Mission Impossible
-
ఏది ఏమైనా... మిషన్ పాజిబుల్
హాలీవుడ్లో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ఈ ఫ్రాంచైజీల్లో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఎనిమిదో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘మిషన్ ఇంపాజిబుల్’లోని ఐదు, ఆరు, ఏడు విభాగాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్వారీయే ఎనిమిదో భాగాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లొకేషన్స్‌లో ప్రారంభమైంది. కొంత చిత్రీకరణ జరిగాక ఆ ్రపాంతంలోని ఎమ్ 25 అనే ఓ ప్రముఖ రోడ్డును తాత్కాలికంగా క్లోజ్ చేశారట. ఈ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని సమాచారం. కానీ ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ షూటింగ్‌ను కొనసాగించాలంటే ఈ రోడ్డు ద్వారా లొకేషన్‌కు వెళ్లాలట. దీంతో ప్రత్యేకంగా హెలికాప్టర్స్ని ఏర్పాటు చేశారట. రోడ్డు మార్గం ద్వారా కాకుండా గగన మార్గాన టామ్ క్రూజ్ అండ్ టీమ్ లొకేషన్‌కు వెళ్తున్నారని హాలీవుడ్ టాక్. పోనీ.. ఈ రోడ్డు మరమ్మతు పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తర్వాత షూటింగ్‌ను మళ్లీ ఆ లొకేషన్లో తిరిగి ఆరంభించానే ఆలోచన కూడా చేశారట. కానీ రోడ్డు రిపేర్‌కి చాలా టైమ్ పడుతుందని, హెలికాప్టర్స్‌తో లొకేషన్‌కి వెళ్లే ఖర్చుతో పోలిస్తే సినిమా ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని క్రూజ్ అండ్ టీమ్ భావించిందని హాలీవుడ్ భోగట్టా. ఇలా ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్‌ను ఏది ఏమైనా ఆగేదే లేదంటూ.. పాజిబుల్ చేశారు టామ్ క్రూజ్ అండ్ టీమ్. ఈ సినిమా 2025 వేసవిలో రిలీజ్ కానుంది. -
61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్ ఫిదా అవుతారు. ఈ సిరీస్‌లో ఏడో సినిమాగా వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ కింగ్ టామ్ క్రూజ్ ఫైటింగ్ సీన్స్‌తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయం. తాజాగా ఇందులో నంటించిన అమెరికన్ నటి హేలీ అట్వెల్ తనపై వస్తున్న రూమర్‌కు సమాధానం చెప్పారు. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం) యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌తో వస్తున్న డేటింగ్ వార్తలపై ఆమె ఇలా క్లారిటీ ఇచ్చింది. 'ఇప్పుడు నాకు 41 ఏళ్లు.. టామ్‌కు 61 ఏళ్లు ఉన్నాయి.. మేమిద్దరం శృంగారంలో పాల్గొన్నామని ఎలా ప్రచారం చేస్తారు. ఇదీ చాలా చెత్తగా ఉంది. ఇంతటి డర్టీ ఆలోచనలు ఎలా వస్తాయి. స్క్రీన్ మీద మాత్రమే మా మధ్య రోమాన్స్ ఉంటుంది. నాకు ఇప్పటికే సింగర్ కెల్లీతో నిశ్చితార్థం జరిగింది. ఇంతటితో ఈ ప్రచారాన్ని ఆపేయండి. టామ్ నాకు అంకుల్ లాంటివాడు. ఆయన కూడా నన్ను ఎప్పుడూ చెడు ఉద్ధేశంతో చూడలేదు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.' అని నటి హేలీ అట్వెల్ తెలిపింది. (ఇదీ చదవండి: విక్రమ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్) -
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
టామ్‌క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్ పూర్తి
హాలీవుడ్ మూవీ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ (ఎమ్ఐ)కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ సినిమాల్లోని హీరో తన అసిస్టెంట్స్‌తో కలిసి చేసే సాహసాలు అబ్బురపరిచేలా ఉంటాయి. అందుకే సిరీస్‌లోని మరో సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఎప్పుడెప్పుడా అభిమానులు ఎదురుచూస్తుంటారు. హాలీవుడ్ స్టార్ నటుడు టామ్‌క్రూజ్ హీరోగా నటిస్తున్నా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో ఆరు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సిరీస్‌లో వస్తున్నా తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన.. ఏడో పార్ట్ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌తోపాటు ఎమ్ఐ 8ని కూడా త్వరగా పూర్తి చేసి 2023లో విడుదల చేయాలని మూవీ టీం భావించింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఎమ్ఐ 7 చిత్రీకరణ, విడుదల ఆలస్యం, ఇతర కారణాల వల్ల ఆ మూవీ కూడా ఆలస్యం అవుతోంది. కాగా ఇటీవల ‘ఎమ్ఐ 7’ షూటింగ్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్లో జరిగింది. టామ్‌క్రూజ్ కాస్ట్లీ కారును మూవీ టీం బస చేసిన హోటల్లో బయట పార్క్ చేయగా ఎవరో దొంగిలించారు. పోలీసులకు సమాచారం అందించగా కారుకు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దగ్గరలోకి ఓ విలేజ్‌లో గుర్తించారు. కోట్ల విలువ చేసే కారు దొరికినా అందులోని లగేజీ, నగదు పోయినట్లు తెలిసింది. -
తాప్సీ `మిషన్ ఇంపాజిబుల్’లో మలయాళ విలక్షణ నటుడు
టాలీవుడ్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. రీసెంట్గా ఈ అమ్మడు`మిషన్ ఇంపాజిబుల్` సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మలయాళ నటుడు హరీశ్ పేరడీ తీసుకున్నారు. మలయాళ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపుపొందారు. ఎరిడ, తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద ఇలా నలబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టడమే కాదు.. ఓ ప్రత్యేకస్థాన్ని సంపాదించిపెట్టాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు. -
Tom Cruise: మిషన్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌కు సడెన్ బ్రేక్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కి కరోనా బారినపడ్డాడా?.. అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. మిషన్ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌ను అర్థాంతరంగా ఆపేయడంతో ఈ ఊహాగానాలకు తెరలేపాయి. టామ్‌తో పాటు చిత్రయూనిట్‌లోని కొందరు కరోనా బారినపడ్డట్లు ఆ కథనాలు ఉటంకించాయి. అయితే కొన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్స్ మాత్రం కేవలం సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడిందని, క్రూజ్‌తో సహా మిగతా వాళ్లంతా ఐసోలేషన్‌కి వెళ్లారని ప్రస్తావించడం విశేషం. కాగా, కొందరు సిబ్బందికి పాజిటివ్ తేలడంతో షూటింగ్‌కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే టామ్ క్రూజ్ ఆరోగ్య స్థితిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక నైట్‌క్లబ్‌లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చిత్రయూనిట్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పదకొండు మంది కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టామ్ క్రూజ్ ఉన్నాడా? లేదా? అనేది మాత్రం నిర్ధారించలేదు. దీంతో హాలీవుడ్ ప్రముఖ వెబ్‌సైట్స్ క్రూజ్ సైతం పాజిటివ్ బారినపడ్డాడని కథనాలు ప్రచురించాయి. అయితే బ్రిటన్ మీడియా హౌజ్‌లు మాత్రం టామ్ ఓ లగ్జరీ హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపాయి. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కావాల్సిన మిషన్ ఇంపాజిబుల్ 7.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది. పోయినేడాది ఇటలీలో జరిగాల్సిన షెడ్యూల్ కరోనాతో ఆలస్యమైంది. మొన్నీమధ్యే టామ్ క్రూజ్, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన సిబ్బందిపై మండిపడినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది కూడా. అయితే తాను నిర్లక్ష్యంగా ఉన్న కొందరిపైనే అరిచానని టామ్ క్రూజ్ క్లారిటీ ఇచ్చాడు కూడా. కాగా, 58 ఏళ్ల క్రూజ్ ఆరోగ్య స్థితిపై ఆయన సిబ్బంది స్పందించాల్సి ఉంది. చదవండి: సంచలనం: నగ్నంగా నన్ను చేసి.. -
హాలీవుడ్ సినిమాలో నటించనున్న ప్రభాస్..!
హాలీవుడ్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో ప్రభాస్ నటించనున్నారా? అంటే.. ప్రచారంలో ఉన్న వార్తలు చూస్తుంటే అది పాజిబుల్ అవుతుందేమో అనేది కొందరి అభిప్రాయం. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కలసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ నటుడు ప్రభాస్ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి ముందుకు వచ్చారని క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు టాక్. ‘రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ గత ఏడాది ఇటలీ వెళ్లినప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ స్క్రిప్ట్‌ను వినిపించారట క్రిస్టోఫర్. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. అంతేకాదు.. ఇటలీలో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ అప్పుడే ‘మిషన్: ఇంపాజిబుల్ 7’కు సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా ప్రభాస్ పూర్తి చేశారనే టాక్ నడుస్తోంది. ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న విడుదల కానుంది. -
నోరు పారేసుకున్న హీరో: ఐదుగురు అవుట్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్ 7. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా గడుపుతోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు పొక్కుతుండటంతో టామ్ క్రూస్ గరంగరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్లో కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాటించటం లేదని తెలిపే ఓ వీడియో ఆన్లైన్లో లీక్ అయింది. ( బట్టలు విప్పటానికి మాల్దీవులకెళ్లాలా?) దీంతో టామ్ క్రూస్ ఓ ఇద్దరు సెట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై నోరుపారేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ కూడా ఆన్లైన్లో విడుదలైంది. దీంతో మరింత ఆగ్రహానికి గురయ్యారాయన. కొంతమంది సెట్ సభ్యులపై తిట్ల దండకం మొదలెట్టారు. టామ్ తిట్లు భరించలేక ఐదుగురు సెట్ సభ్యులు సినిమా నుంచి తప్పుకున్నారు. -
షూటింగ్: ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు!
‘‘మిషన్ ఇంపాజిబుల్’’ నటుడు, హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ మరోసారి అద్భుతమైన స్టంట్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్ఐ సిరీస్-7లో భాగంగా ఒళ్లు గగొర్పొడిచే విన్యాసాలతో ఆకట్టుకోనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నార్వేలో చేసిన షూటింగ్ వీడియోలను బట్టి టామ్ క్రూజ్ మరోసారి అదిరే ఫీట్లతో సందడి చేయడం ఖాయమనిపిస్తోంది. ఇందులో కొండ అంచుల వద్ద గల ర్యాంప్‌పై నుంచి బైక్‌పై దూసుకువచ్చిన క్రూజ్.. అమాంతం లోయలోకి దూకిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అదే విధంగా యూకే షూట్‌కు సంబంధించిన మరో వీడియో ఇటీవల లీకైన సంగతి తెలిసిందే. ఇందులో కూడా అతడు మోటార్ సైకిల్‌పై స్టంట్స్ చేస్తూ కనిపించాడు. కాగా గతంలోనూ టామ్ క్రూజ్ ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రానికి క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఇటలీలో చేయాలని భావించినా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఇటీవల షూటింగ్ ప్రారంభించి యూకే, నార్వేలో పలు యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల కానున్నట్లు సమాచారం. -
మేకింగ్ ఆఫ్ మూవీ: మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్
-
మిషన్ ఇంపాజిబుల్కు కశ్మీర్ కట్స్
ప్రపంచవ్యాప్తంగా జులై 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాజిబుల్ ఫాలవుట్లో కొన్ని సన్నివేశాలపై భారత్‌లో కత్తెర పడింది. ఈ సినిమా క్లైమాక్స్ అంతా కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. అందులో కశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడు చూపించిన మ్యాప్‌లు, మరికొన్ని ఇతర అంశాలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాప్‌లో కశ్మీర్ సరిహద్దుల్ని తప్పుగా గుర్తించడమే కాదు, భారత్ ఆధీనంలో కశ్మీర్ అంటూ ఉదహరించారు. వినోదం కోసం దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఆ చిత్ర నిర్మాతలకు స్పష్టం చేసినట్టు సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి వెల్లడించారు. కశ్మీర్ మ్యాప్‌ను సరిగా చూపించాలని, లేదంటే ఆ సన్నివేశాన్ని తొలగించాలని, కశ్మీర్‌ను భారత రాష్ట్రంలా చూపించాలంటూ ఆదేశించారు. మొత్తం నాలుగు కట్స్, కొన్ని సవరణల్ని చెప్పారు. అంతే కాదు తమ చిత్రం ఏ మతం, వర్గం , ప్రాంతం, , దేశం వారి మనోభావాలను దెబ్బ తీయడానికి ఉద్దేశించినది కాదంటూ సినిమా మొదలవడానికి ముందు వెయ్యాలని కూడా ఆదేశించారు. భారత్‌లో విడుదలైన చిత్రానికి సంబంధించినంత వరకు వీటన్నింటినీ అమలు చేశారు. అయితే లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ గ్లాసియర్, నూబ్రా లోయలకు సంబంధించిన ప్రస్తావనను అలాగే ఉంచేశారు. ఈ చిత్రాన్ని తొలుత భారత్‌లోనే షూట్ చేద్దామని భావించారు చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వెరీ. చాలాసార్లు కశ్మీర్ అంతా తిరిగి కథకి అవసరమైన లొకేషన్ కోసం వెతికారు. ఒక హెలికాప్టర్ ఛేజింగ్ సన్నివేశం చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ శాంతి భద్రతల సమస్యతో న్యూజిలాండ్‌లో కశ్మీర్‌ను తలపించే సెట్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. భారత్‌లో కనిపించే వైవిధ్యం తనకెంతో ఇష్టమని, అదంతా సినిమా క్లైమాక్స్‌లో వచ్చేలా చూసుకున్నామంటూ చిత్ర ప్రోమోషన్ సమయంలో క్రిస్టోఫర్ వివరించారు. మొదటి వీకెండ్‌కే ఈ సినిమా భారత్‌లో 56 కోట్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని హిట్‌గా నిలిచింది. హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ పుల్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్.. ఇందులో ఆరో భాగంగా ఈ ఫాలవుట్ వచ్చింది. ఇందులో హీరో టామ్ క్రూయిజ్ ఇంపాజిబుల్ అనుకునే మిషన్‌ను చేపడతాడు. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. హీరో టామ్ క్రూయిజ్ చేసే విన్యాసాలు ఈ సినిమాలకు అదనపు ఆకర్షణ. టెర్రరిస్టుల చేతుల్లో ప్లుటోనియం బాంబులు పడడం, వాటిని హీరో తిరిగి చేజిక్కించుకోవడం అనే కథాంశంతో ఫాలవుట్ని తీశారు. -
‘మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్’ ట్రైలర్ రిలీజ్
-
‘మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్’ ట్రైలర్
సాక్షి, సినిమా : ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ పేరు వినగానే ప్రసిద్ధ నటుడు టామ్ క్రూజ్ చేసే అద్భుత సాహసాలు, యాక్షన్ సన్నివేశాలు గుర్తుకొస్తాయి. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో కొత్త సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్’ అధికారిక ట్రైలర్ గురువారం విడుదలైంది. టామ్ క్రూజ్, సూపర్‌మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన హెన్రీ కావిల్లు యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతోంది. న్యూక్లియర్ వార్ నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ఈథన్ హంట్ పాత్రలో (టామ్ క్రూజ్) తన కార్యకలాపాలను ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సవాళ్లను గురించి చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్లో భవనంపై నుంచి దూకుతూ క్రూజ్ గాయపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సీన్‌ను కూడా టీం ట్రైలర్లో ఉంచింది. ఈ ఏడాది జులై 27న మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బిల్డింగు దూకబోతే..!
ఆగస్టు నెల. 2017. ‘మిషన్ ఇంపాజిబుల్ 6’ షూటింగ్ జరుగుతోంది. టామ్ క్రూయిజ్ ఒక బిల్డింగ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ యాక్షన్ సీన్‌కు అనుగుణంగా ఆయనకు వైర్లు కట్టి ఉంచారు. పరిగెత్తుకుంటూ వచ్చి క్రూయిజ్ ఒక బిల్డింగ్ మీది నుంచి ఇంకో బిల్డింగ్ మీదకు దూకాలి. క్రూయిజ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒక్క ఉదుటున గాల్లో ఎగిరి పక్క బిల్డింగ్ మీద లాండ్ అవ్వబోతున్నాడు. చిన్న గ్యాప్. అంతే పక్క బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాల్సిన వాడు కాస్తా ఆ గోడకు గట్టిగా గుద్దుకున్నాడు. ముందు పాదం గట్టిగా గోడను తాకింది. ఆ తర్వాత బాడీ కూడా. చుట్టూ కెమేరాలున్నాయి. వైర్లతో కట్టి ఉంచారు కాబట్టి క్రూయిజ్ కిందపడడు. అలాగే అంత పెద్ద దెబ్బ తగిలినా వెంటనే లేచి, ఆ బిల్డింగ్‌పైకి అడుగుపెట్టి మళ్లీ పరిగెడుతూ ఆ సీన్ పూర్తి చేశాడు క్రూయిజ్. అప్పటికే చీలమండకు పెద్ద గాయమైంది. ఈ సీన్ అయితే పూర్తి చేశాడు కానీ, ఆ తర్వాత కొంతకాలం పాటు షూటింగ్ అంతా పక్కన పెట్టాల్సినంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకోవడంతో షూట్ మళ్లీ మొదలుపెట్టారు. జూలై 27న ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీమ్ పనులన్నీ వేగవంతం చేసింది. ఈ సంఘటన జరిగి ఇన్ని నెలలయ్యాక టామ్ క్రూయిజ్, ఆ వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగానే సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్ : ఫాల్ ఔట్’ అన్న పేరును ఖరారు చేసినట్టు తెలిపాడు. అంతపెద్ద దెబ్బ తగిలినా, తన పనిపట్ల టామ్ క్రూయిజ్ చూపించిన డెడికేషన్‌కు ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. ‘ఇది చిన్న విషయమేలే!’ అన్నట్టు క్రూయిజ్ నవ్వి ఊరుకుంటున్నాడు కానీ, ఆయన వయసు ఇప్పుడు 55! ఇదేం చిన్న విషయమైతే కాదు!! -
మేకింగ్ ఆఫ్ మూవీ -మిషన్ ఇంపాజిబుల్
-
'మిషన్ ఇంపాజిబుల్' వెనక మనోళ్లు
న్యూఢిల్లీ: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత దేశంలో విడుదలైన 'మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్' హాలివుడ్ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు కూడా భ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా చిత్రంలో కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ టాలివుడ్ చిత్రం 'బాహుబలి'లోలాగా అదరగొడుతున్నాయని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. వాస్తవానికి ఈ విజువల్ ఎఫెక్ట్స్ క్రెడిటంతా భారతీయులదే. మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలోని సాహసకృత్యాలకు గ్రాఫిక్స్‌తో ప్రాణం తీసుకొచ్చిందీ ధీరేంద్ర ఛాట్పర్, సౌరబ్ నందేడ్కర్, అభిషేక్ సింగ్, ఇంద్రానిల్ భట్టాచార్య తదితర భారతీయులు. జూలై 30వ తేదీన అమెరికాలో విడుదలై భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్సే హైలెట్స్ అని న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఈ సినిమాను రివ్యూ చేసిన ప్రముఖ విమర్శకుడు మనోహ్లా డర్గీస్ పేర్కొన్నారు. ఇంపాజిబుల్ మిషన్‌ను పాజిబుల్ చేసిందీ విజువల్ ఎఫెక్ట్స్ టీమేనని ఆయన ప్రశంసించడం విశేషం. 53 ఏళ్ల టామ్ క్రూయిజ్ నటించిన ఈ చిత్రానికి ధీరేంద్ర ఛాట్పర్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్‌గా పనిచేశారు. ఇటు భారత్‌లో, అమెరికాలో పలు చిత్రాలకు పనిచేస్తున్న ఛాట్పర్ తన కెరీర్‌ను 2012లో 'మిర్రర్ మిర్రర్' చిత్రంతో ప్రారంభమైంది. ఇటీవలనే 500 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు వసూలు చేసిన బాలివుడ్ చిత్రం బజరంగ్ భాయిజాన్‌కు విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్‌గా పనిచేసిందీ ఆయనే. హమారి అధూరి కహాని, తను వెడ్స్ మను అనే చిత్రాలు ఆయన వృత్తి నైపుణ్యానికి మరికొన్ని మచ్చుతునకలు. ఇంతకుముందు ఎడ్జ్ ఆఫ్ టుమారో, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలాక్సీ, వైట్‌హౌజ్ డౌన్, సిన్ సిటీ: ఏ డేమ్ టు కిల్ ఫర్ లాంటి హాలివుడ్ చిత్రాలకు పనిచేశారు. ఇక మిషన్ ఇంపాజిబుల్కు డిజిటల్ కంపోజిటర్లుగా పనిచేసిన సౌరబ్ నందేడ్కర్, అభిషేక్ సింగ్‌లు బాలివుడ్ చిత్రం బర్ఫీ, హాలివుడ్ చిత్రాలు సిన్ సిటీ: ఏ డేమ్ టు కిల్ ఫర్కు పనిచేశారు. ఏబీసీడీ: ఎనీబడీ కెన్ డేన్స్, నాన్ స్టాప్, బాగ్ మిల్కా బాట్ లాంటి చిత్రాలతోని కూడా సౌరబ్ నందేక్కర్కు మంచి పేరు వచ్చింది. ఇంద్రానిల్ భట్టాచార్య ఇంతకుముందు దబాంగ్-2, హౌజ్‌ఫుల్-2 లాంటి చిత్రాలకు పని చేశారు. -
ఆ హీరో శ్రీమంతుడుకి విలన్ అవుతున్నాడా?
-
నీటిలో ఆరు నిమిషాలు...
అది టామ్ క్రూజ్ నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్ లొకేషన్. దర్శకుడు యాక్షన్ అని చెప్పగానే టామ్ నీళ్లల్లోకి దూకేశారు. సమయం గడుస్తోంది. చిత్ర బృందం అంతా చాలా టెన్షన్‌గా ఉంది. ఒకటి...రెండు...ఇలా ఆరో నిమిషం కాగానే దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వైర్ ‘కట్’ చెప్పగానే టామ్ బయటకు వచ్చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ షాట్‌ను కేవలం సింగిల్ టేక్‌లో తీశారు. మామూలుగా ఎవరైనా కేవలం నీటి అడుగున 22 సెకన్ల పాటు ఊపిరి బిగబట్టి ఉంటారన్నది సైన్స్. కానీ టామ్ మాత్రం ఆరు నిమిషాల పాటు ఉండి, చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైస్‌లో ఇప్పటిదాకా ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన టామ్... దర్శకుడు క్రిస్టోఫర్ ఈ సన్నివేశం గురించి చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎటువంటి ఆధారం లేకుండా విమానం మీద టామ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. మరి.. ఈ సినిమాలో ఇంకెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలియాలంటే జూలై 31 వరకూ ఆగాల్సిందే.