
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ‘టాప్ గన్’ పట్టుకున్నారు. ఆయన గన్ పట్టుకోకుండా ఉన్న మూవీ ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. మరి.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యేకంగా గన్ పట్టుకోవడం ఏంటీ? అని ఆలోచించకండి. అందుకనే కదా ‘టాప్ గన్’ అన్నాం. టోనీ స్కాట్ దర్శకత్వంలో 1986లో టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన చిత్రం ‘టాప్ గన్’.
ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ‘టాప్‌గన్ 2’ను స్టార్ట్ చేశారు. ఈ సీక్వెల్‌కు జోసెఫ్ కొసిన్సి్క దర్శకత్వం వహిస్తారట. ‘టాప్‌గన్’లో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టిన టామ్ క్రూజ్ ఇప్పుడు లేటెస్ట్ వెపన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్: ఫాలౌట్’ వచ్చే నెల 27న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment