Mission Impossible Actress Hayley Atwell And Tom Cruise Weird Dating Rumors, Deets Inside - Sakshi
Sakshi News home page

Tom Cruise And Hayley Atwell Rumours: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్‌ అయిన హీరోయిన్‌

Published Mon, Jul 10 2023 8:37 AM | Last Updated on Mon, Jul 10 2023 10:26 AM

Mission Impossible Actress Hayley Atwell And Tom Cruise Weird Rumors - Sakshi

‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్‌‌ ఫిదా అవుతారు. ఈ సిరీస్‌లో ఏడో సినిమాగా వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్‌ కింగ్‌ టామ్ క్రూజ్ ఫైటింగ్ సీన్స్‌తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడం ఖాయం.  తాజాగా ఇందులో నంటించిన  అమెరికన్ నటి హేలీ అట్‌వెల్ తనపై వస్తున్న రూమర్‌కు సమాధానం చెప్పారు.

(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం)

యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌తో వస్తున్న డేటింగ్‌ వార్తలపై ఆమె ఇలా క్లారిటీ ఇచ్చింది. 'ఇప్పుడు నాకు 41 ఏళ్లు.. టామ్‌కు  61 ఏళ్లు ఉన్నాయి.. మేమిద్దరం శృంగారంలో పాల్గొన్నామని ఎలా ప్రచారం చేస్తారు. ఇదీ చాలా చెత్తగా ఉంది. ఇంతటి డర్టీ ఆలోచనలు ఎలా వస్తాయి. స్క్రీన్‌ మీద మాత్రమే మా మధ్య రోమాన్స్‌ ఉంటుంది. నాకు ఇప్పటికే సింగర్ కెల్లీతో నిశ్చితార్థం జరిగింది. ఇంతటితో ఈ ప్రచారాన్ని ఆపేయండి. టామ్‌ నాకు అంకుల్ లాంటివాడు. ఆయన కూడా నన్ను ఎప్పుడూ చెడు ఉద్ధేశంతో చూడలేదు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.' అని నటి హేలీ అట్‌వెల్ తెలిపింది.

(ఇదీ చదవండి: విక్రమ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement