
స్టార్ ఫాలోయింగ్..!
ఎంతవారలైనా కాంత దాసులే అన్నాడో కవి. లిండ్సే లోహాన్ వెంట పడుతున్న హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్‌క్రూజ్‌ను చూస్తుంటే ఎవరికైనా గుర్తుకొస్తుందేమో ఈ కోట్. ఈ నెలారంభంలో లండన్ హాట్‌స్పాట్ చిల్టర్న్ ఫైర్‌హౌస్‌లో కనిపించినప్పటి నుంచీ అందాల తార లిండ్సేను వదలడం లేదట టామ్. ఒక సూపర్‌స్టార్ తన కోసం అంతగా ఇదైపోతుంటే తట్టుకోలేక దగ్గరై... ఆనక అతనే లోకమై.. తెగ ఎంజాయ్ చేసేస్తోందట ఈ ముద్దుగుమ్మ. మరి అతగాడు మాత్రం కూల్‌గా ఎలా ఉంటాడు..! తన కోసం ఇంతగా పరితపిస్తున్న సుందరిని తన ‘ఆప్షనల్- వైవ్స్’ లిస్ట్‌లో పెట్టేశాడట!