
ట్రైలర్‌లోని ఓ సాహసకృత్యంలో టామ్ క్రూజ్
సాక్షి, సినిమా : ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ పేరు వినగానే ప్రసిద్ధ నటుడు టామ్ క్రూజ్ చేసే అద్భుత సాహసాలు, యాక్షన్ సన్నివేశాలు గుర్తుకొస్తాయి. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో కొత్త సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్’ అధికారిక ట్రైలర్ గురువారం విడుదలైంది. టామ్ క్రూజ్, సూపర్‌మ్యాన్ సినిమాలో హీరోగా నటించిన హెన్రీ కావిల్‌లు యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతోంది.
న్యూక్లియర్ వార్ నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ఈథన్ హంట్ పాత్రలో (టామ్ క్రూజ్) తన కార్యకలాపాలను ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సవాళ్లను గురించి చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్‌లో భవనంపై నుంచి దూకుతూ క్రూజ్ గాయపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సీన్‌ను కూడా టీం ట్రైలర్‌లో ఉంచింది. ఈ ఏడాది జులై 27న మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment