Prabhas Hollywood Entry With Mission Impossible 7 Movie Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ సినిమాలో నటించనున్న ప్రబాస్‌..!

Published Wed, May 26 2021 1:32 AM | Last Updated on Wed, May 26 2021 10:10 AM

Prabhas May Act In Hollywood Movie - Sakshi

హాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’లో ప్రభాస్‌ నటించనున్నారా? అంటే.. ప్రచారంలో ఉన్న వార్తలు చూస్తుంటే అది పాజిబుల్‌ అవుతుందేమో అనేది కొందరి అభిప్రాయం. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో టామ్‌ క్రూజ్‌తో కలసి ప్రభాస్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ నటుడు ప్రభాస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి ముందుకు వచ్చారని  క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు టాక్‌.

‘రాధేశ్యామ్‌’ కోసం ప్రభాస్‌ గత ఏడాది ఇటలీ వెళ్లినప్పుడు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ స్క్రిప్ట్‌ను వినిపించారట క్రిస్టోఫర్‌. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట ప్రభాస్‌. అంతేకాదు.. ఇటలీలో ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ అప్పుడే ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’కు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ కూడా ప్రభాస్‌ పూర్తి చేశారనే టాక్‌ నడుస్తోంది. ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న విడుదల కానుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement