హాలీవుడ్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ఈ ఫ్రాంచైజీల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఎనిమిదో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’లోని ఐదు, ఆరు, ఏడు విభాగాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్వారీయే ఎనిమిదో భాగాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లొకేషన్స్‌లో ప్రారంభమైంది.
కొంత చిత్రీకరణ జరిగాక ఆ ్రపాంతంలోని ఎమ్ 25 అనే ఓ ప్రముఖ రోడ్డును తాత్కాలికంగా క్లోజ్ చేశారట. ఈ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని సమాచారం. కానీ ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ షూటింగ్‌ను కొనసాగించాలంటే ఈ రోడ్డు ద్వారా లొకేషన్‌కు వెళ్లాలట. దీంతో ప్రత్యేకంగా హెలికాప్టర్స్‌ని ఏర్పాటు చేశారట. రోడ్డు మార్గం ద్వారా కాకుండా గగన మార్గాన టామ్ క్రూజ్ అండ్ టీమ్ లొకేషన్‌కు వెళ్తున్నారని హాలీవుడ్ టాక్.
పోనీ.. ఈ రోడ్డు మరమ్మతు పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తర్వాత షూటింగ్‌ను మళ్లీ ఆ లొకేషన్‌లో తిరిగి ఆరంభించానే ఆలోచన కూడా చేశారట. కానీ రోడ్డు రిపేర్‌కి చాలా టైమ్ పడుతుందని, హెలికాప్టర్స్‌తో లొకేషన్‌కి వెళ్లే ఖర్చుతో పోలిస్తే సినిమా ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని క్రూజ్ అండ్ టీమ్ భావించిందని హాలీవుడ్ భోగట్టా. ఇలా ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్‌ను ఏది ఏమైనా ఆగేదే లేదంటూ.. పాజిబుల్ చేశారు టామ్ క్రూజ్ అండ్ టీమ్. ఈ సినిమా 2025 వేసవిలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment