకూ మరో నలుగురు కావాలి’ అని ఎంతో ముచ్చటగా చెప్పింది నలభై ఏడేళ్ల నికోల్ కిడ్మన్.