టామ్ క్రూజ్
టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ 7’. క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రమిది. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరగాలి. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. దాంతో మిషన్ రిలీజ్ డేట్స్ మారాయి. ముందుగా 7వ భాగాన్ని 2021 జులైలో, 8వ భాగాన్ని 2022 ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment