Paramount pictures
-
మిషన్ డేట్ మారింది
టామ్ క్రూజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ 7’. క్రిస్టోఫర్ మాక్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రమిది. ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరగాలి. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. దాంతో మిషన్ రిలీజ్ డేట్స్ మారాయి. ముందుగా 7వ భాగాన్ని 2021 జులైలో, 8వ భాగాన్ని 2022 ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా 7వ భాగాన్ని 2021 నవంబర్ 19న, 8వ భాగాన్ని 2022 నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ తెలిపింది. -
స్టార్ హీరోకు గాయాలు.. నిలిచిన షూటింగ్
లండన్ : సినిమా షూటింగ్లో స్టంట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కు గాయాలయ్యాయి. దీంతో 'మిషన్ ఇంపాజిబుల్ సిరీస్'లోని ఆరో భాగం షూటింగ్ ఆగిపోయింది. ఓ భారీ భవంతిపైనుంచి మరో భవంతి పైకి దూకే స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పరిగెత్తుకుంటూ వచ్చి మరో భవంతిపైకి దూకే సమయంలో జరిగిన చిన్న తప్పిదంతో నేరుగా వెళ్లి భవంతి గోడను ఢీకొట్టాడు. దీంతో అతని మోకాలి చిప్పకి బలమైన గాయమైంది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి టామ్‌ను ఆసుపత్రికి తరలించారు. టామ్ కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్టు పారామౌంట్ పిక్చర్స్ వెల్లడించింది. భారీ స్టంట్లు చేయడంలో 55 ఏళ్ల టామ్ ఎప్పుడూ ముందుంటాడు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్’లోని అయిదో భాగం 'రోగ్ నేషన్'లో విమానం టేకాఫ్ అవుతుండగా.. దాని తలుపు పట్టుకుని వేలాడే సీన్లోనూ టామ్ ప్రాణాలకు తెగించి స్టంట్ చేశాడు. ఘోస్ట్ ప్రొటోకాల్’లో కూడా దుబాయ్‌లోని ప్రపంచంలో ఎత్తయిన బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా టవర్ పై రిస్కీ స్టంట్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు టామ్. -
స్టార్ హీరోకు గాయాలు.. నిలిచిన షూటింగ్
-
‘టెర్మినేటర్’ ఇక రాడు!
హాలీవుడ్: చిన్నపిల్లల దగ్గర నుంచి యాక్షన్ చిత్రాలను ఇష్టపడే కుర్రకారు వరకు అందరినీ అలరించిన ‘టెర్మినేటర్’ చిత్రాలు ఇక రావు. వరుస సీక్వెల్స్‌తో అలరించిన టెర్మినేటర్ సీరిస్ చిత్రాలను ఇకపై నిర్మించబోమని నిర్మాణ సంస్థ పారామౌంట్ స్టూడియోస్ ప్రకటిం చింది. ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ కథానాయకుడి గా వచ్చిన ఈ చిత్రాలకు ఇక ముగింపు పలకనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘టెర్మినేటర్ అండ్ ఆర్నాల్డ్.. శకం ముగిసింది. మా నిర్మాణ సంస్థ ఈ స్వీక్వెల్స్కు ముగింపు పలకాలని నిర్ణయించింది. దీంతో ఇకపై టెర్మినేటర్‌కు సంబంధించి ఎటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇకపై జరగవు. దీని అర్థం.. టెర్మినేటర్ ఇక ప్రేక్షకుల ముందుకు రాబోడు. నిజానికి టెర్మినేటర్ సీరిస్‌ను దీర్ఘకాలంపాటు కొనసాగిద్దామని అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా అన్నీ జరగవు కదా..! ఇది కూడా అలాగే మధ్యలోనే నిలిపివేయాల్సివస్తోంద’ని పారామౌంట్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.