
టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. రీసెంట్‌గా ఈ అమ‍్మడు`మిషన్ ఇంపాజిబుల్` సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం మలయాళ నటుడు హరీశ్ పేరడీ తీసుకున్నారు. మలయాళ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపుపొందారు.
ఎరిడ, తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద ఇలా నలబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టడమే కాదు.. ఓ ప్రత్యేకస్థాన్ని సంపాదించిపెట్టాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment