Tom Cruise: మిషన్​ ఇంపాజిబుల్ 7 షూటింగ్‌కు సడెన్‌ బ్రేక్‌! | Tom Cruise Corona Rumours Amid MI7 Halt In UK | Sakshi
Sakshi News home page

ఆగిన MI-7 షూటింగ్​..టామ్​ క్రూజ్​కి కరోనా!

Published Fri, Jun 4 2021 7:59 AM | Last Updated on Fri, Jun 4 2021 8:36 AM

Tom Cruise Corona Rumours Amid MI7 Halt In UK - Sakshi

హాలీవుడ్ స్టార్​ హీరో టామ్​ క్రూజ్​కి కరోనా బారినపడ్డాడా?.. అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. మిషన్​ ఇంపాజిబుల్ 7 షూటింగ్​ను అర్థాంతరంగా ఆపేయడంతో ఈ ఊహాగానాలకు తెరలేపాయి. టామ్​తో పాటు చిత్రయూనిట్​లోని కొందరు కరోనా బారినపడ్డట్లు ఆ కథనాలు ఉటంకించాయి. అయితే కొన్ని బ్రిటిష్​ టాబ్లాయిడ్స్​ మాత్రం కేవలం సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడిందని, క్రూజ్​తో సహా మిగతా వాళ్లంతా ఐసోలేషన్​కి వెళ్లారని ప్రస్తావించడం విశేషం. 

కాగా, కొందరు సిబ్బందికి పాజిటివ్​ తేలడంతో షూటింగ్​కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్​ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్​ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే టామ్​ క్రూజ్​ ఆరోగ్య స్థితిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక నైట్​క్లబ్​లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చిత్రయూనిట్​కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పదకొండు మంది కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టామ్​ క్రూజ్​ ఉన్నాడా? లేదా? అనేది మాత్రం నిర్ధారించలేదు. దీంతో హాలీవుడ్​ ప్రముఖ వెబ్​సైట్స్​ క్రూజ్​ సైతం పాజిటివ్​ బారినపడ్డాడని కథనాలు ప్రచురించాయి. అయితే బ్రిటన్​ మీడియా హౌజ్​లు మాత్రం టామ్​ ఓ లగ్జరీ హోటల్​లో ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపాయి. 

ఇక వచ్చే ఏడాది రిలీజ్​ కావాల్సిన మిషన్​ ఇంపాజిబుల్​ 7.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది. పోయినేడాది ఇటలీలో జరిగాల్సిన షెడ్యూల్ కరోనాతో ఆలస్యమైంది. మొన్నీమధ్యే టామ్​ క్రూజ్​, కోవిడ్ రూల్స్​ బ్రేక్​ చేసిన సిబ్బందిపై మండిపడినట్లు ఓ ఆడియో క్లిప్​ వైరల్ అయ్యింది కూడా. అయితే తాను నిర్లక్ష్యంగా ఉన్న కొందరిపైనే అరిచానని టామ్​ క్రూజ్ క్లారిటీ ఇచ్చాడు కూడా. కాగా, 58 ఏళ్ల క్రూజ్​ ఆరోగ్య స్థితిపై ఆయన సిబ్బంది స్పందించాల్సి ఉంది.

చదవండి: సంచలనం: నగ్నంగా నన్ను చేసి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement