
‘‘మిషన్ ఇంపాజిబుల్’’ నటుడు, హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ మరోసారి అద్భుతమైన స్టంట్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్‌ఐ సిరీస్-7లో భాగంగా ఒళ్లు గగొర్పొడిచే విన్యాసాలతో ఆకట్టుకోనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నార్వేలో చేసిన షూటింగ్ వీడియోలను బట్టి టామ్ క్రూజ్ మరోసారి అదిరే ఫీట్లతో సందడి చేయడం ఖాయమనిపిస్తోంది. ఇందులో కొండ అంచుల వద్ద గల ర్యాంప్‌పై నుంచి బైక్‌పై దూసుకువచ్చిన క్రూజ్.. అమాంతం లోయలోకి దూకిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
అదే విధంగా యూకే షూట్‌కు సంబంధించిన మరో వీడియో ఇటీవల లీకైన సంగతి తెలిసిందే. ఇందులో కూడా అతడు మోటార్ సైకిల్‌పై స్టంట్స్ చేస్తూ కనిపించాడు. కాగా గతంలోనూ టామ్ క్రూజ్ ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రానికి క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఇటలీలో చేయాలని భావించినా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఇటీవల షూటింగ్ ప్రారంభించి యూకే, నార్వేలో పలు యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment