నోరు పారేసుకున్న హీరో: ఐదుగురు అవుట్‌! | Tom Cruise Rant On Crew Five Members Step Out Of Mission Impossible 7 | Sakshi
Sakshi News home page

నోరు పారేసుకున్న హీరో: ఐదుగురు అవుట్‌!

Published Thu, Dec 17 2020 4:47 PM | Last Updated on Thu, Dec 17 2020 7:31 PM

Tom Cruise Rant On Crew Five Members Step Out Of Mission Impossible 7 - Sakshi

హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూస్ ప్రధాన పాత్రలో‌ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం మిషన్‌ ఇంపాజిబుల్‌ 7. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా గడుపుతోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు పొక్కుతుండటంతో టామ్‌ క్రూస్‌ గరంగరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్‌లో కోవిడ్‌ 19 ప్రోటోకాల్స్‌ పాటించటం లేదని తెలిపే ఓ వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. ( బట్టలు విప్పటానికి మాల్దీవులకెళ్లాలా?)

దీంతో టామ్‌ క్రూస్‌ ఓ ఇద్దరు సెట్‌ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై నోరుపారేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ కూడా ఆన్‌లైన్‌లో విడుదలైంది. దీంతో మరింత ఆగ్రహానికి గురయ్యారాయన. కొంతమంది సెట్‌ సభ్యులపై తిట్ల దండకం మొదలెట్టారు. టామ్‌ తిట్లు భరించలేక ఐదుగురు సెట్‌ సభ్యులు సినిమా నుంచి తప్పుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement